Veerlapally Shankar Shadnagar | TPCC State General Secretary | Telangana | INC | the Leaders Page

Veerlapally Shankar Shadnagar

TPCC State General Secretary, Telangana, INC.

 

Mr. Veerlapally Shankar, a prominent Indian politician, is a member of the Indian National Congress Party (INC) and currently holds the position of TPCC State General Secretary in Telangana. 

EARLY LIFE AND EDUCATION:

He was born on March 15th, 1969, in the village of Veerlapalle, located in the Nandigama Mandal of Rangareddy District in the Indian state of Telangana. Mr. Shankar was raised by his parents, Mr. Ramaiah and Mrs. Anjamma, who instilled in him the values of hard work, dedication, and public service.

For his early education, Mr. Shankar attended Nandigama High School from 1986 to 1987, where he completed his Secondary School Certificate. He then enrolled in the intermediate course at Government Junior College in Shadnagar, completing it in 1988. 

Mr. Shankar’s academic journey continued as he pursued his higher education, earning a degree in the B.Com course from City Degree College, which is affiliated with Osmania University in Hyderabad, Telangana State.

Throughout his life, Mr. Shankar has demonstrated a strong commitment to public service and has worked tirelessly to improve the lives of those around him. With his extensive education and political experience, Mr. Shankar is a respected and influential figure in Telangana’s political landscape.

CAREER IN POLITICS:

Mr. Shankar made a significant decision in the year 1992 by joining the Indian National Congress (INC), which is a major political party founded by Dadabhai Naroji, and its productivity improved under the dynamic leadership of Sonia Gandhi. 

The main motivation behind Shankar’s decision to enter into politics was to address the political demands of his people and provide them with dignified and courteous service. By joining the Indian National Congress, Shankar aspires to make a valuable contribution to the comprehensive development of his country and to work towards creating a fair and equitable society.

Shankar is a humble and dedicated individual who is committed to the progress and welfare of the people. His efforts have been acknowledged and appreciated by the Indian National Congress, who appointed him as the Assembly Youth President of Shadnagar. This appointment was made based on Shankar’s conviction, service, and hard work.

Shankar has been fulfilling his role with dedication and has benefited many people by completing the tasks assigned to him. His kind and compassionate nature have won him the support and respect of the people. In addition to his primary responsibilities, Shankar was elected by the people in 1995 to serve as the Village Sarpanch of Veerlapalle in Nandigama Mandal for two terms i.e., from 1995-2002. This position enabled him to ensure that the duties assigned to him were performed efficiently, thereby benefiting the people in his community.

Shankar is known for his commitment to his work, and he continues to serve the people of his community with the same dedication and focus. He concentrates his efforts on the well-being of the people and engages in activities that encourage the Indian National Congress to advance. In recognition of his hard work and dedication, Shankar was designated as the Mandal President of Kothur from 2004-2014. He carried out every activity that was considered his responsibility for the welfare of the people, adhering to a strict code of conduct and working for the benefit of recognition.

Shankar’s commitment to serving the people of his community is an inspiration to many, and he continues to work tirelessly towards their progress and welfare as a TPCC State General Secretary of Telangana. His efforts and humility have made him a beloved and respected figure among the people, and he remains a shining example of selfless service and dedication to the community.

Subsequently, Shankar decided to join the Bahujan Samaj Party (BSP) as a member. After joining, he began to actively engage in providing assistance and support to individuals regardless of their caste, race, gender, or religion. 

He passionately dedicated himself to promoting the growth and development of the backward classes within society while still embracing the importance of religious diversity. Through his selfless service, Shankar endeavored to bring about positive change and greater opportunities for those who had been marginalized and overlooked by society.

Contested Positions:

In 2018, Shankar’s political aspirations led him to contest for the esteemed post of Member of the Legislative Assembly (MLA) from the Bahujan Samaj Party (BSP) for the Shadnagar Constituency. However, despite his best efforts, the seat was eventually vacated, and the position was granted to his opponent from the ruling party. This outcome resulted from a minor discrepancy in the vote percentage, which ultimately proved to be the deciding factor in the election.

In the period of the Municipal Elections, Mr. Shankar, a Member of the Indian National Congress (INC), ran for the highly esteemed position of Mandal Parishad Territorial Constituency (MPTC) in the Veerlapalle . However, despite his best efforts, he could not secure the position due to a minor discrepancy in the voting percentage. It is unfortunate that despite his hard work and dedication, the position remained defeated due to this issue.

H.No: 18-392/H/1, Landmark: Bhagiratha Colony, Post Office: Shadnagar, Town: Shadnagar, Mandal: Faruknagar, District: Ranga Reddy, Constituency: Shadnagar, Parliament:  Mahabubnagar, State: Telangana, Pincode: 509216.

Email: [email protected]

Mobile: 9848217388, 9553321219

Veerlapally Shankar Shadnagar | TPCC State General Secretary | Telangana | INC | the Leaders Page

Personal Information of Mr. Veerlapally Shankar
Full Name Mr. Veerlapally Shankar
Date of Birth March 15th, 1969
Birth Place Veerlapalle
Qualification Graduation
Nationality Indian
Father Name Mr. Ramaiah
Mother Name Mrs. Anjamma
Siblings
-Not Allowed-
Marital Status Married
Profession Politician
Constituency Shadnagar
Political Party
Indian National Congress Party(INC)
Designation  TPCC State General Secretary, Telangana
Permanent/ Residential Address Shadnagar, Farooqnagar, Rangareddy, Telangana.
Mobile Number  9848217388, 9553321219

Brief about Mr. Veerlapally Shankar

As an elected official, it is my duty to prioritize the needs and aspirations of the citizens who have bestowed their trust upon me, as well as those who currently entrust me with their representation, and those who will entrust me in the future.

I strive to bring about positive change and create a more inclusive and equitable society, where every citizen has an equal opportunity to realize their full potential. I firmly believe that by working together and upholding our shared values of justice, equality, and compassion, we can build a better future for all.

In conclusion, I humbly accept the responsibility of serving the people and pledge to use my position to improve our great nation. Together, let us work towards a brighter future where everyone can reach their full potential and where the principles of justice, equality, and democracy are upheld.

గౌరవనీయులైన రాజకీయ నాయకులతో శ్రీ వీర్లపల్లి శంకర్ గారు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (2004–2009) స్వర్గీయ “గౌ. శ్రీ. డా. వైస్ రాజశేఖర్ రెడ్డి” గారితో కలిసి వీర్లపల్లి శంకర్ గారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు(టి పి సి సి ) “గౌ. శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన వీర్లపల్లి శంకర్ గారు

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి “కోమటిరెడ్డి వెంకటరెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.

టీపీసీసీ ఉపాధ్యక్షుడు “డాక్టర్ మల్లురవి” గారిని మర్యాదపూర్వకముగా కలిసిన షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ గారు.

నల్గొండ నియోజకవర్గ శాసనసభ్యులు “కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి” గారిని కలిసిన వీర్లపల్లి శంకర్ గారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ “భారతి హోళీకేరిని” ఎమ్మెల్యే శంకర్ మర్యాదపూర్వకంగా జిల్లా కార్యాలయంలో కలవడం జరిగింది.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ “మాణిక్యం ఠాగూర్” గారిని అభినందనలు తెలుపుతూ సన్మానం చేసిన వీర్లపల్లి శంకర్ గారు.

ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి “డా.వంశీచంద్ రెడ్డి” గారికి స్వాగతం పలుకుతున్నా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ గారు.

వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు “జి. చిన్న రెడ్డి” గారిని మర్యాదపూర్వకముగా కలిసిన వీర్లపల్లి శంకర్ గారు.

Views of Mr. Ande Mohan Mudiraj about Veerlapally Shankar

Shankar’s decision to join the Indian National Congress in 1992 is an exemplary display of his unwavering dedication to serving the people of his country. It is a testament to his firm belief in creating a just and equal society where everyone is treated with dignity and respect. His eagerness to put in the necessary hard work to bring about positive change in the lives of his fellow citizens is truly admirable.

Furthermore, Shankar’s goal to ensure equal opportunities for all individuals to excel in their chosen fields is a laudable pursuit. By joining the Indian National Congress, he has gained a platform to voice his opinions and ideas, which can help shape the future of his nation. His commitment to contributing to the development of his country is truly inspiring.

In Conclusion, Shankar’s decision to join the Indian National Congress reflects his exceptional character and dedication to the betterment of society. His passion for serving his people is commendable, and his contribution to the nation’s growth is invaluable.

Recent Activities

సందర్శిన

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి సారి కొతూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించిన శంకర్ గారు.

పార్టీ క్యాంపు కార్యాలయంలోకి విచ్చేసిన సందర్భంలో

మొదటిసారి షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలోకి విచ్చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.

సర్వసభ సమావేశం

చౌదరి గూడెం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవనీయులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు మరియు ఇతర నాయకులు.

ప్రజా పాలన దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమం

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు, శ్రీ జూపల్లి కృష్ణారావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది

AICC ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నయా రాయ్ పూర్ లో నిర్వహిస్తున్న AICC 85 వ ప్లీనరీ సమావేశాలలో ఏఐసీసీ ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఇట్టి సమావేశాలకు హాజరైన వారు టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, వీర్లపల్లి శంకర్, బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, దేప భాస్కర్ రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, చిగిరింత పారిజాతా – నర్సింహారెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డీ, అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

హత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర

వీర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో హత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర షాద్ నగర్ పట్టణంలో 1వ వార్డు, 10 వార్డు 11వ వార్డు, 12వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డు 15వ వార్డులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ అందే మోహన్ గారు.

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీకి భారీ స్వాగతం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. మక్తల్ గుడి బెల్లూరు వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు భారత్ జోడో యాత్ర శంకర్ గారి ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేసారు. కర్ణాటకలోని రాయచూర్ ఎర్మాసూర్ నుంచి మొదలైన రాహుల్ పాదయాత్ర కృష్ణా నదిపైనున్న బ్రిడ్జి నుంచి తెలంగాణలోకి ప్రవేశించారు. పార్టీ నేతలకు ఆయనకు జాతీయ జజెండాను అందించారు. రాహుల్ కు స్వాగత తోరణాలతో పాటుగా సాంప్రదాయ రీతిలో యువజన కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.

పరిశీలన

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర షాద్ నగర్ లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఏఐసిసి సెక్రెటరీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ మరియు VH హనుమంతరావు గారు,బోసురాజు గారు,పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ గౌడ్ షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ గారు మరియు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందే మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి

స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు.

అన్నదాన కార్యక్రమం

షాద్ నగర్ పట్టణం బైపాస్ రోడ్ యమ్మి హోటల్ పక్కన హెచ్పి పెట్రోల్ బంకు వెనక గల శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 6వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అందే మోహన్ ఆధ్వర్యంలో ఈ సందర్బంగా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ గారు హాజరయ్యారు

2వ రోజు కొందుర్గు మండలంలో కొనసాగిన కాంగ్రెస్ పాదయాత్ర

సమ సమాజం స్థాపన కోసం సమాజంలో సమానత్వ స్వాతంత్రాలు ప్రసాదించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్న నగర్ నియోజకవర్గం కొందూర్గు మండలంలో పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్రను చేపట్టినట్లు వీర్లపల్లి శంకర్ తెలిపారు.

స్వాతంత్ర సమరయోధుల జ్ఞాపకార్థం పాదయాత్ర

చౌదరి గూడ మండలంలో పాదయాత్ర ప్రారంభం అలాగే యువజన కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందే మోహన్, షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖదీర్, ముబారక్ అలీ ఖాన్,అందే శ్రీకాంత్, రాజు,వేణు,భాస్కర్,వెంకటేష్, రామ్, అజయ్,తేజ పాల్గొన్నారు.అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్రను చేపట్టినట్లు వీర్లపల్లి శంకర్ తెలిపారు.

షాద్ నగర్ లో కేంద్రమంత్రి స్మృతి ఇరాని దిష్టిబొమ్మ దగ్ధం

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని బిజెపి నేతలు టార్గెట్ చేస్తే సహించేది లేదని, సంబంధం లేని విషయాల్లోకి సోనియా గాంధీని లాగితే భయపడేది లేదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖదీర్ విమర్శించారు. షాద్ నగర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పార్లమెంట్ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోనియా గాంధీ పట్ల అనుచితంగా వ్యవహరించారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో - ధర్నా

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరుక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామాన్ని ప్రభుత్వం మండలంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు ఉపక్రమించడంతో వాహనాల రాకపోకలు రెండు గంటలకు పైగా స్పందించాయి. ఆందోళనను విచ్చినం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. షాద్ నగర్ సిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వీర్లపల్లి శంకర్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాయి.

బస్తి బాట కార్యక్రమం

షాద్ నగర్ మున్సిపాలిటీ:పేరుకే పట్టణ ప్రగతి మురికివాడలను తలపిస్తోన్నాయంటూ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వీర్లపల్లి శంకర్ పెదవివిరిచారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో బస్తి బాట కార్యక్రమాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి వీర్ల పల్లి శంకర్,పీసీసీ మెంబెర్ బాబర్ ఖాన్ ముఖ్య అతిథిగా బస్తి బాట కార్యక్రమం జరిగింది.

రచ్చబండకు కార్యక్రమం

కేశంపేట్ మండలం, కొత్తపేట్ గ్రామంలో జరిగిన రచ్చబండకు కార్యక్రమం కి విచ్చేసిన అద్దంకి దయాకర, అన్వేష్ రెడ్డి,వీర్లపల్లి శంకర్ గారికి ఘన స్వాగతం పలికారు.

భారీ ప్రదర్శన కార్యక్రమం

ఎఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గార్ల పైన అక్రమంగా ఈ డి నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ టిపిసిసి ఆధ్వర్యంలో ఈ డి ఆఫీస్ ముందు నిరసన గా భారీ ప్రదర్శన కార్యక్రమం నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపడం జరిగింది.

రచ్చబండ కార్యక్రమం

చౌదరిగూడెం మండలంలో ఎలుకగూడెం మరియు పద్మారం గ్రామంలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

రూ.60వేల విలువైన 5నెలల మందుల వితరణ

మానవత్వం పరిమళించే మంచి మనుషులకు సమాజం ఎప్పుడు స్వాగతం చెబుతూనే ఉంటుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ మరోసారి తన దానగుణ దయార్ధ హృదయాన్ని చాటుకున్నారు. ఓ నిరుపేద వ్యక్తి పక్షవాతంతో బాధపడుతుంటే మందులు కొనుగోలు చేయలేని అతని ఆర్థిక దీనస్థితిపై జాలి పడి ఐదు నెలలకు సంబంధించిన పక్షవాత మందులు 60 వేల రూపాయలు ఖర్చు చేసి మసనవత్వంతో ఇచ్చారు.

బాధితులకు రూ.30వేల ఆర్థిక సాయం

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన నిరుపేదలను ఆదుకోవడం మానవుల కనీస ధర్మం అని షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ “వీర్లపల్లి శంకర్” అన్నారు. ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఇటీవల ఈదురు గాలులకు ఇండ్లు దెబ్బతిన్న ఇద్దరు నిరుపేద మహిళలు శాంతమ్మ కుటుంబానికి 20వేలు, శివలీలా కుటుంబానికి 10వేల రూపాయలను తక్షణ సహాయంగా వీర్లపల్లి శంకర్ నగదు అందజేశారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అంత్యక్రియల కోసం అందించారు మానవతా దృక్పథంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు అండగా నిలబడేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆపత్కాలంలో ప్రతి ఒక్కరు స్పందించి చిన్నారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

బొడ్రాయి పున:ప్రతిష్ట కార్యక్రమం

అంతిరెడ్డి గూడ లో ఘనంగా శ్రీ రామాంజనేయ స్వామి, మహాగణపతి, శివలింగం, బొడ్రాయి పున:ప్రతిష్టలో. పాల్గొన్న షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్.

సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు

శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన సంద్భంగా తెలంగాణ స్టేట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. శివసేన రెడ్డి ఆదేశాల మేరకు షాద్ నగర్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలు అభిషేకము మరియు గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లులు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగినది.

బొడ్రాయి పండుగ కార్యక్రమం

షాద్ నగర్ నియోజకవర్గం ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలని షాద్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ “వీర్లపల్లి శంకర్” ఆకాంక్షించారు. షాద్ నగర్ పట్టణంలోని 14వ వార్డులో బొడ్రాయి పండుగ కార్యక్రమంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ యువ నాయకుడు అందే మోహన్ పిలుపు మేరకు బొడ్రాయి పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బస్తి బాట కార్యక్రమం

పేరుకే పట్టణ ప్రగతి మురికివాడలను తలపిస్తోన్నాయంటూ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వీర్లపల్లి శంకర్ పెదవివిరిచారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో బస్తి బాట కార్యక్రమాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి వీర్ల పల్లి శంకర్,పీసీసీ మెంబెర్ బాబర్ ఖాన్ ముఖ్య అతిథిగా బస్తి బాట కార్యక్రమం జరిగింది.

రచ్చబండ కార్యక్రమం

 చౌదరిగూడెం మండలం లో ఎలుకగూడెం మరియు పద్మారం గ్రామంలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వీర్లపల్లి శంకర్ గారు మరియు కాంగ్రెస్ నేతలు.

బాధితులకు రూ.30వేల ఆర్థిక సాయం

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన నిరుపేదలను ఆదుకోవడం మానవుల కనీస ధర్మం అని షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ “వీర్లపల్లి శంకర్” అన్నారు. ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఇటీవల ఈదురు గాలులకు ఇండ్లు దెబ్బతిన్న ఇద్దరు నిరుపేద మహిళలు శాంతమ్మ కుటుంబానికి 20వేలు, శివలీలా కుటుంబానికి 10వేల రూపాయలను తక్షణ సహాయంగా వీర్లపల్లి శంకర్ నగదు అందజేశారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అంత్యక్రియల కోసం అందించారు మానవతా దృక్పథంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు అండగా నిలబడేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆపత్కాలంలో ప్రతి ఒక్కరు స్పందించి చిన్నారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు

బొడ్రాయి పున:ప్రతిష్ట కార్యక్రమం

అంతిరెడ్డి గూడలో ఘనంగా శ్రీ రామాంజనేయ స్వామి, మహాగణపతి, శివలింగం, బొడ్రాయి పున:ప్రతిష్టలో పాల్గొన్న షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ గారు మరియు కాంగ్రెస్ నేతలు.

యువత పార్టీలో చేరిక

రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారని, తెలంగాణలో రానున్నది రేవంతన్న రాజ్యం అని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. చౌదరిగుడా మండలంలోని బీర్జాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల మేక్యాతండాలో యువకులు మరియు మహిళలు సుమారు వందమంది దాకా వివిధ పార్టీల నుండి మండల పార్టీ అధ్యక్షులు చలివేంద్రంపల్లి రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

మానవునికి ప్రాణా ధారమైనది నీరు అని నిత్యజీవితంలో నీటి ఉపయోగం అత్యంత ప్రధానమైనదని అందుకే నీటి విలువ తెలిసి గిరిజనులకు తన వంతు సహకారంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశానని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు.రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండల పరిధిలోని దేవుని గుడి గ్రామ పంచాయితీలో సోమవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వీర్లపల్లి శంకర్ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను గ్రామస్థుల సమక్షంలో ప్రారంభించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ శరీరం లోపల కూడా ఈ నీటితో అనేకమైన ప్రయోజనాలున్నాయని, నీరు ఆహార రసం శరీరంలో కలవటానికి ఉపయోగ పడుతుందని రక్తాన్ని ద్రవరూపంలో ఉంచుతుందని శరీరపు ఉష్ణోగ్రతను కాపాడుతుందనీ మూత్రం ద్వారా చెడు పదార్థాలను వెలుపలకు పంపుతుందని ప్రతి ప్రాణి ఆరోగ్యంగా జీవించుటకు ప్రతిరోజు నీరు అవసరమవుతుందని నీటి యొక్క ప్రాధాన్యతను వివరించారు.

Social Activities

ప్రత్యేక పూజలు

పరమ పవిత్ర హనుమాన్ దేవాలయం చౌడమ్మ గుట్టలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

హజ్రత్ జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకున్న సందర్భంలో

అసెంబ్లి ఎన్నికల్లో షాద్ నగర్ నూతన ఎమ్మెల్యేగా గెలిచిన వీర్లపల్లి శంకర్ గారు మొదటి సారి ఇన్ ముల్ నర్వ పంచాయతీ శివారులో మత సామరాశ్యానికి ప్రతీకగా నిలిచిన హజ్రత్ జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకోవడం జరిగింది. 

పూల మొక్కలు అందజేత

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారిని స్థానిక ఏసిపి రంగస్వామి గారు, రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి గారు, ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు తదితరులు కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేయడం జరిగింది.

చీరలు పంపిణీ

తెలంగాణ తల్లి సోనీయమ్మ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకొని పేద ప్రజలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.

ఉచిత బస్సు పధకం ప్రారంభోత్సవం

మహిళలకు ఉచిత బస్సు పధకాని షాధనగర్ లో ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.

బాబాయి దర్గాను దర్శించిన సందర్భంలో

చౌదర్ గూడా మండలం తుంపల్లి గ్రామంలో బాబాయి దర్గాను దర్శించిన MLA వీర్లపల్లి శంకర్ గారు. 

ఫ్యామిలీ సమావేశం

షాద్నగర్ సోలిపూర్ రోడ్ లోని చర్చి లో ఫ్యామిలీ సమావేశం లో పాల్గొన్న శంకర్ గారు మరియు ఇతర నాయకులు.

పాదయాత్ర

షాద్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలుపొందిన వీర్లపల్లి శంకర్ గారు అభిమానులు దేవాలయాలకు తమ మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరుతున్నారు. కొందరు దేవాలయాలకు వెళ్లి నేరుగా పూజలు చేస్తుండగా మరికొందరు పాదయాత్ర చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గెలుపును పురస్కరించుకొని శ్రీలక్ష్మీ నరసింహస్వామి మొక్కు తీర్చుకోవడానికి షాద్ నగర్ నుండి పాదయాత్రగా పెద్ద ఎత్తున బయలుదేరిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ గారు అనుచరులు.

క్రిస్మస్ వేడుక

షాద్నగర్ మరియా రాణి స్కూల్ లో క్రిస్మస్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర్ గారు.

పరిశీలన

షాద్నగర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ను సందర్శించి సమస్యలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు..

పరామర్శ

శ్రీశ్రీశ్రీ సతీషన్ నాయర్ గురుస్వామి త్వరగా కోలుకొని షాద్ నగర్ ప్రజలకు ఆధ్యాత్మికంగా చెరువ అవుతారని షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు అన్నడం జరిగింది. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీషన్ నాయర్ గురు స్వామి గారిని ఎమ్మెల్యే శంకర్ గారు పరామర్శించడం జరిగింది.

వేదగిరి దేవాలయంలో యజ్ఞం

చౌదరి గూడెం మండలం లాల్ పాడు వేదగిరి దేవాలయంలో యజ్ఞంలో పాల్గొన్న గౌరవనీయులు ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ గారు పాల్గొనడం జరిగింది.

అంజయ్య కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వీర్లపల్లి.శంకర్ హామి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండల పరిధిలోని జాకారం గ్రామంలో అప్పుల బాధ,భూతగాదా వంటి సమస్యలు భరించలేక మనస్థాపానికి గురై ఉగ్గి.అంజయ్య(53) చెట్టుకు ఉరివేసుకుని మరణించగా తండ్రి మరణ వార్తను జీర్ణించుకోలేక గంటల వ్యవధిలో చిన్న కుమారుడు ప్రవీణ్(23) ఉరి వేసుకొని తండ్రి కొడుకులు ఒకే రోజు మరణించారు. కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ వీర్లపల్లి.శంకర్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఓపెన్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులు ప్రధానం

షాద్ నగర్ లోని గ్రీన్ పార్క్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నేషనల్ లెవెల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్, చాంపియన్షిప్ నిర్వాహకులు మాస్టర్ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విశాలాంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్, చౌదరి గూడెం మండల పార్టీ అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందే మోహన్, ముబారక్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం

ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడేందుకు ఆచరణతో దైవం పట్ల భక్తిశ్రద్ధలతో ఉండాలని షాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం సంగెం గ్రామంలో ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామానికి వచ్చిన వీర్లపల్లి శంకర్ కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టించిన తరువాత అయన ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు.

విరాళం

సంగెం హనుమాన్ దేవాలయ అభిరుద్ధి కోరకు షాద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వీర్లపల్లి శంకర్ తన వంతు విరాళముగా 69000 రూపాయలు అందజేశారు. .

షాద్ నగర్ లో ఘనంగా "వైఎస్సార్ వర్ధంతి

తెలంగాణ ప్రజల విముక్తి కోసం కొట్లాడి రాష్ట్రం సాధించాక ఇప్పుడు మరోసారి హక్కు కోసం ప్రభుత్వం పై ప్రజలు తిరగబడ్డారని ఇది తిరగబడ్డ, దగాపడ్డ తెలంగాణ అంటూ షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడ్డ తెలంగాణలో వైయస్సార్ లేని లోటును రేవంత్ రెడ్డి భర్తీ చేస్తున్నారని వీర్లపల్లి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పెద్దఎత్తున నివాళులు అర్పించారు.

బైర్ఖాన్ పల్లి బాధితురాలికి రూ. 95 వేల నగదు సాయం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని బైర్ఖాన్ పల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి గ్రామానికి చెందిన కావలి మంగమ్మ ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యింది. రోడ్డున పడ్డ నిరుపేద మంగమ్మ కుటుంబాన్ని మానవతా దృక్పథంతో షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్” బృందం తక్షణమే ఆదుకుంది. మంగమ్మకు ఆర్థిక సహాయంగా వీర్లపల్లి శంకర్ 50 వేల రూపాయల నగదును అందజేశారు. అంతేకాదు మంగమ్మ కూతురు శ్రావణి ఆన్లైన్ క్లాస్ చదువుల కోసం ఫోన్ కొనుక్కోవడానికి 10 వేల రూపాయలు అందించారు.

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గట్టెక్కడానికి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని సిండికేట్ కాలనిలలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్ని వేర్వేరుగా చేపట్టారు.

నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి సన్మానం

కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య చికిత్సలు చేస్తున్న సిబ్బందికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం నందిగామ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితంగా మాస్కులు, శానిటైజర్, పండ్లు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

కాంగ్రేస్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

కొవిడ్-19 కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోవడం మానేశారని, ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు తమ వంతు సహకారం అందిస్తామని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి మాస్కులు శానిటైజర్ ఉచితంగా పంపిణీ చేశారు.

ఫోటో స్టూడియో ప్రారంభోత్సవం

షాద్ నగర్ పట్టణం లో విజయనగర్ కాలనీలోని రవి ఫోటో స్టూడియో ప్రారంభించడానికి విచ్చేసిన ముఖ్య అతిథులు వీర్లపల్లి శంకర్ గారు మరియు PCC మెంబర్ బాబర్ ఖాన్, ఫరూక్ నగర మండల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్ రాజ్ గౌడ్,ఎంపీటీసీ మొగిలిగిద్ద శ్రీశైలం, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందే మోహన్.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా షాద్ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ అన్న గారు యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అందే మోహన్ పాల్గొన్నారు.

ఆసుపత్రిని ప్రారంభోత్సవ కార్యక్రమం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో లిమ్స్ ప్రైవేటు హాస్పిటల్ ను ప్రారంభించిన నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరియు షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రామ్ రాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాగన్న గౌడ్ కుటంబానికి పలువురు రూ. 7లక్షల ఆర్థిక సాహయం

రే ఒకసారి అన్నం పెడితే జన్మ మొత్తం గుర్తుంచుకుంటావని కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కేటరింగ్ నాగన్న గౌడ్ సంతాప సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ స్వతహాగా 51 వేల రూపాయలను అందజేశారు. అదేవిధంగా షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ 25000, తెరాస రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య మరో 25 వేలు, ఇంకా అనేకమంది పట్టణానికి చెందిన ప్రముఖులు నాగన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

ప్రాణదాతకు వీర్లపల్లి శంకర్ సన్మానం

ఫరూక్నగర్ మండలంలోని మధురాపూర్ గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. బాలరాజ్ గౌడ్ సోదరుడు వినాయక్ గౌడ్ ను ప్రాణాపాయం నుంచి తప్పించిన రైతు చాపల ఆగమయ్య రైతు ఆగమయ్య ధైర్య సాహసాలకు కృతజ్ఞతా భావంతో సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ సన్మానించారు. ఆయనతో పాటు గ్రామ కాంగ్రెస్ యువకులు అవినాష్ రెడ్డి, మల్లేష్ రెడ్డి, రాజు, రామచంద్రారెడ్డి,రామ్ రెడ్డి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో 10 వేల రూపాయలు మరియు షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ 5 వేలు మొత్తం 15 వేల పారితోషకం ఇవ్వడం జరిగింది.

గణతంత్ర దినోత్సవ వేడుక

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ భవన స్థలంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ సంస్థలు ఇతర ప్రాంతాల్లో జెండాను ఎగరవేశారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 (1950)న గౌరవంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారని అన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రేస్ నేత వీర్లపల్లి శంకర్ అభిప్రాయపడ్డారు. ఫరూక్ నగర్ మండలంలోని దేవునిపల్లి గ్రామంలో శ్రీవేణు గోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

నవ తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ కీలకమైనదనీ, భావప్రకటనా స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రేస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ మీడియాకు సూచించారు. నవ తెలంగాణ దినపత్రిక 2021 క్యాలెండరును రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో నియోజకవర్గ పిసి ఇంచార్జ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రేస్ నేత “వీర్లపల్లి శంకర్” చేతుల మీదుగా ఆవిష్కరించారు.

Party Activities

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో వీర్లపల్లి శంకర్ భేటి

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతోంది. రాష్ట్రంలో 30లక్షల మందితో డిజిటల్‌ సభ్యత్వం నమోదు చేయించాలని టీపీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రతి సభ్యునికి 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపద్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభ్యత్వాల నమోదుపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపద్యంలో మొయినా బాద్ వద్ద ఓ రిసార్ట్స్ లో రేవంత్ రెడ్డితో ఓ కార్యక్రమం సందర్భంగా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆన్లైన్ డిజిటల్ సభ్యత్వాల గురించి వాకబు చేశారు.

పాలమూరు జంగ్ సైరన్ పోస్టర్ల విడుదల

పాలమూరు గడ్డపై రెండు లక్షల మందితో నిరుద్యోగులు, విద్యార్థులతో జంగ్ సైరన్ మ్రోగిస్తామని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ప్రకటించారు. ఆదివారం షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 12న పాలమూరు గడ్డపై టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మొదటి సారి యుద్ధభేరి మోగించ బొతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మన నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ యువతను, విద్యార్థులను మోసం చేసిన కెసిఆర్ నిర్లక్ష్యం పట్ల జంగ్ సైరన్ మ్రోగబోతుందని వివరించారు.

కాంగ్రెస్ దళిత గిరిజన సభ- వీర్లపల్లి శంకర్ కు ఘన స్వాగతం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నాం దళిత గిరిజన ఆత్మ గౌరవ సభలు షాద్ నగర్ మున్సిపల్ పట్టణానికి బుధవారం చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సభలకు వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వీర్లపల్లి శంకర్ గృహ నిర్బంధం

కాంగ్రెస్ నాయకులను బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకుంటుందని, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు.

ఐఎన్ టీయూసి రాష్ట్ర కార్యదర్శి "రఘు"కు సన్మానం

కార్మికుల హక్కుల పై నిరంతరం రాజిలేని పోరాటాలను చేస్తామని, కార్మిక చట్టాలను అమలు చేసే విధంగా ఐఎన్ టియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఐఎన్ టియుసి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నుకోబడిన కార్మిక నేత రఘును ఆయన స్వగృహంలో కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం ఘనంగా సన్మానించారు.

షాద్ నగర్ కాంగ్రేస్ ప్రెస్ మీట్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగ సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, లక్షమందితో ఈ సభ జరిపి తీరుతామని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత “వీర్లపల్లి శంకర్” ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. షాద్ నగర్ పట్టణంలోని ఆయన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో “వీర్లపల్లి శంకర్” మాట్లాడారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఫరూక్ నగర్, కొత్తూరు, కేశంపేట, నందిగామ, కొందుర్గు చౌదరిగుడా మండలాల తోపాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, బిసి, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల నాయకులు ఈ విలేకరుల సమావేశానికి హాజరయ్యారు.

దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష

జు నందిగామ మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష వందలాదిగా పాల్గొన్న దళిత గిరిజనులు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ బాలరాజు గారు. షాద్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ మరియు. బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లు మరియు ఆరు మండలాల అధ్యక్షులు సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్ ఎంపిటిసిలు సర్పంచులు మాజీ ఎంపిటిసి లు కౌన్సిలర్లు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బీసీ సెల్ ప్రెసిడెంట్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

షాద్ నగర్ లో యువజన కాంగ్రెస్ నేత అందే మోహన్ నేతృత్వంలో సత్యాగ్రహ దీక్ష

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల, విద్యార్థుల, నిరుద్యోగుల, మేధావుల, గొంతు నొక్కుతున్నారని, అధికార పార్టీకి ఎవరు ఎదురు తిరగకుండా ప్రతిపక్ష నాయకులను తమలో కలుపుకొని రాజకీయ వ్యభిచారానికి టిఆర్ఎస్ పాల్పడుతుందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అందే మోహన్ నేతృత్వంలో షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో నిర్వహిస్తున్న యువజన కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షకు వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు.

చిరు సత్కారం

 ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కలిసి శాలువాతో సత్కరించి న షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీర్లపల్లి శంకర్ గారు.

ఎడ్లబండి వాహనంపై నిరసన ప్రదర్శన

కాంగ్రెస్ పార్టీ ముందు ఇకపై ఏ పార్టీ నిలబడ జాలదని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాకతో పార్టీ బలంగా మారిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నాకు అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో షాద్ నగర్ నియోజకవర్గం నుండి సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్యకర్తలు కందుకూరు ధర్నాకు తరలి వెళ్లారు. నియోజకవర్గం నుండి 80 కార్లు 100 ద్విచక్ర వాహనాలతో భారీగా బయల్దేరి వెళ్లారు. అదేవిధంగా కందుకూరు వద్ద కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డితో కలిసి ఎడ్లబండి వాహనంపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత "వీర్లపల్లి శంకర్" పిలుపు

 కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు నచ్చిన మెచ్చిన నాయకుడు టిపిసిసి చీఫ్, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి అని ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతి కార్యకర్త కదలాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం వీర్లపల్లి శంకర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మీడియాతో మాట్లాడుతూ కనీవినీ ఎరుగని రీతిలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతుందని పేర్కొన్నారు.

వీర్లపల్లి శంకర్" ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి సన్మానం

ఆపద సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు భవిష్యత్తులో అండగా ఉంటానని టీపీసీసీ చీఫ్, ఎంపి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డిని సన్మానించేందుకు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్వగృహంలో ఆయనను వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. టీపీసీసీ చీఫ్ గా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు తినిపించారు.

షాద్‌నగర్ చొరస్తా పెట్రోల్ బంక్ ఎదురుగా ధర్నా

 ప్రజలను ఎలా దోచుకోవాలా అని ఇన్నాళ్లూ ఎదురుచూసిన ప్రభుత్వము ఎన్నికలు అయిపోగానే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మొదలు పెట్టేశారని, ప్రధాన మంత్రి మోడీ ప్రజలను దోచుకుని విర్రవీగుతున్నాడని, కేంద్ర అహంకారాన్ని తుంచేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలోని పెట్రోల్ బంకు ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్రపతి పేరుపై వినతి పత్రం సమర్పణ

కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందని, ఇటీవల సుప్రీం కోర్టు కూడా వ్యాక్సిన్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిందనీ షాద్ నగర్ నియోజకవర్గ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ విమర్శించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్రపతికి సంబంధించిన లేఖను కలెక్టర్ ద్వారా అందించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు.

ఉప ఎన్నికల ప్రచారం

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజవరం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ తదితరులు

ఇంచార్జిల నియామకం

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఇంచార్జ్ లతో పీసీసీ ప్రెసిడెంట్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమావేశం నిర్వహించడం జరిగింది మన షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ గారికి హాలియా ఇన్చార్జిగా నియమించడం జరిగింది.

ఓటు హక్కు

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నందిగామ జిల్లా పరిషత్ హై స్కూల్ బూత్ నెంబర్ 163 లో తన ఓటు హక్కును వినియోగించుకున్న వీర్లపల్లి శంకర్ గారు.

రెండో రోజు కొనసాగుతున్న రేవంత్‌ పాదయాత్ర

తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాదయాత్ర ఉప్పునూతల నుంచి రెండో రోజు కొనసాగుతోంది. ఉప్పునూతల, గట్టుకాడి పల్లి, కామ్సనూపల్లి, తిరుమలపూర్, డిండి మీదుగా చింతపల్లి వరకు రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ మద్దతు తెలుపుతూ నడక కొనసాగించారు. గట్టుకాడిపల్లి వద్ద పొలాల్లో పని చేసుకుంటున్న ఆడబిడ్డలతో రేవంత్ రెడ్డి ముచ్చటించారు.

అచ్చంపేట రాజీవ్ రైతు భరోసా కరపత్రాల విడుదల

 మోడీ కేసీఆర్, కేసీఆర్ సర్కార్లు వేరైనా వారి ఉద్దేశాలు, లక్ష్యాలు మాత్రం ఒక్కటేనని ఈ రెండు ప్రభుత్వాలు ఓకె నాణానికి ఇరువైపులా బొమ్మలని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లురవి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్అండ్బి గెస్ట్ హౌస్ లో స్థానిక నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డాక్టర్ మల్లురవి మాట్లాడారు.

Party and Social Activities

హాత్ సే హాత్ జోడో యాత్ర లో వీర్లపల్లి శంకర్ గారు.

ఛత్తిస్ ఘడ్ రాయ్ పూర్ లో జరుగతున్న AICC 85 వ ప్లీనరీ లో పాల్గొనడం జరిగింది.

కేశంపేట్ మండలం,కొత్తపేట్ గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంకి విచ్చేసిన వీర్లపల్లి శంకర్ గారికి ఘన స్వాగతం పలికారు.

చించొడ్ గ్రామంలో హజ్రత్ మౌలాలి దర్గా 13వా ఉర్సు ఉత్సవాలు

ఛత్తిస్ ఘడ్ రాయ్ పూర్ లో జరుగతున్న AICC 85 వ ప్లీనరీ లో పాల్గొనడం జరిగింది.

 3వ రోజు పాదయాత్ర ఫరూఖ్ నగర్ మండల్ అయ్యవారిపల్లి గ్రామం నుంచి ప్రారంభం అయ్యింది

ఇందిరాపార్క్ వద్ద “వరిదీక్ష” కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ గారు

74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బైక్ రాళ్ళు మరియు జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది.

షాద్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహా దీక్ష

శ్రీరామనవమి కళ్యాణంలో పాల్గొన్న షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ గారు మరియు పార్టీ నాయకులు

Involvement in INC and Social Activities

Party and Social Activities

News Paper Clippings

Videos

}
15-03-1969

Born in Veerlapally Village

of Nandigama mandal, Rangaredy District, Telangana

}
1985-1986

Studied SSC Standard

from Nandigama High School

}
1987-1988

Completed Intermediate

from Government Junior College, Shadnagar

}
1989-1991

Attained Graduation

from City Degree College

}
1992-1993

Joined in INC

}
1992-1993

Party Activist

of INC

}

Assembly Youth President

of Shadnagar, INC

}
1995-2002

Sarpanch

of Veerlapally, INC

}
2004-2014

Mandal President

of Kothur, INC

}
2018-2019

Contested MLA

of Shadnagar Constituency, BSP

}

TPCC State General Secretary

of Telangana, INC

}

Contested MPTC

of Veerlapally, INC

Interested to Know More about Mr. Veerlapally Shankar?

Get in Touch!                                              Get Through !!                                                  Get Interactive!!!