Sajeed Khan | ADCC Minority Chairman | INC | Adilabad | Telangana | the Leaders Page

Sajeed Khan

ADCC Minority Chairman, Adilabad, Congress Party, Telangana.

 

Sajeed Khan is the ADCC Minority Chairman of the Indian National Congress Party, Adilabad. He was born on 04-05-1979 to Shiraj Khan & Zhakeera Khanam in Adilabad. In 1993, He completed SSC Standard from Little star’s high school and Intermediate from the Govt Junior College in 1995.

He Started his Political Journey in 1993 with the (National Students’ Union of India) NSUI and was the Active in Politics. Later on, he joined the Indian National Congress Party(INC). In 1998, He worked at Youth Congress.

In 2003, He organized ASK Foundation and set up many programs himself like Free blood donation camps, free checkups, and have free Helpline Service to the People.

In 2008, Sajeed Khan Elected as President of the Urban Congress. In 2009, He was Served as Chairman of Adilabad District. In 2009, he was elected as President of the Lorry Owners Associations. He was a Member of the All India lorry Association.

In 2015, He worked as Telangana Spoke Person. In 2017, He working as ADCC Minority Chairman from the Indian National Congress, Adilabad. Sajeed Khan appointed as Incharge DCC President on 06-November-2020.

Recent Activities:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. The villages were sprayed with sodium hypochlorite solution.
  • He helped the poor people financially and Financial assistant to the Poor People and free blood donation camps.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems, Against electricity bills in his Constituency.
  • Distribution of masks in Adilabad on the occasion of the death anniversary of former Chief Minister Shri YS Rajasekhar Reddy.
  • Sajeed Khan, Adilabad District Congress Minority Chairman, visited the revenue due to the influx of water at the Ganpati Temple in the town due to heavy rains in Adilabad. The priest who resides there provided financial assistance to the family.
  • Rahul Gandhi’s 50th birthday was held in Adilabad’s Bhagat Singh Nagar under the aegis of Congress district minority president Sajeed Khan Garu. During the event, the colonists distributed rations, fruits, chocolates, and biscuits to children. Sajeed Khan and several other young people donated blood in this blood donation camp.

Shanthi Nagar Colony, Adilabad, Telangana

Mobile:8008283786
Email: [email protected]

Recent Activities

సమావేశం

మాజీ మంత్రి క్రీ.శే.చిలుకూరి.రామచంద్ర రెడ్డి నివాసంలో అదిలాబాద్ పార్లమెంట్ ఎఐసిసి ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ రాథోడ్ ప్రకాష్ సూచన మేరకు డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ల నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గ బూత్ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ బూత్ స్థాయి నియోజకవర్గ కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో జైనథ్, బేల, మావల, ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు

సమావేశం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో ప్రస్తుతం నాయకు లుగా కొనసాగుతున్న 2001 నుండి 2014 వరకు తెలంగా ణ రాష్ట్ర సాధనా ఉద్యమం లో క్రియాశీలక పాత్ర వహించి పోరాటం చేసిన ఉద్యమ నాయకుల సమావేశం హైద రాబాద్ లోని లకిడికా పూల్ అశోకా హోటల్ లో తెలంగాణ అమరుల ఆశయాల సాధ నా జేఏసీ ఉద్యమ ప్రణాళిక అమలు కమిటీ చైర్మన్ S. రా ములు నాయక్ EX MLC అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రారంభోత్సవం

హత్ సే హత్ జోడో యాత్ర కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారి నేతృత్వంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. భద్రాద్రి రాములోరి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్రకు బ్రహ్మ రథం పడుతున్న ప్రజలు ప్రజల్లో ఈ ఉత్సహం చూస్తుంటే రాబోయే తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని గట్టి నమ్మకం కలుగుతుంది అని జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు సాజిద్ ఖాన్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

హత్ సే హత్ జోడో యాత్ర కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారి నేతృత్వంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. భద్రాద్రి రాములోరి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్రకు బ్రహ్మ రథం పడుతున్న ప్రజలు ప్రజల్లో ఈ ఉత్సహం చూస్తుంటే రాబోయే తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని గట్టి నమ్మకం కలుగుతుంది అని జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు సాజిద్ ఖాన్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

హత్ సే హత్ జోడో యాత్ర కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారి నేతృత్వంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. భద్రాద్రి రాములోరి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్రకు బ్రహ్మ రథం పడుతున్న ప్రజలు ప్రజల్లో ఈ ఉత్సహం చూస్తుంటే రాబోయే తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని గట్టి నమ్మకం కలుగుతుంది అని జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు సాజిద్ ఖాన్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

బంగారు గూడా కాలనీ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటివరకు టీఆరెస్ ప్రభుత్వం ఇంటిపట్టాలను కల్పించలేదని డీసీసీ అధ్యక్షులు సాజీద్ ఖాన్ మండిపడ్డారు. ఈ మేరకు స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన కాలనీ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఎన్నికైన జోగురామన్న ఇప్పటివరకు కాలనీకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఐదునెలల క్రితం సైతం కాలనీ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు పత్తాలేకుండా పోయారన్నారు. ఇప్పటికైనా ఇళ్లకు పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. అలాగే విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలను వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో ఈ నెల 24 న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముట్టడి చేపడుతున్నట్లు ప్రకటించారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారితో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ గారు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు భరత్ చౌహన్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ సెడ్మకే ఆనంద్ రావ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతీరాం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించిన సాజిద్ ఖాన్ గారు ఇక్కడి పరిస్థితులను వివరించారు. ఈ మేరకు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారంతో జరుగుతుందని రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది.

సమావేశం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారి నివాసంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ఓ చారిత్రక ఘట్టం అని ప్రపంచ చరిత్ర పుటలో లికించే అంశం అని ప్రపంచ రాజకీయ చరిత్రలో మునుపుఎన్నడు ఏ రాజకీయ నాయకుడు ఇలా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను వింటూ చెయ్యలేదు అని తెలిపారు తెలంగాణ రాష్ట్రలో 7Th నవంబర్ చివరి రోజు అని ఓ బాధ్యతయుత పౌరునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు చివరి రోజు పాదయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

సంక్షేమ వసతి

భావి భారత పౌరులకు అందని ద్రాక్షగా పౌష్టికాహారం సంక్షేమ వసతి గృహల్లో సన్న బియ్యంతో భోజనం వట్టి మాటే బంగారి గూడా మైనారిటీ గురుకులాన్ని సందర్శించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ వసతి గృహల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతాం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు సన్న బియ్యంకు బదులుగా దొడ్డు బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారో సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నించిన సాజీద్ ఖాన్ గారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ గారు, మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్రోజ్ ఖాన్ గారు, జిల్లా ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి కాంబ్లీ నాందేవ్ గారు, బీసీ సెల్ జిల్లా నాయకులు సంగ రాజు యాదవ్ గారు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

దేశం కోసం తమ కుటుంబ సభ్యులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని బిజెపి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆరోపించారు . సోనియా గాంధీ గారిపై ఈడి కేసులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని బీ ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఎఐసిసి సభ్యురాలు గండ్రత్ సుజాత పాల్గొని కేంద్రం తీరును ఖండించారు. ఈ సందర్భంగా ప్రధాని ఫ్లెక్సీని దహానం చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు నగేష్ గారు, బోథ్ నియోజక వర్గ ఇంఛార్జి ఆడే గజెందర్ గారు, సంతోష్ కాడే గారు,ఎం ఎ షకీల్ గారు,షేక్ కలిం గారు, రాజు యాదవ్ గారు,శివాజి గారు,మొసిన్ పటేల్ గారు, సదిక్ గారు,ముర్తుజా గారు, అన్నుభాయ్ రసూల్ ఖాన్ గారు,తాహెర్ ఖాన్ గారు, ఆనంద్ రావు గారు,సృజన్ రెడ్డి గారు, మధుకర్ గారు,దేవన్న గారు, ఫహీమ్గారు తదితరులు పాల్గొన్నారు.

దేశం కోసం తమ కుటుంబ సభ్యులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని బిజెపి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆరోపించారు . సోనియా గాంధీ గారిపై ఈడి కేసులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని బీ ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఎఐసిసి సభ్యురాలు గండ్రత్ సుజాత పాల్గొని కేంద్రం తీరును ఖండించారు. ఈ సందర్భంగా ప్రధాని ఫ్లెక్సీని దహానం చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు నగేష్ గారు, బోథ్ నియోజక వర్గ ఇంఛార్జి ఆడే గజెందర్ గారు, సంతోష్ కాడే గారు,ఎం ఎ షకీల్ గారు,షేక్ కలిం గారు, రాజు యాదవ్ గారు,శివాజి గారు,మొసిన్ పటేల్ గారు, సదిక్ గారు,ముర్తుజా గారు, అన్నుభాయ్ రసూల్ ఖాన్ గారు,తాహెర్ ఖాన్ గారు, ఆనంద్ రావు గారు,సృజన్ రెడ్డి గారు, మధుకర్ గారు,దేవన్న గారు, ఫహీమ్గారు తదితరులు పాల్గొన్నారు.

పరిశీలన

అదిలాబాద్ జిల్లా లోని మారుమూల ఆదివాసీ గూడెల పై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని..జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు ఆరోపించారు…రూరల్ మండలంలోని దార్లోద్ది,చిచ్ దరి,ఖానాపూర్,అల్లోకొరి గ్రామాల్లో మోటర్ సైకిల్ లపై పర్యటించి,భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ఇండ్లను,పంట పొలాలను,వరద కారణంగా కొట్టుకుపోయిన రోడ్లను,బ్రిడ్జి లను పరిశీలించి గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకొని,రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలు తొందరగా పరిష్కరించాలని కోరారు….

మీడియా సమావేశం

ప్రజా సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు ఆరోపించారు…ఈ బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం రెండవ అధికారం లోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్న ఇప్పటికీ అర్హులకు ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని,అలాగే నూతనంగా రేషన్ కార్డుల జారీ ఇప్పటి వరకు జరగలేదని,అన్నారు..వారం రోజుల్లో పెన్షన్లు,రేషన్ కార్డుల జారీ పై నిర్ణయం తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని అన్నారు.పంట నష్టపోయిన రైతుల పక్షాన అదిలాబాద్ నియోజక వర్గ ఎమ్మల్యే జోగు రామన్న మాట్లాడక పోవడం శోచనీయం అన్నారు….అనంతరం పంట నష్టపోయిన రైతుల చెన్లకు వెళ్లి వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు…ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఫైజుల్ల ఖాన్ గారు ,బ్లాక్ అధ్యక్షులు సంజయ్ గుండావార్ గారు ,మాజి జడ్పీటిసి రామ్దాస్ నాక్లే గారు ,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే గారు ,పొచ్చన్న గారు ,చౌహాన్ గారు ,ఘన్ శ్యామ్ గారు ,దైర్యవాన్ గారు ,శంకర్ బొక్రే గారు ,అవినాష్ గొండే గారు , సుమిత్ గారు , గుడిపెళ్ళి నగేష్ గారు ,శ్రీదర్ భూపేళ్ళి గారు ,ఆనంద్ రావు గారు , మోతీ రామ్ గారు తదితరులు పాల్గొన్నారు.

మీడియా సమావేశం

ప్రజా సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు ఆరోపించారు…ఈ బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం రెండవ అధికారం లోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్న ఇప్పటికీ అర్హులకు ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని,అలాగే నూతనంగా రేషన్ కార్డుల జారీ ఇప్పటి వరకు జరగలేదని,అన్నారు..వారం రోజుల్లో పెన్షన్లు,రేషన్ కార్డుల జారీ పై నిర్ణయం తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని అన్నారు.పంట నష్టపోయిన రైతుల పక్షాన అదిలాబాద్ నియోజక వర్గ ఎమ్మల్యే జోగు రామన్న మాట్లాడక పోవడం శోచనీయం అన్నారు….అనంతరం పంట నష్టపోయిన రైతుల చెన్లకు వెళ్లి వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు…ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఫైజుల్ల ఖాన్ గారు ,బ్లాక్ అధ్యక్షులు సంజయ్ గుండావార్ గారు ,మాజి జడ్పీటిసి రామ్దాస్ నాక్లే గారు ,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే గారు ,పొచ్చన్న గారు ,చౌహాన్ గారు ,ఘన్ శ్యామ్ గారు ,దైర్యవాన్ గారు ,శంకర్ బొక్రే గారు ,అవినాష్ గొండే గారు , సుమిత్ గారు , గుడిపెళ్ళి నగేష్ గారు ,శ్రీదర్ భూపేళ్ళి గారు ,ఆనంద్ రావు గారు , మోతీ రామ్ గారు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సమస్యలు వివరణ

దీక్ష

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల దేశ భద్ర తకే ముప్పు వాటిల్లేల ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,నియోజక వర్గ సమన్వయ కర్త శ్రీనివాస్ గారుఆరోపించారు… పిసిసి అదేశల మేరకు ఈ రోజు మున్సిపల్ కార్యాలయం దగ్గర అగ్నిపథ్ పతకాన్ని రద్దు చేయాలని కోరుతూ..జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం లో ముందుగా పోలీసుల కాల్పుల్లో మరణించిన యువకుడికి నివాళులు అర్పించి అనంతరం దీక్షలో కూర్చున్నారు.నాయకులు మాట్లాడుతూ…అగ్నిపత్ స్కీమ్ వల్ల సైనిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని,వెంటనే దీనిని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు…ఈ కార్యక్రమంలోఏఐసిసి సభ్యురాలు సుజాత గారు,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి గారు,యాసమ్ నర్సింగ్ రావు,పట్టణ అధ్యక్షులు నగేష్ గారు,జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీదర్ గారు,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,మహిళా,యూత్,ఎన్ ఎస్ యు ఐ,సేవాదళ్,ఓబీసీ విభాగాల అధ్యక్షులు,నాయకులు,పలు మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్ర రెడ్డి 77వ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. 

మందలింపు

కరోనా భారిన పడిన వ్యాధిగ్రస్థులకి సరైన సౌకర్యాలు కల్పించడాం లో విఫలమైన ఆసుపత్రి యాజమాన్యాన్ని మందలిస్తున్న సాజీద్ ఖాన్ గారు. 
గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థలం కోసం కలెక్టర్ మరియు అధికారుల చుట్టూ తిరుగున్న ఎలాంటి స్పందన లేకపోవడం తో  జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయం వేలం పాట లో పాల్గొని 16,000 రూపాయలకు మల్గి ని పొందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ పార్టీ కార్యాలయ స్థలం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన స్పందన లేకపోవడం తో నిరసనగా వేలంపాట లో పొందిన మల్గి లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ధర్నా

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాంసి బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం ధర్నా కార్యక్రమం నిర్వహించించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిలాబాద్ పట్టణ వాసుల ప్రధాన సమస్య అయినటువంటి రైల్వే బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని మర్చిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వానికి, నియోజక వర్గాల్లో ఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయాలు కట్టుకోవడానికి, ప్రగతి భవన్ నిర్మాణానికి నిధులు ఉన్నాయని, కానీ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడీపీటీసీ గణేష్ రెడ్డి, యాసం నర్సింగ్ రావు, నగేష్, మునిగెల నర్సింగ్ , కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పలు కాలనీలకు, తాంసి,  తలమడుగు మండలాల కు చెందిన పలువురు పాల్గొన్నారు.
25 తేదీన తాంసి బస్టాండ్ రైల్వే గేట్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమానికి ప్రజలందరూ హాజరవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు.మాజీమంత్రి రామచంద్రా రెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేరిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ,తెరాస ప్రభుత్వాలు ఆదిలాబాద్ లో ప్రధాన సమస్య అయినటువంటి రైల్వే బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని చెప్తూ ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చాక ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలని తప్పు దోవ పట్టిస్తున్నారని, ఇలాంటి పనులు మానుకోక పోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడీపీటీసీ గణేష్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నర్సింగ్ రావు,మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్,సంజీవ్ రెడ్డి,సయీద్ ఖాన్,నారాయణ,మున్నా భాయ్,రాహుల్ చంద్రాల,ఎం ఏ షకీల్,సంతోష్,రాజారెడ్డి,గఫ్ఫార్,అఫ్రొజ్ తదితరులు పాల్గొన్నారు.
25 తేదీన తాంసి బస్టాండ్ రైల్వే గేట్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమానికి ప్రజలందరూ హాజరవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు.మాజీమంత్రి రామచంద్రా రెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేరిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ,తెరాస ప్రభుత్వాలు ఆదిలాబాద్ లో ప్రధాన సమస్య అయినటువంటి రైల్వే బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని చెప్తూ ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చాక ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలని తప్పు దోవ పట్టిస్తున్నారని, ఇలాంటి పనులు మానుకోక పోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడీపీటీసీ గణేష్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నర్సింగ్ రావు,మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్,సంజీవ్ రెడ్డి,సయీద్ ఖాన్,నారాయణ,మున్నా భాయ్,రాహుల్ చంద్రాల,ఎం ఏ షకీల్,సంతోష్,రాజారెడ్డి,గఫ్ఫార్,అఫ్రొజ్ తదితరులు పాల్గొన్నారు.

రైతు వ్యతిరేక బిల్లులకు నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా ఢిల్లీలో రైతుల చేస్తున్న ట్రాక్టర్ ర్యాలీ కి మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ లతో బారి ర్యాలీ నిర్వహించిన అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,నియోజక వర్గ ఇంచార్జి గండ్రత్ సుజాత లు మాట్లాడుతూ …రైతులను కార్పొరేట్ కంపెనీ లకు బానిసలుగా మార్చే ఈ చట్టాలను బలవంతంగా రైతులపై రుద్దాలని చూస్తున్నారని,గణతంత్ర దినోత్సవం రోజు రైతులు సంతోషంగా ఉండాల్సింది పోయి కష్టాలతో రోడ్డేక్కాల్సిన పరిస్థితి తీసుకువచ్చిన ఈ ప్రభుత్వానికి త్వరలో రైతులు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు యాసం నర్సింగ్ రావు,సంజీవ్ రెడ్డి,కొండ గంగాధర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్,శాంతన్ రావు,రాహుల్ చంద్రాల,భుపెళ్లి శ్రీధర్,అశోక్,మోసిన్ పటేల్,మూర్తుజా,మోతీరాం, గంగన్న,సృజన్ రెడ్డి,రూపేష్ రెడ్డి,మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి నివాసం వద్ద గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సంజీవరెడ్డి,యసం నర్సింగ్ రావు,కొండ గంగాధర్,టౌన్ ప్రెసిడెంట్ వసీం,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్,రాహుల్,అర్ఫాత్,రాజు, మోతీరాంతదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ వివాహం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కి చెందిన జమీల్ వృత్తి రీత్యా డ్రైవర్ వివాహం కె ఆర్ కె కాలని కి చెందిన రహీం గారి కుమార్తె తో జరిగింది.
వరుడు అమ్మాయి తరపు వారి నుండి ఎలాంటి లాంఛనాలు తీసుకోకుండా,అలాగే భోజనాలు కూడా లేకుండా వివాహాఁ చేసుకున్నారు.ఈ వివాహానికి హాజరైన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు వధువరులను ఆశీర్వదించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లితండ్రులకీ భారంగా మారిందని,ఆడంబరాలకి పోయి జనాలు అతిగా ఖర్చు చేస్తూ ,ఆహారాన్ని కూడా వృధా చేస్తున్నారని,అందరూ ఈ యువకుడిని ఆదర్షంగా తీసుకోని వివాహాలు చేసుకోవాలని అన్నారు.

వినతి పత్రాన్ని ...

కరోనా సమయంలోనూ రెగ్యలర్ వైద్య ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహించి తమవంతు బాధ్యతను నిర్వర్తించిన రిమ్స్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆరోపించారు. తమ వేతన సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని రిమ్స్ ఎదుట చేపట్టిన సమ్మెకు బుధవారం మద్దతు తెలిపారు. అంతకుముందు రిమ్స్ ఆస్పత్రి నుండి ర్యాలీగా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పట్నాయక్ మర్యాద పూర్వకంగా కలిసి, వినతి పత్రాన్ని అందజేశారు. వేతనాలు రాక కార్మికులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, మల్లేష్ యాదవ్ ,రాజు యాదవ్, సృజన్ రెడ్డి,రూపేష్ రెడ్డి, రిమ్స్ కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ నాయకులు బండ్ల శ్రీనివాస్, సఖి ఉద్దీన్ తదితరులు ఉన్నారు.

మెరుపు సమ్మె

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తపట్నాయక్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పేద విద్యార్ధులకు నోట్ బుక్స్,పెన్నులు అందించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,మునిగెల నర్సింగ్ గారు,రాహుల్ చంద్రాల గారు,మోతీరాం గారు.

ఫసల్ బీమా ప్రీమియం డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ బేలా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా ప్రీమియం లో తమ వాటా తొందరగా చెల్లించాలని,కేంద్రం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చాటాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని,లేని పక్షంలో రైతులంతా కలిసి మీకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్,నియోజకవర్గ ఇంచార్జి గండ్రత్ సుజాత,బేలా మండల అధ్యక్షులు ఫైజుల్లాహ్ ఖాన్,ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్,యాసం నర్సింగ్ రావు,సంజీవరెడ్డి,రాందాస్,సంజయ్ గుండవార్, వామన్ గారు తదితరులు పాల్గొన్నారు.

స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లురి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు వారి ఏ ఎస్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించి, వారితో కలిసి ప్రసాదాన్ని స్వీకరీంచారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా రోజులుగా స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకుంటుంన్నానని ఈ రోజు ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉందని ,అలాగే ఏఐసీసీ ఎవరిని అధ్యక్షుడిగా నియమించిన అందరు కలిసి పార్టీ కోసం పనిచేయాలని స్వామి ని కోరుకున్నానని అన్నారు,ఈ కార్యక్రమంలో మునిగెల నర్సింగ్ గారు,నగేష్ గారు,ఎం ఏ షకీల్,రాహుల్ చంద్రాల,మోసిన్ పటేల్ గారు తదితరులు పాల్గొన్నారు.

రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతుగా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతుగా, ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతుగా పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్, నగేష్ గారు, రాహుల చంద్రాల. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ ఈ చట్టాలు కేవలం కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే అని, రైతులకు ఉపయోగపడని ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరాం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో రైతు, ప్రజా సంఘాల నాయకులు బండి దత్తాత్రి, కొండ రమేష్, లోకరి పోశెట్టి, బొర్రన్న తదితరులు పాల్గొన్నారు.  

టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మానిగం ఠాగూర్, ఎఐసిసి సెక్రటరీ లు శ్రీనివాస కృష్ణన్,బోస్ రాజు ల ఎదుట అభిప్రాయం తెలిపిన అనంతరం జిల్లాలో పార్టీ పరిస్థితులపై,మండల కమిటీలపై చర్చించిన కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు.జిల్లా లో ఎంతమంది జెడీపీటీసీ లు,ఎంపీటీసీ లు,సర్పంచ్ లో ఎన్నికయ్యారో వివరంగా అడిగి తెలుసుకున్న అనంతరం, త్వరలోనే టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని,ఆదిలాబాద్ జిల్లా లో గ్రామ స్థాయి,మండల స్థాయి కమిటీలని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయాలని వారు సాజిద్ ఖాన్ గారికి సూచించారు.

సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా

సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం లోని ఉర్దూభవన్ లో యూత్ కాంగ్రెస్ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం లో పాల్గొన్న కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాతగారు, మాజీ జెడ్ పీటీసీ కొండ గంగాధర్ గారు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, అసెంబ్లీ ఇంచార్జి అర్తాఫ్ అహ్మద్, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ నాహిద్, కౌన్సిలర్ ముబారక్ మైనార్టీ సెల్ పట్టణాధ్యక్షుడు ఎం ఏ షకీల్, ఎస్ సీ సెల్ల్ నాయకులు రాహుల్ చంద్రాల,మోసిన్ పటేల్, గఫ్ఫార్ తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ

అఖిలపక్షం నిర్వహిస్తున్న బంద్ లో భాగంగా  పట్టణంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏ ఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత గారి, ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నేషనల్ హైవే పై రోడ్డు పై బైఠాయించరు.

నిరసన

రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ లో భాగంగా జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట టైర్లు కాల్చి నిరసన తెల్పిన జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమెందర్, వామపక్షాల నాయకులు.

వర్దంతి సందర్భంగా

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ గారి 64 వ వర్దంతి సందర్భంగా  జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత గారు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్, జెడీపీటీసీ గణేష్ రేడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్ రావు, మాజీ జెడ్పీటీసీ కొండ గంగాధర్ గారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన నిరసన కు మద్దతుగా డిసెంబర్ 8 తేదీన జరిగే భారత్ బంధ్ కి రైతులు, వ్యాపారులు, కార్మికులు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని అఖిలపక్షం నాయకులు అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, మునిగెల నర్సింగ్,రైతు సంఘ నాయకులు బండి దత్తాత్రి గారు, పోశెట్టి గారు, కొండ రమేష్ గారు, చిలక దేవిదాస్ గారు, తదితరులు పాల్గొన్నారు.

ధర్నా

గత కొన్ని నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతూ, రిమ్స్ ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు. ఉద్యోగులతో కలిసి ధర్నా కార్యక్రమం లో పాల్గొన్న అనంతరం సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ కరోన సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు చేసిన వారు జీతాల కోసం ధర్నా చేయాల్సి రావడం బాధాకరం అని,ఈ విషయం పై కలెక్టర్ గారిని కలిసి సమస్య పరిష్కరమయ్యేలా చూస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో ఐఎంటీయుసి జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్,ఎస్ సీ సెల్ నాయకుదు చంద్రాల రాహుల్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అర్ఫాత్,సంతోష్,అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

రహమత్ నగర్ డివిజన్ 102 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భవాని శంకర్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ సోహెల్ అబ్దుల్లా గారు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అజర్, నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లాహ్,కిజార్,జునైద్, ఎహెతేశం,ఫైసల్,జీషన్, సజ్జద్, కలీల్ తదితరులు.

Election Campaign

గృహ నిర్బంధం

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  చేపట్టిన గ్రామీణ బంద్ కి వెళ్లకుండా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారిని ఉదయం 6గంటల నుండి గృహ నిర్బంధం చేసిన పోలీసులు. 

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డ్ పరిస్థితి ఇలా ఉంటే మిగతా కాలని ల సంగతి ఎలా అని కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు.  పట్టణం లోని వార్డ్ నెంబర్ 34 శాంతి నగర్ వాసుల కోరిక మేరకు కాలనీ ని సందర్శించారు.ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ వార్డ్ లో డ్రైనేజి వ్యవస్థ సరిగా లేదని, పలుచోట్ల కల్వర్టుల అవసరం ఉందని, అలాగే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె లేక కాలనీ వాసులు భయంతో గడుపుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయం పై మున్సిపల్ చైర్మన్ కి,అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని,వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవ్వకపోతే మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని అన్నారు.

జయంతి

భారతదేశ తొలి మహిళ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి ని పురస్కరించుకొని స్థానిక ఇందిరా చౌక్ (ఠాగూర్ హోటల్) వద్ద ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్,ఏ ఐ సీ సీ సభ్యురాలు గండ్రత్ సుజాత,ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్ గారు,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు శాంతాన్ రావు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి,యాసం నర్సింగ్ రావు,ఎక్స్ కౌన్సిలర్ నాగేష్ గారు,మైనార్టీ టౌన్ చైర్మన్ షకీల్,మోసిన్ పటేల్ తదితరులు.

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలో పలువురు ప్రముఖులను, మరియు వ్యాపారస్తులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు.

రైతుల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరైనది కాదని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు.టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ..అకాల వర్షంతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని,ఎకరానికి ఇరవ వేళ చొప్పున రైతుకు నష్టపరిహారం అందించాలని,తేమ తో సంబంధం లేకుండా పంట కి మద్దతు ధర అందించాలని,గత మూడుసంవత్సరాలుగా ఇన్సూరెన్స్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన అన్నారు.

ధర్నా కార్యక్రమంలో

రైతుల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరైనది కాదని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు.టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ..అకాల వర్షంతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని,ఎకరానికి ఇరవ వేళ చొప్పున రైతుకు నష్టపరిహారం అందించాలని,తేమ తో సంబంధం లేకుండా పంట కి మద్దతు ధర అందించాలని,గత మూడుసంవత్సరాలుగా ఇన్సూరెన్స్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన అన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు రితేష్ రాథోడ్,భారత్ చౌహన్,రైతు సెల్ నాయకులు మల్లేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిగెల నర్సింగ్,నగేష్ రాజేశ్వర్,మల్లేష్,మైనార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం ఏ షకీల్,మోసిన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

 అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు.ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు రితేష్ రాథోడ్,భారత్ చౌహన్,రైతు సెల్ నాయకులు మల్లేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిగెల నర్సింగ్,నగేష్ రాజేశ్వర్,మల్లేష్,మైనార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం ఏ షకీల్,మోసిన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

Honor Ceremony Program

ధర్నా కార్యక్రమంలో

జయంతి సందర్భంగా

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పరామర్శ

రిమ్స్ ఆస్పత్రి లో అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురు బేల మండలవాసులను కలిసి పరామర్శించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు వారి వెంట బేల మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్ల్ మాజీ మార్కెట్ మాజీ సర్పంచ్ రూప్ రావ్.వాంకడే తదితరులు పాల్గొన్నారు

ఇంద్రవెళ్లి లో జరిగే దళిత,గిరిజన దండోరా సభను విజయవంతం చేయాలని కోరుతూ జైనథ్ మండలం లోని ఖాప్రి,బెల్లూరి గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులను,కాంగ్రెస్ పార్టీ నాయకులను,కార్యకర్తలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ,మండల కన్వీనర్ కల్చప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

సమస్యల పరిష్కారం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారాల కోసం నిర్మించిన దుకాణ సముదాయాలను ఏళ్ళ నుండి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కాకుండా కొత్తవారికి ఇస్తున్నారని కొందరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారిని సంప్రదించగా ,అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరింప చేసినందుకు గాను సాజిద్ ఖాన్ గారిని ధన్యవాదాలు తెలిపిన చిరు వ్యాపారులు.

మెమోరాండం అందజేత

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బేలా మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి బేల మండల ఎమ్మార్వో గారికి రైతు సమస్యల పై ప్రభుత్వం వెంటనే లక్ష రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, పోడు వ్యవసాయ భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి అనే ప్రధానమైనటువంటి రైతు సమస్యలపై
మెమోరాండం ఇవ్వడం జరిగింది.

స్వాగతం-సుస్వాగతం

ఇంద్రవెళ్లి అమరులకు నివాళులు అర్పించడానికి జిల్లా కి విచ్చేసిన ఎంపీ, టీపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి శాలువా కప్పి స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, నగేష్ గారు ,మల్లేష్ యాదవ్ గారు,రాహుల్ చంద్రాల గారు.

కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు ఏ.ఐ.సి.సి.మరియు పి.సి.సి.ఆదేశాల మేరకు…ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్.కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో ప్లాస్మా,ఆక్సిజన్,హాస్పిటల్ బెడ్స్,వెంటిలేటర్,మెడిసిన్ వీటిలో ఏ అవసరం ఉన్నా తమ ను సంప్రదించాలని10 మందితో కూడిన ఒక టీమ్ తయారుగా మీ సేవకోసమే ఉందని అలాగే సోనియా మేడం గారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికునిలా పనిచేయాలని సాజిద్ ఖాన్ గారు అన్నారు. 

ఆక్సిజన్ సీలిండర్ల పంపిణి

ఎంతో మంది ప్రాణాలు కుప్పకూలిపోతున్న కరోనా సమయం లో,కోరో న బాధితులకు సాజీద్ ఖాన్ గారు ఆక్సిజన్ సీలిండర్లను పంపిణి చేయడం జరిగింది …

ఇంద్రవెళ్లి లో జరిగే దళిత,గిరిజన దండోరా కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని నెరడిగొండ మండల కేంద్రంలో ప్రజలని కలిసి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,నరేష్ జాధవ్ గారు,జాధవ్ వసంత్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు , మైనార్టీ జిల్లా అధ్యక్షులు షకీల్ గారు , మైనార్టీ టౌన్ అధ్యక్షులు సయ్యద్ మొసిన్ పటేల్ గారి సమక్షంలో పట్టణంలోని ఖుర్షీద్ నగర కాలనీకి చెందిన పలువురు యువకులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

ధర్నా

ఈ కార్యక్రమం లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు , ఏ ఐ సి సి సభ్యురాలు గండ్రత్ సుజాత గారు బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ గారు , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ రెడ్డి గారు , యాసం నర్సింగ రావు గారు తదితరులు పాల్గొనడం జరిగింది

Party Activities

Social Services

ఉమ్రా యాత్ర

ఆ దేవదేవుడైన అల్లా అనుగ్రహంతో, ఆదిలాబాద్ ప్రజల ఆశీస్సులతో నా యొక్క పవిత్ర ఉమ్రా యాత్ర పూర్తయ్యింది.యాత్రలో భాగంగా మన దేశం పాడిపంటలతో వర్ధిల్లాలని, రైతులు సకాలంలో వర్షాలు పడి సంతోషంగా ఉండాలని ప్రార్థించడం జరిగింది. దేశంలో ఎలాంటి మత ఘర్షణలు తలెత్తకుండా, సోదర భావంతో ప్రజలందరూ జీవించేలా చూడాలని, వరదలు, భూకంపాలు సంభవించకుండా, కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయి, అంటువ్యాధులు రాకుండా చూడాలని ఆ అల్లాను కోరుకోవడం జరిగింది. యువత పెడదారిన పడకుండా, దేశంలో నిరుద్యోగం పెరగకుండా సద్బుద్ధిని ప్రసాదించాలని వేడుకోవడం జరిగింది. అందులోభాగంగా మన మువ్వన్నెల జాతీయ జెండాతో కాబా వద్ద మా కుటుంబ సభ్యులతో కలిసి భారతీయుడినని సగర్వంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.దేశ ప్రజలు, తెలంగాణా ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికై కట్టుబడి ఉంటానని ఆ అల్లా సన్నిధిలో ప్రమాణం చేస్తూ మీ అందరి ప్రేమానురాగాలు, ఆశీస్సులు సదా నాపై ఇలాగే చూపించాలని ఆకాంక్షిస్తూ. మీ సాజిద్ ఖాన్, డిసిసి అధ్యక్షులు

మీడియా తో

ఆదిలాబాద్ మిమ్స్ హాస్పిటల్ లో covid-19 రోగులకు కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని, వెంటనే గవర్నమెంట్ దీనిపై చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్ ఖర్చు ప్రజలు భరించలేక పోతున్నారని covid-19 ఖర్చు ని ఆరోగ్య శ్రీ లో కలపాలని సాజిద్ ఖాన్ గారు మీడియా తో తెలిపారు
కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లో అప్పటి ఇంచార్జి మంత్రి బస్వరాజు సారయ్య గారి చేతుల మీదుగా మావల పరిధి లోని సర్వే నెంబర్ 170 లో పేదలకు ఇళ్లపట్టాలు మంజూరు చేయగా,ఇప్పుడు తప్పుడు ధ్రువ పత్రాలు అంటూ రెవెన్యూ అధికారులు తమ ఇండ్లు కూల్చివేశరని,ఏడు సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్న వారికి న్యాయం చేయాలని కోరుతూ బాధితుల తో కలిసి ఈ రోజు అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు.

మీటింగ్ లో

కాంగ్రెస్ నూతన కార్యాలయ ఏర్పాటుకు కృషి

ప్రచారం లో

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తరపున ఆనంతసాగర్ గ్రామంలో ప్రచారం నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు(ఇంచార్జి) సాజిద్ ఖాన్ గారు, టీపీసీసీ సెక్రటరీ శివకుమార్ గారు, మరియుకాంగ్రెస్ నాయకులు నగేష్, మొహమ్మద్ షాహిద్, మోసిన్ పటేల్ తదితరులు.
మున్సిపల్ వైస్ చైర్మన్ గారి ప్రెస్ మీట్ కి కాంగ్రెస్ నాయకుల కౌంటర్
కూరగాయల మార్కెట్ తరలింపు విషయంలో టీ ఆర్ యస్ నాయకులు తీరు సరికాదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు(ఇంచార్జి)సాజిద్ ఖాన్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోన నేపత్యంలో కూరగాయల బీట్ ని స్థానిక రాంలీల మైదానం లో ఏర్పాటు చేసారని,ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడంతో మార్కెట్ ని అధికారులు డాల్డా కంపెనీ వద్దకు తరలించారు.ఇక్కడ షాప్స్ పెట్టుకోవడానికి వ్యాపారులను TRS నాయకులు 6లక్షల రూపాయలు అడుగుతున్నారని,అలాగే మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్,ఎమ్మెల్యే పేరట కొన్ని షాప్స్ కేటాయించాలని అంటున్నారని ఆయన ఆరోపించారు.ఒకవేళ TRS నాయకులు ఈ విషయంలో తీరు మార్చుకోకపోతే వ్యాపారులతో కలిసి నిరాహార దీక్షకు సిద్ధం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నగేష్,మునిగెల నర్సింగ్,ఎం ఏ షకీల్,చెంద్రాల రాహుల్,మల్లేష్,రసూల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

Nomination Rally

Congress district in-charge presidents Sajid Khan, Nagesh Garu, Motiram, Santosh, Rasool Khan, and villagers Srinivas, Sankarayya, Komuraiya, Sai Yadav and Dubaka from Chegunta zone Anantasagar village in support of Cheraku Srinivas Reddy, who is nominating as a Congress candidate in the by-election to Dubakk constituency. Moved to.

స్వాగతం-సుస్వాగతం

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన టీపీసీసీ ఇంచార్జి మానిగం ఠాగూర్ గారికి శాలువా కప్పి స్వాగతం పలికిన పీసీసీ మైనార్టీ చైర్మన్ సోహెల్ భాయ్, ఆదిలాబాద్ కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు, కాంగ్రెస్ నాయకులు నాగేష్ గారు, మల్లేష్ గారు, విశాల్.

సమావేశం

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో టీపీసీసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన నార్సింగి, చేగుంట మండలాల్లోని గ్రామాల ఇంచార్జి లతో సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఇంచార్జి మానిక్యoఠాగూర్ హాజరయ్యి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆదిలాబాద్ కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు, ఓబీసీ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనందరావు పటేల్, ఎక్స్ కౌన్సిలర్ నగేష్, కాంగ్రెస్ నాయకులు మల్లేష్, విశాల్, గ్రామస్తులు సాయి యాదవ్, శ్రీనివాస్, శంకరయ్య, కొమురయ్య తదితరులు.

వరినాట్లు నిరసన

ఆదిలాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లు వరి పంట వేసుకునే స్థితిలో ఉన్నాయి! మున్సిపల్ రోడ్లు గుంతల మయం ఏ ప్రధాన రహదారి చూసిన చేసిన మూడు నెలలకే రోడ్ల పరిస్థితి అవినీతి రాజ్యమేలుతున్న ఆదిలాబాద్ పట్టణంలో రోడ్లు పూర్తిగా గుంతల మయం అయినాయి దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు sajid khan గారి నాయకత్వంలో రోడ్ల గుంతలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు

జయంతి ఉత్సవాల్లో భాగంగా

మాజి ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణం లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో ని థీమ్స్ వార్డులో రోగులకు పండ్లు అందించారు. ఈ సంధర్భంగా సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ. స్వర్గీయ రాజీవ్ గాంధి గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఈ రోజు ప్రతీ ఇంట్లో మొబైల్ ఫోన్ ఉందంటే దాని ఘనత రాజీవ్ గాంధీ గారికే చైందుతుందని అన్నారు.

బక్రీద్ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ ప్రజలతో

Save the Democracy

AICC పిలుపు మేరకు ఈ రోజు ఆదిలాబాద్ పట్టణం లోని కలెక్టర్ ఆఫీసు ఎదుట Save the democracy అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోధర్నా నిర్వహించారు. అనంతరం DROకి మెమోరండం అందజేశారు

అఖిల పక్షం ఆధ్వర్యంలో

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ,అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో కార్యక్రమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాంద వద్ద నేషనల్ హైవే పై రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ ,ఈ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేయడానికి ఈ చట్టాలను ప్రవేశ పెట్టిందని,చట్టాలను వెనక్కి తీసుకోక పోతే రైతులతో కలిసి ఉద్యమన్ని ఉదృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత,మాజీ కౌన్సిలర్ నగేష్ ,కొండ గంగాధర్,సంజీవరెడ్డి,ముబారక్ ,యాసం నర్సింగ్ రావు,ఎం ఏ షకీల్,రాహుల్ చంద్రాల,చరణ్ గౌడ్, రాజు యాదవ్,రూపేష్ రెడ్డి,మోసిన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ యార్డ్ రోడ్డు పూర్తిగా

గెలుపు ,ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా సేవలో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ….

ఆదిలాబాద్ పట్టణంలో భాగ్యనగర్ ,తాటిగుడా ,జైజవన్ నగర్ కాలని లకు వెళ్లే ప్రధాన మార్గం అయినటువంటి పత్తి మార్కెట్ యార్డ్ రోడ్డు పూర్తిగా గుంతలు గుంతలుగా ఏర్పడి కాలనీ వాసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కాంగ్రెస్ డీసీసీ ఇంచార్జి సాజిద్ ఖాన్ గారి దృష్టికి కాలని వాసులు తీసుకెళ్ళడంతో తన సొంత డబ్బులతో రోడ్డు మరమ్మత్తులు పనులను ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలని వాసులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో , గతుకుల రోడ్డులో ప్రధానంగా రైతుల పత్తి బండ్లు, ప్రసూతి మహిళల అవస్థలు,వాహనదారులు ఇబ్బందులు గమనించి కాలని వాసులు అవస్థలు పడకూడదని ఈ పని ప్రారంభిచమని ,ఇకనైనా ఆదిలాబాద్ ఎం ఎల్ ఏ,మున్సిపల్ చైర్మన్ గారు స్పందించి రోడ్డు వెయిస్తే బాగుంటుందని,అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా జనాల పక్షాన పని చేయడానికి వారికి అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఐఏన్టీయుసి జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్,మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎం ఏ షకీల్,ఎస్ సీ సెల్ నాయకులు రాహుల్ చంద్రాల, ఆయ్యుబ్, సలీం తదితరులు పాల్గొన్నారు.

సత్యాగ్రహ ఉపవాస దీక్ష

బీజేపీ,టీఆర్ఎస్ ప్రభుత్వాలు పేద రైతులకు మోసం చేసికార్పొరేట్ కంపెనీ లకు దోచిపెడ్తున్నాయని,కాంగ్రెస్ నిర్మించిన అభివృద్ధి పునాదుల మీద పాలన చేస్తూ కాంగ్రెస్ పార్టీ ని విమర్శిస్తున్నాయని,కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు.సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జయంతి ,ఇందిరా గాంధీ ,కొమరం భీం ల వర్దంతి సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు స్థానిక ఇందిరాగాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన కిసాన్ అధికార్ దివాస్ సత్యాగ్రహ ఉపవాస దీక్ష కార్యక్రమంలో నాయకులు ముందుగా ఇందిరాగాంధీ,కోమరంభీమ్,వల్లబ్ భాయ్ పటేల్ ల చిత్ర పటాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేసే రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేసే వరకు రైతుల ప్రక్షాన నిలబడి ఎంతటి పోరాటలకైనా సిద్ధంగా ఉంటామని అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్,కాంగ్రెస్ నాయకులు దిగంబర్ రావుపాటిల్, మునిగెల నర్సింగ్,నగేష్,చెంద్రాల రాహుల్,భీంరెడ్డి,రాందాస్,గండ్రత్ వెంకటేశ్వర్లు,అశోక్ అల్లాలి,ఎం ఏ షకీల్,ఖయ్యుమ్,కలీమ్ తదితరులు పాల్గొన్నారు

నిరసన

సెక్రటేరియట్ లో రెండు మజీద్ లు, ఒక మందిరంను కూల్చివేయడానికి నిరసనగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవాలయం, మస్జిద్ ముందర కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

 

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా

 ఆదిలాబాద్ పట్టణంలోని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు. మాజి ZPTC మడావి రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ లు కోమురంభీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

Independence day celebrations

దిలాబాద్ జిల్లా లోని భీంపూర్ మండల్ ధనోర గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గోవర్ధన్ యాదవ్ పండిస్తున్న పంటలను సందర్శించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు, ఉమ్రి సర్పంచ్ పెందుర్ లక్ష్మణ్, పోలిశెట్టి లు. ధనోర గ్రామంలో తన 10 ఎకరాల వ్యవసాయ భూమి లో అదునాతన పద్దతిలో పండిస్తున్న డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పసుపు, అల్లం, మిర్చి పంటలను సాజిద్ ఖాన్ గారు తిలకించారు.

President of INC సోనియా గాంధీ గారిని కలిసిన సందర్భంలో

Shop Opening Program

ఆదిలాబాద్ పట్టణంలో అబ్దుల్ రఫత్, MD. వసీమ్ గార్ల నూతనంగా పెట్టిన బిగ్వన్ ఫర్నీచర్ షాప్ ను ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు.

Honor Ceremony

లాక్ డౌన్ సమయంలో ఆదిలాబాద్ లో నిరుపేద ప్రజలకు ఉచితంగా రేషన్ సరుకులు అందించి కష్ట సమయంలో ఎలాంటి స్వార్థం లేకుండా ఆదుకున్నందుకున్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారికి తన నివాసంలో నిర్మల్ జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి M.A లతీఫ్ తన బృందంతో సాజిద్ ఖాన్ గారిని పులమాలవేసి శాలువాతో సన్మానించారు

DCC ప్రక్రియ లో భాగంగా

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ DCC ప్రక్రియ లో భాగంగా హైదరాబాద్ లో త్రిమ్యాన్ కమిటి మీటింగ్ సంధర్భంగా PCC ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు మరియు కౌన్సిలర్ ముబారక్, మాజీ కౌన్సిలర్ నగేష్ గారు, చంద్రాల రాహుల్.

పోలాల పండుగ శుభాకాంక్షలు

పోలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం మామిడి గూడ గ్రామంలోని మాజి ZPTC మడావి రాజు గారి నివాసంలో పాడెడ్లను సందర్శించి పోలాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు

రాహుల్ గాంధీ 50వ జన్మదినం సందర్భంగా

 ఆదిలాబాద్ లోని భగత్ సింగ్ నగర్ లో కాంగ్రేస్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కి రేషన్ సరుకులు, పిల్లలకి పండ్లు, చాక్లట్లు,బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ రక్తదాన శిబిరం లో సాజిద్ ఖాన్ గారితో పాటు పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గండ్రత్ సుజాత గారు, నర్సింగ్ రావు, కౌన్స్లర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Service in Pandemic COVID-19

పరామర్శ

కరోన కష్ట కాలంలో ప్రజలకు సేవలు అందిస్తునందుకు గాను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారిని సన్మానించిన అమ్మ హాస్పిటల్ యాజమాన్యం,అనంతరం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్స్ దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడి వారి లో మనోధైర్యం నింపిన సాజిద్ ఖాన్ గారు..

ఉచిత ఆక్సిజన్ పంపిణీ కేంద్ర ప్రారంభోత్సవం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో ఉచిత ఆక్సిజన్ పంపిణీ కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తన తండ్రి జ్ఞాపకార్థం ఏఎస్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ కరోన కష్టకాలం లో ఆక్సీజన్ అందక రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని ,వారి కోసం ఈ పంపిని కార్యక్రమాన్ని ప్రారంభించామని,కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఈ సేవల్ని పొందొచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అంజాద్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు మునిగెల నర్సింగ్,నగేష్, షకీల్, చంద్రాల రాహుల్, షేక్ కలీం,సంతోష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆక్సిజన్ సీలిండర్లు అందచేత

జలీల్ అహ్మద్ ఖాన్ గారి ద్వారా నిర్మల్ ఖానాపూర్ కి చెందిన పేషంట్ కి సీలిండిర్ పంపించడం జరిగింది.

ఉచితంగా ఆక్సిజన్ సీలిండర్లు పంపిణీ

ఏ ఎస్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోన పేషంట్స్ కోసం ఉచితంగా సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా జలీల్ అహ్మద్ ఖాన్ గారి ద్వారా నిర్మల్ ఖానాపూర్ కి చెందిన పేషంట్ కి అలాగే తాటిగుడా కి చెందిన హన్మాండ్లు గారికి ఆక్సీజన్ సిలిండర్ అందించడం జరిగింది….

నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నా కారణంగా పేదలకు నిత్యవసర సరుకులు కూరగాయలు మరియు ఎంతో కష్టపడ్డా పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా అందజేశారు

StayHome StaySafe SaveLives

రోజు రోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న తరుణంలో ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఇంటింటికీ సానిటైజ్ స్ప్రేను చల్లినమాజీ కౌన్సిలర్ నగేష్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో కోవిడ్ 19 వైరస్ లు అడ్డు అదుపు లేకుండా ప్రభలుతుందన్నారు. ఇలాంటియంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించి చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పారు. కోవిడ్ లక్షనాలు కనిపిస్తే భయపడకుండా టెస్టులు చేసుకోవాలన్నారు.

హైదరాబాద్ నుండి UP కి వెల్తున్న 100 మంది వలసకూలీలను ఆదిలాబాద్ దగ్గర బోరజ్ చెక్పోస్టు వద్ద వలస కూలీలు ప్రయానిస్తున్న బస్సులను ఆపి బస్సులను సీజ్ చేసి ఆదిలాబాద్ పట్టణంలో ని బస్ డీపో లో ఉంచడంజరిగింది. దీంతో కూలీలూ దిక్కు తోచని స్థితిలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారిని సంప్రదించగా వెంటనే ఆయన స్పందించి హుటాహుటిన పట్టణం లోని బాస్ డిపోకు చేరుకుని DTC గారితో మాట్లాడి కూలీల బస్సులను విడిపించారు. కూలీలకు తినడానికి స్నాక్స్, తాగడానికి మంచినీరు అందించి వారిని సాగనంపారు. దీంతో వలస కూలీలు సాజిద్ ఖాన్ గారికి కృతజ్ఞతలు తెలిపి తమ ప్రాంతానికి పయనమయ్యారు

చిరు వ్యాపారస్తుల జీవనం దయనీయంగా మారిందని

ఆదిలాబాద్ పట్టణంలో రొడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటూ రోజువారి జీవితం గడుపుతున్న వారి దుకాణాలను ప్రభుత్వం జేసీబీతో కూలగొడుతుంటే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు అడ్డుకున్నారు. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారులను దౌర్జన్యం గా వారి దుకాణాలను జేసీబీ తో కూల్చడం అన్యాయం అని సాజిద్ ఖాన్ గారు అన్నారు. లాక్ డౌన్ సమయంలో వ్యాపారం లేక చిరు వ్యాపారస్తుల జీవనం దయనీయంగా మారిందని, ఇలాంటి సమయంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని దౌర్జన్యం గా వెల్లగొట్టడం సరికాదని పేర్కొన్నారు. వీరికి వ్యాపారం చేసుకోడానికి వేరే స్థలాలను కేటాయించాకే షాపులు తొలగించాలని అన్నారు. వ్యాపారస్తులకు తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

లాక్ డౌన్ సమయంలో

ఫుట్ పాత్ పైన ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారం లేక రోజువారీ జీవనం కఠినంగా మారిందని వారిని ఇబ్బందులు పెట్టకండని DSP కి విన్నవించారు.. తరువాత అడిషనల్ కలెక్ట్ డేవిడ్ గారికతో ఫోన్ ద్వారా ఫుట్ పాత్ వ్యాపారస్తుల బాధలను విన్నవించారు. ఫుట్ పాత్ వ్యాపారస్తుల కు వేరే స్థలాలను కేటాయించాకే ఫుట్ పాత్ పైన షాపులు తొలగించాలని కోరారు. దీంతో DSP, అడిషనల్ కలెక్ట్ లు వ్యాపారస్తులకు హామి ఇవ్వడంతో వ్యాపారస్తులు సంతోషించారు..వీరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేన్నానని సాజిద్ ఖాన్ గారు .హామీ ఇచ్చారు..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పుత్లిబౌలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రములో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ గారితో కలిసి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని,అలాగే దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగేష్ రాహుల్ చంద్రల,రాజు యాదవ్,అజిజ్ తదితరులు పాల్గొన్నారు.

మాస్క్ లు పంపిణీ

పీసీసీ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్ లో మాస్క్ లు పంపిణీ చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,నగేష్,జాబీర్,రసూల్ ఖాన్,రాహుల్ చంద్రాల,అశోక్,రాజు యాదవ్ ,అన్ను భాయ్,అజిజ్ తదితరులు…

ఉచిత ఆక్సిజన్ సిలిండర్ ల పంపిణీ

ఏ ఎస్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోన పేషంట్స్ కోసం ఉచితంగా 70 ఆక్సిజన్ సిలిండర్ లను పంపిణీ చేసి వాలాను ఆదుకోవడం జరిగింది.

Party Activities

బోథ్ మండలం దన్నుర్ గ్రామంలో జరిగే రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, భోధ్ మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, నగేష్ గారు, మల్లేష్ యాదవ్, రాజు యాదవ్,షేక్ నాసర్, మహేందర్, చంటి తదితరులు.

కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం

ఖమ్మం జిల్లా కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర ఇంచార్జి మానిగం ఠాగూర్, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, సీఎల్ఫీ నేత మల్లు బట్టి విక్రమార్క, రేణుక చౌదరి గార్ల ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, నాగేష్ గారు, రాహుల్ చంద్రాల, రాజు యాదవ్, రాయిసిడం సౌరభ్.

ముఖాముఖీ కార్యక్రమం

ఆదిలాబాద్ రురల్ మండలం లోని భీంసరి గ్రామంలో సీఎల్పీ నేత మల్లు బట్టివిక్రమార్క గారి బృందం రైతులతో ముఖాముఖీ కార్యక్రమానికి ప్రతి ఒక్క రైతు తప్పకుండా హాజరు కావాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,  ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత గారు అన్నారు. భీంసరి గ్రామంలో ముఖాముఖీ కార్యక్రమానికి స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాడుతూ ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలోసంజీవరెడ్డి గారు, కొండ గంగాధర్ గారు, నగేష్ గారు, భీంసరి ఉప సర్పంచ్ రజిత మల్లయ్య, సంజయ్, రామారావు, రాహుల్ చంద్రాల, రాజు యాదవ్, గజనన్, రవి, దేవేందర్, రూపేష్ రెడ్డి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

నిరసన

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ దేశం లో పెరుగుతున్న పెట్రోల్ ధర లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, అటు నిత్యావసరాల ధరలు కూడా ఆకాశనంటుతున్నాయని, బీజేపీ ప్రభుత్వం అధికారమే లోకి వస్తే 35 రూపాయలకు లీటర్ డీజిల్ వస్తుంది అని చెప్పిన రాందేవ్ బాబా ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలని అన్నారు.అనంతరం మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,నియోజక వర్గ ఇంచార్జి గండ్రత్ సుజాత గారు,యాసం నర్సింగ రావు , సంజీవ్ రెడ్డి, కొండ గంగాధర్, చరణ్ గౌడ్, మల్లేష్ యాదవ్,ఎం ఏ షకీల్, రాహుల్ చెంద్రాల, షేక్ కలీమ్,రాజు యాదవ్, శాంతన్ రావు, అర్ఫాత్,షిండే గారు, సంతోష్, అశోక్ అల్లాలి తదితరులు పాల్గొన్నారు.

రైతులను వారి వ్యవసాయ పొలాల్లోనే కూలీలుగా మార్చేల కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర పిసిసి పిలుపుమేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు సుజాత, ఉట్నూర్ జెడ్పిటిసి చారులత రాథోడ్,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ జడ్పిటిసి అభ్యర్థి కొండ గంగాధర్, నాయకులు చంద్రాల రాహుల్, చరణ్ గౌడ్, లక్ష్మణ్ రెడ్డి, షకీల్, శ్రీధర్ ,సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

INTUC జాతీయ ,రాష్ట్ర అధ్యక్షులు సంజీవరెడ్డి గారిని అదిలాబాద్ జిల్లా కేంద్రంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్,ఎం ఏ షకీల్.

కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవాణ్ని పట్టణంలోని మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సెల్ఫీ విత్ తిరంగా కార్యక్రములో భాగంగా జాతీయ జెండా తో సెల్ఫీ లు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి, రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, తలమడుగు జెడ్పిటిసి గొక గణేశ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండ గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు,సంజీవరెడ్డి, నర్సింగ్ రావ్, నగేష్, నర్సింగ్ మునిగెల, చంద్రాల రాహుల్, షకీల్, చరణ్ గౌడ్, సృజన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ రురల్ మండల జడీపీటీసీ అభ్యర్థిగా కొండ గంగాధర్ గారి పేరును ప్రకటించిన కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు.

పరామర్శ

 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాటిగూడా కాలని లో జరిగిన కాల్పుల ఘటన లో గాయపడి మృతి చెందిన సయ్యద్ జమీర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, ఎం ఏ షకీల్, చంద్రల రాహుల్ తదితరులు.

నివాళి

కాంగ్రెస్ సీనియర్ మహిళ నాయకురాలు, మహిళ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి రాయిసిడం సరిత గారి అంత్యక్రియలకు హాజరై, ఆమె పార్థివ దేహం పై పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు, నగేష్ గారు, ఎం ఏ షకీల్, చంద్రాల రాహుల్,షేక్ కలీమ్ గారు.

క్రిస్మస్ వేడుకల్లో

ఉట్నూర్ మండల కేంద్రంలో ని సి ఎస్ ఐ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పండగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అందరితో కలిసి పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని , అలాగే అందరూ బాగుండాలని, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రార్థన చేయాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, ఎం ఏ షకీల్,షేక్ కలీమ్, ఉట్నూర్ కి చెందిన నాయకులు భరత్ చౌహన్, విజయ్, సయ్యద్ ఇక్బాల్, నిస్సార్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ సాజిద్ ఖాన్ గారిని శాలువా కప్పి సత్కరించారు.

కాంగ్రెస్ సీనియర్ మహిళ నాయకురాలు ,మహిళ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి రాయిసిడం సరిత గారి అంత్యక్రియలకు హాజరై,ఆమె పార్థివ దేహం పై పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు,నగేష్ గారు,ఎం ఏ షకీల్,చంద్రాల రాహుల్,షేక్ కలీమ్ గారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనుకుంట లోని శివ మార్కండేయ ఆలయంలో అన్నదానం చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీజిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారిని శాలువా కప్పి సన్మానించిన ఆలయ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గారు,బింగి ఇస్తారీ, రాజేశ్వర్,బస దత్తు తదితరులు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులుమునిగెల నర్సింగ్,సంతోష్,రాజు యాదవ్,రాహుల్ యాదవ్,చారి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగ పంట పండించిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 17 వ తేదీన అఖిల పక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున రావాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు.ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రయివేట్ వ్యాపారులు తక్కువ దరకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారని దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

వారం రోజులుగా ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల రైతుల హక్కుల కోసం కలెక్టరేట్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, నగేష్,శివాజీ కాంబ్లే,మల్లేష్ యాదవ్,రాహుల్ చంద్రాల,రాజు యాదవ్ తదితరులు.

News Paper Clippings and Pamphlets

Videos

Videos

}
04-05-1979

Born in Adilabad

Adilabad

}
1993

Completed SSC Standard

from Little star’s high school

}
1995

Completed Intermediate

from the  Govt Junior College

}
1993

Joined in the NSUI

}

Joined in the INC

}
1998

Worked as Youth Congress

}
2003

ASK Foundation

set up many programs himself like Free blood donation camps, free checkups, and have free Helpline Service to the People.

}
2008

President

of the Urban Congress, Adilabad

}
2009

Chairman

of Adilabad District

}
2009

President

of the Lorry Owners Associations, Adilabad

}
2015

Telangana Spoke Person

}
2017-till now

Chairman of ADCC Minority

from the Indian National Congress, Adilabad

}
06-November-2020

Incharge DCC President