Saila Satyanarayana | Mandal President | Sarpanch | TDP | the Leaders Page

Saila Satyanarayana

Mandal President, Sarpanch, Chakradevarapalle, Jangareddygudem, Eluru, Chintalapudi, Andhra Pradesh, TDP

Saila Satyanarayana is an Indeed Politician of the TDP Political Party and Mandal President from Jangareddygudem of Eluru district Andhra Pradesh State.

CHILDHOOD AND EDUCATION-

On the 15th of May 1971, Satyanarayana was born to the couple Mr Saila Pentaiah & Mrs Saila Mahalaxmi and raised in Chakradevarapalle Village of Eluru district from the Indian state of Andhra Pradesh.

In 1987, Satyanarayana obtained his Secondary Board of Education from Zilla Parishad High School at Jangareddygudem of Eluru. In 1990 he completed his Intermediate from Sri Damodara Junior College at Jangareddygudem in Eluru.

In the year 1993, Satyanarayana attained graduation with a degree from CSPS Degree College from Jangareddygudem of Eluru, Andhra Pradesh.

DEMOCRATIC CAREER IN TDP

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed due to his services.

Satyanarayana commenced his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of TDP, Satyanarayana expressed a keen interest and performed every activity to recognize the respective party.

Satyanarayana was appointed as the Village General Secretary from the TDP Party of Chakradevarapalle, Andhra Pradesh, to tackle the issues and consequences that arose in the society.

In 1996, he worked incredibly as a Telugu Yuvatha Mandal General Secretary from ITDP. He worked hard for the welfare of the people, constantly striving for the development of society, and rendered desperate services to the community.

For his work and humility towards the growth and the welfare of the people, in 2021, he was appointed as the Mandal President of Jangareddygudem from TDP by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

As a Sarpanch in 2021, he demonstrated his commitment to the people by continuously working for their well-being and college development and striving hard for their benefit.

From the party’s inception to the current day, he has worked conscientiously for the prosperity of the people, persistently aiming for the party’s and society’s growth and rendering desperate service to society and the common good of the people.

In recognition of his continued service, Satyanarayana was elected 2 times for the position of Ward Member for the 04th & 08th Ward of Chakradevarapalle but also increased his responsibilities to discharge his duties.

His constant attention and pure dedication to service led to his promotion to the Vice Sarpanch from TDP to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

FAMILY PARTICIPATION IN POLITICS –

Satyanarayana has been accustomed to leadership qualities since childhood, as his ancestors worked in politics. As he has a respectable level in politics, Satyanarayana’s family has been ideal for him to provide continuous services to the people.

Saila Pentaiah, the Father of Saila Satyanarayana, was the Village General Secretary of the TDP Party and has served with gratitude and perpetually working hard for the well-being of society.

Pentaiah has an extensive political career as an Ex. Sarpanch. He demonstrated his commitment to the people by continuously working for their well-being and college development and striving hard for their benefit.

Pentaiah served as the Vice President of Pradhamika Sahakara Sangam for his tenacity, with the mandate to carry out his duties only for the sake of the people without jeopardizing the party’s confidence in him.

Party Activities:

  • He is fighting with the government to provide proper employment by releasing Job notifications to the unemployed who are worried about getting a good job even after graduation.
  • At the request of the TDP party, protests are being conducted around the state to demonstrate their strong condemnation and resistance to decisions made in the three capitals.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s doctrines and worked for the party.
  • In case of any issues with the land of the village people, Satyanarayana remained and argued the problems and handed over the grounds to them.
  • Subsidy Loans and Grants are also made available to the beneficiaries for their revenue works and the setting up of mini businesses.
  • Following a recent event in which Chandra Babu Naidu wept in the CBN Assembly for instigating obscene statements against the wife of our beloved former Chief Minister, all Telugu Desam party leaders conducted a dharna in support of them to protest against the Opposition party.

Social Activities: 

  • Satyanarayana said that the struggle for developing Dalits, minorities, the poor, and minorities in society would be achievable only with the TDP party.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • He organized eye camps for senior citizens far from hospitals and helped them by providing treatment.
  • He donated the amount to the death-affected family and provided entire equipment for the Funerals.
  • He Participated in the Village development activities in the village like laying of CC Roads, Digging Bore wells, Putting up Street Lights, Clearance Drainage systems, and installing CC Cams.
  • Apart from providing humanitarian assistance to the flood victims, he extended his core of service to compensate the victims affected during the rainy season.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and dispensed White Ration Cards to the town.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking down.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • Satyanarayana sneaked away to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raise awareness about the virus covid and provided precautions to be followed.

HNO: 5-17, Street: Ramalayam Street, Village: Chakradevarapalle, Mandal: Jangareddygudem, District: Eluru, Constituency: Chintalapudi, State: Andhra Pradesh, Pincode: 534447

Email: [email protected]

Mobile No: 9440816278

Biodata of Mr. Saila Satyanarayana

Saila Satyanarayana | Mandal President | Sarpanch | TDP | the Leaders Page

Name: Saila Satyanarayana

DOB:  15-05-1971

Father: Mr. Saila Pentaiah

Mother: Mrs. Saila Mahalaxmi

Education Qualification: Graduation

Political Party: Telugu Desam Party (TDP)

Present Designation: Mandal President , Sarpanch

Permanent Address: Chakradevarapalle, Jangareddygudem, Eluru, Chintalapudi, Andhra Pradesh

Contact No: 94408 16278

” నాయకుడంటే నమ్మించేవాడు కాదు … నడిపించేవాడు  గెలిచే వాడు కాదు… గెలిపించే వాడు... “

 

 

Recent Activities

జన్మదిన సందర్భంగా

ఏలూరు జిల్లా ,జంగారెడ్డిగూడెం మండలం, చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ ,మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మరియూ గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ అధ్యక్షతన గాంధీ అవలంబిస్తున్న శాంతి ప్రేమ ఐక్యత అభిమానం ప్రేమానురాగాల తో ఇద్దరి నాయకుల జన్మదిన సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేచి నివాళులు అర్పించారు

ఫించన్లు పంపిణీ కార్యక్రమం

చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు దేవులపల్లి, లక్కవరం గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేయడం జరిగింది.

గ్రామ సభ సమావేశం

జంగారెడ్డిగూడెం మండలం, చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద “మన ఇల్లు – మన గౌరవం” గ్రామ సభ సమావేశాలలో పాల్గొని ప్రసంగించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ ఎంపీటీసీ సాయిల రాంబాబు గారు .

జన్మదినం సందర్భంగా

ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో జనసైనికులు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును మండల టీడీపీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ మరియు గ్రామ నేతలతో కలిసి ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి Dr దాసరి శ్యామ్ చంద్రశేషు, మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణలు మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికీ హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.

వన మహోత్సవం

గ్రామ పంచాయితి కార్యాలయం,ఎంపీపీ స్కూల్,RBK, ప్రాంగణం, హెల్త్ కేర్ ఆస్పత్రి, అంగన్వాడి కేంద్రం మరియు వాటర్ ఫిల్టర్ షెడ్ వద్ద “మనం-వనం “కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. మామిడి , నేరేడు, డ్రాగన్, ఉసిరి, దానిమ్మ తదితర మొక్కలు నాటి మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీలో పచ్చదనంపెంపొందించేందుకు NDA కూటమి ప్రభుత్వం మనం-వనం కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు , ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆన్నారు.

ప్రత్యేక గ్రామసభ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ గారు.

ఆత్మీయ సమావేశం

చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ ల ఆత్మీయ సమావేశం చింతలపూడి పట్టణం లో M కన్వెన్షన్ హోటల్ లో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఇరుపక్షాలు కలిచి పని చేయాలి అని కొరారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, క్లస్టర్ ఇంచార్జీ బలుసు కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు. ఇరు పక్షాలు నుండీ అన్ని మండల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు.

బాబు ష్యురిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం

జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పొల్నాటి సత్యనారాయణ అధ్యక్షతన మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన బాబు ష్యురిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి ప్రచారం చేస్తూ ప్రతి ఆడబిడ్డకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500, తల్లికి వందనం కింద చదువుకునే ప్రతి ఒక్కరికి సంవత్సరంకు 15000, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, అన్నదాత కింద ప్రతి రైతుకు 20000, ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, తదితర హామీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి గ్యారెంటీ కార్డులు అందజేయడం జరిగింది.

వివాహ వేడుక

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వాస్తవ్యులుతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పఠాన్ హజ్కారి వల్లి కుమార్తె వివాహానికి హాజరయి వదువరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ గారు. 

అవగాహన

జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అక్కంపేట గ్రామం లో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారెంటీ పథకాలు కరపత్రాలు ఇంటింటికి తిరిగి పంచి పెట్టారు ప్రతీ ఇంటికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది

ప్రత్యేక పూజలు

జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారికి బెయిలు వచ్చిన సందర్భంగా నారా లోకేశ్ యువజన ఫౌండేషన్ జిల్లా అధికార ప్రతినిధి అనపరెడ్డి గంగాధర్ ఆధ్వర్యంలో, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అద్యక్షతన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆలయం లో పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకోవడం జరిగింది.

సమావేశం

తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల ప్రచారం నిమిత్తం ప్రారంభించిన బాబు స్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం పై జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం నిర్వహించడం జరిగింది.

పరిశీలన

వర్షాకాలంలో కూడా కనీసం వర్షాలు లేక వర్షాధారిత ప్రాంతాల్లో పంటలు వేసి నీరు లేక పంటలు అన్ని ఎండిపోయి తీవ్ర నష్టాల పాలవుతున్నామని రైతాంగం ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా దాసరిశేషు సత్యనారాయణ లతో రైతు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి పాదం దరిద్రమైన పాదం అని మొదటి మూడు సంవత్సరాలు కారోనా వ్యాధి, నాలుగో సంవత్సరం కళ్ళ కలకలు వ్యాధి, జ్వరాలు ఇప్పుడు ఏమో కరువు ఇలా ఇతని పరిపాలన అంతా ఇదే దరిద్రమైన పరిస్థితి ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎండిపోయిన పంట పొలాలు పరిశీలించడం జరిగింది. 

️జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశంపార్టీ కార్యాలయం

జంగారెడ్డిగూడెం మండలం, మైసన్నగుడెం గ్రామ యంపీటీసి నూనె శ్యామలత గారి మామయ్య , నూనె పల్లరావు గారి తండ్రీ నూనే నాగేశ్వర రావు ఇటీవల కాలంలో మరణించినారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ , ఎంపీటీసీ సాయిల రాంబాబు,, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, కొట్టారు ప్రసాద్,,మండల రైతు అద్యక్షుడు ఏలికే ప్రసాద్, గ్రామ కార్యదర్శి మోటమర్రి ధర్మరాజు , మాజీ సర్పంచ్ కుర్రు అప్పారావు, కుక్కల సీతారామరాజు, నందిపాము సర్వేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఏలూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ యువనాయకులు గోరుముచ్చు గోపాల్ యాదవ్ వారితో జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ ,, రాజాన సత్యనారాయణ,మద్దిపోటు నాగ నాగేశ్వర రావు లు అమ్మవారి దేవాలయం లో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ యువనాయకులు గోరుముచ్చు గోపాల్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బంగారు శివలక్ష్మి,జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, మద్దిపోటు నాగేశ్వర రాంబాబు,గోరుముచ్చు శ్రీను యాదవ్,చవల శ్రీను యాదవ్, మారోతి రాటలు యాదవ్, మున్నగు వారు పాల్గొన్నారు

" బాబు తో నేను " కార్యక్రమం

జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో ” బాబు తో నేను ” కార్యక్రమం లో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు గురుంచి ప్రజలకు వివరించడం జరిగింది.రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలి అని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి అని ప్రజలను కోరారు. మహిళలలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.

కరపత్రాలు పంపిణీ

 జంగారెడ్డిగూడెం మండలం, శ్రీనివాసపురం గ్రామం లో ” బాబు తో నేను ” కార్యక్రమం లో భాగంగా ఇంటింటికీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించి, అక్రమం గా అరెస్ట్ చేశారు అన్ని ప్రజలకు వివరించి ప్రతీ ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.

గ్రామ సభ

జంగారెడ్డిగూడెం మండలం, చక్రదేవరపల్లిగ్రామ పంచాయితీ కార్యాలయం లో గ్రామ సర్పంచ్ సాయిల సత్యనారాయణ అద్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది

పరామర్శ

జంగారెడ్డిగూడెం మండలంలో ఇటీవల కాలంలో మరణించిన కుటుంబాలు శ్రీనివాసపురం లొ పులపాకుల రాజశేఖర్, పంగిడిగుడెం గ్రామం లో భేతాళ సువార్త, భేతాళ ప్రసాదరావు, ముళ్ళపూిడి సత్యనారాయణమ్మ, లక్కవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దె వెంకట సుబ్బారావు గారి తండ్రి గద్దె హనుమంతరావు ఇటీవలి కాలంలో మరణించినరు వారి కుటుంబాలను పరామర్శించినరు

పరామర్శ

మండలంలో ఇటీవల కాలంలో మరణించి వారి కుటుంబాలను పరామర్శించిన చింతలపూడి నియోజకవర్గం యువానాయకులు బొమ్మజీ అనిల్ మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ.

5000 రూపాయలు ఆర్థిక సహాయం

జంగారెడ్డిగూడెం మండలం, పేరం పేట గ్రామం లో ఇటీవలే మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త లు భీమడోలు వెంకయ్య, భీమడోలు బ్రహ్మయ్య, లు, కట్టవపొదలవారిగుడెం గ్రామానికీ చెందిన గొల్లపల్లి గంగయ్య ఇటీవలే పాముకాటుకు గురి అయి మరణించడం జరిగింది ఆ కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికీ 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేచిన చింతలపూడి నియోజకవర్గం యువానాయకులు బొమ్మజీ అనిల్

కరపత్రాలు ఇంటి ఇంటికి పంపిణీ

జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సింహాద్రి రవి అధ్యక్షతన బాబుతో నేను అనే కరపత్రాలు ఇంటి ఇంటికి పంపిణీ కార్యక్రమం జరిగింది.

పరామర్శ

ఇటీవల జంగారెడ్డిగూడెం మండలం,శ్రీనివాసపురం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పై ఆందోళన చెందిన టీడీపీ కార్యకర్త పులపాకుల రాజశేఖర్ 32 అనే దళిత యువకుడు మృతి చెందగా అతని కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణలతో కలిసి సొంగా రోషన్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా చనిపోయిన రోజు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన రోషన్ రేపు కార్యక్రమం సందర్భంగా మరి కొంత నగదు సహాయం అందించారు. అనంతరం వారి పిల్లల భవిష్యత్తు కోసం కొంత నగదు పిక్సీడ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు.

నిరసన దీక్ష

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా జంగారెడ్డిగూడెం మండలంలో 28 వ రోజు నిరసన దీక్ష మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అద్యక్షతన,కుక్కల మాధవరావు, మండల తెలుగు యువత గోలి అనిల్ ఆధ్వర్యం లో నిర్వహించామని చెప్పారు.

నిరసన దీక్ష

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా జంగారెడ్డిగూడెం మండలంలో 28 వ రోజు నిరసన దీక్ష మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అద్యక్షతన,కుక్కల మాధవరావు, మండల తెలుగు యువత గోలి అనిల్ ఆధ్వర్యం లో నిర్వహించామని చెప్పారు.

నిరసన

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా జంగారెడ్డిగూడెం మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయం దగ్గర 27 వ రోజు భారీగా మహిళలతో మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ గారి అద్యక్షతన కుక్కల మాధవరావు గారు , మండల తెలుగు యువత అధ్యక్షులు గోలి అనిల్ గారి ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సుమారు 60 మంది మహిళలు దీక్షలో పాల్గొన్నారు. మహిళలు అందరూ అధినేత చంద్రబాబు గారి ఫ్లెక్సీ కి గుమ్మడి కాయలతో దిష్టి తీసి మంగళ హారతులు ఇచ్చి, ఆయన మచ్చలేని చంద్రుడిలా బయటకి రావాలని కోరారు. వారికి సంఘీభావం గా జనసేన, తెలుగు దేశం నాయకులు , ప్రజలు భారీగా మద్దతు తెలిపారు.

నిరాహార దీక్ష

జంగారెడ్డిగూడెం మండలం, గుర్వాయిగూడెం గ్రామం లో జరుగుచున్న 22 వ రోజు నిరాహారదీక్షలు శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఏలూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు శ్రీ గొరుముచ్చు గోపాల్ యాదవ్ గారు

ధర్నా

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉమ్మడి పచ్చిమ గోదావరి జిల్లాల సర్పంచ్లు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన సర్పంచ్ లు ధర్నా నిర్వహించారు

నిరశన కార్యక్రమం

ఢిల్లీ లోని ఏపీ భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్ ల నిరశన కార్యక్రమం లో పాల్గొన శైల సత్యనారాయణ గారు మరియు ఇతర పార్టీ నాయకులు.

సమావేశం

ఢిల్లీలో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామ సర్పంచ్ గారు మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ గారు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పటేల్ గారు, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, పంచాయతీ రాజ్ చీఫ్ సెక్రటరీ గారు, మరియూ ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిచి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

మహాశక్తి తో మహిళలభవిష్యత్కుగ్యారంటీ

జంగారెడ్డిగూడెం మండలం, పేరంపేట గ్రామంలో మహాశక్తి తో మహిళల భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యం లో గ్రామ పార్టీ అధ్యక్షుడు గోలి రామకృష్ణారెడ్డి గారు, రాష్ట్ర మహిళా కమ్మిటీ కార్యదర్శి యాళ్ళ లీలా ప్రశాంతి గారు, చింతలపూడి నియోజకవర్గం మహిళా కన్వీనర్ చిలపరెడ్డి ఇంద్రాణీ గారు, మండల మహిళా అధ్యక్షురాలు దండే పద్మ గార్ల అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహానాడులో విడుదలచేసిన సూపర్ సిక్స్ పథకాల గురుంచి మహాశక్తి పతకాలగురుంచి వివరించి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగినది.

మహాశక్తి సన్నాహక కార్యక్రమం

మహాశక్తి సన్నాహక కార్యక్రమం లక్కవరంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ మాగంటి బాబు గారు మాట్లాడుతూ ఈ వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని అభివృద్ధి అనేది లేకుండా పోయింది అని, పోలవరం అటకెక్కింది అని అన్నారు. టిడిపి తోనే రాష్ట్ర ప్రగతి జరుగుతుంది అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ అభివృద్ధి ఏది అని అడిగితే అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలను ప్రజలను హింసిస్తున్నారని అన్నారు. అక్రమ అట్రాసిటీ కేసులతో రక్షణ చట్టాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తుంది అని అన్నారు. హింస, దాడులు, అక్రమ కేసులు, అధిక ధరలు తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదని రేపు రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. 

మండల స్థాయి ఇంటిగ్రేటెడ్ సమావేశం

జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ గారి అధ్యక్షతన మండల స్థాయి ఇంటిగ్రేటెడ్ సమావేశం నిర్వహించబడింది.

మండల స్థాయి ఇంటిగ్రేటెడ్ సమావేశం

జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ గారి అధ్యక్షతన మండల స్థాయి ఇంటిగ్రేటెడ్ సమావేశం నిర్వహించబడింది.

పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర రేపు అనగా ది 11-07- 2023 వ తేదీ మంగళవారం నాటికి 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో యువ గళం పాదయాత్రకు సంఘీభావంగా ఉదయం 9.30 గంటలకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని నిర్మల హాస్పటల్ వద్ద నుండి అశ్వారావుపేట రోడ్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు పాదయాత్ర కార్యక్రమం జయప్రదం చేయటానికి తెలుగుదేశంపార్టీ నాయకులు పరిమి సత్తిపండు గారు ఇంటి వద్ద చింతలపూడి నియోజకవర్గ0,జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ ఘంటా సుధీర్ మరియూ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాజీ శాసనసభ్యులు ఘంట మురళీరామకృష్ణ గారు రేపు జరగబోయే యవగళం పాదయాత్రకు ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు జయప్రదం చెయ్యటానికి ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరారు మరియు రూట్మ్యాప్ గురించి చర్చిస్తున్న రు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర SC సెల్ కార్యదర్శి ఆకుమర్తి రామారావు, జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి బొబ్బర రాజ్ పాల్ కుమార్, రాష్ట్ర SC సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి పాతూరి అంబేడ్కర్,BC సెల్ రాష్ట్ర సాధికారిక డైరెక్టర్ మిడత పెంటయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి తోటికుంట రాము, మాజీ మండల అధ్యక్షుడు ముళ్ళపూడి శ్రీను, కొయ్యగుర వెంకటేష్, అల్లూరి రామకృష్ణ, మండల తెలుగు యువత అధ్యక్షుడు గోలి అనిల్, ప్రధాన కార్యదర్శి లాగు సురేష్, పాకలపాటి రవి,ఘంటా రామారావునాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

 

వర్థంతి వేడుకలు.

జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల ఎస్సిసెల్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్ అధ్యక్షతన గురవాయిగూడెం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ ఒక జాతి నాయకులు కాదు జాతీయ నాయకులు అని వారు దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు.వారి నాయకత్వంలో దేశం ఎన్నో విజయాలు సాధించింది అని అన్నారు. నేటి రాజకీయ నాయకులు వారి నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అన్నారు.దేశ ఉప ప్రధానిగా, కార్మిక, రక్షణ శాఖామంత్రిగా ఆయన చారిత్రాత్మక నిర్ణయాలు, విజయాలు సాధించారు అని అన్నారు. రాష్ట్ర ఎస్సిసెల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్ధి రామారావు మాట్లాడుతూ ఒక దళిత వ్యక్తి దేశ ఉప ప్రధానమంత్రి వరకు ఎదగడం ఎంతో గొప్ప విషయం అని అంబెడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అన్నారు. వారికి నివాళులు అర్పించిన వారిలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజ్ పాల్, ఎస్సిసెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాతురి అంబెడ్కర్, రాష్ట్ర మహిళా విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, గంటా రామారావు, ఉండవల్లి చంద్ర రావు, పగడం దినేష్,చితికిన శ్రీను, అప్పిరెడ్డి గంగాధరరావు,కంకిపాటి భార్గవ, మొక్కపాటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు

 

జలదీక్ష

పట్టేన్నపాలెం వద్ద జల్లేరు వాగు మీద ఎప్పటినుంచో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టిడిపి నేతలు కాలువలోకి దిగి జలదీక్ష చేశారు. ఈ జలదీక్షలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ బోరగం శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు. ఈ సందర్భంగా టీడీపీ పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ బోరగం శ్రీనివాసులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు బుట్టయిగూడెం మండలాల నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళడానికి ప్రధాన రహదారి ఇది అని, ఎంతో ప్రసిద్ధి గాంచిన గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం వెళ్ళడానికి కూడా ఇదే ప్రధాన మార్గం అని కావున దీని నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

 

పరామర్శించారు

మాగంటి బాబును పరామర్శించిన టీడీపీ నేతలు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) ఇటీవల నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గాయపడి చికిత్స పొందుతూ హైదరాబాద్ నుంచి ఏలూరు వచ్చిన సందర్భంగా జంగారెడ్డిగూడెం నుంచి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు , మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వర రావు, పోలవరం మాజీ ఏ ఎమ్ సి చైర్మన్ పారేపల్లి రామారావు, జిల్లా తెలుగుయువత కార్యదర్శి గంట శ్రీను, మండల ఎస్సిసెల్ అధికార ప్రతినిధి తాళ్లూరి వెంకటేశ్వరరావు, టి ఎన్ ఎస్ ఎఫ్ నేత పారేపల్లి పవన్ తదితరులు వెళ్లి పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కోలుకోవాలని మరల ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టి తెలుగుదేశం కొరకు ప్రజల కొరకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ మీ అందరి ప్రేమ అభిమానం నాకు శ్రీరామ రక్ష అని అన్నారు. దాసరి శేషు మాట్లాడుతూ త్వరలోనే జిల్లాలో అందరం కలిసి తెలుగుదేశం విజయానికి మీ నేతృత్వంలో పనిచేసి విజయబావుట ఎగురవేద్ధాం అని అన్నారు..

శత జయంతి సందర్భంగా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టీ ఆర్ శత జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు.మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ జరిగే మహానాడు కార్యక్రమానికి మండలం నుండి భారీగా మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్లు, టాటా మాజీక్లు, మరియూ బైక్ ల ద్వారా బయలు దేరి వెళ్ళటం జరిగింది అని అన్నారు.

జయంతి ఉత్సవాలు

 కామవరపకోట లో గల కిలారు ఫార్మ్స్ నందు ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది మరియూ ఏలూరు జిల్లా మినీ మహానాడు కార్యక్రమం జరిగింది.

ధర్నా

విద్యుత్ చార్జీలు తగ్గించాలి అని టిడిపి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు టిడిపి మండల ,పట్టణ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం లోని డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆపరేషన్ వారి విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలని నాణ్యమైన విద్యుత్ అందించాలని టిడిపి శ్రేణులు ధర్నా నిర్వహించారు.

పరామర్శించిన

జంగారెడ్డిగూడెం మండలం, వేగవరం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ సర్పంచ్ తూంపాటి శశిరేఖ ఇటీవల కాలంలో మరణించటం జరిగింది. వారి కుమారుడు తూంపాటి ఆదాము ని పరామర్శించిన జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆలపాటి దుర్గా రామ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ముళ్ళపూడి శ్రీను, మాజీ సర్పంచ్ ఘంటా రామారావు మున్నగు వారు ఉన్నారు

గడప గడపకు కార్యక్రమం

చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గడప గడపకు కార్యక్రమం లో శ్రీనివాసపురం, మైసన్నగుడెం గ్రామం లో సమస్యల పై ప్రశ్నిస్తున్న గ్రామాల ప్రజలు సమాధానం చెప్పకుండా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే జంగారెడ్డిగూడెం మండలం,చక్రదేవరపల్లి గ్రామ సర్పంచ్ మరియూ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం లోని అన్ని గ్రామ పంచాయతీల కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 14వ, మరియూ 15 వ ఆర్థిక సంఘం నిధులను రూ.8660 కోట్ల రూపాయలు ఏ విధమైన సమాచారం లేకుండా దొడ్డిదారిన మల్లిస్తే గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి అని అన్నారు . గ్రామాలులో ఏ విధమైన నిధులు మంజూరు చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేయకుండా గడప గడపకు అనే కార్య్రమాన్ని చేయడం సిగ్గు చేటు అని అన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల నుండి లాగేసుకొన్న ఆర్థిక సంఘం నిధులను రూ 8660 కోట్ల రూపాయలు వెంటనే జమచేయలి అని డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమం

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలి అంటూ జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశంపార్టీ ఆద్వర్యంలో అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి అధ్యక్షతన తాహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు రైతు అధ్యక్షులు ఎలికె ప్రసాద్ లు మాట్లాడుతూ మండలంలో పోలాసి గూడెం లో మొక్కజొన్న పొత్తులు కల్లా లలోనే మొక్కలు వచ్చాయని, మిర్చి కూడా కల్లాల మీద పాడయ్యాయని ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని వీటన్నిటికీ నష్టపరిహారం ఇప్పించాలని
తాహశీల్దార్ గారికి కొన్ని డిమాండ్లు అందించారు.వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు.
1. 75 కేజీల ధాన్యం బస్తాకు అదనంగా 5 కేజీలు చొప్పున మరియు లారీ లోడు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా దోపిడీ చేసేవారిపై చర్యలు తీసుకోవాలి.
2. రైతుల వద్ద ఎదురు నగదు కట్టించుకున్న ప్రతి రూపాయి తిరిగి రైతుకు చెల్లించాలి.
3. రంగు, తేమ, మొలకెత్తిన, నూక వంటి కారణాలు చెప్పకుండా ప్రతి 75 కేజీల ధాన్యపు బస్తా ఎంఎస్ పీ రూ.1530 ధరకు కొనుగోలు చేయాలి.
4. ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టకుండా మోసం చేసినందుకు పంటచేలో నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.25వేలు పరిహారం చెల్లించాలి.
5. వరి, మొక్కజొన్న, తెల్లజొన్న రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందజేయాలి.
6. మిర్చి, అరటి, మామిడి, బొప్పాయి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలి.
7. పిడుగుపాటు గురై మరణించిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలి.
8. రైతును ఎర్రిపప్ప అని దుర్భాషలాడిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలి అని సాయిల సత్యనారాయణ గారు డిమాండ్ చేశారు.

పంట పరిశీలన

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యాం చంద్ర శేషు గారు, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు, దేవులపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు సింహాద్రి రవి గారు, సీనియర్ నాయకుడు పొలమోలు బాబురావు గారు, ప్రతినిధి తాళ్లూరు వెంకటేశ్వరరావు గారు, దేవులపల్లి గ్రామంలోని రైతులను పరామర్శించి తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు.

పర్యటన

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఏలూరు జిల్లా,ఉంగుటూరు నియోజకవర్గం , ఉంగుటూరు గ్రామం పర్యటనలో లో తడిచి పోయిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండలం నుంచి పాల్గొన్న జంగ్రెడ్డిగుడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ,చక్రదేవరపల్లి గ్రామ సర్పంచ్ సాయిల సత్యనారాయణ గారు, తాడిచర్ల సర్పంచ్. పసుమర్తి పార్థసారథి . ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి Dr దాసరి శ్యామ్ చంద్ర శేషు గారు, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు గారు,మండల రైతు అధ్యక్షుడు ఎలికే ప్రసాద్ గారు, బాదరాల వీరబాబు గారు,పట్టణ తెలుగుయువత ఉపాధ్యక్షులు చిలమకూరి బాబీ గారు, షేక్ పెంటు సాహెబ్ గారు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

పుట్టినరోజు వేడుకలు

జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, మాన్యశ్రీ నారా చంద్రబాబు గారి 73వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సాయిల సత్యన్నారాయణ గారి అధ్యక్షతన కార్యదర్శి కుక్కల మాధవరావు గారి పర్యవేక్షణలో జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి 73వ పుట్టినరోజు జంగారెడ్డిగూడెం మండల పార్టీ ఆధ్వర్యంలో పేరంపేట గ్రామంలో ది 20- 4 -2023 ఘనంగా నిర్వహించారు.

బాబూ జగజ్జీవన్ జయంతి

గురవాయిగూడెం గ్రామంలో గల మండల పార్టీ కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ 115 వ జయంతి సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం జంగారెడ్డిగూడెం మండలం, నాగుల గూడెం గ్రామం లో గల బాబూ జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి కమ్మిటీ అధ్యక్షులు లాగు సురేష్ గారు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గోలి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యం లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కమ్మిటీ సభ్యులు కేకే కట్ చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు, మండల SC సెల్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీను గారు, మాజీ సర్పంచ్ ఘంటా రామారావు గారు, దందే గాంధీ గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు చిటికెన శ్రీను గారు,గోలి వెంకటరెడ్డి గారు, వేముల శ్రీను గారు,క్లస్టర్ ఇంఛార్జి దాసరి అప్పారావు గారు, పోసి బాబు మండల తెలుగు యువత,ప్రధాన కార్యదర్శి లాగు సురేష్ గారు, చింతలపూడి నియోజకవర్గం యువ నాయకుడు శ్రీ బొమ్మాజీ అనిల్ తెలుగు యువత నాయకులు ఘంటా శ్రీను గారు, గద్దె శివ కోటేశ్వరరావు గారు, జస్వంత్ గారు,లాగు ప్రకాష్ గారు, కునపం మహేష్ గారు, పులపకుల శివాజీ గారు, తానిగడప శేషయ్య గారు, బెబ్బులి రాజు లాగు శ్రీను లాగు హరి గారు, లాగు వంశీ గారు, లాగు ప్రేమ్ గారు, వెలిచేటి నాగేశ్వరావు గారు, ఉడతనేని మధు గారు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ 41 ఆవిర్భవించి 42సంవత్సరాలు అయిన సందర్భంగా మండల పార్టీ కార్యాలయం గురవాయిగూడెం లో పార్టీ ఆవిర్భావ సభ మండల అధికార ప్రతినిధి వందనపు రమణ పర్యవేక్షణలో జరిగింది. ఇందులో మండల ఉపాధ్యక్షురాలు అరుగొల్లు గంగ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ చంద్ర శేషు గారు,మాజీ అధ్యక్షులు ముళ్ళపూడి శ్రీను గారు, తెలుగు రైతు అధ్యక్షులు శ్రీను గారు, బొబ్బర రాజ్ పాల్కుమార్ గారు, మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్ర రావు గారు, తెలుగు యువత అధ్యక్షులు అనిల్ గారు,ఘంటా రామారావు గారు, మునిసిపల్ కౌన్సిలర్ k. రమా దేవి గారు,తెలగారపు జ్యోతి గారు,మరియు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి ఆధ్వర్యం లో నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షుడు ఆకుమర్తి రామారావు గారు అనారోగ్యంతో బాధపడుతున్న , జోన్నవారిగుడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొంతు ప్రభాకర్, బొంతు నాగలక్ష్మి గార్ల కుటుంబానికి 10000 (పది వేల రూపాయలు)ఆర్థిక సహాయం చేసారు.

నివాళి

జంగారెడ్డిగూడెం మండలం, గురవాయి గూడెం గ్రామంలో గల మండల పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆర్థిక సహాయం

నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షుడు ఆకుమర్తి రామారావు గారు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పాత కాకుల ముక్కయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసారు గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు ముక్కయ్య ఇటీవల మరణించారు. జంగారెడ్డిగూడెం మండల, పుట్లగట్ల గూడెం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యం లో గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు పాతకాకుల ముక్కయ్య కుటుంబంనకు 5000 రూపాయల నగదు మరియూ 25 కేజీల బియ్యం ఆకుమర్తి రామారావు గారు సహాయం చేశారు.

సర్వ సభ్య సమావేశంలో

జంగారెడ్డిగూడెం ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో గ్రామ పంచాయతీలకు రావలచిన 14th మరియూ 15th ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దొడ్డిదారిన దారిమల్లించి గ్రామ పంచయతీల్లో ఏ విధమైన అభివృద్ధి పనులు జరగకుండా, చేస్తుంది అని మా పంచాయతీ నిధులు మాకు జమ చేయాలి అని చక్రదేవరపల్లి గ్రామ సర్పంచ్ సాయిల సత్యనారాయణ గారు కోరారు.

శుభాకాంక్షలు

జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో, రాష్ట్రంలో పట్టబద్రుల మూడు స్థానాలు లో ప్రస్తుతం రెండు తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగినది.

విగ్రహ ఆవిష్కారణ

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామ రావు గారి విగ్రహ ఆవిష్కారణ సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి నమస్కరించడం జరిగింది.

ధర్నా

టీడీపీ పార్టీ నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్న శైల సత్యనారాయణ గారు.

జన్మదిన శభాకాంక్షలు

చింతలపూడి నియజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఘంటా మురళీ రామ కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కార్యక్రమం

పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు, ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ చక్ర దేవరపల్లి గ్రామంలో కొత్తగా 13 పెన్షన్లు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సాయిలు రాంబాబు గారు మాట్లాడుతూ వివిధ కారణాలుగా ఇటీవల తాత్కాలికంగా ఆపేసిన పెన్షన్లు అందరికీ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో దండు ధనరాజు కొనలు వాడ ప్రసాద్ రాజు బేతి వెంకటరమణ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ సూర్య కిరణ్ వాలంటరీస్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వర్ధంతి

అస్పృశయత, ఆర్థిక సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడిన న్యాయకోవిదుడుడు, ఆర్థికవేత్త, సంఘసంస్కర్త. తన జాతి విముక్తికీ దేశపురోగతికీ బాటవేసిన ప్రపంచ మేధావి “ప్రపంచరత్న” బాబాసాహెబ్అంబేడ్కర్ గారి వర్ధంతి ఆయన ఆశయాలను సాధించడం కోసం పోరాడడమే మనం ఆయనకి ఇవ్వగలిగే నివాళి..

ధర్నా

న్యాయం జరగాలి అని రోడ్డు పై ధర్నా నిర్వహించడం జరిగింది.

బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి 66వ వర్ధంతి

అస్పృశయత, ఆర్థిక సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడిన న్యాయకోవిదుడుడు, ఆర్థికవేత్త, సంఘసంస్కర్త. తన జాతి విముక్తికీ దేశపురోగతికీ బాటవేసిన ప్రపంచ మేధావి “ప్రపంచరత్న” బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి 66వ వర్ధంతి ఆయన ఆశయాలను సాధించడం కోసం పోరాడడమే మనం ఆయనకి ఇవ్వగలిగే నివాళి.

వినతి పత్రం

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

జన్మదిన వేడుక

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యపరాజగూడెంలో, తెలుగుదేశం పార్టీ జిల్లా యాదవ సంఘం నూతన అధ్యక్షులు, బి.సి సీనియర్ నాయకులు పిల్లల శ్రీనివాస్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఆయన గృహంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ గారు కేక్ కటింగ్ చేసారు. అనంతరం నాలుగు మండలాల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తల శ్రీనివాస్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ.చలపతిరావు గారు, జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షులు సాయల.సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు ములుపూరి మురళి గారు, నాలుగు మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

3 రోజుల పర్యటన కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ కింజరాపు అచెన్న నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఏలూరు జిల్లాలో 3 రోజుల పర్యటన కోసం విజయవంతం చేయటానికి జిల్లాలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలం నుంచి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు గారు, చింతలపూడి, పోలవరం నియోజవర్గం పరిశీలకులు శ్రీ కోళ్ల నాగేశ్వరావు గారు,మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు, పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ గారు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బుసా సత్యనారాయణ రెడ్డి గారు, తాళ్లూరి వెంకటేశ్వరరావు గారు, రైతు నాయకులు అల్లూరి రామకృష్ణ గారు,బేతి వెంకటరమణ గారు పాల్గొన్నారు.

పర్యటన

జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కాలనీ వాసులు తో చర్చించిన జంగారెడ్డిగూడెం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు, ఎంపీటీసీ సాయిల రాంబాబు గారు, కాలనీ వాసులు పోలవరం నియోజకవర్గ డా. అసోసియేషన్ ఉపాధ్యక్షులు మిరియాల పుల్లారావు గారు, ఆకుల పోసిబాబు గారు, మంతెన శ్రీనివాసరావు గారు వార్డ్ మెంబర్, వలపర్ల వెంకటేష్ గారు వార్డ్ మెంబర్, బుడిపుడి శంకర్ గారు గ్రామ కార్యదర్శి, బుడిపుడి వెంకటేష్ గారు, మాడేపల్లి సతీష్ గారు, చింతపల్లి ప్రకాష్ గారు, నాగుల వెంకటేష్ గారు పాల్గొన్నారు.

బాదుడే బాదుడు కార్యక్రమం

పంగిడిగూడెం గ్రామం లో “బాదుడే బాదుడు” కార్యక్రమం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను , ప్రజల పై గ్యాస్, పెట్రోలు డీజిల్ ఇసుక, నిత్యావసర వస్తువుల మీద వేస్తున్న అధిక ధరలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు గారు, మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు,ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు గారు, గ్రామ అధ్యక్షుడు లింగాల సత్యనారాయణ గారు, ముళ్ళపూడి శ్రీను గారు, ఘంటా రామారావు గారు, తెలుగు యువత నాయకులు రాగాని వంశీ అందుగుల శ్యామ్ గారు, గోలి అనిల్ గారు, బుసా సత్యనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, లాగు సురేష్ గారు, మొక్కపాటి నాగసుబ్రహ్మన్యం గారు, ఉమ్మడి మాణిక్యం గారు, కుంచే విజయ్ గారు, పారేపల్లి నరసింహమూర్తి గారు, సింహాద్రి రవి గారు, గోలి వెంకట రెడ్డి గారు,సిరిపల్లి గజ్జెలు గారు, యంత్రపటి నాగ శ్రీను వెంకటేష్ గారు, తాళ్లూరి వెంకటేష్ గారు, రాగాని శ్రీను గారు, పాతూరి రామచంద్రరావు, చిటికెన సురేష్,, నల్లగోపు త్రిమూర్తులు, భోగవల్లి రత్నాజీ గారు, చిన్ని గంగాధర రావు గారు,కంకిపటి సుబ్బారావు గారు,రవి తేజ గారు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

పార్టీ కార్యక్రమం

జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ శ్రీ మాగంటి బాబు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమా గారు, కొల్లూరి రవీంద్ర గార్లతో మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు, కోనేరు వెంకట సుబ్బారావు గారు, గ్రామ అధ్యక్షులు చిటికెన శ్రీను గారు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబొమ్మ రామలింగేశ్వరరావు గారు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బుసా సత్యనారాయణ రెడ్డి గారు, తెలుగుయువత నాయకులు బాదరాల వీరబాబు గారు, నల్లగోపు త్రిమూర్తులు గారు, రాగాని శ్రీను గారు, వేముల అంజి గారు ,చిటికెన సురేష్ గారు, దల్లి మధు గారు, మోగుల్లురి కొండయ్య గారు, బేతి వెంకట రమణ గారు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

పూజ కార్యక్రమం

జంగారెడ్డిగూడెం మండలం, గుర్వాయిగూడెం గ్రామం లో గల శ్రీ స్వయంభూ మద్ది ఆంజనేయస్వామి దేవాలయం నందు 108 కొబ్బరికాయలు కొట్టిన ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రెడ్డి చందు గారి ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఏలూరు జిల్లా లో పర్యటించనున్న నేపథ్యం లో దిగ్విజయంగా పర్యటన పూర్తి కావాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు నతా నాగేంద్ర కుమార్ గారు, మండల తెలుగుయువత అధ్యక్షులు గోలి అనిల్ గారు, పట్టణ అధ్యక్షుడు కోనేటి చంటి గారు, ప్రధాన కార్యదర్శి చిత్త పురి దుర్గేష్ గారు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు పాకనాటి అంజిబాబు గారు,నియోజకవర్గ తెలుగు యువత నాయకులు రాగాని వంశీ గారు, ఘంటా శ్రీను గారు, బాదరాల వీరబాబు గారు, బలుసు సాయి గారు, హర్ష గారు, విజయ్ గారు, పాలోతు అంజిబాబు గారు, డాన్ గారు ,TNSF పవన్ చిలంత్రవుల మురళీ గారు, సాయి గారు, తెలుగుయువత నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

వర్ధంతి

జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న శ్రీ మహాత్మా జ్యోతీ రావ్ పూలే వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రెడ్డి చందు గారి ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు అధ్యక్షతన ఆయనకు పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బర రాజ్ పాల్ కుమార్ గారు, చింతలపూడి నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు నతా నాగేంద్ర కుమార్ గారు, మండల తెలుగుయువత అధ్యక్షులు గోలి అనిల్ గారు, పట్టణ అధ్యక్షుడు కోనేటి చంటి గారు, ప్రధాన కార్యదర్శి చిత్త పురి దుర్గేష్ గారు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు పాకనాటి అంజిబాబు గారు,నియోజకవర్గ తెలుగు యువత నాయకులు రాగాని వంశీ గారు, ఘంటా శ్రీను గారు, బాదరాల వీరబాబు గారు, బలుసు సాయి గారు, హర్ష, విజయ్ గారు, పాలోతు అంజిబాబు గారు, డాన్ గారు,TNSF పవన్ గారు, చిలంత్రవుల మురళీ గారు, సాయి గారు, తెలుగుయువత నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

బహిరంగ సభ

జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి అధ్యక్షతన మండల పార్టీ కార్యాలయం నుండి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చింతలపూడి లో జరిగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకు భారీగా బయలు దేరి వెళ్ళారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు గారు, గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు చిటికెన శ్రీను గారు, ముళ్ళపూడి శ్రీను ఉండవల్లి చంద్రరావు గారు, ఉండవల్లి శ్రీను పొన్నగంటి అనిల్ గారు,చిటికెన సురేష్ గారు, మండల తెలుగుయువత అధ్యక్షులు గోలి అనిల్ గారు, ఆలపాటి రాము గారు, కొండ్రెడ్డి వీరాస్వామి గారు, నలగోపు త్రిమూర్తులు గారు, కనికెళ్ళ శ్రీను సింహాద్రి రవి గారు, గద్దె బాబీ గారు, దండే గాంధీ గారు,ఉండవల్లి రవిశంకర్ గారు,పరేపల్లి నరసింహమూర్తి గారు, వేములపల్లి శ్రీను గారు, ఏలికే ప్రసాద్ గారు, గంధం గోపాల కృష్ణ గారు, తరిపిరెడ్డి రామకృష్ణ గారు, పోల్నాటి సత్యనారాయణ గారు,సూర్యచంద్ర రావు ఆకుల దుర్గారావు గారు, ఆకుల రామచంద్రరావు లింగాల సత్యనారాయణ గారు, గోలి రామకృష్ణారెడ్డి గారు, గోలి వెంకట రెడ్డి గారు, యాగంటి సుబ్రహ్మణ్యం గారు, పెడ్డమల్ల ధర్మేంద్ర గారు, రతయ్య గారు, వెంకట స్వామి గారు, పులపాకుల పసుపులేటి సూర్యచంద్ర రావు గారు, భోగవల్లి రత్నాజీ గారు,పట్టణ అధ్యక్షుడు కోనేటి చంటి గారు, ప్రధాన కార్యదర్శి చిత్త పురి దుర్గేష్ గారు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు పాకనాటి అంజిబాబు గారు,నియోజకవర్గ తెలుగు యువత నాయకులు రాగాని వంశీ గారు, ఘంటా శ్రీను గారు, రాగాని శ్రీను గారు,బాదరాల వీరబాబు గారు, పాలోతు అంజిబాబు గారు, కొండయ్య గారు, చిలంత్రవుల మురళీ గారు, సాయి గారు, తెలుగుయువత నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ట్రైనింగ్ ప్రోగ్రామ్

ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారి అధ్యక్షతన జరిగిన క్లస్టర్, యూనిట్ ఇంచార్జీ ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇదేం ఖర్మ అనే కార్యక్రమం గురించి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు గారు, క్లస్టర్ ఇంచార్జీ లు దాసరి అప్పారావు, SS ఇష్మాయేలు, యూనిట్ ఇంచార్గ్ లు ఏలికే ప్రసాదరావు, పారేపల్లి నరసింహమూర్తి, తెలుగు యువత నియోజక వర్గ అధికార ప్రతినిధి గంటా శ్రీను, భోగవల్లి రత్నాజీ మున్నగు గారు పాల్గొన్నారు.

బాదుడే బాదుడు కార్యక్రమం

జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన పెట్టేనపాలెం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా శేషు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది అని నేను వస్తే అన్ని ధరలు తగ్గించేస్తా అని ప్రజలను నమ్మించి వారి ఓట్లతో నెగ్గి ముఖ్యమంత్రి ఆయన తరువాత నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలో ఉన్నాయి అని వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే పెట్టేనపాలెం కాల్వ పై కనీసం బ్రిడ్జి వేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని అన్నారు.. మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ అధిక ధరలు పోవలన్నా పేద ప్రజలకు సరైన సంక్షేమం త అందించాలన్న, రైతులకు న్యాయం జరగాలన్నా మరల చంద్రబాబు ముఖ్యమంత్రి ని కావాలని ప్రజలంతా తెలుగుదేశానికి మద్దతు తెలపాలని కోరారు..

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టీడీపీ పార్టీ నాయకులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

శిక్షణా కార్యక్రమం

సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చేప రొయ్యల ప్రాసెసింగ్ మరియు ఉత్తమ నిర్వహణ పద్ధతులలో మూడు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ట్రై సైకిల్ అందజేత

చక్రదేవరపల్లిలో దివ్యాంగులైన గనిశెట్టి లక్ష్మీప్రసన్న (14)కు వీల్చైర్, భూక్యా పోశమ్మ (3)కు ట్రై సైకిల్ను బొప్పన రాధమ్మఆ ర్థిక సహాయంతో సర్పంచ్ సాయిల సత్యనారాయణ గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ దళిత నాయకులు పల్లి శ్రీను గారు, ఎమ్పీటీసీ సాయిల రాంబాబు గారు, ఉప సర్పంచ్ కరుటూరి దుర్గ గారు, వార్డు మెంబర్లు నులకాని వాసు గారు, రౌతు నారాయణరావు గారు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు గారు, మైనార్టీ నాయకులు షేక్ పెంటూ సాహెబ్ గారు, బేతి వెంకటరమణ గారు, అంగూరి నాగు గారు, కాజ అంజి గారు, దుర్గ గారు, మంగ గారు, మహాలక్ష్మి గారు తదితరులు పాల్గొన్నారు.

నిరసన

తెలుగుదేశం పార్టీలో బలమైన బీసీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల విజయ్ గారిని పోలీసులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మండల తెలుగుదేశం పార్టీ గురవాయిగూడెంలో రాస్తారోకో నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుని, ఆయన కుమారుడు విజయ్ గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం సిగ్గు చేటన్నారు. ఈ అరెస్ట్ మండల తెలుగ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు గారు, గ్రామ అధ్యక్షుడు చిటికెన గారు, మండల బూస గారు, రాస్తారోకో చేస్తున్న టీడీపీ నాయకులు శ్రీను గారు, సెల్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి గారు, నేతలు బొడ శ్రీనివాసరావు గారు, ఘంటా రామారావు గారు, ఉండవల్లి చంద్రరావు గారు, చిరిగిన రాంబాబు గారు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం

వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయమే లక్ష్యంగా ప్రతీ నాయ కుడు, కార్యకర్త పనిచేయాలని ఏలూరు జిల్లా. అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఆ పార్టీ శ్రేణు లకు పిలుపునిచ్చారు. గురవాయిగూడెంలో తెదేపా మండల శాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ చింతలపూడి నియోజకవ ర్గంలో తెదేపా బలంగా ఉందని, నాయకులు సమ న్వయంతో పనిచేస్తూ ప్రజలతో మమేకమై పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఘుంటా మురళీ గారు మాట్లాడుతూ వైకాపా పాలనపై ప్రజలు విసుగెత్తిపోయి ఎన్నికలు ఎప్పు డొస్తాయని ఎదురు చూస్తున్నారన్నారు. పోల వరం, చింతలపూడి నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు బహుమ మాట్లాడుతున్న వీరాంజనేయులు గ తిగా ఇవ్వాలని రెండు నియోజక వర్గాల పరిశీ లకుడు కోళ్ల నాగేశ్వరరావు కోరారు. అనంతరం వి బొప్పన రాధమ్మ ఆర్ధిక సహాయంతో ఇద్దరు శ దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను వీరాంజ నేయులు చేతులు మీదుగా అందజేశారు.

దళితుల సమావేశం

వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చింతలపూడి వైసీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న దళితుల సమావేశానికి వచ్చి,జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ,నోటికొచ్చినట్లుగా మాట్లాడినందుకు గాను జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ. మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న మాజీ ముఖ్యమంత్రి గా ప్రతిపక్ష నేత గా వున్న చంద్రబాబు గారిని విమర్సించే హక్కు నీకు లేదు అని అన్నారు. చంద్రబాబు గారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే తగిన విధంగా బుద్ది చెప్పుట0 జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బర రాజ్ పాల్ కుమార్, పగడం సోభగ్యవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రారంభోత్సవం

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం గుర వాయి గూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏలూరు జిల్లా టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజ నేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసు దగ్గర జెండాను ఎగరవేశారు అనంతరం పార్టీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపుసమ జంగారెడ్డిగూడెం మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయంమే దేవాలయం ప్రజలే దేవుకోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు రానున్న ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గారు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సన్మానం

చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళనం లో శైలా సత్యనారాయణ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

పరామర్శ

విద్యుత్ షాక్ తో మరణించిన జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీ కంకిపాటి నాగరాజు గారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

Service in Pandemic COVID-19

మా పంట మునిగింది పరిహారం చెల్లించండి అంటూ జంగారెడ్డిగూడెం మండలంలోని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంగిడిగూడెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ తో కలిసి తడిసిన ధాన్యాన్ని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు పరిశీలించారు ఈ సందర్భంగా రైతులు పంది రామ్ ప్రసాద్, పంగిడిగూడెం గ్రామానికి చెందిన పడాల చిన నాగేశ్వరరావు, పోక వీర రాఘవులు అనే కౌలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

జంగారెడ్డిగూడెం లో గల దండమూడి మినీ కళ్యాణ మండపం నందు ఏలూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గంలో గల యాదవ ప్రతినిధుల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో యాదవుల ఎదుర్కొంటున్న పలు సమస్యల పై చర్చించటం జరిగినది.ఈ సమావేశం లో తెలుగదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గం పరిశీ లకులు ముమ్మడి సత్యనారాయణ గారు,బొమ్మిడి అప్పారావు గారు,జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు, లింగపాలెం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస యాదవ్ గారు,చింతలపూడి నియోజకర్గం యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు మానికల సూరిబాబు గారు, అధ్యక్షుడు పిల్లల శ్రీనివాస్ యాదవ్ గారు,కాట్రు బాలకృష్ణ, మహేష్ యాదవ్ గారు,ముమ్మడి చింతయ్య గారు, నాలి శ్రీను గారు,ఉల్లాస వెంకటేశ్వరరావు గారు, చింతం విష్ణు గారు, చెన్ను ఏడుకొండలు యాదవ్ గారు, ఉమ్మడి రాంబాబు గారు,తాళ సర్వేశ్వరరావు గారు,ఏలికే నాగేశ్వరావు గారు, గంగుల యేసు గారు,జమ్మి కృష్ణ, కట్టా వెంకటేశ్వరరావు గారు, తాత వెంకటేశ్వరరావు గారు, జెట్టిబోయిన వెంకటేశ్వరరావు గారు, తాత ఏడుకొండలు గారు, మనికాల నాగేశ్వరావు గారు,పాకనాటి కాశీ దొప్పసాని పండు మూలకాల కొండయ్య గారు, ముమ్మడి మాణిక్యం గారు, జోనుబోయిన సోంబాబు గారు, పాకనాటి సురేష్ కోట శివ గారు, యాదాల రాంబాబు గారు, తీయాలా గణేష్ గారు, చిన్ని వెంకట్ గారు, మానికల వెంకటేశ్వరరావు గారు, జోనుబోయిన వెంకటేశ్వరరావు గారు, గందిబోయిన శ్రీను మున్నగు గారు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం లో గల దండమూడి మినీ కళ్యాణ మండపం నందు ఏలూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గంలో గల యాదవ ప్రతినిధుల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో యాదవుల ఎదుర్కొంటున్న పలు సమస్యల పై చర్చించటం జరిగినది. ఈ రోజు దండముడి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని యాదవ సోదరులు కు 2 ఎమ్మెల్యే, 1ఎంపీ సీట్లను రాబోయే ఎన్నికల్లో యాదవులకు కేటాయించాలి అని కోరారు. ఈ సమావేశం లో తెలుగదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు గారు, మంగళగిరి నియోజకవర్గం పరిశీ లకులు ముమ్మడి సత్యనారాయణ గారు,బొమ్మిడి అప్పారావు గారు,జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు, లింగపాలెం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస యాదవ్ గారు,చింతలపూడి నియోజకర్గం యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు మానికల సూరిబాబు గారు, అధ్యక్షుడు పిల్లల శ్రీనివాస్ యాదవ్ గారు, కాట్రు బాలకృష్ణ, మహేష్ యాదవ్ గారు,ముమ్మడి చింతయ్య గారు, నాలి శ్రీను గారు,ఉల్లాస వెంకటేశ్వరరావు గారు, చింతం విష్ణు గారు, చెన్ను ఏడుకొండలు యాదవ్ గారు, ఉమ్మడి రాంబాబు,తాళ సర్వేశ్వరరావు గారు,ఏలికే నాగేశ్వరావు గారు, గంగుల యేసు గారు,జమ్మి కృష్ణ, కట్టా వెంకటేశ్వరరావు గారు, తాత వెంకటేశ్వరరావు గారు, జెట్టిబోయిన వెంకటేశ్వరరావు గారు, తాత ఏడుకొండలు గారు, మనికాల నాగేశ్వరావు గారు,పాకనాటి కాశీ దొప్పసాని పండు మూలకాల కొండయ్య గారు, ముమ్మడి మాణిక్యం గారు, జోనుబోయిన సోంబాబు గారు, పాకనాటి సురేష్ కోట శివ గారు, యాదాల రాంబాబు గారు, తీయాలా గణేష్, చిన్ని వెంకట్ గారు, మానికల వెంకటేశ్వరరావు గారు, జోనుబోయిన వెంకటేశ్వరరావు గారు, గందిబోయిన శ్రీను గారు ,మున్నగు వారు పాల్గొన్నారు.

సీరలు దుప్పట్లు , వంట సామాగ్రి, 25కేజీ ల బియ్యం పంపిణీ

జంగారెడ్డిగూడెం మండలం, దేవులపల్లి గ్రామం లో దళిత కుటుంబానికి చెందిన గందిపాము నాగమణి కి చెందిన ఇల్లు అగ్నికి ఆహుతి అయినది.ఆకుటుంబానికి మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షలు రాష్ట్ర SC సెల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు గారి ఆధ్వర్యంలో వారి ఆర్థిక సహాయం తో దళిత వాడలోని మహిళ కు 5000 రూపాయలు,సీరలు దుప్పట్లు , వంట సామాగ్రి, 25కేజీ ల బియ్యం పంపిణీ చేయడం జరిగింది.

పిచికారీ

కరోనా బారిన పడకుండా గ్రామం యొక్క భద్రత కోసం గ్రామం అంతటా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరిగింది.

Mr. Saila Satynarayana with TDP Leader

టెక్కలి నియోజకవర్గ శాసనసభ సభ్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధినేత కింజరాపు ” అచ్చెన్నాయుడు గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

జంగారెడ్డిగూడెం మండలం, లక్కవరం గ్రామం లో తెలుగదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ” కొట్టారు దొరబాబు ” గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎంఎల్ఏ రాష్ట్రం లోనే అత్యధిక ఓట్ల భారీ మెజారిటీ 95235 ఓట్లు సాధించిన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జంగారెడ్డిగూడెం మండలం, చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర SC సెల్ ప్రధాన కార్యదర్శి, శ్రీ నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షుడు, సేవా తత్పరులు ” ఆకుమర్తి రామారావు ” గారికి  హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసిన సాయిల సత్యనారాయణ గారు.

జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామం లో కొండ్రెడ్డి వీరాస్వామి గారి మనుమడు మనుమరాలు ల పంచెకట్టు, ఓణీ ల వేడుకలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ” ఇమ్మణి రాజేశ్వరి ” గారిని కలవడం జరిగింది.

Party Activities

Social Activities

NewsPaper Clippings & Pamphlets

Pamphlets

Videos

}
15-05-1971

Born in Chakradevarapalle

Jangareddygudem, Eluru

}
1987

Studied Schooling

from ZP High School, Jangareddygudem

}
1990

Completed Intermediate

from Sri Damodara Junior College, Jangareddygudem

}
1993

Attained Graduation

from CSPS Degree College, Jangareddygudem

}

Joined in the TDP

}

Party Activist

from TDP

}

Village General Secretary

from TDP, Chakradevarapalle

}
1996

Telugu Yuvatha Mandal General Secretary

from TDP, Jangareddygudem

}
Since - 2021

Mandal Predisdent

from TDP, Jangareddygudem

}
Since -2021

Sarpanch

from TDP, Chakradevarapalle

}

Ward Member

from 04th & 08th Ward, Chakradevarapalle

}

Vice Sarpanch

from TDP, Chakradevarapalle