Ponna Ravi Kumar | Founder and State President of Shalivahana Kummarula Abhivrudhi Sankshema Samithi | the Leaders Page

Ponna Ravi Kumar

Founder and State President of Shalivahana Kummarula Abhivrudhi Sankshema Samithi, Tirupati, Andhra Pradesh, TDP.

 

Ponna Ravi Kumar is presently in the position of the Founder and State President of Shalivahana Kummarula Abhivrudhi Sankshema Samithi.

He was born and raised up on 28th February 1986 to Ponna Ramachandra and Nagalaxmi in Tirupati. He completed his schooling at Arunodhaya High School at Madanapally.

In the year 2009, Ponna Ravi Kumar started his political career by entering the Telugu Desam Party(TDP)and worked as an Active Member by serving the Party.

In the year 2009, For his Sincerity to the services of the Party, he elected as the Vice-Sarpanch of Kalikiri village from TDP and worked up to 2013.

As being a part of TDP, Ravi Kumar express keen interest and performs every activity for the recognition of the respective party and also worked hard for the development of the Sankshema Sangam all over the state.

For his excellent performance during the process of the activities in the year 2015, he was appointed as the Vice-President for Andhra Pradesh Kummarula Shalivahana Sankshema Sangam.

He comprehensively committed to hard work and in 2019, he decided to set up a society and serve the people in a new way so he established society by naming its as Shalivahana Kummarula Abhivrudhi Sankshema Samithi. He is the Founder and the State President of the respective Society.

In 2020, he was appointed as the South India Media Secretary of All India Kumbar Kulalar Prajapati Federation to discharge his duties with a code of conduct.

Recent Activities

  • Ravi Kumar has been organizing many service programs in association with Sankshema Sangam.
  • He helped the old and poor people in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • Every year during national festivals like Republic Day and Independence day, Ravi Kumar conducts and attends the programs in the schools and distributed prizes to the students who actively participate and won in the sports.
  • Every year he Distributed books, pens, and clothes to poor children for their higher education and also helped them financially for their bright future.
  • He extended his services by assisting poor people who are deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially.

Pandemic Services

  • Ravi Kumar came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers,  needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • Ravi Kumar came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

H.NO: 70, G2, Colony: Seshadri Nagar, Land Mark: Pudi road, Village: Tirupati rural, Mandal: Tirupati, District: Tirupati, State: Andhra Pradesh, Pincode:517502

Email: [email protected]

Mobile: 7013620449, 9493950718

 

Recent Activities

సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరి కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం తిరుపతి పట్టణంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ యొక్క చైర్మన్ & వ్యవస్థాపకులు కంచర్ల సురేష్ హాజరయ్యారు.

గౌ.శ్రీ. పులివర్తి నాని గారితో

చంద్రగిరి ఎమ్మెల్యే గౌ.శ్రీ. పులివర్తి నాని గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ గారు.

అలంకరించడం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడంతో పంచాయతీ నందు అరాచక పాలన నుండి అయోధ్య పాలన వచ్చిన సందర్భంగా కీచుకుని ఫోటోలు తీసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,గారు అలాగే చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఫోటోలను పాడిపేట పంచాయితీ ప్రధాన కార్యదర్శి పొన్న రవికుమార్ చేతుల మీదుగా అలంకరించడం జరిగింది .

కంప్లైంట్ ఇవ్వడం

అనంతపురం జిల్లా పుత్తూరు మండలం లో జరిగిన ఒక హత్య కేసులో సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ అలాగే సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ బేరి రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నా రవికుమార్ చంద్రకళది ముమ్మాటికి హత్యా అని అనంతపురం నుంచి డిఎస్పి వెంకట శివ ప్రసాద్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు తగు విచారణ చేసి కచ్చితంగా నిందితులని అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్ సంతోషంగా వ్యక్తం చేశారు.

తిరుపతిలోని మహిళ యూనివర్సిటీలో ఈనెల 14వ తేదీన తెలుగుదేశంపార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తినాని మీద జరిగిన హత్యాయత్నం సంఘటనపై శాలివాహన సాధికార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నా రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు హత్యాయత్నం చేసిన ఘటనలో విధినిర్వహణలో ఉన్న గన్ మాన్ కు సైతం గాయాలు కావటం,కాల్పుల్లో వైసీపీ కార్యకర్తకు బుల్లెట్ గాయం కావటం,ఈ సంఘటనను రాష్ట్రం మొత్తంచూసిందని, వైసిపి నాయకులు దౌర్జన్యం చేసి కొడుతుంటే,చంపడానికి ప్రయత్నిస్తుంటే ఎవరైనా ప్రాణరక్షణ చేసుకోకుండా ఉంటారా అని అన్నారు.

చేర్చ

తిరుమల కొండమీద టి టి డి కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు గత రెండు నెలలుగాజీతాలివ్వడం లేదని వారు బాధపడుతున్న కారణంగా వారిసమస్య పరిష్కారం కొరకు కాంట్రాక్టర్ కార్యాలయంలో యాజమాన్యంతో చర్చిస్తున్న టి ఎన్ యు సి రాష్ట్రప్రధానకార్యదర్శి, ఆంబూరు సింధూజ గారు.

వైద్య పరీక్షలు మరియు దేహదారుడ్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 02-01-2020వ తేదీన ప్రభుత్వ జీవో ప్రకారం హోం శాఖలో విలీనంగా పోలీసు శాఖ 2156 మంది (SPO) స్పెషల్ పోలీసు ఆఫీసర్స్ ను వైద్య పరీక్షలు మరియు దేహదారుడ్య పరీక్షలు చేసి ప్రక్రియ ప్రకారం నియమించడం జరిగింది.

పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు నమస్కరిస్తూ, మీ టీ.శ్రీనివాసులు శేషాద్రి నగర్, పాడిపేట పంచాయితీ, తిరుపతి రూరల్ మండలం. ఉదయం 5 గంటలకు తిరుపతి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు మోకాళ్ల మీద పాదయాత్ర చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రగిరి నియోజకవర్గంలో నుండి పోటీ చేస్తున్న శ్రీ పులివర్తి వెంకటమణి (నాని) గారి గెలుపు కోసం తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు మోకాల్ల మీద పాదయాత్ర చేస్తున్నామని తెలియజేయడం జరిగింది.

నియామక పత్రం అందజేత

 తిరుపతి ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన సమావేశంలో ప్రస్తుతం కుమ్మరులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ మాట్లాడుతూ కుమ్మర్లు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు .కాబట్టి చదువుకున్న కుమ్మర కుల బంధువులు అలాగే మిగతా కార్యక్రమాలలో ఉన్నటువంటి ఏ కుమ్మర కుల బంధువైన సరే ఆర్థికంగా ముందుకు రావాలని మరి మరి కోరుతున్నాము. అలాగే అన్నమయ్య జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మన కుమ్మర ముద్దుబిడ్డ అయినటువంటి పెట్టేటి రెడ్డెప్ప. గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేయడం జరిగినది.

ప్రెస్ మీట్

కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర కార్యవర్గంలోకి ఆహ్వానిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లు మరీ కీలకమైన పదవులు పోషించగలరని ఉద్దేశంతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పెట్లూరి నరసయ్య గారిని, కడప నుంచి అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొమర్ల గురుస్వామి, గారిని తిరుపతి నుంచి రాష్ట్ర కమిటీ లోకి ఆహ్వానించి వారికి నియామక పత్రాలను అందజేసి కార్యవర్గంలోకి ఆహ్వానించడం జరిగినది .ఈ కార్యక్రమం తిరుపతి జిల్లా అధ్యక్షుడు ధరణికోట లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో జరగడం. చాలా ఆనందంగా ఉందని అన్నారు. కుల బంధువులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగినది. అలాగే రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి కుమ్మరుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కుమ్మరులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యవర్గాన్ని నియమించడం జరిగిందని తెలియజేశారు.

తిరుపతి జయహో బీసీ కార్యక్రమం

తిరుపతి జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న శాలివాహన సాధికార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్న రవికుమార్ గారు.

సమావేశం

బీసీలకు న్యాయం చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారిని పూర్తిగా విస్మరించారని, ఆయన బీసీల ద్రోహి అని తెదేపా తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు నరసింహయాదవ్ గారు అనడం జరిగింది. స్థానిక వైకన్వెక్షన్ కేంద్రంలో ‘బీసీలకు జగన్ ప్రభుత్వం నమ్మక ద్రోహం’పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. 

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా తిరుపతి పట్టణంలోని కపిలతీర్థం సర్కిల్ వద్ద నిరాహారదీక్ష శిబిరంలో 27రోజులుగా కొనసాగుతున్న దీక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ శాలివాహన సాధికార కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్న రవికుమార్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు ఆముదాల తులసీదాసు పాల్గొన్నారు

బాబు తో నేను కార్యక్రమం

పొన్న రవి కుమార్ గారు ఇతర పార్టీ నాయకులతో కలిసి బాబు తో నేను కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

విజిల్ వేస్తూ డప్పులు మోగిస్తున్న సందర్భంలో

తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నారా బ్రాహ్మణి గారు ఇచ్చిన పిలుపుమేరకు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుతూ తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం పాడి పేట పంచాయతీ శేషాద్రి నగర్ నందు విజిల్ వేస్తూ డప్పులు మోగిస్తూ ఉన్న టీడీపీ కార్యకర్తలు మరియు శేషాద్రి నగర్ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

మౌన దీక్ష

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం దగ్గర తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ మతి మన్నూరు సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో నోటికి నల్ల రంగు రిబ్బన్ కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ మౌన దీక్షలో పాల్గొన్న తిరుపతి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు.

10వ రోజు దీక్ష

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అక్రమ అరెస్టుకు నిరసనగా పదవరోజు తిరుపతి ఇంచార్జ్ శ్రీమతి మన్నూరు సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో, స్థానిక మునిసిపల్ ఆఫీస్ కూడలి నందు జరుగుతున్న 10వ రోజు దీక్షలో పాల్గొన్న తిరుపతి తెలుగుదేశం పార్టీపార్లమెంట్ పరిశీలకులు శ్రీ సురేంద్ర కుమార్ గారు మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది .

రిలే నిరాహార దీక్ష

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండల పరిధిలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని గారు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పొన్న రవికుమార్ పాల్గొనడం జరిగింది.

పార్టీ సమావేశం

 శ్రీ కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడుగారి నికలిసిన తిరుపతి పార్లమెంటు శాలివాహనులు. తిరుపతి కాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గం మాజీ సర్పంచ్లు ప్రతి ఒక్క శాలివాహన ముఖ్య నాయకులు తిరుపతి పార్లమెంట్ శాలివాహన తెలుగుదేశం పార్టీ శాలివాహన సాధికార అధ్యక్షులు ఆముదాల తులసి దాస్, అధ్యక్షతన కాళహస్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ సి వి నాయుడు గారితో కలిసి తెలుగుదేశం పార్టీ వైపు పూర్తిగా మద్దతు పలుకుతున్నామని చెప్పడం జరిగింది . దీనిపై ఎస్ సి వి నాయుడు గారు స్పందిస్తూ శాలివాహనులయొక్క పరిస్థితులు పూర్తిగా చంద్రబాబు నాయుడు గుర్తించారని, కార్పొరేషన్ , కమ్యూనిటీ హాల్లో ,ఇళ్ల స్థలాలు వాళ్లకు కావాల్సినటువంటి పనిముట్లు ఆర్థికంగా రాజకీయంగా బలపడే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని ,రాబోయే రోజుల్లో శాలివాహనులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పూర్తి సహాయ, సహకారాలు అందజేస్తుందని ఎస్ సి వి నాయుడు గారు శాలివాహనలకు వచ్చినటువంటి మూడు నియోజకవర్గాల శాలివాహననాయకులకు ధైర్యం చెప్పడం జరిగింది. దీనిపై స్పందిస్తూ తిరుపతి పార్లమెంటు శాలివాహన అధ్యక్షులు ఆముదాల తులసీదాసు చెప్పడం జరిగింది .పార్టీకి అన్ని రకాలుగా కావలసినటువంటి సహాయ సహకారాలు శాలివాహనుల నుంచి దాదాపు 90 o/o అందుతుందని ,కచ్చితంగా భారీ మెజార్టీతో మా శాలివాహనాలందరూ తెలుగుదేశం పార్టీ వారినీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తుందని చెప్పడం జరిగింది.  ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాలివాహన సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్న రవి కుమార్, రాపూరు మధు, రాజేష్, ప్రవీణ్ సుధాకర్, యశ్వంత్ కుమార్ , శ్రీరాములుమొదలగువారు పాల్గొన్నారు .

సన్మానం

కుమ్మర ఎల్లప్ప కు కుమ్మరు ల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి వేందుల వెంకటేష్ గారు, మరియు పలమనేరు వినాయక కమిటి కార్యవర్గ సభ్యులు ఘన సన్మానం చేయడం జరిగింది.

మహాశక్తి"ప్రోగ్రాం

సత్యవేడు నియోజకవర్గం సురుటుపల్లి గ్రామంలో నియోజకవర్గం ఇన్చార్జి Ex MLA శ్రీ మతి హేమలత గారు, శ్రీ మతి H.హెలన్ గారి ఆధ్వర్యంలో “మహాశక్తి”ప్రోగ్రాం జరిగింది.

కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్ ఆధ్వర్యంలో తిరుపతి RDO కార్యాలయంలో కుమ్మరి శాలివాహన ల సమస్యలను త్వరగా పరిష్కారం జరిగేలా చూడాలని తిరుపతి పార్లమెంటు బీ సీ శాలివాహన సాధికార పార్లమెంటు అధ్యక్షుడు ఆముదాల తులసీదాస్,ఆర్ డి ఓ శ్రీ కనకనరసా రెడ్డి గారి కి విన్న వించడం జరిగింది.అలాగే AO గారిని కలిసి శాలివాహన సామాజిక వర్గానికి సంబంధించిన మట్టి సమస్యను త్వరగా పరిష్కారం జరిగేలా చూడాలని కోరడం జరిగింది, AO గారు శాలివాహన సమస్యలపై స్పందించి త్వరలో శాలివాహనులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.

ప్రజల సమస్యలను సంభందిత అధికారికి వివరిస్తూ మర్యాదపూర్వకంగా వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది.

 

సమావేశం

తిరుపతి నగర నడిబొడ్డులో నీ శాలివాహన నగర్ నందు కుమ్మర కుల బంధువుల ఆత్మీయ సమావేశం. ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి పొందాము. ప్రస్తుత గవర్నమెంటులో కుమ్మర కుల బంధువులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. వాటి గురించి వివరములు శాలివాహన సోదరులకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్,కుమ్మర, శాలివాహన సాధికార కమిటీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఆముదాల తులసిదాస్ గారు అలాగే శాలివాహన నగర్ కుల బంధువులు అచ్యుత్, నిరంజన్, మనీ ,గురవయ్య తదితర కుమ్మర కుల బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది.

 

సాధికార పార్లమెంట్ సమావేశం

బీసీలకు భరోసా బాట తిరుపతి కుమ్మర శాలివాహన సాధికార పార్లమెంట్ సమావేశంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సుగుణమ్మ గారితో కలసిపాల్గొన్న మదనపు పోతలయ్య గారు. ఈ సందర్భంగా మదనాపు పోతలయ్య గారు మాట్లాడుతూ కుమ్మరులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీ తోనే. మనము ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీ గెలిపించుకొని శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి కుమ్మరి నడుం బిగించాలని పిలుపునిచ్చారు .ఈ సమావేశంలో బీసీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సదాశివం తిరుపతి అసెంబ్లీ అబ్జర్వర్ వడ్డెర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవర్ మురళి గారు నగరపాలక కార్పొరేటర్లు కుమ్మరి శాలివాహన తిరుపతి పార్లమెంట్ కన్వీనర్ ఆముదాల తులసి గారు,రాష్ట్ర కమిటీ మెంబర్ పొన్నరవికుమార్ గారు పార్లమెంట్ పరిధిలోని పార్లమెంట్ నెంబర్లు తెలుగుదేశం పార్టీ కుమ్మర కుటుంబ సభ్యులు అనేక మంది హాజరై ఉన్నారు.

సన్మాన కార్యక్రమం

మైసూరు కుమ్మర కుంబహార్ సంఘం మైసూరు జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సమావేశంలో భాగంగా ఎవరు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

పాదయాత్ర

యువగళం పాదయాత్రలో భాగంగా నేడు పొద్దుటూరులో లోకేష్ గారు ఏర్పాటు చేసిన క్యాంప్ లో పాల్గొనడం జరిగింది.

వినతి పాత్రం అందజేత

కోవెలకుంట్ల పట్టణంలో యువగళం పాదయాత్రసందర్భంగా శాలివాహన మహిళలు నారా లోకేష్ గారికి* పూల మాల వేసి అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నారా లోకేష్ గారికి అందించడం జరిగింది.

 మంగళగిరి టిడిపి రాష్ట్ర కార్యాలయం లో శాలివాహన సాధికార కమిటీ సమావేశంలో పాల్గొన్న కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు, పొన్న రవి కుమార్, ముడివేటి శ్రీరాములు, వెంకటరమణ కుమ్మర, పట్నం శ్రీను, నదికుడి వెంకటేశ్వర రావు, పాల్గొనడం జరిగింది. అలాగే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారికి, తెలుగుదేశం పార్టీ శాలివాహన సాధికార కమిటీరాష్ట్ర కన్వీనర్ మాదానపు పోతలయ్య గారికి సన్మానం చేయడం జరిగింది.

బీసీల కార్యాచరణ కార్యక్రమం

బీసీల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.

మొల్లమాంబ జయంతి

శ్రీశ్రీశ్రీ కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా కుమ్మర కుల సభ్యులతో పాల్గొన్న కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాన్న రవికుమార్. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన m l c ఎలాక్సన్ లో తెలుగుదేశం పార్టీ తరపున నిలబడిన శ్రీకాంత్ గారిని గెలిపించాలని సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అలాగే చిత్తూరు జిల్లాఅధ్యక్షులు పులివర్థి నాని గారుతో తెలుగుదేశం పార్టీ సాధికారక కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోన్న రవి కుమార్ పాల్గొన్నారు.

పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో భాగంగా నగరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గాలి భాను ప్రకాష్ రెడ్డి గారిని అలాగే, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని గారిని అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి శ్రీ నందమూరి తారకరత్న గారి కి నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పొన్నా రవికుమార్, భక్తవత్సలం ,చంద్రశేఖర్ , డి.ఎస్.పి వెంకటరమణ గారు తిరుపతి రూరల్ మండలం కూపుచంద్ర పేట గ్రామస్తులు పాల్గొన్నారు.

సన్మానం

నాయకులని గౌరవప్రదంగా కలుసుకొని వారు చేస్తున్న సేవలకు ప్రతిరూపంగా కృతజ్ఞత భావంగా సన్మానం చెయ్యడం జరిగింది.

మహోత్సవ భోజనాలు

నెల్లూరు జిల్లా పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన వన మహోత్సవ భోజనాలు కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీకి బీసీ సాధికార సమితి శాలివాహన రాష్ట్ర కన్వీనర్ మదనపు పోతలయ్య గారు.ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర బీసీ కుమ్మర శాలివాహన సాధికార సమితి కన్వీనర్ మదనాపు పోతులయ్య గారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం నాయకులతో పాటు ఇతర జిల్లాల కుమ్మర శాలివాన సోదర సోదరీమణులు ముఖ్య నాయకులు హాజరై భగవంతుని సన్నిధిలో కార్తీక వనభోజనా కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

తిరుపతి జిల్లా కలెక్టర్ కలిసిన కుమ్మర శాలివాహన కార్పొరేషన్ శ్రీ మండేపూడి పురుషోత్తం గారు జిల్లాలో కుమ్మర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అలాగే వారి అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుండి చూసుకుంటామని, అలాగే కుమ్మర శాలివాహన కులస్తులు కొరకు ఏర్పాటుచేసిన బిసి వెల్ఫేర్ కమిటీ లో కొత్తగా ప్రభుత్వం ద్వారా నియమించబడిన నలుగురు కమిటీ మెంబర్లను కలెక్టర్ గారికి పరిచయం చేస్తూ, అలాగే కుమ్మర కులం కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము చేస్తాము అని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగినది.

పుట్టినరోజు సందర్భంగా

తిరుపతి టిడిపి పట్టణ అధ్యక్షులు చిన్న బాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ సాధికారక సమితి తిరుపతి పార్లమెంటరీ కన్వీనర్ పోన్న రవికుమార్, ఆముదాల తులసీదాస్ గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

కలిసిన సందర్భంలో

తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇంచార్జ్ సుగుణమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

మాజీ ఎమ్మెల్సీ, మాజీ శాలివాహన అధ్యకుడు ఐలపురం వెంకయ్య గారి తో కుమ్మరుల అభివృద్ధి సంక్షమ సమితి రాష్ట్ర అద్యక్షులు పొన్న రవి కుమార్ గారిని కలవడం జరిగింది.

ధన్యావాదాలు

సర్వ ప్రథమ దేవుడు శ్రీ వినాయక స్వామి మరియు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు సకల లోకాల దేవుడి అనుగ్రహం తో పెద్దల ఆశీససులతో విజయవంతంగా జరిగిన మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవం రవి కుమార్ గారి జీవితం లో ఎన్నడూ మరవని సన్నివేశం. మరియు వారి పై నమ్మకం తో నాకు EC మెంబర్ గా భాద్యతలు అప్పగించిన మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి గారికి, అద్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు గారికి, కార్యదర్శులు పావులూరి పద్మనాభం నాయుడు గారికి ఉపాధ్యక్షులుగ వార్తల శేషాద్రి గారికి, కల్లూరు రంగయ్య గారికి, సహాయ కార్యదర్శులు వెంకటేష్ యాదవ్ గారికి, నా ప్రియ మిత్రుడు లక్ష్మీకాంత్ నాయుడు(బాబ్జీ) గారికి, అత్తిరాల సూరిబాబు గారికి, కోశాధికారిగా శ్రీరామ్ తీర్థప్రసాద గుప్తా గారికి, లీగల్ అడ్వైజర్ తొండవాడ రవిచంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ. తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యావాదాలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

స్పందన

తిరుపతి లోని కలెక్టర్ కార్యాలయం నందు స్పందన…

జయంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మాజి కిషోర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి రోజున తిరుపతి పట్టణంలో ని బస్టాండ్ కూడలి లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ sc,st,bc,వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు.బొమ్మాజి కిషోర్ గారు,తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకుడు మురళి రెడ్డి గారు, అఖిలభారత బీసీ సమైక్య జిల్లా అధ్యక్షులు పొన్న రవి కుమార్ గారు ,,బాషా గారు , సంఘసేవకురాలు ముని లక్ష్మి గారు ,, అఖిలపక్షం న్యూస్ ఛానల్ చైర్మన్ గిరి గారు తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్బంగా

తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు డిఆర్ఓ గారిని తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సన్మానం

తిరుపతి జూనియర్ సివిల్ జడ్జి గా నియామకం అయిన పొదలపల్లి సంయుక్త గారిని సన్మనించిన ఏ.పీ, ఎస్.సి,ఎస్.టి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మాజి కిషోర్ గారు.. ఈ కార్యక్రమంలో పొన్న రవి కుమార్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

మీటింగ్

బెంగళూరులో జరిగిన రవి కుమార్ గారి బిజినెస్ మీటింగ్ లో పాల్గొన్న సందర్బంగా..

పుట్టినరోజు సందర్భంగా

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి కొర్లకుంట ఎరుకల కాలనీ లో అంగన్వాడి స్కూల్ నందు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైనటువంటి పోన్నా రవి కుమార్ గారు , శాలివాహాన కార్పొరేషన్ చైర్మన్ మండెపూడి పురుషోత్తం గారు , పులివెందుల వెంకటేష్ గారు ,అలాగే నాయి బ్రాహ్మణ చిత్తూరు జిల్లా డైరెక్టర్ పుల్లయ్య గారు ,ముఖ్య అతిథులుగా పాల్గొని స్కూల్ పిల్లలకి పుస్తకములు, పెన్నులు, పెన్సిలు పంపిణీ చేయడం జరిగింది.

మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ప్రముఖంగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలం లో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుండి ప్రారంభమైనది. ఇది క్రీ.శ 78 లో ప్రారంభమైంది.

శాలివాహన సంప్రదాయము ఇది అచ్చముగా చారిత్రకమే. శాలివాహనుడు బ్రాహ్మణ కన్యకు కుమ్మరి వలన జన్మించి, కుమ్మరుల కందరకును నాయకుడై, వారి సహాయమున – ఆకాలమున రాజైన విక్రమార్కుని జయించి, ఆరాజ్యమున వశపరచుకొని, రాజ్యమును పాలించి తన పేర శకమును నెలకొల్పడం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు

తిరుపతి ప్రెస్క్లబ్లో ఇజం టీవి మేనేజింగ్ డైరెక్టర్ బాల నరసింహులు గారి పుట్టినరోజు వేడుకల్లో తిరుపతి ప్రెస్క్లబ్లో అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్న రవి కుమార్ గారు, మరియు తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి రెడ్డి గార ,ఉపాధ్యక్షులు బొమ్మ జి కిషోర్ గారు, పిఆర్వో వెంకట్ రమణ గారు, అలాగే మీడియా సోదరులందరూ పాల్గొని బాల నరసింహులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

జయంతి

రెండు తెలుగు రాష్ట్రాల కుమ్మరి బందువులందరికి “తొలి తెలుగు మహిళా కవయిత్రి శ్రీ ఆతుకూరి మొల్లమాంబ గారి జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

ఆత్మీయ సమావేశం

కుమ్మరులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రాణించాలని రాష్ట్ర శాలివాహన కుమ్మరి సేవా సంఘం కన్వీనర్ గురుస్వామి, రాష్ట్ర కుమ్మరుల అభివృద్ధి సమితి అధ్యక్షులు రవికుమార్ గారు, రాష్ట్ర శాలివాహన కుమ్మరి సంఘం కార్యదర్శి వేణుగోపాల్ గారు, జిల్లా శాలివాహన కుమ్మరి సేవా సంఘం అధ్యక్షులు చంద్రబాబు తెలిపారు. కల్లూరులో శాలివాహన కుమ్మరి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి, రవికుమార్, వేణుగోపాల్, చంద్రబాబు మాట్లాడుతూ కుమ్మరుల సంక్షేమానికి సంఘాలు ఎనలేని కృషి చేయాలన్నారు. శాలివాహన కుమ్మరుల సంక్షేమ సంఘాల బలోపేతానికి అందరం ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కుమ్మరుల సంక్షేమ సంఘాల్లో ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తామన్నారు. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న కుమ్మరులను అదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కుమ్మరుల పేద విద్యార్థులను విద్యా పరంగా ఆదుకునేందుకు సంఘాలు ముందుకురావలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కుమ్మరుల సంఘం నాయకులు సోమశేఖర్, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పూజ కార్యక్రమం

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ తిరుపతమ్మ దేవస్థానం నుండి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కుమార శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మండేపుడి పురుషోత్తం గారు, పొన్న రవి కుమార్ గారు, మరియు చిత్తూరు జిల్లా నాయకులు.

నిత్యావసర వస్తువులు పంపిణీ

ఏబిబిఎస్ యూత్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు, నిత్యావసర వస్తువులు పంపిణీ

ఏబిబిఎస్ యూత్ జిల్లా అధ్యక్షులు పొన్నా రవికుమార్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వేదాంతపురం నందు గల వృద్దాశ్రమం లోని వృద్ధులకు, దుస్తులు మరియు బియ్యం, కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గౌరవ అధ్యక్షులు లంకిపల్లి శ్యామూర్తి మాట్లాడుతూ, ABBS తరుపున ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేసి, పేదవారికి, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలని కోరారు. సంఘము తరుపున తమ పూర్తి సహకారం ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చారు.

 

యూత్ ప్రెసిడెంట్ గా నియామకం

అఖిల భారత బి సి సమాక్య చిత్తూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా పొన్నా రవికుమార్ ఎంపికైనట్టు, ఆ సంఘ గౌరవ అధ్యక్షులు శ్యామూర్తి తెలిపారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు సత్యవాడ శ్రీనివాస్ అందించిన నియామక పత్రాన్ని, రవికుమార్ కి అందచేశారు. తనపై నమ్మకంతో, బి సి లపై తనకున్న ప్రేమను గుర్తించి, జిల్లా స్థాయిలో పదవి ఇచ్చిన జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి రవికుమార్ గారు ధన్యవాదాలు తెలిపారు.

దర్శనం

విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని దర్శించుకున్న పొన్న గారు.

కలిసిన సందర్భం

శాలివాహన కుమ్మరి సమన్వయ సమావేశం విజయవాడ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నందు జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండెపూడి పురుషోత్తం గారిని అలాగే వైఎస్ఆర్ సీపీ గౌరవ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవి కుమార్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

దేశంలో రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి బి సి పోరాడాలని, అఖిల భారత బి సి సమాక్య జాతీయ అధ్యక్షులు సత్యవాడ శ్రీనివాస్ అన్నారు. శనివారం తిరుపతిలోని ఆ సంస్థ కార్యాలయంలో, తిరుపతి గౌరవ అధ్యక్షులు లంకిపల్లి శ్యామూర్తి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కువ శాతం జనాభా కలిగిన బి సి లు, నానాటికి అనగతోక్కబడుతున్నారని, అలాంటి వారి జీవితాలు మారాలంటే, ప్రస్తుతంఉన్న పరిస్థితుల్లో రాజ్యాధికారమే ముఖ్యమని, అది బి సి ల హక్కు అని అన్నారు. 

విలేఖర్ల సమావేశం

ప్రకాశం జిల్లా బిట్రగుంట లోని కుమ్మర జీవనాధారమైన స్థలాన్ని స్థానిక నాయకులు కబ్జా చేయటాన్ని , అఖిల భారత బి సి సమాక్య మరియు కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి తీవ్రంగా ఖండించారు. అఖిల భారత బీసీ సమాఖ్య తిరుపతి గౌరవ అధ్యక్షుడు శ్యామూర్తి మాట్లాడుతూ బీసీ ల హక్కుల్ని కాలరాస్తున్న ప్రస్తుత ప్రభుత్వ విధానా ల పై ద్వజమెత్తారు. బడుగు బహీనవర్గాల సమరక్షణే ధ్యేయంగా అఖిలభారత బీ సీ సంఘం పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం కుమ్మరు లకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యని పరిష్కరించి కుమ్మరి లకు న్యాయం చేయాలని డిమండ్ చేశారు. ఈ విలేఖర్ల సమావేశంలో అఖిల భారత బీసీ సంఘం రాష్ట్ర ప్రధాకార్యదర్శి కృష్ణచైతన్య ఆలియస్ కిట్టు, జిల్లా అధ్యక్షులు శివశంకర తదితరులు పాల్గన్నారు.

జయంతి

తొలి తెలుగు మహిళా కవయిత్రి ,కుమ్మర కులముద్దుబిడ్డ ,కుల ఆడపడుచు ,కుమ్మర కులకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన కవయిత్రి శ్రీ శ్రీ శ్రీ ఆతుకూరు మొల్లమాంబ గారి జయంతి శుభాకాంక్షలు ఇలాగే ప్రతీ సంవత్సరం రాష్ట్రంలో శ్రీ మొల్ల గారి జయంతిని అందరూ కలసికట్టుగా చేయాలని కోరుకుంటున్నాము..

వార్షికోత్సవ కార్యక్రమం

కుమ్మర కులంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాన్ని అందుకున్న బాడీ బిల్డర్ సుధీర్ కు నవ్యాంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన యువసేన గిద్దలూరులో జరిగిన రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో కుమ్మర శాలివాహన ఫెడరేషన్ చైర్మన్ శ్రీ తుగ్గలి నాగేంద్ర గారు మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల చేతుల మీదుగా 35 వేల రూపాయలు ఆర్థికంగా సహాయం చేసారు..

కుమ్మర శాలివాహన యువసేన

ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన యువసేన రెండవ వార్షికోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగించడానికి గిద్దలూరు కమిటీ సభ్యులు చేసిన కృషి అభినందనీయం.. 

ప్రమాణ స్వీకార మహోత్సవం

గిద్దలూరులో ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఈమని శ్రీనివాసరావు గారు, నవ్యాంధ్ర కుమ్మర శాలివాహన యువసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దగ్గుబాటి హరికిషన్ గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జయప్రకాష్ గారు మరియు ఇతర కమిటీ సభ్యులు.

ఆత్మీయ సమావేశం

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మడలం మల్లెల కుమ్మరపల్లిలో కుమ్మర ఆత్మీయ సమావేశం జయప్రదంగా ముగించడానికి కృషి చేసినటువంటి నవ్యాంధ్ర కుమ్మర శాలివాహన యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వేపంజేరి వేణుగోపాల్ గారికి ప్రత్యేక అభినందనలు.

చర్చ

నవ్యాంధ్రప్రదేష్ కుమ్మర శాలివాహన యువసేన అధ్వర్యంలో, చిత్తూరు జిల్లా వాల్మీకిపురం నియోజకవర్గంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కిరణ్ గారి అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గంలోని కుమ్మర్ల పరిస్థితులు ,సమస్యల మీద చర్చించడం జరిగింది.

చిత్తూరు జిల్లా దేవలంపేట నందు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవి కుమార్.అలాగే ఏపీ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో బిసి శాలివాహన వెల్ఫేర్ కమిటీ సభ్యులు చీమలమర్రి గురు స్వామి గారు ,వేపంజేరి వేణుగోపాల్ గారు అలాగే కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గురుస్వామి గారు అలాగే కుమ్మర కుల బంధువులు అందరూ పాల్గొన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలోని పాడిపేట పంచాయతీలో శేషాద్రి నగర్ నందు ఒకటో బ్లాక్ దగ్గర నుంచి ఈరోజు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 321.322 బూతుల నుంచి ఇన్చార్జిలు అలాగే కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాడిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ అలాగే చిత్తూరు పార్లమెంటు బిసి కార్యదర్శి ప్రకాష్ ,ఎస్సీ మహిళా అధికార ప్రతినిధి కళావతి అలాగే నవీన్ కుమార్ , మురుగన్ , శేఖర్ ,భోగ గోపాల్, విజయ్ కుమార్ ,శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాస్ నాయుడు, అలాగే బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

Party Activities

Identity Cards

Newspaper Clippings 

 Video Clippings

Videos

}
28-02-1986

Born in Tirupati

of Andhra Pradesh

}

Completed SSC Standard

from Arunodhaya High School, Madanapally.

}
2009

Joined in the TDP

}
2009-2013

Vice-Sarpanch

of Kalikiri

}
2015

Vice-President

Andhra Pradesh Kummarula Shalivahana Sankshema Sangam

}
2019-till now

Founder and the State President

of Shalivahana Kummarula Abhivrudhi Sankshema Samithi

}
2020-till now

South India Media Secretary

of All India Kumbar Kulalar Prajapati Federation