Lavu Sri Krishna Devarayalu | MP | YSRCP | Narasaraopet | A.P | the Leaders Page

Lavu Sri Krishna Devarayalu

MP, Vice Chairman of Vignan University, YSRCP, Guntur, Narasaraopet, Andhra Pradesh.

Lavu Sri Krishna Devarayalu is the MP(Member of Parliament in the Lok Sabha) in Narasaraopet Constituency, Andhra Pradesh. He was born on 29-04-1983 to Lavu Rathaiah & Nirmalamma in Guntur.

In 2006, He completed his Graduation B.Tech from Andhra University Visakhapatnam. He studied Media studies at La Trobe University, Australia, and the University of California, Santa Barbara.

Krishna serves as the Vice Chairman of Vignan University a Premier University in Andhra Pradesh.

Krishna started his political journey in 2014 with the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) and was the Leader. Krishna was the Incharge of Parliamentary Guntur.

Sri Krishna Devarayalu Lavu is a first-time Member of Parliament(MP) who contested the 2019 general elections. He won the seat by securing a vote share of 51.83% and by a margin of 5,40,298 votes. Currently, he also serves as a Member of the Human Resources Development Standing Committee.

He has spoken in Parliament on a range of legislation such as The Surrogacy (Regulation) Bill, The National Medical Commission Bill, The Motor Vehicles (Amendment) Bill, and The Central Universities (Amendment) Bill.

He has also raised various issues in Parliament, a few being, the demand to establish a Chilli Board in Guntur and the Construction of the Varikapudisala Lift Irrigation Project in Andhra Pradesh.

Social Services:

  • Distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the Villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to the Poor people in lockdown time.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

D.No. 3-30-5/2, Brundavan Gardens, Guntur-522006

E-Mail: [email protected]
Contact Number: +91-9491747777

Party Events

మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌లను పంపిణీ

పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్‌ఆండ్‌బి బంగ్లా నందు.. గురజాల నియోజకర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సిబ్బందికి, పిహెచ్‌సీ సెంటర్ల సిబ్బందికి, ఏఎన్‌ఎమ్‌లకు ఎన్‌–95 మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌లను  పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో

 ప్రై వేట్‌ ఆసుపత్రి వైద్యులతో గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కన్ఫెరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ శామ్యూల్‌ గారు, మంత్రి మోపిదేవి వెంకటరమణ గారితో కలిసి పాల్గొనటం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించిన విషయాలు కరోనా సేవల్లో ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు భాగస్వామ్యం పెరగాలి.
ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డు సౌకర్యం ఉండాలని. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఓపీ సేవలందించాని సూచించాము. ఈ విపత్కర సమయంలో ప్రజలు ఇంటినుండే వైద్యం పొందేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రారంభించిన టెలీమెడిసిన్‌ సేవలపై చర్చించటం జరిగింది.

మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌లను పంపిణీ

సత్తెనపల్లి పట్టణంలో.. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల వైద్య సిబ్బందికి, పిహెచ్‌సీ సెంటర్లలోని సిబ్బందికి, ఎన్‌ఎమ్‌లకు ఎన్‌–95 మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌లను పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు, తహశీల్దార్‌ రమణకుమారి, వైసీపీ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, అచ్యుత శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరులో విలేకర్ల సమావేశంలో

మనందరం సురక్షితంగా ఉంటున్నామంటే.. కరోనాపై నిరంతరం పోరాడుతూ సేవలందిస్తున్న వైద్యులే కారణం. అహర్నిశలు శ్రమిస్తూ.. మనందరి క్షేమానికి సేవలందిస్తున్న వైద్యులను రక్షించుకోవాలి.

ఈ దృక్పథంతోనే ఈ రోజు కాటూరి మెడికల్‌ ఆస్పత్రి వైద్యులకు రక్షణార్థంగా 500 పీపీఈ కిట్‌లు, ఎన్‌–95మాస్కులు, ఫేస్‌ షీల్డ్‌లు కాటూరి మెడికల్‌ కాలేజీ డీన్‌ డాక్టర్‌ సత్యవరప్రసాద్, ప్రిన్సిపాల్‌ జి. చైతన్యలకు అందించటం జరిగింది.

నిత్యవసర సరుకుల పంపిణీ

నరసరావుపేట పట్టణం.. రెడ్‌జోన్‌లోని(వరవకట్ట ప్రాంతం) 1100 నిరుపేద కుటుంబాలకు గోపిరెడ్డి చారిటిస్‌ అందిస్తున్న నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలసి పాల్గొన్నాను. ఈ కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద జరిగింది. విజ్ఞాన్‌ సంస్థల తరుఫున నా వంతుగా రెడ్‌జోన్లలో పనిచేస్తున్న వాలంటీర్లు, గ్రామసచివాలయ, మున్సిపాలిటీ, పారిశుధ్య సిబ్బందికి రోగనిరోధక పెంచే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ట్యాబ్‌లెట్స్‌ను అందజేశాను. వారికి అందించాల్సిందిగా..2000 ట్యాబ్లెట్సును నరసరావుపేట ఆర్డీఓ వెంకటేశ్వర్లు గారికి అందించాను.

నిరంతరం భయానక వాతావరణంలో సేవలందిస్తున్న వీరికి రక్షణార్థంగా ఫేస్‌ షీల్డ్‌లు, ఎన్‌–95 మాస్క్‌లు అందించాల్సి ఉంది. నరసరావుపేటలో రెడ్‌జోన్లలో పనిచేస్తున్న వాలంటీర్లు, గ్రామసచివాలయ, పారిశుధ్య కార్మికులకు అధనంగా రూ. 5వేలు ఈ నెల అందించాలనే ఉద్ధేశంతో ఉన్నాము. ఈ కార్యక్రమంలో నరసరావుపేట మున్సిపల్‌ కమీషనర్‌ వెంకటేశ్వరరావు గారు, మిట్టపల్లి రమేష్‌ గారు, తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్‌–19 హెల్ప్‌డెస్క్

నరసరావుపేట పట్టణంలో గత కొద్ది రోజులుగా మున్సిపల్‌ అధికారుల ఆధ్వర్యంలో 18 నుండి 22వ వార్డు ప్రజల సహాయార్థంగా ఏర్పాటు చేసిన కోవిడ్‌–19 హెల్ప్‌డెస్క్‌ను నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలసి సందర్శించాను. అక్కడి విధివిధానాలు అధికారుల ద్వారా తెలుసుకోవటం జరిగింది. అనంతరం అభాగ్యులకు ఆసరాగా 21వ వార్డు రామిరెడ్డి పేటలో ఏర్పాటు చేసిన షెల్టెర్‌ను ఎమ్మెల్యే గారితో కలసి ప్రారంభించటం జరిగింది.

అనంతరం కరోనా కేసులు అధికంగా ఉన్న నరసరావుపేట 21వ వార్డులో మాస్క్‌లు, శానిటైజర్‌లు ఎమ్మెల్యే గోపిరెడ్డి గారితో కలసి అందించాము. వాలంటీర్ల సాయంతో సుమారు 3000 మందికి వీటిని అందిస్తున్నాము. ఈ కార్యక్రమంలో నరసరావుపేట మున్సిపల్‌ కమీషనర్‌ వెంకటేశ్వరరావు గారు, రొంపిచర్ల తహశీల్దారు సైదులు గారు, నరసరావుపేట మార్కెట్‌ యార్డు చైర్మన్‌ హనీఫ్‌ గారు, సదాశివరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

రైతన్న సంక్షేమం

రైతన్న సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా రైతన్న నష్టపోకుండా పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గారు కృషిచేస్తున్నారు. ఊరూరా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ.. మద్ధతు ధరలు అందిస్తున్నారు.  నరసరావుపేట నియోజకవర్గం..పమిడిపాడు గ్రామంలోని ఆర్‌సిఎమ్‌ హైస్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి గారితో కలసి ప్రారంభించటం జరిగింది.

క్వింటా మొక్కజొన్న రూ.1750 అందించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. అదే బయట మార్కెట్లో రూ.13 నుండి 14వందలుగా ఉంది. కావున  రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు సూచించటం జరిగింది.

వైద్యుల రక్షణ

వైద్యుల రక్షణకు పెద్ద పీట వేస్తూ..విజ్ఞాన్‌ సంస్థల తరుఫున గతకొద్ది రోజులుగా గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్య సిబ్బందికి పీపీఈలు తదితర రక్షణ కవచాలను అందిస్తున్నాను. అందులో భాగంగా చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలోని వైద్య సిబ్బందికి రక్షణార్థంగా ఎన్‌–95 మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌లు అందించటం జరిగింది.

అనంతరం ఆసుపత్రి విధివిధానాలు గురించి వైద్య సిబ్బందితో మాట్లాడాను. రోగుల వద్దకు వెళ్లి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడగటం జరిగింది. కరోనా వచ్చినప్పటి నుండి వైద్యులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయం. ఈ మహమ్మారి నివారణలో మీదే కీలకపాత్ర. మీరు నిశ్చింతంగా విధులు నిర్వహించండి. ఇది అందరి మేలు కోరే ప్రభుత్వం. మీకు తగిన గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది.

నిత్యవసర సరుకుల పంపిణీ

ఈ కరోనా విపత్కర సమయంలో దాతలు వీలైన సాయాలు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. పెద్ద మనసుతో పేదలకు సాయం అందిస్తూ.. అండగా ఉంటున్నారు. కరోనాను జయించటంలో భాగంగా ఎక్కడ ఆకలి కేకలు ఉండకూడదనే దాతలు విరాళాలు అందిస్తున్నారు.

ఈ దృక్పథంతోనే.. నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాల వైస్‌ చైర్మన్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి రమేష్‌ గారు నరసరావుపేటలోని 29, 30 వార్డుల్లో సుమారు 1000 కుటుంబాలకు నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలసి నిరుపేదలకు సరుకులను అందించటం జరిగింది. అన్ని కుటుంబాలకు వాలంటీర్ల సాయంతో అందిస్తున్నాము.

అలాగే గోపిరెడ్డి చారిటిస్‌ తరుఫున నరసరావుపేట 25వ వార్డులో 200కుటుంబాలకు అందిస్తున్న నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి గారితో కలసి పాల్గొనటం జరిగింది

సమావేశంలో

నరసరావుపేట పట్టణంలో కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ వారితో సమీక్ష సమావేశం నిర్వహించటం జరిగింది. నరసరావుపేటలో కరోనా అధికంగా ఉన్న నేపథ్యంలో పూర్తి లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యవసరాలను, మెడిసిన్‌ను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి అమ్మే విధంగా ఏర్పాట్లు చేశాము.
కిరాణా మర్చంట్స్‌ సభ్యులు పూర్తి సహకారాన్ని అందిస్తూ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా సరుకులను ప్రతి గడప గడపకు చేరుస్తున్నారు. ఇప్పుడున్న సేవలు మరింత విస్తృత పరిచి శివారు ప్రాంతాల వారికీ సరుకుల కొరత లేకుండా చూడాలి. ప్రభుత్వాలు సూచించిన ధరలకే సరుకులను విక్రయించాలని ఆదేశించటం జరిగింది.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మున్సిపల్‌ కమీషనర్‌ వెంకటేశ్వరరావు గారు, మున్సిపల్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావు గారు, డిఇ శ్రీనివాసరావు గారు, మిట్టపల్లి రమేష్‌ గారు, చాంబర్‌ ప్రసిడెంట్‌ కొత్తూరు కిషోర్‌ గారు పాల్గొన్నారు.

}
29-04-1983

Born in Guntur

}
2006

Completed Graduation

completed his Graduation B.Tech from Andhra University Visakhapatnam.

}

Media Studies

from La Trobe University, Australia, and the University of California, Santa Barbara.

}
2014

Joined in the YSRCP

}

Leader

of YSRCP

}

Incharge

of Parliamentary Guntur from YSRCP.

}
2019

MP(Member of Parliament to the 17thLok Sabha)

of YSRCP in  Narasaraopet Constituency, Andhra Pradesh.

}

Member

of the Human Resources Development Standing Committee.

}

Vice - Chairman

of Vignan University a premier University in Andhra Pradesh.