కొమ్మినేని సతీష్
MPTC, MPTC's ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ, INC
కొమ్మినేని సతీష్ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను INC నుండి MPTC ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి & MPTC గా పనిచేస్తున్నారు.
విద్య అర్హతలు:
09 జనవరి 1989న మహబూబాబాద్ జిల్లా కేంద్రమైన దాట్లలో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు కొమ్మినేని రాములమ్మ & క్రీ.శే రామయ్య.
2004లో, అతడి సొంత గ్రామమైన దాట్లలో ZPHSలో 10వ తరగతి పూర్తి చేశాడు మరియు 2004-2006 వరకు దంతాలపల్లిలోని సాయిరాం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్పూర్తి చేశాడు.
2006-09 తొర్రూరు పట్టణంలోని సమత డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేట్ ( బి.కాం.), 2009-11లో కాకతీయ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయెట్ (యం.కామ్.)పూర్తి చేశాడు.
సతీష్ తన విద్యను హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం 2011-13 లో సోషియోలాజి,2014-19ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి LL.B. లను పూర్తి చేశారు.
వివాహం:
రజిత (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు)తో 27-ఆగస్టు-2016న కొమ్మినేని సతీష్ గారి వివాహం జరిగింది. వారి సంతానం ఇద్దరు కుమార్తెలు జీవనశ్రీ, దేవాన్షి.
కులం: మున్నూరుకాపు, బీసీ-డి.
విద్యార్థి నాయకుడిగా, ఉధ్యమకారుడిగా సతీష్ పాత్ర :
సతీష్ 2006లో తొర్రూరులో డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థి పోరాటాల్లో ముందుండేవాడు. తన గ్రామానికి విద్యార్థుల రవాణా కోసం కళాశాల టైమింగ్స్ బట్టి బస్సులను నడపాలని మరియు స్కాలర్షిప్-ఫీ రియంబర్స్ మెంట్ విడుదల కోసం అనేకసార్లు తోటి విద్యార్థులను సంఘటిత పరిచి ధర్నాలు చేసాడు.ఈక్రమంలో పోలీసులు పలుమార్లు అదుపులోకి తీసుకొని హెచ్చరించి విడిచిపెట్టారు.
అప్పటి మండలకేంద్రమైన నర్సింహులపేట మండల పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో ధర్నాలు చేసాడు.
ఈక్రమంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమపోరాటంలో సతీష్ సైతం వీరోచితంగా పాల్గొన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమం2009 ప్రారంభానికి ముందే సతీష్ కు ఉద్యమపోరాటాలు అంటే తన అభిప్రాయంలో సమాజ శ్రేయస్సు కోసం జరిగే మంచిమార్పు గా భావించేవాడు. ఈ అభిప్రాయంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, తెలంగాణకు ఆంధ్రప్రాంత నాయకులు పెత్తందారుల వల్ల జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి తోటి కాకతీయ విద్యార్థులతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈక్రమంలోనే రాష్ట్ర ఏర్పాటు వచ్చేవరకు(2009-14) వందల సంఖ్యల్లో ధర్నాలు, రాస్తారోకోలు, వంటవార్పులు, నిరసనలు, మిలియన్ మార్చ్, ధూమ్-దాం సభలు, రచ్చబండ కార్యక్రమంను అడ్డుకోవడం, సకలజనుల సమ్మె, రోడ్ల దిగ్బంధం, సడక్ సమ్మెలు, మహబూబబాద్ రైల్వే స్టేషన్లో రాళ్ళ దాడి, కేసముధ్రం రైల్వే స్టేషన్లో రైల్ భోగి దహనం ఘటన, ట్యాంక్ బండ్ మీద ఆంధ్ర మేధావుల విగ్రహాలు కూల్చివేతలు, ఆంధ్ర నాయకుల దిష్టిబొమ్మల దహనాలు వంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని సుమారు 20కి పైగా కేసులు నమోదు అయ్యాయి. YS జగన్ తలపెట్టిన మహబూబాబాద్ ఓదార్పు యాత్ర సందర్భంగా జరిపిన రాళ్ళ దాడిలో పాల్గొనడంతో తలపగిలి తీవ్రరక్తస్రావం కూడా జరిగింది. తన సొంత గ్రామంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రచ్చబండ ప్రోగ్రాంను అడ్డుకొని నిరసన తెలిపినందుకు అప్పటి తొర్రూరు CI బలస్వామి సతీష్ పై విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసి కేసు బుక్ చేయడంతో అయిదు రోజులపాటు మహాబాద్ జైల్లో జైలు జీవితం కూడా గడిపాడు. 2010లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో ఒకసారి, ఉస్మానియా విద్యార్థులతో కలిసి 2011లో ఒక్కసారి, 2012రెండుసార్లు రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో అరెస్టు అయినప్పుడు స్టేషన్ బెయిల్ పై విడుదల అయ్యాడు.
చేపట్టిన పదవులు :
2009 లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం జరుగుతున్న ఉద్యమ సమయంలో సతీష్ ఉమ్మడి నర్సింహులపేట మండలానికి TRSV మరియు TRSయూత్ మండల అధ్యక్షుడిగా ఎన్నికై మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన కమిటీలు వేసి, యువతను కలుపుకొని అనేక ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, వంటవార్పు కార్యక్రమలు చేసి తెలంగాణ భావజాలాన్ని యువకుల్లోనూ, స్థానిక ప్రజల్లోనూ నింపేందుకు కృషిచేశారు.
- 2010లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జె.ఏ.సి. కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు మరియు సికేయం కళాశాల TRSV ఇంచార్జిగా ఎన్నిక అయ్యారు .
- 2012లో ఉస్మానియా యూనివర్సిటీ TRSV ప్రధానకార్యదర్శిగా ఎన్నిక అయ్యారు.
- 2014లో TRSV రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు.
- 2016లో నూతన జిల్లాలు ఏర్పడటంతో నూతన మహబూబాబాద్ జిల్లా TRSV అధ్యక్షుడుగా సీఎం కేసీఆర్, KTRలు సతీష్ కు అవకాశం కల్పించారు.
- విద్యార్థి ఉద్యమల్లోనే గాకుండా సతీష్ బీసీ కులాలకు జరుగుతున్న అన్యాయాలపై కూడా R.కృష్ణయ్యతో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్నారు.
- 2018లో రాష్ట్ర బీసీ యువజన సంఘం ఉప అధ్యక్షుడుగా సతీష్ ను అప్పటి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు R.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.
- అంతేగాక తన మున్నూరుకాపు కుల అభివృద్ధి కోసం, కుల ఐక్యతకోసం అనేక సభల్లో,సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు.
- 2017లో మున్నూరుకాపు మహబూబాబాద్ జిల్లా యూత్- విద్యార్థి సంఘం అధ్యక్షుడుగాను ఎన్నికయ్యారు.
- 2018లో ఓయూ విద్యార్థి JAC రాష్ట్ర కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 2020లో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
- 2021లో జిలా డీసీసీ మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 2021లో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
- 2023లో జిల్లా కాంగ్రెస్ కమిటీ-మహబూబాబాద్ (డీసీసీ) ప్రధానకార్యదర్శి ఏకగ్రీవంగా నియామకం.
కాంగ్రెస్ పార్టీలో చేరిక:
- తెలంగాణ ఉద్యమంలో ఎవ్వరిమీద పోరాటాలు చేశారో మళ్ళీ వారినే సీఎం కేసీఆర్ పార్టీలోకి తీసుకొని పదవులు కట్టబెట్టడం, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం ఫెల్యూర్ కావడం, స్థానిక నాయకుల అరాచకాలు, అక్రమంగా కేసులు పెట్టడం మొదలగు కారణాలతో సతీష్ TRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో 2018లో చేరారు.
- కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి నిత్యం ఆ పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ, AICC, PCC, DCC ఇచ్చే ప్రతి కార్యక్రమను విజయవంతం చేసేందుకు, డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు విశేష కృషి చేస్తున్నారు.
ఎంపీటీసీగా భారీ మెజారిటీతో గెలుపు:
- గ్రామంలో 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేందుకు యువకులను, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేసాడు.
- ఈక్రమంలోనే అధికార TRS పార్టీ నాయకులు ఘర్షణ వాతావరణం సృష్టించి సతీష్ పై పదిమందికి పైగా దాడి చేశారు.
- ఈక్రమంలో సతీష్ కు తీవ్రగాయలై తలకు 12 కుట్లు పడ్డాయి. దాడి చేసింది అధికార పార్టీ MLA అనుచరులు కావడం, మరియు అధికార TRS పార్టీని వీడిచి కాంగ్రెస్ పార్టీలో చేరడనే ఆగ్రహంతో సతీష్ మీదనే అక్రమంగా రౌడీ షీటర్ కేసును సైతం నమోదు చేయించి అరెస్టు చేయించి తొర్రూర్ లో విధులు నిర్వహిస్తున్న సిఐ.చేరాలు దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో సతీష్ పై అకారణంగా, దౌర్జన్యంగా వందకు పైగా లాఠీ దెబ్బలు కొట్టడం జరిగింది.
- ఈకేసు వల్ల 23రోజులపాటు ఫిబ్రవరి 2019లో మహబూబాబాద్ జిల్లా జైల్లో జైలుజీవితం గడిపారు.
విద్యార్థి నాయకత్వ లక్షణాలు, ఉద్యమ నాయకత్వ పోరాటాలు పదియేండ్లకు పైగా అనుభవం ఉండటంతో తన భవిష్యత్ రాజకీయలతోనే ప్రయాణం అని నిర్ణయించుకొని, ఒక ప్రణాళికాబద్ధంగా రాజకీయంగా అడుగులు వెయ్యాలని జైలు గదిల్లోనే నిర్ణయించుకున్నారు. - 2019 మే నెలలో ఎంపీటీసీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా గ్రామ యువత సహకారం,మద్దతుతో ఎంపీటీసీగా నామినేషన్ వేశారు.ఈక్రమంలోనే అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన లక్ష్యం కోసం వెనకడుగు వేయలేదు. ప్రచారంకు వచ్చే గ్రామ యువతను, నిఖార్సయిన కాంగ్రెస్ వాదులను సైతం అధికార పార్టీ నాయకులు బెదిరించి, సహకారం అందించకుండా కట్టడి చేశారు. ఆఖరికి సతీష్ కు డబ్బు ఆశ చూపి నామినేషన్ ఉపసంహరించుకోమని ఒత్తిడి చేశారు. అయిన అవేమి పట్టించుకోకుండా అనుకున్న లక్ష్యం కోసం ముందుకు సాగిపోయి, అధికార TRS పార్టీకి చెందిన అభ్యర్ధిపై 351ఓట్ల భారీ మెజార్టీతో సతీష్ గెలుపొందాడు.. ప్రజల్ని, యువకుల్ని బెదిరింపులకు గురి చేసి సహకారం అందించకుండా చేసారేమోగాని, ఒక విద్యావంతుడు, సౌమ్యుడు, ఉద్యమాకారుడు అయిన సతీష్ పై ప్రజలు, యువకులు పెట్టుకున్న ఆశను, గెలుపించాలి అనే కసిని మాత్రం అధికారపార్టీ వారు కట్టడి చేయలేకపోయారు.
ఎంపీటీసీల ఫోరమ్ రాష్ట్రకార్యదర్శిగా ఎన్నిక:
- రాష్ట్రస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల పక్షాన, వారి సమస్యలపై పోరాటం చేసే పంచాయితీరాజ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సతీష్ అనేక సభలు సమావేశాలకు ఎంపీటీసీ హోదాలో పాల్గొని, ఎంపీటీసీలకు రావాల్సిన నిధులు, విధులు గురించి అనర్గళంగా మాట్లాడాడు. ఈక్రమంలోనే రాష్ట్ర చైర్మన్ చింపుల సత్యనారాయణ, ఎంపీటీసీ సతీష్ గారి సేవలను రాష్ట్రస్థాయిలో వినియోగించుకోవాలని భావించి సతీష్ ను ఎంపీటీసీల ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసారు.
- ఆ తరువాత మంత్రులు కేటిఆర్, హరీష్ రావు, MLC కవితలను పార్టీలకు అతీతంగా రాష్ట్రస్థాయి నాయకులతో కలిసి ఎంపీటీసీల సమస్యలు, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల, విధుల గురించి వివరించి వినతిపత్రాలు ఇచ్చి, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ప్రముఖపాత్ర పోషించారు.
హైదరాబాద్ వేదికగా ఎంపీటీసీల సమస్యల పరిష్కారానికై ఎన్నో ధర్నాల్లో,నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు
సేవా కార్యక్రమాలు:
- సతీష్ ఎంపీటీసీ గాకముందే సేవాలక్షణాలు ఉన్న వ్యక్తి.
ఎంపీటీసీగా గెలిచిన అనంతరం 2019 నుండి నేటికి తన గ్రామంలో ఎవరైనా పేదవారు మరణిస్తే వారి కుటుంబానికి 50కేజీల బియ్యం, కొంత నగదును ఆర్ధికంగా సాయం చేస్తూ వారి కష్టాల్లో పలుపంచుకోవడం సతీష్ ప్రత్యేకత. - కరోనా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క గ్రామస్థుడికి పండ్లు, కూరగాయలు, సానిటైజర్స్ మాస్కులను పంపిణీ చేసాడు.
- మహమ్మారి కరోనా నుండి రక్షణ పొందేందుకు ప్రత్యేక క్వాలిటితో దాదాపు 2000మాస్కులు తన ఫోటోతో ముద్ర వేయించి గ్రామస్థులకు పంపిణీ చేశారు.
- గ్రామంలో దాదాపు 200మందికి పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు అందించారు.
- గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమందిని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ, ఆర్థికసాయం మరియు పండ్ల, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
- వైద్యపరంగా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారికి డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ రాంచంద్రునాయక్ గారిచే ఉచితంగా వైద్యం చేయించారు.
- అధికారపార్టీలో లేనప్పటికీ సతీష్ ప్రత్యేక చొరవ, కృషితో ఎంతోమంది అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు అందించారు.
ప్రతి సంవత్సరం తన వివాహ దినోత్సవం రోజున పెద్దముప్పారం గ్రామంలోని అమ్మఒడి వృద్ధుల అనాధ ఆశ్రమం కు తప్పకుండా బియ్యం, నూనె, పండ్లు పంపిణీ చేయడం అలవాటు.
ప్రశంస పత్రాలు- అవార్డులు:
- కరోనా బారినపడిన వారికి మనోధైర్యం కల్పించి, వారికి అందించిన సేవలకుగాను జైబీమ్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ అవార్డ్-2021.
- ప్రజాప్రతినిధిగా అందిస్తున్న సేవలకుగాను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రణవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా అవార్డు-2021 ను అందుకున్నారు.
సతీష్ మాటల్లో నాయకత్వం అంటే… Leadership is service-not position
( నాయకత్వమనేది హోదా, పదవికి సంబంధించినది కాదు — ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన, సేవా చేయాలనే సంకల్పంను కలిగిఉండటం ).
సతీష్ లోని కోణాలు ఒక్కసారి గమనిస్తే…
విద్యార్థి నాయకత్వ లక్షణాలు,
ఉద్యమాకారుడి నాయకత్వ లక్షణాలు,
రాజకీయ నాయకత్వ లక్షణాలు,
సమాజ సేవకుడి లక్షణాలు ఈకోణాలు సుస్పష్టంగా కనిపిస్తాయి.
ఇంటి నెంబర్ : 2-21/A, గ్రామం: దాట్ల, మండలం: దంతాలపల్లి, జిల్లా: మహబూబాబాద్, అసెంబ్లీ: డోర్నకల్, రాష్ట్రం: తెలంగాణ, పిన్‌కోడ్: 506324
Email: [email protected]
Mobile:8919808716,9959825351
Party Activities
Recent Activities
I am A supporter of good people irrespective of any better political party, who is willing to perform best for
society.
Welfare Activities
Social Activities
Kommineni Satish with Politicians
ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎన్నికల్లో MLC గా గెలిచిన కల్వకుంట్ల కవిత గారిని కోరుతున్న ఎంపీటీసీల రాష్ట్ర కార్యదర్శి కొమ్మినేని సతీష్ గారు
సీతక్క గారి జన్మదినం సందర్బంగా, పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎంపీటీసీ కొమ్మినేని సతీష్ గారు..
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఎంపీటీసీ కొమ్మినేని సతీష్ గారు..
Party Activities
Social Activities
TRSV Activities
News Paper Clippings
Born in Datla
Finished School
at ZP High School, Datla
Studied Intermediate
from the Sairam Junior College, Danthalapally
Joined TRSV
Mandal President
of Narsimulapet
Attained Graduation
from Samatha Degree College, Thorrur
Obtained Post Graduation
from KU, Warangal
District General Secretary
of TRSV
Completed LLB
from Osmania University, Hyderabad
BC Yuvajana Sangam State Youth Vice-President
Munnuru Kapu Student Vibhagam District President
of Mahabubabad
District President
of TRSV, Mahabubabad
Vidyarthi JAC State Convenor
Joined INC
Party Activist
MPTC
MPTC's Forum State Secretary
Zilla DCC Member
of Mahabubabad
Youth Congress District General Secretary
of Mahabubabad