జూకంటి ప్రవీణ్ కుమార్
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ
బాల్యం- విద్యాభ్యాసం
జూకంటి ప్రవీణ్ కుమార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు తాలూకా పరిధిలో రాజపేట మండలం పారుపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. వారి ముత్తాత సంఘం (జూకంటి) బీరప్ప వామపక్ష ఉద్యమ నాయకుడు కావడంతో ప్రవీణ్ కుమార్ నాయకత్వ లక్షణాలు ప్రాథమిక దశలోని పుష్కలంగా అలవర్చుకున్నారు.వీరి ప్రాథమిక విద్య స్వగ్రామమైన పారుపల్లిలో 1991-98 మధ్యకాలంలో, 8వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో చదువుతూ స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఉంటూ హాస్టల్లో నెలకొన్న విద్యార్థుల సమస్యలపై అధికారులను ఆనాడే నిలదీసే వాడు. 9,10 తరగతులు సమీప గ్రామమైన బొందుగుల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాడు. 2002 సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యను తాలూకా కేంద్రమైన ఆలేరులోని శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి జూనియర్ కళాశాలలో బైపీసీ కోర్సు పూర్తి చేశాడు.
విశ్వవిద్యాలయ విద్య కోసం హైదరాబాద్ పయనం
హైదరాబాదులోని అంబర్ పేట బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో ఉంటూ డిగ్రీ కళాశాలకు వెళుతూ విద్యారంగ సమస్యలపై పోరాటాల నిర్మాణం చేశాడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఫూలే, అంబేద్కర్ భావజాలానికి ఆకర్షితుడై బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల స్కాలర్ షిప్ ల కోసం, ఫీజురీయంబర్స్ మెంటు కోసం, రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు కొనసాగిస్తూ బ్యాచిలర్ డిగ్రీ, డీ.ఎడ్ మరియు ఎం.ఎ, బి.ఎడ్ పూర్తి చేశాడు. ప్రవీణ్ కుమార్ 2003 సంవత్సరంలో బిసి విద్యార్థి సంఘంలో చేరి విద్యార్థినాయకుడిగా చురుకైన పాత్ర పోషించడంతో బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య గారు బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శిగా నియమించడం జరిగింది.2004 నుంచి 2005 వరకు బీసీ హాస్టల్ విద్యార్థుల ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా పని పనిచేస్తూ బీసీ విద్యార్ధుల మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ సుమారు రెండు వేల మంది విద్యార్థులతో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి కొనిజేటి రోశయ్య ఇంటిని ముట్టడించిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.2006లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులై విశ్వవిద్యాలయాల్లోని పరిశోధక బీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఫెలోషిప్ లు విడుదల చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పెరిగిన ధరల ప్రకారం బీసీ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, స్కాలర్షిప్ లు పెంచాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు మంజూరు చేయాలని ఆందోళనలు చేపట్టారు.
తెలుగు నాడు విద్యార్థి సంఘం రాష్ట్ర నేతగా
2007వ సంవత్సరంలో ఆయన తెలుగుదేశం పార్టీలో సభ్యునిగా చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. విద్యార్థి సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, హాస్టల్ విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రవీణ్ కుమార్ చేస్తున్న విద్యార్థి పోరాట పటిమను గుర్తించి మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నర్సింహులు గారిసూచనల మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు 2007 సంవత్సరంలోతెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య (టి.ఎన్.ఎస్.ఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగానియమించారు.టిఎన్ఎస్ఎఫ్ నేతగా విద్యారంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాల నిర్మాణం చేశారు.ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాల నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని, గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేయాలని, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, విశ్వ విద్యాలయంలో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, 98 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది.
బీసీ ప్రజా వేదిక స్థాపన
2008 సంవత్సరంలో బీసీ ప్రజా వేదికను అనే సామాజిక ఉద్యమ సంస్థను ఏర్పాటుచేసి, బీసీ సమస్యల పట్ల నిరంతరం గలం విప్పుతూ, బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో సమానమైన వాటా కోసం అలుపెరుగని పోరాటాలు చేశారు. బీసీ రిజర్వేషన్ వర్గాలకు అన్యాయాన్ని తలపెట్టే 496 జీ.వో రద్దు చేసి క్రిమిలేయర్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్నారు.జరిగింది.సంక్షోభంలో నెట్టి వేయబడ్డ సంక్షేమ హాస్టల్లను సంస్కరించాలని వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించడం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేతగా ప్రవీణ్ కుమార్ 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించాడు. తెలంగాణ ఏర్పాటు కోసం రైల్ రోకో లు, రాస్తారోకోలు, నిర్వహిస్తూ, నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, ఉద్యమంపై ఇతరులకు అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మిలియన్ మార్చ్, బైక్ ర్యాలీలు, ధర్నాలతో శాంతియుత నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
2010లో తెలంగాణ బహుజన విద్యార్థి ఫ్రంట్ ఏర్పాటు
2010 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పూలే, అంబేడ్కర్ ఆలోచనలతో సామాజిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ బహుజన విద్యార్థి ఫ్రంట్ అనే విద్యార్థి సంస్థను ఏర్పాటుచేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంతంలోని, విద్యార్థులను, నిరుద్యోగులను, మేధావులను, సబ్బండ వర్గాలను, సమీకరించి అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం కూడా అంతే ముఖ్యమని సభల ద్వారా సమావేశాల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచారు. ఈ ప్రాంత విద్యార్థుల పట్ల సీమాంధ్ర పెట్టుబడిదారి పాలకులు అనుసరిస్తున్న విధానాలపై రాజీలేని పోరాటాన్ని కొనసాగించడంలో విశేషంగా కృషి చేశారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతగా
వెనుకబడిన వర్గాల అభివృద్దే ధ్యేయంగా ఎంచుకొని దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైగా ఉన్న బీసీలకు సమస్త రంగాల్లో న్యాయమైన వాటా దక్కాలని ప్రవీణ్ కుమార్ చేస్తున్న పోరాటాలను, బీసీ సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని గుర్తించి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బీసీల హక్కులకు ఎక్కడ భంగం కలిగినా బీసీల వానిని, బాణిని వినిపించడా నికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఉన్నత చదువులు చదువుకొని సమాజంలోని అంతరాలు పోవాలని, సమ సమాజం రావాలని, మనిషిని మనిషి గుర్తించే సమ సమాజం కోసం పరితపించే వాళ్లలో జూకంటి ప్రవీణ్ కుమార్ చేస్తున్న కృషి అమోఘమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి 2023 వరకు కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న బీసీ వ్యతిరేక చర్యల పట్ల, విద్యార్థి వ్యతిరేక చర్యల పట్ల, నిరుద్యోగ సమస్యల పట్ల, ప్రభుత్వం అనుసరించే తీరును ఎండగట్టడంలో క్రియాశీలక పాత్ర వహించాడు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (బీసీ) అభ్యర్థికి మద్దతు
2018 సార్వత్రిక ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిగా బూడిద బిక్షమయ్య గౌడ్ అవకాశం రావడంతో నియోజకవర్గంలో బిసి కుల సంఘాలను సమీకరించి రాజపేట కేంద్రంగా సుమారుగా 2000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించడం జరిగింది.
2023 -సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (బిసి) అభ్యర్థి బీర్ల ఐలన్నకు మద్దతు
2023 శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన 55 మంది జాబితాలో ఆలేరు నియోజకవర్గం నుండి బీసీ అభ్యర్థి బీర్ల ఐలయ్యకు చోటు కల్పించడం పట్ల మొట్టమొదట హర్షం వ్యక్తం చేసి కుల సంఘాలను, బీసీ సంఘాలను, దళిత బహుజన సంఘాలను, సమీకరిస్తూ, ఎన్నికల ప్రచారంలో సైతం ఐలన్న వెంట నడుస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాలు తిరుగుతూ, గత పాలకులు సాగించిన ఆగడాలను, వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ ఐలన్న గెలుపు కోసం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతగా జూకంటి ప్రవీణ్ కుమార్ అనేక ప్రచార ప్రచార సభల్లో తన గొంతును వినిపించారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి గెలిచిన ఏకైక బీసీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ హైదరాబాద్ కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి జేఏసీ నాయకులతో, వివిధ కుల సంఘాల, బీసీ సంఘాల తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జూకంటి ప్రవీణ్ కుమార్ చేపట్టిన ఆందోళనలు
- తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని, ఉద్యోగ భద్రత వస్తుందని, సామాజిక న్యాయం జరుగుతుందని, రైతు రాజ్యం వస్తుందని కలగన్న తెలంగాణ ప్రాంత వాసుల ఆశలను కేసీఆర్ ప్రభుత్వం అడి ఆశలు చేసింది. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన ప్రతి ఆందోళనలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత జూకంటి ప్రవీణ్ కుమార్ ఆయా సంఘాలకు మద్దతిస్తూ అండగా నిలబడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని అనేక ఆందోళన లు చేపట్టడం, రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ కు లేఖలు పంపి రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా నిలబడడం జరిగింది.
- తెలంగాణ పోరాట యోధులు దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి మహనీయుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలు చేర్చి వారి జయంతులను వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, హైదరాబాద్ కేంద్రంగా వారి విగ్రహాలను, స్మారక కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని జిల్లాలకు ఆ మహనీయుల పేర్లు నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది.
- యాదాద్రి జిల్లాలోని రగణాధపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని 12 గ్రామాలు ప్రజలు 400 రోజులు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పక్షాన పూర్తిస్థాయి మద్దతు తెలిపి మండల సాధన ఉద్యమానికి అండగా ఉండడం జరిగింది.
- ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీలతో చేస్తున్న ఆందోళనలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పక్షాన రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది.
- తమ న్యాయమైన డిమాండ్ లు పరిష్కరించాలని అంగన్వాడి టీచర్లు మరియు వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు, వీఆర్డీలు, మిషన్ భగీరథ కార్మికులు, విద్యుత్ కార్మికులు చేపట్టిన ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వాలను స్తంభింపజేసిన సంఘటనలు.
- గంధమల్ల ప్రాజెక్టు పనులు చేపట్టి ఆలేరు ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలని ఆందోళన చేపట్టడం జరిగింది.
- కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ పదవిని గొల్ల కురుమల కేటాయించాలని డిమాండ్ చేస్తూ, గొల్ల, కురుమ సంఘాలతో, బీసీ సంఘాలతో కొమరవెల్లిలో సభ నిర్వహించి తమ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
- అర్హులైన పేదలందరికీ ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని ఆందోళన చేపట్టి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి
తీసుకురావడం జరిగింది. - ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అర్హత మార్కులను 40 గా నిర్ణయించాలని గత ప్రభుత్వంపై ఆందోళన చేపట్టి విజయం సాధించడం జరిగింది.
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వీర బైరాన్ పల్లి అమరవీరుల చరిత్రను పాఠ్యాంశాలు చేర్చి, అమరవీరుల కుటుంబాలకు స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ మంజూరు చేయాలని ఆందోళన చేపట్టడం జరిగింది.
- భారీ వర్షాల వల్ల రాజాపేట మండల పరిధిలోని కుర్రారం చెరువు, పారుపల్లి వాగు కృంగి నష్టం వాటిల్లెప్రమాదం ఉందని వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. > యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపి గత ప్రభుత్వ ధమనకాండను ప్రశ్నించడం జరిగింది.
- రాజపేట మండలం నెమిల మధుర గ్రామం అయిన పిట్టలగూడెం కు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
- కరోనా కష్టకాలంలో రైతు వేదిక భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వాడుకోవాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
- యాసంగిలో పండించిన పంట వర్షాభావం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మగ్గిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటను వేగవంతం చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని ఆందోళన చేపట్టడం జరిగింది.
- భూములకు ఆధారమైన భూ రికార్డులు రెవెన్యూ కార్యాలయాల్లో శిథిలావస్థలకు చేరడంతో వాటిని స్కానింగ్ చేసి భద్రపరిచి వాటిని భావితరాలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
- గత ప్రభుత్వం బీసీ విద్యార్థి, యువజన సంక్షేమం పట్ల అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ పాలమూరు నుండి పట్నం వరకు బీసీ విద్యార్థి, యువజనుల పోరుయాత్ర నిర్వహించి హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున ముగింపు సభ నిర్వహించడం జరిగింది.
- బీసీలకు బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుని నిరసిస్తూ అనేక ధర్నాలు, రాస్తారోకోలు, చేపట్టడం జరిగింది.
- కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది.
- ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన చేపట్టిన ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం నేతగా పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం జరిగింది.
- వికలాంగుల హక్కుల సాధన కోసం జరిగిన పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం నేతగా పూర్తిస్థాయిలో సహకరించడం జరిగింది.
- రాజస్థాన్ రాష్ట్రంలోని దళిత విద్యార్థి ఇందిరా మెగాలాల్ పై దాడి చేసి అతని మృతికి కారకులను శిక్షించాలని, ఇటీవల కలకత్తా నగరంలో మేడికో విద్యార్ధిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలని బీసీ సంఘాల, ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించడం జరిగింది.
- కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని అనేక రకాల ఆందోళనలు నిర్వహించడం జరిగింది.
- రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ముసాయిదా చట్టం-2024 పై అభిప్రా సేకరణ అవకాశం కల్పించడంతో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతగా పలు సూచనలు చేస్తూ సీసీఎల్ఎ కమిషనర్ కు లేఖ రాయడం జరిగింది.అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హనుమంతు జెండగే నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు బీసీ సంఘం ఆధ్వర్యంలో హాజరై రెవిన్యూ సమస్యలపై పలు సూచనలు చేస్తూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.
- బిసి కుల సంఘాలను చైతన్య పరుస్తూ కుల సంఘాల కమిటీలను ఏర్పాటు చేస్తూ బీసీ వర్గాల్లో ఓటు చైతన్యం తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగింది.
- బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ 42 శాతానికి పెంచాలని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు ఉదృతం చేయడం జరిగింది.
- విద్యార్థుల్లో విద్యార్థినేతగా ఉద్యమ ప్రస్తానాన్ని ప్రారంభించి నిరుద్యోగుల్లో నిరుద్యోగిగా,ఉద్యోగస్తులో ఉద్యోగిగా, కార్మికుల్లో కార్మికునిగా, రైతాంగంలో రైతుగా సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటాలు కొనసాగిస్తూ, సామాజిక న్యాయ సాధన కోసం పూలే, అంబేడ్కర్ మార్గమే శరణ్యమని నమ్మి ముందుకు సాగుతున్నాడు.
H.No: 2-41, Village: Parupally, Mandal: Rajapet, District: Yadadri-Bhuvanagiri, Constituency: Alair, Parliament: Bhuvanagiri, State: Telangana, Pincode: 508105.
Email: [email protected]
Mobile: 9000225010
Recent Activities
Involvement in various Activities
ఆలేరు ఎమ్మెల్యే గౌ. శ్రీ బీర్ల ఐలయ్య గారికి మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించాలని ఓయు లో కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు, టీ ఎస్ జేఏసీ, ఓయు జేఏసీ నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సందర్భం
బీర్ల ఫౌండేషన్ చైర్మన్ గౌ. శ్రీ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో రాజాపేట మండలంలో క్యాన్ల పంపిణి కార్యక్రమంలో మాట్లాడుతున్న బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
రాజపేటలో నిర్వహించిన గౌ. శ్రీ బీర్ల ఐలయ్య గారి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న సందర్భం
2023 సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునాథపురం గ్రామంలో DR. బీ.ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూల మల వేసి నివాళ్లు అర్పించిన సందర్బంగా గౌ. శ్రీ బీర్ల ఐలయ్య గారితో బీసీ సంఘం నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2023 సంవత్సరంలో జ్యోతిరావు పూలె 197వ జయంతి సందర్బంగా భువనగిరి పట్టణ కేంద్రంలో పూలె విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించిన పూలె ఉత్సవ కమిటీ రాష్ట్ర కో ఆర్డీనేటర్ జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2007 సంవత్సరంలో విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఓయులో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న విద్యార్థి సంఘ నేతలు ఈడిగ ఆంజనేయ గౌడ్, జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
రాజాపేట మండల పరిధిలోని నెమిల మధిర గ్రామమైన పిట్టలగూడెంకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారికి వినతి పత్రం అందచేస్తున్న బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు, ఉద్యమ సహచరుడు గౌ. శ్రీ కే. కిషోర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
ఆరుట్ల ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న బిసి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
బీసీ విద్యార్థి యువజన పోరుయాత్ర భువనగిరికి చేరిన సందర్భంగా భువనగిరిలో జరిగిన విద్యార్థి గర్జనలో మాట్లాడుతున్న జూకంటి ప్రవీణ్ కుమార్
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన శిబిరానికి మద్దతు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్
2011 సంవత్సరంలో నూతనంగా నిర్వహించిన టెట్ పరీక్షలో 50 శాతం నిరుద్యోగులు అర్హత సాదించలేకపోవడంతో నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టెట్ పరీక్షను మళ్ళీ నిర్వయించిన తర్వాతనే డీఎస్సీ నిర్వయించాలని కోరుతు అప్పటి ముఖ్యమంత్రి గౌ. శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిండి
2005 సంవత్సరం సైదాబాదులోని సంఘం లక్ష్మీబాయి విద్యాపీఠంలోని ఆస్తులని పరిరక్షించి విద్యాపీఠంలోని దళిత బాలికలకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ దశలవారీగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో విద్యార్ధి నేతగా పాల్గొన్న జూకంటి ప్రవీణ్ కుమార్
2009 సంవత్సరంలో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బీసీలకు 50 శాతం టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత గౌ. శ్రీ
నారా చంద్రబాబు నాయుడుని కలిసిన జూకంటి ప్రవీణ్ కుమార్
2012 సంవత్సరంలో బీసీల అభివృధికి తగిన నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ. శ్రీ
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బీసీ నేత ఆర్. కృష్ణయ్య గారితో కలిసి వినతి పత్రం అందచేసిన విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
బీసీ సమస్యలు పరిష్కరించాలని తెదేపా పార్లమెంట్ సభ్యుడు గౌ. శ్రీ లాల్ జాన్ బాషా గారిని ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో కలిసిన విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2007 సంవత్సరంలో బీసీల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి గౌ. శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసిన బీసీ విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2008 సంవత్సరంలో ఏపిపిఎస్సీ అక్రమాలపై తెలుగు దేశం పార్టీ స్పదించాలని కోరుతూ ప్రతిపక్ష నేత గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి వినతి పత్రం అందచేసిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2009 సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత, కేంద్ర మంత్రి గౌ. శ్రీ అజిత్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ సంఘాల నేతలతో జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యక వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ హైద్రాబాదులోని ఇంద్ర పార్క్ వద్ద చేపట్టిన బీసీ మహిళా సదస్సు పాల్గొన్న సందర్భం
2008 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధినేత గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ మంత్రి గౌ. శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారితో మర్యాదపూర్వకంగా కలిసిన TNSF రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్
గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళ్లు అర్పించడానికి వెళ్తున్న మాజీ మంత్రి గౌ. శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారితో పాల్గొన్న సందర్భం
ఆలేరు ఎమ్మెల్యే గౌ. శ్రీ బీర్ల ఐలయ్య గారికి ఉప్పల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం సందర్బంగా ఓయు జేఏసీ నాయకులతో కలిసి పుష్ప గుచ్చము అందచేస్తున్న బీసీ సంఘం నేత జూకంటి ప్రవీణ్ కుమార్
గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటరుగా కురుమ న్యాయవాదులకు అవకాశం వచ్చిన సందర్బంగా ఉప్పల్ కురుమ సంఘంలో ఘనంగా సన్మానించిన సందర్భం
హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద వేలాదిమందితొ నిర్వహించిన బీసీ విద్యార్థి యువజనుల పోరుయాత్ర ముగింపు సభను ఉద్దేశించి మాట్లాడుతున్న జూకంటి ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించిన బీసీ విద్యార్థి యువజన పోరు యాత్ర ముగింపు సభను ఉద్దేశించి మాట్లాడుతున్న బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
రాజపేట లో జరిగిన మహనీయుల జయంతి సభను ఉద్దేశించి మాట్లాడుతున్న బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్
2006 సంవత్సరంలో సూర్యాపేటలో నిర్వయించిన బీసీ విదార్థి సంఘం సదస్సును ఉద్దశించి మాట్లాడుతున్న జూకంటి ప్రవీణ్ కుమార్
2008 సంవత్సరంలో ఎస్సి, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైద్రాబాదులోని ధర్నా చౌక్ ఇంద్ర పార్క్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2006 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గౌ. శ్రీ ఎన్. రఘువీరా రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
ఓబీసీల డిమాండ్లు పరిష్కరించాలని అప్పటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గౌ. శ్రీ సిద్ది రామయ్య గారికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందచేసిన బీసీ సంఘం నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
నిరుద్యోగ సమస్యలపై హైద్రాబాదులో ఇంద్ర పార్క్ వద్ద జరిగిన భారీ బహిరంగా సభలో పాల్గొన సందర్భం
2005 సంవత్సరంలో బీసీ డిమాండ్లమీద కేంద్ర మంత్రి గౌ.శ్రీ దాసరి నారాయణ గారిని కలిసి వినతి పత్రం అందచేయడం జరిగింది
జనాభా దామాషా ప్రకారం బీసీలకు టిక్కెట్లు కేటాయించాలని రాజపేటలో నిర్వహించిన బీసీల ఆత్మ గౌరవ సభలో మాట్లాడుతున్న బీసీ నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
రఘునాథపురం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ అఖిలపక్షాల 136 వ రోజు ఆందోళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతున్న జూకంటి ప్రవీణ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బేగంపేట గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న జూకంటి ప్రవీణ్ కుమార్
2007 సంవత్సరంలో కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీ లకు 27 శాతం రేజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాజధాని హైద్రాబాదులో బీసీ నేత ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో విద్యార్థి నేతగా పాల్గొన్న జూకంటి ప్రవీణ్ కుమార్
ఓబీసీల డిమాండ్లు పరిష్కరించాలని తమిళనాడు పార్లమెంట్ సభ్యుడికి వినతి పత్రం అందచేస్తున్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
లాలాపేటలోని లెప్రసీ కాలనీలో వీ వీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తో కలిసి లెప్రసీ వ్యాధి గురస్థులకు దుప్పట్లు పంపిణి చేస్తున్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
విద్యార్థి సమస్యలపై రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘం రాష్ట్ర నాయుడు జూకంటి ప్రవీణ్ కుమార్
2013 సంవత్సరంలో బీఈడి అభ్యర్థుల సమస్యలపై ఇంద్ర పార్క్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బీసీ నేత గౌ. శ్రీ ఆర్. కృష్ణయ్య గారితో కలిసి పాల్గొన్న విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2010 సంవత్సరంలో టీవి 1 క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొన్నతెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
జ్యోతిరావు పూలె జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కో ఆర్డినేటరుగా జూకంటి ప్రవీణ్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సందర్బంగా యాదాద్రి జిల్లా కేంద్రంలో పలు సంఘాల నాయకులు సన్మానించిన సందర్భం
ఆలేరు ఎమ్మెల్యే గౌ. శ్రీ బీర్ల ఐలయ్య గారు గెలిచిన అనంతరం ఎల్బీ స్టేడియంలో కలిసి పుష్ప గుచ్చము ఇచ్చిన బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్
మాజీ మంత్రివర్యులు గౌ. శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారి జన్మదినం సందర్బంగా కేక్ తినిపిస్తున్న బీసీ నేత జూకంటి ప్రవీణ్ గారు
2003 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థి సంఘం
నాయుడు జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా ఉత్సవ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటరుగా యాదాద్రి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారితో, మరియు భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డితో కలిసి పాల్గొన్న బీసీ నేత జూకంటి ప్రవీణ్ కుమార్
రఘునాథపురం మండల కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద 100వ రోజు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్
2005 సంవత్సరంలో నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ధర్నా చౌక్ ఇంద్ర పార్క్ వద్ద నిర్వయించిన భారీ ర్యాలీలో బీసీ నేత గౌ. శ్రీ
ఆర్ కృష్ణయ్య గారితో కలిసి పాల్గొన్న విద్యార్ధి నేత జూకంటి ప్రవీణ్ కుమార్
2004 సంవత్సరంలో బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లుకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆర్థిక మంత్రి గౌ. శ్రీ కొణిజేటి రోశయ్య గారి ఇంటిని ముట్టడించిన బీసీ విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్
2005 సంవత్సరంలో సైదాబాదులోని ఇందిరా సేవా సదన్ ట్రస్ట్ బోర్డులో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలతో కలిసి రాస్తా రోకో నిర్వహిస్తున్న విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2005 సంవత్సరంలో కురుమ మాస పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గౌ. శ్రీ
అలె నరేంద్ర గారిని కలిసిన విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2005 సంవత్సరంలో బీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మాసాబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టిన బీసీ విద్యార్థి సంఘం నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్
మహనీయుల జయంతి సందర్బంగా భువనగిరి ఆర్ డి వో భూపాల్ రెడ్డి గారితో ఎస్ సి, ఎస్ టీ, బీసీ సంఘాల నాయకులతో జరిగిన సన్నాహాక సమావేశంలో మాట్లాడుతున్న బీసీ నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
రఘునాధపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతు 6వ రోజు రిలే నిరాహారదీక్షలో B.C.సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీన్ కుమార్ గారు
2007 సంవత్సరంలో 60వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఐదు సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేయాలనీ కోరుతూ అప్పటి హోంశాఖ మంత్రి గౌ. శ్రీ కుందూరు జానా రెడ్డి గారికి బీసీ నేత ఆర్ కృష్ణయ్య గారితో కలిసి వినతి పత్రం అందచేస్తున్న అప్పటి విద్యార్ధి నేతగా జూకంటి ప్రవీణ్ కుమార్
2004 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు 50 శాతం టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు గౌ. శ్రీ కే. కేశవరావు కు ఆర్. కృష్ణయ్య గారితో కలిసి వినతి పత్రం అందచేస్తున్న జూకంటి ప్రవీణ్ కుమార్
2005 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నాయకుడు, కేంద్ర మంత్రి గౌ. శ్రీ ఆలే నరేంద్ర గారిని మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2008 సంవత్సరంలో బీసీల డిమాండ్ల పరిష్కరించాలని కోరుతు రాష్ట్ర మంత్రివర్యులు గౌ. శ్రీ చిన్నా రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందచేసిన బీసీ సంఘాల నాయకులు
బీసీ మంత్రికి సన్మానం
2005 సంవత్సరంలో జరిగిన బీసీ విద్యార్థి సంఘం సదస్సులో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌ. శ్రీ డీ శ్రీనివాస్ గారిని సన్మానించిన విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
2005 సంవత్సరంలో జరిగిన బీసీ విద్యార్థి సంఘం జంటనగరాల సదస్సులో బీసీ నేత గౌ. శ్రీ ఆర్. కృష్ణయ్య గారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఈడిగ ఆంజనేయులు గౌడ్ లతో జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
బీసీల బడ్జెట్ పెంచాలని సుందరయ్య పార్క్ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నేత జూకంటి ప్రవీణ్ కుమార్ గారు
Social Activities
Community Activities
Party Activities
News Paper Clippings
Pamphlets
Videos
Born in Parupally Village
of Rajapet Mandal in Yadadri-Bhuvanagiri District, Telangana
Studied SSC Standard
from ZPHS, Bandugula
Completed Intermediate
from SLNS Junior College at Bhuvanagiri
Received TTC Training
from Gulam Mohammed Elementary Teachers Education, Hyderabad
Joined in BC Student Association
Nalgonda Secretary
of BC Student Association
Hyderabad President
of BC Student Association
Attained Graduation
from SVS Degree College, Vidya Nagar
State Secretary
of BC Student Association
Finished Post Graduation
Hyderabad
Joined in TDP
Party Activist
of TDP
State Secretary
of Telugu Nadu Vidyardhi Samaikya, Telangana
Founder and Chairman
of BC Praja Vedika
Founder and Chairman
of Telangana Bahujan Front
State Secretary of BC Welfare Association
Completed B.Ed
from Gandhi Educational College, Hayath Nagar
State Coordinator
of Mahatma Jyotiba Phule Telangana Backward Classes Welfare Residential Educational Institutions Society