Hemaraju Naidu #separator_saJanasena | Party Leader| theLeadersPage | the Leaders Page

Hemaraju Naidu

Party Leader, Chittoor, Andhra Pradesh, Janasena

 

Chinthagumpala Hemaraju is an Indian Politician and Chittoor Assembly President from Chittoor Town of Andhra Pradesh State.

CHILDHOOD AND EDUCATION-

On April 08, 1988, Hemaraju was born to Mr. Chinthagumpala Subramanyam Naidu and Mrs. Chinthagumpala Nirmala in the village of Chittoor Town in the Indian state of Andhra Pradesh.

In the year 2002, Hemaraju obtained his Secondary Board of Education from King’s English Medium School, placed at Chittoor, and in 2004, he completed his Intermediate course at Narayana Junior College in Chittoor.

Later in the year 2008, Hemaraju attained a graduation with a degree (Nursing) from Narayana Degree College at Nellore in Andhra Pradesh.

OCCUPATIONAL LIFE-

Hemaraju began his professional career as a Nurse, in Ashwini Hospital while also financially taking care of his family.

A JOURNEY IN POLITICS-

In the year 2020, Hemaraju joined the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

He exposed his leadership skills by serving as a Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of TDP, Hemaraju expressed a keen interest and performed every activity for the recognition of the respective party.

In recognition of his continued service in the year 2020, the party not only promoted him to the position of Telugu Youth Vice President from TDP of Chittoor Town but also increased his responsibilities to discharge his duties.

From the party’s inception to the current day, he has worked conscientiously for the prosperity of the people, persistently aiming for the party’s and society’s growth and rendering desperate service to society and the common good of the people.

Participation & Involvement in BCYP

Hemaraju Naidu #separator_saJanasena | Party Leader| theLeadersPage | the Leaders Page

In the Presence of Mr. Bode Ramachandra Yadav, the esteemed President of the Bharat Chaitanya Yuvajana Party, Chinthagumpala Hemaraju took a significant step in his political journey by joining the Bharat Chaitanya Yuvajana Party (BCYP).

As a BCYP member, Chinthagumpala Hemaraju has consistently demonstrated commitment to the party’s objectives and aspirations. Subsequently, he was promoted to the illustrious position of Chittoor Assembly President from Andhra Pradesh within the BCYP. In this capacity, he advocated conscientiously for inclusive and efficient population growth.

Social Activities –

  • Hemaraju continues to struggle for the abolition of the concept of caste and religious distinctions in society, as well as for human equality in all aspects of his life.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Every year, Hemaraju visits orphan homes as it marks the birth anniversary of Former Chief Minister Nara Chandra Babu Naidu and Nara Lokesh (Member of Andhra Pradesh Legislative Council), and he delivers meals, fruits, and many more essential requirements for the orphans.
  • Hemaraju conducted Village development activities in the village like laying of CC Roads, Digging of Bore wells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problem issues.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • During the wedding, money was given to the families of the underprivileged in order to help them financially sustain their families.
  • Hemaraju is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.

Services Rendered during the Pandemic:

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to the teachers affected by the lockdown. Hemaraju distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, and financially supported for them.
  • Hemaraju sneaked away to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need to take precautionary steps to eliminate the Corona epidemic.

HNO: 28-1195, New Balaji Colony, Village: Chittoor Town, Constituency: Chittoor, State: Andhra Pradesh, Pincode: 517001

Email: [email protected] 

Mobile: 9550792273 

Biodata of Mr. Chinthagumpala Hemaraju

Hemaraju Naidu #separator_saJanasena | Party Leader| theLeadersPage | the Leaders Page

Name: Chinthagumpala Hemaraju

DOB: April 08, 1988

Father: Mr. Chinthagumpala Subramanyam Naidu

Mother: Mrs. Chinthagumpala Nirmala

Present Designation: Chittoor Assembly President

Education Qualification: Graduation

Profession: Nurse

Permanent Address: Chittoor Town, Chittoor, Andhra Pradesh.

Contact No: 9550792273

“Be willing to make decisions. That’s the most important quality in a good leader.”

Recent Activities

శ్రీ రామ నవమి సందర్భంగా

కలిసిన సందర్భంలో

చిత్తూరు టౌన్ జనసేన పార్టీ నాయకుడిగా సి. హేమ రాజు నాయుడు గారు రావూరి ఈశ్వరరావు గారిని వారి స్వగృహంకి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ పార్టీ  గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ గారిని. మన 34వ డివిజన్ కన్నయ్య నాయుడు కాలనీవాసులు గెలిపించుకునే బాధ్యత ఎంతైనా మనపై ఉందని. వారి అందరికీ టిడిపి కరపత్రాలను . ఇంటింటికి వెళ్లి ఇచ్చి వివరించడం జరిగింది. వారందరూ నాకు ఒకే మాట చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని గురజాల జగన్మోహన్ గారిని గెలిపించుకుంటామని వారు నాకు చెప్పడం చాలా సంతోషం వేసింది. అదేవిధంగా నేను వారందరికీ నన్ను చిన్నప్పటినుంచి చూస్తున్నారు. నా కుటుంబం పై వాళ్లకున్న నమ్మకంతో మరొక్కసారి నా మిత్రుని గెలిపించే బాధ్యత మాది అని నాకు చెప్పడం జరిగింది. జై టిడిపి జై జనసేన మీ సి. హేమ రాజు నాయుడు

గుంటూరు నాయుడు గారి ఆహ్వానం మేరకు వారి కుమారుడు ఫంక్షన్ కి జనసేన పార్టీ నాయకుడిగా సి. హేమ రాజు నాయుడు మరియు నా మిత్రులతో వారి స్వగ్రామానికి వెళ్లి మా అన్న బిడ్డని ఆశీర్వదించడం జరిగింది

నేచురల్ లవర్స్ అసోసియేషన్ మురళి గారి ఆధ్వర్యంలో నీరు వృధా చేయకూడదు చెట్లు పెంచాలంటూ ప్రజలందరికీ విన్నపం చేస్తూ ప్రతినిధులతోపాటు హెమరాజు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది

 జనసేన పార్టీ తరఫునుండి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులు గారు ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు టౌన్ జనసేన పార్టీ నాయకుడిగా సి. హేమ రాజు నాయుడు లక్ష్మీ నగర్ కాలనీలో తన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జై జనసేన జై టిడిపి

టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో 34 వ వార్డు ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా జనసేన నాయకుడిగా సి. హేమ రాజు నాయుడు నా చేతుల మీదగా వాళ్లకి ఇవ్వడం జరిగింది. 34 వ వార్డు ముస్లిం సోదరీమణులు తరపు నుండి నా మిత్రుడికి జి జే యం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను . జై జనసేన జై టిడిపి

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు టౌన్ మార్కెట్ చౌక్ నందు భావన నిర్మాణ కార్మికులకు నిరుపేదలకు అల్పాహారం పెట్టడం జరిగింది . టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారు అదే విధంగా జనసేన పార్టీ నాయకులు దయారాం గారు, జనసేన యువ నాయకులు యశ్వంత్, హేమరాజు నాయుడు, రూపేష్, మరి కొంతమంది జనసేన వీర మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జై జనసేన జై టిడిపి

కింగ్ స్కూల్ గురువు గారు ఎస్ ఎస్ కే రాజా గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. ఆయన ఆల్ ద బెస్ట్ అని చెప్పడం చాలా సంతోషం కలిగింది. మీ జనసేన నాయకుడు సి. హేమ రాజు నాయుడు

ఎన్నికల ప్రచారం

34వ వార్డులో jsp క్యాంపింగ్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీజేఎం గారికి ఓటు వేసి గెలిపించమని ప్రచారం చేయడం జరిగింది

ఎన్నికల ప్రచారం

34 డివిజన్ కన్నయ్య నాయుడు కాలనీలో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయబడినది.మన చిత్తూరు జిల్లా ఉమ్మడి ఎంఎల్ఏ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారిని గెలిపించుకోవాలని . ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. 34 వ డివిజన్ జనసేన నాయకుడిగా సి. హేమ రాజు నాయుడు జై టిడిపి జై జనసేన

6వ డివిజన్ చెందిన టిడిపి నాయకులు బాబు బాయ్ అన్న నా ఇంటి దగ్గర జనసేన ఆఫీసుకు వచ్చారు. కూతురు వివాహానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా బాబు బాయ్ తో కలిసి గౌస్ బాషా అన్న, గౌస్ రావడం జరిగింది. వారు తొలిసారి నా జనసేన ఆఫీస్ కి రావడంతో వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. సి.హేమ రాజు నాయుడు

చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సి ఆర్ రాజన్న గారిని చిత్తూరు టౌన్ టిడిపి పార్టీ ఆఫీసులో కలవడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకుడిగా సి. హేమ రాజు నాయుడు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వివాహ మహోత్సవం

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు టౌన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కేక్ కట్ చేసి అదేవిధంగా నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అందరూ రావడం జరిగింది .

చిత్తూరు జిల్లా యాదమరి మండలం జనసేన అధ్యక్షులు కుమార్ గారు పిలుపు మేరకు రిచ్చుపల్లి గ్రామంలో అమ్మవారికి కుంభాభిషేకంచేయడం జరిగింది . చిత్తూరు టౌన్ జనసేన నాయకులందరినీ గుడికి ఆహ్వానించడం జరిగింది .

 తిరుపతి జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాస్ గారిని తన ఇంటి వద్ద కలవడం జరిగింది. అలాగే తిరుపతి జిల్లాలో కపిల్ తీర్థం నుండి జీవకోన ప్రాంతం వరకు జనసేన ర్యాలీలో చిత్తూరు టౌన్ జనసేన నాయకుడిగా సి. హేమ రాజు నాయుడు . అలాగే జనసేన నాయకులు రెడ్డి గుంట కిషోర్ అన్న, వెంకటేష్ అన్న, యశ్వంత్, బాలకృష్ణ మరి కొంతమంది జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. జై జనసేన జై టిడిపి

BCYP Party Activities

నిరసన

భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ అన్నగారు పిలుపుమేరకు చిత్తూరు టౌన్ నందు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెనుమూరు మండలం ఉగ్రంపల్లి పోస్ట్ తానా వేణుగోపాలపురం ఊరులో నివసిస్తున్న టీ భవ్య శ్రీ కొంతమంది కామాంధులు ఆమెపై నిర్ధాచంగా చంపేసి గుండు గీయించి బావిలో పడవేసిన ఆ నలుగురు నీచుల్ని ఉరితీయాలని ఆ తల్లిదండ్రులు ఆత్మ శోభకు గురిచేసిన ఆ వ్యక్తులని వారి వెనక ఎంత పెద్దవారు ఉన్నా వదలకూడదని రేపు ఇలాంటి సంఘటన మీకు జరగకూడదని వారికి కఠినంగా శిక్ష పడేదాకా మా బీసీవై పార్టీ ఎప్పుడు వారి కుటుంబానికి అండగా ఉంటుందని చిత్తూరు టౌన్ బీసీవై పార్టీ నాయకుడుగా సి. హేమ రాజు నాయుడు. ప్రతి ఒక్క పార్టీ కూడా కులాలకి మతాలకి పోకుండా మన బిడ్డగా భావించి అందరూ వారి కుటుంబం పై మానవత్వం చూపించమని. న్యాయం దక్కేదాకా పోరాడాలి నేను తెలియజేసుకుంటున్నాను

భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గారు గత నెల టిడిపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కొన్ని అనివార్య కారణాలవల్ల టిడిపి నాయకులు కార్యకర్తలు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పుంగునూరు ప్రజలందరూ చిత్తురు సబ్ జైల్లో ఉండడంతో వారందరినీ మేమున్నాము అని వారికి ధైర్యం చెప్పడానికి ఇవాళ చిత్తూరు పట్టణానికి విచ్చేయడం జరిగింది. చిత్తూరు టౌన్ బీసీవై పార్టీ యువ నాయకుడు సి. హేమ రాజు నాయుడు

కలిసిన సందర్భం లో

జి జె ఎం చారిటబుల్ ఫౌండర్ అయినటువంటి గురుజాల జగన్మోహన్ నాయుడు గారు ఆహ్వానం మేరకు బీవీ రెడ్డి కాలనీలో తన ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెల్లవారుజామున టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కాజూరు రాజేష్ అన్నగారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. బీసీవై పార్టీ యువ నాయకుడుగా సి . హేమ రాజు నాయుడు. టిడిపి నాయకులకు మా బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ అన్న తరఫునుండి కూడా మద్దతు తెలియజేయడం జరిగింది.

ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ అన్నగారు చిత్తూరు టౌన్ లోకి విచ్చేస్తున్న సందర్భంగా. దర్గా సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి తరువాత చిత్తూర్ టౌన్ బీసీవై యువ నాయకుడు సి. హేమ రాజు నాయుడు ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. చిత్తూరు టౌన్

రాజకీయ గురువు అయినటువంటి టిడిపి సీనియర్ లీడర్ కాజూరు బాలాజీ అన్న గారికి, అదేవిధంగా చిత్తూరు టౌన్ టిడిపి ఎక్స్ ఎమ్మెల్యే ఎస్ మనోహర్ అన్న గారికి వారిద్దరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వృద్ధాశ్రమంలో నివసిస్తున్న నిరుపేదలందరికీ ఈ కొత్త సంవత్సరంలో నా చేతుల మీదుగా వారందరికీ వారి కడుపు నింపడం అనేది ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నాకు ఈ అవకాశం కల్పించాడని నేను భావిస్తున్నాను. అదేవిధంగా నాకు సహకరిస్తున్న మా బీసీవై పార్టీ నాయకులకు , నా స్నేహితులకు , నేను తలపెట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా తరఫునుండి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఎంతగానో ఆదరిస్తున్న చిత్తూరు టౌన్ ప్రజలందరికీ బీసీవై పార్టీ యువ నాయకుడుగా సి. హేమ రాజు నాయుడు త్వరలో మీ ముందుకు వస్తున్నాను. మీరు తప్పకుండా నాకు మద్దతిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏

టిడిపి లీడర్ అనేటువంటి కాజురు బాలాజీ అన్నగారు చిత్తూరు టౌన్ లో ఉన్న యువతని ప్రోత్సహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో .అమర్ రాజా బ్యాటరీ ఎదురుగా వారి సొంత మైదానంలో ఆయన సొంత ఖర్చులతో క్రికెట్ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది .అదేవిధంగా నిన్నటి రోజు నన్ను ఆహ్వానించి చిత్తూరు టౌన్ పెద్ద హరిజనవాడకు చెందిన . యువకుడు జస్ట్లిన్ మేన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. వారి టీం సభ్యులందరికీ. బీసీవై పార్టీ చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ గా సి . హేమ రాజు నాయుడు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా టిడిపి సీనియర్ లీడర్ అయినటువంటి కాజూరు బాలాజీ అన్నగారిని నేను ప్రత్యేకంగా మా బీసీవై పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 

 

పేదవారి ఆకలి తీర్చడానికి ఎప్పుడూ ముందు ఉన్న బీసీవై పార్టీ యువ నాయకుడు సి. హేమ రాజు నాయుడు గారు

 

TDP Party Activities

యువ గళం పాదయాత్ర

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు యువ గళం పాదయాత్ర మన కడప నగరంలో చేపడుతున్న సందర్భంగా కడప టిడిపి ఇన్చార్జ్ అమీర్ బాబు గారు ఆహ్వానం మేరకు హెమరాజు నాయుడు గారు వెళ్లడం జరిగింది. 1500 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా. చిత్తూరు టౌన్ తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు చెప్పగానే యువ నాయకుడు నారా లోకేష్ గారు నీకు నేనున్నానని నాకు ధైర్యం చెప్పడం జరిగింది.

మన చిత్తూరు టౌన్ నందు గాంధీ సర్కిల్ వద్ద ఓల్డ్ సైకిల్ డే సందర్భంగా నా 34వ వార్డులో నివసిస్తున్న నేచురల్ మురళి అన్న ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి ప్రతి ఒక్క పార్టిసిపేన్స్ కి ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. మీ టిడిపి యువ నాయకుడు సి. హేమ రాజు నాయుడు

 

 చిత్తూరు టోన్ టిడిపి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ అన్నగారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్క టిడిపి నాయకులకు అలాగే కార్యకర్తలకు అలాగే ఆయన అభిమానులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా బాలాజీ అన్న తరపున మరియు నా తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై తెలుగుదేశం తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు 34త్ డివిజన్ టిడిపి యూత్ లీడర్

 

శతజయంతి ఉత్సవాలు

 చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ అన్నగారు తో కలిసి తెలుగు యువత నగర ఉపాధ్యక్షుడిగా సి. హేమ రాజు నాయుడు మినీ మహానాడు లో నందమూరి తారక రామారావు గారికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాల్లో  పాల్గొనడం జరిగింది 

కృతజ్ఞతలు

పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ అన్నగారిని పుంగనూరు టౌన్ తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా ఆయన ప్రజలకు చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు ఆయన ఫేస్బుక్లో పెట్టే పోస్టులను గమనిస్తూనే ఉన్నాను అందుకే ఒకసారి ఆయనకు తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది . చిత్తూరు టౌన్ 34 వార్డు టీడీపి యూత్ లీడర్ , తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు

కృతజ్ఞతలు

ఆర్కే సేవా సదన్ అధ్యక్షులు ఆర్కే కుమార్ అన్నగారు నన్ను సన్మానించిన సందర్భంగా ఆర్కే సేవా సదన్ అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి 34 వార్డు ప్రజలకి వారు చేసే సేవలకి ఆర్కే సేవాసదన్ వారు గుర్తించి వారి పార్టీ ఆఫీస్ కి పిలిచి అభిమానించడం నేను గర్వకారణంగా భావిస్తున్నారు. దీనికి సహకారం అందించిన 34 వార్డు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది. తెలుగు యువత నగర ఉపాధ్యక్షుడిగా కాకుండా ఒక సామాన్య నాయకుడిగా గుర్తించి వారు చేసిన సన్మానానికి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది.

చిత్తూరు టౌన్ లో బీసీ భవనం వర్ధకు మేము వెళ్లి సెల్ఫీ చాలెంజ్ వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వారి నాయకులకు చాలెంజ్ చేయడం జరిగింది. గత టిడిపి ప్రభుత్వంలో 90% పూర్తయిన బీసీ భవనం మరి పది పర్సెంట్ నిలిచిపోయిన పనులు మీరు ఎందుకు పూర్తి చేయలేదని తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు సూటిగా మిమ్మల్ని చెప్పమని ప్రశ్నించడం జరిగింది.

రంజాన్ మాసం ముస్లిం సోదరులకు చాలా పవిత్రమైనదని తెలుగుదేశం చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు హేమరాజు నాయుడు తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని కన్నయ్య నాయుడు కాలనీ 34 డివిజన్ హేమరాజు నాయుడు టిడిపి తెలుగు యువత కార్యాలయంలో పండ్లు పంపిణీ కార్యక్రమానికి కాజూరు బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 33, 34 డివిజన్ల లో ని మసీదుల్లో నూరు మందికి ద్రాక్ష, ఖర్జూర పండ్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తుంటారు అన్నారు. వారికి తమ వంతు సహాయంగా పండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిలాని భాష, విజయ్, భాను, వహీదా, శంషాద్, సల్మా, ముస్కాన్ తదితరులు పాల్గొన్నారు.

 

గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టిడిపి నాయకుడు తార ప్రతి అన్నని నేను వెళ్లి అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది. మన టిడిపి పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు అతని గాయపరచడం అన్నది చాలా దురదృష్టకరం ఎవరైతే గాయపరిచారో వారిని కఠినంగా శిక్షించాలని మరి ఇంకొక టిడిపి కార్యకర్తకి ఇలా జరగకుండా ఉండాలంటే తక్షణమే వాళ్లపై చర్య తీసుకోవాలని నేను టిడిపి నాయకులని కోరుతున్నాను. ఒక తెలుగు యువత నగర ఉపాధ్యక్షులుగా కాకుండా ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా సి. హేమ రాజు నాయుడు జై తెలుగుదేశం

చిత్తూరు టౌన్ గాంధీ సర్కుల్ దగ్గర మా తెలుగు యువత చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు కాజూరు రాజేష్ అన్నగారు మరియు తెలుగు యువత నగర అధ్యక్షులు యువరాజ్ 34త వార్డు టిడిపి ఇన్చార్జ్ తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు హేమ రాజు నాయుడు గౌస్, విజయ్, రాంప్రసాద్, మరి కొంతమంది తెలుగు యువత నాయకులు మన ఆంధ్రప్రదేశ్ యువత డ్రగ్స్ మత్తులో బానిసలు అవుతున్నారని సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జై నారా చంద్రబాబు నాయుడు గారు

ఓటు

ఈరోజు మా 34 వ వార్డులో నివసిస్తున్న గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన అభ్యర్థులను నేను స్వయంగా వారి వారి ఇండ్లకు వెళ్లి మన టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిని కంచర్ల శ్రీకాంత్ అన్న గారిని మీ అమూల్యమైన ఒకటి అనే అంక వేసి ఓటు వేయాల్సిందిగా మీ వార్డ్ లో నేను ఒక్కడిగా తెలుగుదేశం పార్టీని గెలిపించమని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను . తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు

అరెస్ట్

మన టిడిపి పార్టీ కోసం యువత భవిష్యత్తు కోసం మన అందరి రాజధాని అయిన అమరావతి లో జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా యువతకి జాబ్ ఎక్కడా అని ప్రశ్నించినందుకు  టిడిపి తెలుగు యువత నాయకులను అరెస్ట్ చేసి మంగళగిరి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అప్పుడే మేము భయపడలేదు ఇప్పుడెందుకు భయపడతాము. మా అందరిదీ ఒకటే లక్ష్యం 2024లో తెలుగుదేశం పార్టీ గెలిచేది ఖాయమని సీఎంగా మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని. ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకు తెలియజేయడం జరుగుతుంది . జై తెలుగుదేశం  మీ తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి . హేమ రాజు నాయుడు.

సభ

 టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి సభలో ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. టిడిపి కార్యకర్తలు పై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు న్యాయమని వాళ్ల విజ్ఞప్తికే వదిలేస్తున్నాం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బ్రహ్మ రథం పడుతుంటే . వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు జీర్ణించుకోలేక ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రానున్న 2024లో మా నారా చంద్రబాబునాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని వైఎస్ఆర్సిపి నాయకులకి తెలిసి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంది. రానున్న రోజుల్లో మా టిడిపి అధినేత కచ్చితంగా పోలీస్ వారికి అలాగే వైఎస్ఆర్సిపి నాయకులకి, కార్యకర్తలకి, బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉందని టిడిపి పార్టీ తరఫున మేము అందరం హెచ్చరిస్తున్నాం . ఈరోజు చిత్తూరు టౌన్ దర్గా సర్కుల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు కళ్లకు గంతులు కట్టుకొని సైకో పోవాలి సైకిల్ రావాలి. నినాదాలు చేయడం జరిగింది.

తెలుగు యువత ఆఫీసులో నన్ను ఎంతగానో అభిమానించే నా 34త్ వార్డు ప్రజలందరికీ నా చేతుల మీదుగా నా క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది . నన్ను ఇంత అభిమానించే నా వార్డు ప్రజలు ఉన్నారని నాకు ఎంతో సంతోషంగా ఉంది . ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే మీ ఆధార అభిమానులు ఎల్లప్పుడూ నాకు ఇలానే అందిస్తారని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఒక్కడిని మీకోసం వచ్చిన వాడిని సి. హేమ రాజు నాయుడు
టిడిపి నాయకులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టిడిపి అధినేత మా ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని 2024 లో టీడీపి గెలుపే లక్ష్యంగా నేను కృషి చేస్తానని. నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా యువనేత నారా లోకేష్ బాబు అన్నగారు చిత్తూరు టౌన్ తెలుగు యువత నగర ఉపాధ్యక్షుడిగా నాకిచ్చిన బాధితను గౌరవంగా నిలబెట్టుకొని నారా చంద్రబాబునాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తానని నేను ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ మాటిస్తున్నాను. అంతేకాకుండా నా 34వ వార్డు ప్రజల కోసం ఎల్లవేళలా వారికోసం కృషి చేస్తానని వారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను . సి. హేమ రాజు నాయుడు జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్

పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆనాడు వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చెప్పిన వాగ్దానం ఏమిటంటే మన అందరి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఏటా డీఎస్సీ రిలీజ్ చేస్తానని మరి అలాగే పోలీస్ జాబులు కానీ టీచర్స్ జాబులు కానీ టీటీడీలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తానని ఎవరైతే టీటీడీలో కాంట్రాక్ట్ బేసిక్ లో ఉండే ఉద్యోగస్తులందరినీ మేము మన ప్రభుత్వం వచ్చాక పర్మినెంట్ చేస్తామని . కల్లబొల్లి మాటలు చెప్పి కనీసం జీవితం పెంచే ఆలోచన కూడా చేయలేదు . యువత దగ్గర ఓట్లు వేయించుకొని ఇప్పుడు నట్టేటట్లు ముంచిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంకే దక్కిందని నేను భావిస్తున్నాను. తక్షణమే మీరు ఏదైతే యువతకు హామీ ఇచ్చారో నెరవేర్చేలాగా చూడాలని తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు డిమాండ్ చేస్తున్నాను . లేని పక్షంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత అందరినకి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మా యువ నేత నారా లోకేష్ బాబు గారు ఈనెల 27 నుంచి కుప్పం టు ఇచ్చాపురం వరకు యువగలం పేరిట ప్రజలు కష్టాలు తెలుసుకునే దానికి పాదయాత్రగా వస్తుంటేచేపడుతుంటే మీకెందుకు అంత భయం సూటిగా నేను వైఎస్ఆర్సిపి నాయకులని కార్యకర్తలని ప్రశ్నిస్తున్నాను

కలిసిన సందర్భంలో

టిడిపి సీనియర్ లీడర్ అయినటువంటి చిత్తూరు టౌన్ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ గారిని చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ గారిని తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి.హేమ రాజు నాయుడు ఆయన ఇంటికి వెళ్లి మరియు వారి కుటుంబ సభ్యులందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భంలో

తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారిని సంతపేట లో నివసిస్తున్న విజయ్ కుమార్ గారికి న్యూ ఇయర్ విషెస్ మరియు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఇదేం కర్మ కార్యక్రమం

పుంగునూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు రెడ్డి గారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి సదుం మండలంలో విచ్చేస్తున్న సందర్భంగా చల్ల బాబు రెడ్డి గారు వాహనంపై వైఎస్ఆర్సిపి కార్యకర్తలు . రాళ్లతో దాడి చేసి వాహనం అద్దాలను ధ్వంసం చేయడం జరిగింది

 టిడిపి ఎక్స్ కార్పొరేటర్ బాబు అన్న గారిని వారి కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమరాజు నాయుడు జై తెలుగుదేశం

వినతి పత్రం

చిత్తూరు టౌన్ లో గాంధీ కోడలి వద్దా తెలుగు యువత చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు కాజూరు రాజేష్ అన్నగారు ఆధ్వర్యంలో తెలుగు యువత సభ్యులందరూ కలిసికట్టుగా యువత తరఫున వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని యువత డ్రగ్స్ హెరాయిన్ కల్తీ మద్యం బానిసలు అవుతున్నారని . దీనిని అరికట్టాలని చిత్తూరు టౌన్ లో వన్ టౌన్ సిఐ గారికి  వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

వినతి పత్రం

చిత్తూరు పార్లమెంట్ తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామ్ చిన్న బాబు అన్నగారు చిత్తూరు టౌన్ కలెక్టరేట్ కార్యాలయం నందు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు కాజూరు రాజేష్ అన్నగారు. చిత్తూరు తెలుగు యువత నగర అధ్యక్షుడు యువరాజ్ నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు అలాగే తెలుగు యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

ధైర్యం

ఉదయాన మన చిత్తూరు టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్ లో టిడిపి సీనియర్ నాయకుడు బిసి షణ్ముగం అన్నగారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలిసి. చిత్తూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ అన్నగారు మరి తెలుగు యువత ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ అలాగే మరి కొంతమంది యువత నాయకులు టిడిపి మైనార్టీ నాయకులు షణ్ముగం గారి దగ్గరికి వెళ్లి మీకు మేమందరం ఉన్నామని ధైర్యం చెప్పి రావడం జరిగింద. 

అభినందనలు

డప పట్టణంలో డాక్టర్ నూరు పర్వీన్ ఆమె ప్రజలకు 10 రూపాయలకే ఓపి పెట్టడం ఎంతో నిరుపేదలకు కానీ సామాన్య ప్రజలకి ఆమె సేవ ని గుర్తించి నిన్న ఆమె దగ్గరికి వెళ్లి హెమరాజు గారి మిత్రులతో కలిసి ఆమెకు అభినందనలు తెలియజేయడం జరిగింది .

వివాహం

నిన్నటి రోజు కడప టిడిపి ఇన్చార్జ్ అమీర్ బాబు గారు తన కుమార్తె వివాహానికి హాజరు కమ్మని హెమరాజు గారిని పిలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు వెళ్లి వారి కుమార్తెను అలాగే వారి అల్లుడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం జరిగింది .

పీలేరు టిడిపి ఇన్చార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నగారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు మరియు నా మిత్రుడు టిడిపి మైనారిటీ నాయకుడు జిల్లాని జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జై నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి

మెసేజ్ లు పెట్టినంత మాత్రాన టిడిపి నాయకులు మారరు కార్యకర్తలు బతుకులు మారవు ఇది ఫిక్స్ ఐపోండి కొత్త యువతరం నాయకులు రావాలన్న మా టిడిపి యువనేత నారా లోకేష్ బాబు గారు, మా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు గారు అనుకుంటున్నారు కానీ టిడిపి పార్టీలోకి యువతరం రావాలన్నా వాళ్లు భయపడతారు ఎందుకనేది టిడిపి నాయకులకే వదిలేస్తున్నా . నేను ఈ ఒకటిన్నర సంవత్సరంలో తెలుసుకునేది ఏమిటంటే ఒకటి డబ్బు రెండవది కులము మూడవది మన బ్యాక్ గ్రౌండ్ ఈ ఉంటే చాలు తెలుగుదేశం పార్టీలో సులభంగా రావచ్చు ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా వారు తెలుగుదేశం పార్టీకి ఎంత కష్టపడినా వృధా. అని నేను భావిస్తున్నాను మరి మీరు ఇలానే అనుకుంటున్నారా .తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు చిత్తూరు టౌన్ జై తెలుగుదేశం. జై నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగు యువత

ఆఫీసు ప్రారంబోత్ససవం

34వ వార్డులో టిడిపి తెలుగు యువత ఆఫీసును ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిధులుగా పాల్గొన్నవారు చిత్తూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ గారు, కటారి మోహన్ గారి గారు, అల్లుడు కిరణ్ గారు, చిత్తూరు తెలుగు యువత టౌన్ ప్రెసిడెంట్ యువరాజ్ గారు, మనీ గారు, గౌతమ్ గారు, గౌస్ గారు, తెలుగు యువత టీం, టిడిపి కొండమెట్ట ఎక్స్ కార్పొరేటర్ ప్రమీల ఆనంద్ గారు, టిడిపి నాయకులు కార్యకర్తలు టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులందరూ ఆశీర్వదించడం జరిగింది.

కృతజ్ఞతలు

వార్డు ప్రజలందరికీ నాయుడు గారు కృతజ్ఞతలు తెలిపారు, తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు టిడిపి పార్టీకి ఒక నాయకుడు , లాగా కాకుండా ఒక సైనికుడిగా, తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

చిత్తూరు టౌన్ 34 వ వార్డులో ఉన్న స్కూళ్లకు వెళ్లి టిడిపి MLC అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ అన్న గారిని గెలిపించమని ఉపాధ్యాయులందరినీ అలాగే గ్రాడ్యుయేట్ చేసిన ప్రజలందరినీ తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు కోరడం జరిగింది ఉపాధ్యాయులు మరియు ప్రజలు మేము ఓటేసి గెలిపించుకుంటామని నాకు చెప్పడం జరిగింది

మద్దతు

పట్టభద్ర ఎన్నికలు సందర్భంగా టిడిపి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కంచర్ల శ్రీకాంత్ చౌదరి గారికి మద్దతుగా చిత్తూరు తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు కాజూరు రాజేష్ గారు మరియు చిత్తూరు టౌన్ తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు, మరి కుప్పంలో ఉన్న తెలుగు యువత నాయకులు మరి కొంతమంది టిడిపి కార్యకర్తలు అందరం కలిసి కుప్పం స్కూల్ లకు మరియు కాలేజీలకు వెళ్లి అక్కడున్న ఉపాధ్యాయులకు వివరించి టిడిపి ఎమ్మెల్సీగా నిలబడిన అభ్యర్థిని గెలిపించమని తెలుగు యువత తరపున కోరడం జరిగింది.

చిత్తూరు టౌన్ టిడిపి మైనారిటీ నాయకుడు జహంగీర్ ఖాన్ మృతి చెందినారని తెలియగానే తన నివాసం వద్దకు వెళ్లి వారికి నివాళులర్పించడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు.

శుభాకాంక్షలు

టిడిపి మైనార్టీ నాయకులుకి కార్యకర్తలకి మరి వారి కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రజలందరికీ మిలాడి నబి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు.

చికిత్స

టిడిపి ముస్లిం మైనారిటీ నాయకుడు నిజాముద్దీన్ గత నాలుగు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కావున ఆ విషయం మాకు తెలియగానే చిత్తూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ అన్నగారు డాక్టర్ తో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించమని కోరడం జరిగింది మరియు తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి . హేమ రాజు నాయుడు గారు మరియు కొంతమంది చిత్తూరు టౌన్ టిడిపి ముస్లిం నాయకులు నిజాముద్దీన్ కుటుంబానికి మేమున్నాము అనే ధైర్యం చెప్పడం జరిగింది.

చిత్తూరు టౌన్ గ్రీన్ పేట నందు కారాగారంలో ఉన్న టిడిపి కుప్పం నాయకులునీ మరియు శాంతిపురం మండలం మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు గారిని విడుదల చేయడం జరిగింది. తెలుగు యువత నగర ఉపాధ్యక్షులుగా సి. హేమ రాజు నాయుడు టిడిపి నాయకులతో మరియు కార్యకర్తలతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

అక్రమ అరెస్ట్

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది కాలంగా చిత్తూరు టౌన్ గిరింపేట నందు కారాగారంలో ఎం ఎల్ సి శ్రీనివాసులు గారు, టిడిపి నాయకులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు, జై తెలుగు దేశం జై నారా చంద్రబాబునాయుడు గారు, తదితరులు వాళ్ళకి దైర్యం చేప్పడం జరిగింది.

బాదుడే బాదుడు

చిత్తూరు టౌన్ నందు 19, 20 వార్డు నందు తెలుగుదేశం పార్టీ తరఫున బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించబడినది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దొరబాబు అన్నగారు కటారి హేమలత గారు, వెంకట్ ఇళ్ల సురేంద్ర గారు, చిత్తూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ అన్నగారు చిత్తూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కాజూరు రాజేష్ అన్నగారు పెద్ద ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు 19,20,వార్డు వారు పిలుపుమేరకు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

పరమార్శించడం

టిడిపి మైనారిటీ నియోజకవర్గ సెక్రెటరీ అన్సర్ భాషని ఆయనకి ఇటీవల ప్రమాదం జరిగిన సందర్భంగా ఆయన ఇంటి దగ్గరికి వచ్చాడని సమాచారం తెలియడంతో చిత్తూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ అన్నగారు మరియు టిడిపి మైనారిటీ నాయకులు తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు పండ్లు తీసుకొని మర్యాదపూర్వకంగా ఈరోజు నర్సింగరానిపేటలో తన నివాసం దగ్గర కలవడం జరిగింది

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు గారు 2024 లో సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీ లో మరెన్నో ఉన్నతమైన పదవుల్లో ఉండాలని మరి నా కుటుంబ సభ్యులందరూ బాగుండాలని తిరుమల కు వెళ్లి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా 2024 లో తెలుగుదేశంపార్టీ వచ్చాక చిత్తూరు టౌన్ 34త్ వార్డ్ తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు . చిత్తూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది

విద్య ఆగ్రహ దీక్ష

చిత్తూరు టౌన్ నందు టిడిపి పార్టీ ఆధ్వర్యంలో టిఎన్ఎస్ఎఫ్ విద్య ఆగ్రహ దీక్ష పాల్గొని వారికి మద్దతు తెలిపిన చిత్తూరు టౌన్ తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు అలాగే మరి తెలుగు యువత నాయకులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

నిరుద్యోగుల ధర్నా

విజయవాడలో వెలుగు పొడి అసెంబ్లీ దగ్గర నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్సిపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన మాటని నిలబెట్టుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామ్ చిన్న బాబు గారు మరియు చిత్తూరు తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు కాజురు రాజేష్ గారు అలాగే చిత్తూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ నాథ్ రెడ్డి గారు చిత్తూరు టౌన్ తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు చౌదరి గారు జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పాల్గొనడం జరిగింది

పాదాభివందనం

ప్రజలందరికీ రాజకీయంగా పరిచయం చేసిన గురువైనటువంటి తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ గారికి హెమరాజు గారు హృదయపూర్వక పాదాభివందనం చేయడం జరిగింది.

వినాయక చవితి కార్యక్రమం

ఆయురారోగ్యాల‌తో అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని గ‌ణ‌నాథుడిని వేడుకొంటూ చలువ పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసి గణనాథుని ప్రతిష్టించిన భక్తుల, వినాయక చవితి కార్యక్రమంలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పులివర్తి నాని గారికి మరియు చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ గారికి మరియు తెలుగు యువత నగర కమిటీ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జయంతి

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామ రావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

మీటింగ్

మంగళగిరి టిడిపి పార్టీ ఆఫీసులో తెలుగు యువత చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు కాజురు రాజేష్ గారితో కలిసి చిత్తూరు టౌన్ నుంచి మీటింగ్ కి వెళ్లడం జరిగింది.

కుంభాభిషేకం

గుడిపాల మండలంలో వినాయక స్వామి ఆలయం వద్దా కుంభాభిషేకం చేయడం జరిగింది అందువలన ముఖ్యఅతిథిగా టిడిపి సీనియర్ నాయకుడు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజురు బాలాజీ గారు, మరియు గుడిపాల మండల జడ్పిటిసి అనిల్ చౌదరి గారు , తెలుగుదేశం పార్టీ నాయకుడు కోళ్ల హేమాద్రి నాయుడు పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం అందజేత

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఆదేశాల మేరకు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నిరుద్యోగ యువకులు మోసం చేసిన ప్రభుత్వం రాష్ట్ర తెలుగు యువత పిలుపుమేరకు శ్రీరామ్ చిన్నబాబు అన్నగారు ఆదేశాల మేరకు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు కాజురు రాజేష్ గారి ఆధ్వర్యంలో రాజంపేట తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత తరలి రావడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

ప్రారంభోత్సవ సందర్భంగా

చిత్తూరు నియోజకవర్గం, గుడిపాల మండలం లోని నార గల్లు గ్రామంలో క్రైస్తవ మందిరము ప్రారంభోత్సవ సందర్భంగా క్రైస్తవ సోదరుల ఆహ్వానం మేరకు చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కాజూరు బాలాజీ గారు మరియు గుడిపాల మండల ఉపాధ్యక్షులు దేవపత్ని అనిల్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు తెలుగు యువత నగర ఉపాధ్యక్షుడు సి. హేమా రాజు చౌదరి గారు, పాల్గొనడం జరిగింది.

బాధ్యతలు

చిత్తూరు టౌన్ తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు కాజురు రాజేష్ గారి ఆధ్వర్యంలో తెలుగు యువత నగర ఉపాధ్యక్షుడు సి.హేమ రాజు చౌదరి గారు, తెలుగు యువత నగర ఆర్గనైజ్ సెక్రెటరీ గౌస్ ఒంగోలులో టిడిపి మహానాడు సభకు వాలెంటరీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

అరెస్ట్

చిత్తూరు టౌన్ నందు టిడిపి తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు కాజురు రాజేష్ గారిని కాజురులో తన ఇంటి వద్ద అక్రమంగా టూటౌన్ పోలీస్ వారు తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేయడం జరిగింది రాజేష్ అన్నకు మద్దతుగా తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు అలాగే టిడిపి తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

 పుట్టినరోజు జరుపుకుంటున్న టిడిపి పార్టీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టినరోజు జరుపుకుంటున్న టిడిపి సీనియర్ లీడర్ నిమ్మల రామానాయుడు గారికి హృదయ పూర్వకంగా తెలియజేయడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన సందర్భంగా, శుభాకాంక్షలు తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు పట్టణంలో హెమరాజు గారు ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది.

రక్తదానం

చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి 73 వా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది.

నిరసన

చిత్తూరు టౌన్ నందు 8 వార్డు ఇప్పుడున్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన పథకాలు ప్రజలకి అన్ని విధాలుగా పప్పు, బియ్యం , వంటనూనె, మరియు గ్యాస్, పెట్రోల్ ,డీజిల్, అంతేకాకుండా ఈ వేసవి కాలంలో కరెంటు బిల్లులు, కూడా ఎన్నడూ లేని విధంగా ప్రజలందరి మీద బాదుడే బాదుడు కార్యక్రమం వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఇందుకు నిరసనగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆదేశాల మేరకు మన ఏపీ ప్రజలందరికీ వివరించ మని చెప్పడం జరిగింది.

వర్ధంతి

చిత్తూరు టౌన్ తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 195 వా వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మైనార్టీ నాయకులు, మరియు తెలుగు యువత నగర ఉపాధ్యక్షుడు సి. హేమ రాజు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వేడుకలు

పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు టిడిపి పార్టీ ఆఫీసులో ఘనంగా టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు వేడుకలు నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్భంగా

పుంగనూరు టిడిపి ఇంచార్జ్ చల్లా బాబు గారిని అలాగే మరియు పీలేరు టౌన్ టిడిపి ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని చిత్తూరు టౌన్ 34th వార్డు టిడిపి ఇంచార్జ్ అలాగే తెలుగు యువత ఉపాధ్యక్షులు సి. హేమ రాజు నాయుడు గారు వాళ్ళిద్దరినీ మర్యాదపూర్వకంగా కాజురు బాలాజీ గారి ఇంటి దగ్గర కలవడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

34వ వార్డులో నాని గారితో కలిసి తెలుగు దేశం పార్టీ 41 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగు యువత ఉపాధ్యక్షులు సి.హేమరాజు నాయుడు గారు చిత్తూరు లో నిర్వహించడం జరిగింది.

సన్మానం

టిడిపి ఎక్స్ కార్పొరేటర్ వసంత్ కుమార్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తేనె బండ మురాద్ బాబా దర్గా దగ్గర తన తమ్ముడు తెలుగు యువత నగర ఉపాధ్యక్షుడు సి. హేమ రాజు నాయుడు 34 డివిజన్ టిడిపి ఇంచార్జి నాయకుడు శాలువాతో దర్గా దగ్గర టిడిపి మైనార్టీ నాయకులు ముందు ఘనంగా సన్మానించడం జరిగింది.

గౌరవ సభ

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో 43 ,44 , వార్డు ప్రెసిడెంట్ అత్తూర్ భాయ్ గారు, గౌరవ సభలో ప్రజల దగ్గర అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. టిడిపి ముఖ్య అతిథులుగా చిత్తూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ అన్న గారు, మరియు ఎక్స్ మేయర్ కటారి హేమలత వదినమ్మ గారు తెలుగు యువత నగర వైస్ ప్రెసిడెంట్ సి. హేమ రాజు నాయుడు గారు, టిడిపి మైనార్టీ నాయకులు అక్కడికి వెళ్లడం జరిగింది.

కలిసిన సందర్భంగా

చిత్తూరు నగరంలో ఫంక్షన్ హాల్ దగ్గర గంగాధర నెల్లూరు టిడిపి కోఆర్డినేటర్ భీమినేని చిట్టి బాబు నాయుడు గారినీ తెలుగు యువత నగర ఉపాధ్యక్షుడు సి.హేమ రాజు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

శుభాకాంక్షలు

శ్రీరామ్ చినబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

MHPS అధ్యక్షుడు ఫారుక్ ఉబ్లీగారిని మర్యాదపూర్వకంగా పుంగనూరులో చిత్తూరు టౌన్ తెలుగు యువత నగర వైస్ ప్రెసిడెంట్ సి. హేమ రాజు నాయుడు గారు కలవడం జరిగింది.

భోజనాలు పంపిణి

అమరావతి రాజధానిగా హైకోర్టు తీర్పు ఇచ్చిన శుభ సందర్భంగా గుడిపాల మండలం సియోన్ చర్చ్ లో పేదవాళ్ల అందరికీ కూడా భోజనాలు పెట్టి, పళ్ళు మరియు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు మరియు మండల జనరల్ సెక్రెటరీ చంద్రయ్య గారు, తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు సి.హేమ రాజునాయుడు గారు, పేదవారికి బిస్కెట్లు పంపిణీ చేశారు మరియు MHPS రాష్ట్ర కార్యదర్శి జాఫర్ గారు, టిడిపి నాయకులు, మరియు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం

మధ్యాహ్నం 12.pm గంటలకు తెలుగు యువత రాంప్రసాద్ చికెన్ షాప్ మిట్టూరు నందు ప్రారంభించడం జరిగింది. టిడిపి చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ ,గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది అలాగే MHPS రాష్ట్ర కార్యదర్శిగా జాఫర్ గారు, మరియు తెలుగు యువత సి. హేమ రాజు నాయుడు, చిత్తూరు టౌన్ రాంప్రసాద్ ముగ్గురిని ఆహ్వానించడం జరిగింది.

పోలియో చుక్కలు

గవర్నమెంట్ హాస్పిటల్ నందు హెమరాజు గారి బిడ్డ ఖుషికి పల్స్ పోలియో చుక్కలు వేయించబడినది.

వేడుకలు

అమరావతి విజయం ఏపీ ప్రజలు అందరిదీగా భావించి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ సి. హేమ రాజు నాయుడు గారు వేడుకలు జరుపుకోవడం జరిగింది.

గౌ. శ్రీ. బోడె రామచంద్ర యాదవ్ గారిని కలిసిన సందర్భంలో

 భారత చైతన్య యువజన పార్టీ అధినేత గౌ. శ్రీ. బోడె రామచంద్ర యాదవ్ గారిని మర్యాదపూర్వకముగా కలిసి సన్మానం చేయడం జరిగింది

Party Activities

News Paper Clippings

Videos

}
08-04-1988

Born in Chittoor Town

Chittoor, Andhra Pradesh

}
2002

Studied Schooling

From King’s English Medium School, Chittoor

}
2004

Finished Undergraduation

From Narayana Junior College, Chittoor.

}
2008

Attained Graduation

From Narayana Degree College, Chittoor.

}
2020

Joined in the TDP

}
2020

Party Activist

From TDP

}
Since - 2020

Telugu Youth Vice President

From TDP, Chittoor

}
2023

Joined in BCYP

}
2023

Chittoor Assembly president

from BCYP, Chittoor