Gone Srikanth Mudiraj | Chilkanagar 7th Division President | Uppal | BJP | the Leaders Page

Gone Srikanth Mudiraj

Chilkanagar 7th Division President, Uppal, Medchal–Malkajgiri , Telangana, BJP.

 

Gone Srikanth Mudiraj is an Indian Politician and 7th Division President of Chilkanagar in Uppal from the Political Party BJP.

EARLY LIFE AND EDUCATION:

On the 12th of July 1986, Srikanth was born to the couple Mr. Gone Anjaiah and Mrs. Gone Andalu in the Nalgonda district in the Indian State of Telangana.

Srikanth acquired his Secondary Board of Education in 2000 from Zilla Parishad High School at Uppal in Medchal Malkajgiri District and completed his Intermediate in 2002 from NICT ITI college at Mettuguda in Secunderabad.

In the year 2012, Srikanth attained his Graduation of Degree from Dr. Ambedhkar Degree College situated at Nampally in Telangana and attained his MA Political Science from Prof. G. Ram Reddy Centre for Distance Education affiliated with Osmania University in Hyderabad in 2016.

PROFESSIONAL LIFE:

Soon after receiving the certificate of Education, Srikanth began his Professional Career in the field of Real Estate in Uppal, and ever since he started the business he simultaneously handled his family responsibilities.

Srikanth expanded his social service efforts by establishing a Sri Sai High School in Boduppal, where he laid the foundation for the students’ bright futures by informing them of the significance of education in school.

EARLY CAREER IN POLITICS:

Before the accomplishment of his Education, Srikanth began his political career by entering the Rashtriya Swayamsevak Sangh Party (RSS). After joining the RSS he has gone through the Initial Training Camp(Prathmik Shiksha Varg).

Later on, He joined the Bharatiya Janata Party (BJP) which was founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) and Lal Krishna Advani(Former Deputy Prime Minister of India) and continued rendering services to the people from 2012 as an Active Member of BJP.

Ever since he was joined the party he ordained as the Party Activist of the BJP Party and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

In 2013, He was designated as the BJYM Uppal President from BJP for intending to serve people with the purpose of addressing the people’s requirements while also presenting a modest service.

For his determination, he was promoted as the 7th Division General Secretary of Chilkanagar of BJP to discharge his duties only for the good of the people without compromising on the trust placed in him by the party.

Srikanth extended his service and work by accepting the respectable position of 7th Division President of Chilkanagar of Uppal from BJP to look after the people and the issues they are facing and served with the assigned position and by providing services to the people by satisfying the needs of everyone.

During the time period of elections, Srikanth contested for the GHMC Corporator but the position has been defeated due to less difference in the voting percentage.

Party Activities:

  • During elections, he actively participates in the door-to-door campaign and works hard to bring in more Democrats to help the candidates win in his community.
  • He set up and engaged in every Mandal level, Village level meetings and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • Srikanth played a key role by participating in Bike Ralley, Dharnas, and protests for the local and land issues and the justice to the underprivileged ones.
  • Srikanth is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Srikanth was actively involved in various social service activities and worked hard to take various schemes of the State and Central Government into public and assisted them to get the benefit.

Social Activities:

  • As a part of environmental protection, Mahesh has taken an active role by participating in the Palle Pragathi and Clean and green by casting the plants in the village.
  • For the hefty price of the crops grown by the farmer, Srikanth worked hard for the welfare of the farmers during his reign.
  • During his reign, roads were laid as part of the colony’s development program, as well as repairing damaged roads.
  • On the occasion of Birth Anniversaries of the Political Leaders, Srikanth celebrates the occasion by organizing a Blood donation camp and conducting an Annadanam program at his Locality.
  • In order to help the poor in the hospital during emergencies, Srikanth handed over the government-implemented Health Sree cards to them.
  • As a part of Haritha Haram, massive plantation programs were taken up and distributed Plants to the village people.
  • Srikanth continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality
  • He helped the old and poor people in the village by providing the basic essentials to them for survival and also assisted them during the financial crisis.
  • He took an active part in ensuring assistance programs for the impoverished and aiding them in surviving their life.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially.
  • Srikanth is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.

Services Rendered During the Pandemic:

  • During the first and second waves of Corona, Srikanth offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Srikanth acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Srikanth responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

H.No: 2-20, 95/4/A, Colony: New Ram Nagar Colony, Chilkanagar, Mandal: Uppal, District: Medchal–Malkajgiri, Constituency: Uppal, State: Telangana, Zipcode: 500039.

Email
Mobile: 90309 04041, 93948 58143.

Bio Data of Mr. Gone Srikanth Mudiraj

Gone Srikanth Mudiraj | Chilkanagar 7th Division President | Uppal | BJP | the Leaders Page

Name : Gone Srikanth Mudiraj

DOB: 12th of July 1986

Father: Mr. Gone Anjaiah

Mother: Mrs. Gone Andalu

Present Designation: Chilkanagar 7th Division President

Education Qualification: MA Political Science

Profession: Politician                

Contact No   : 90309 04041, 93948 58143

“Leadership cannot just go along to get along. Leadership must meet the moral challenge of the day.”  

                                                                                                                                                                                                        –Gone Srikanth Mudiraj…

Recent Activities

దాడి

 మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హెూలీ పండుగ లక్ష్యంగా హిందూ మహిళలపై అర్ధరాత్రి మతోన్మాదులు దాడికి ప్రయత్నించారని, ఇది ఆటవిక చర్యగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు హెూలీ పండుగ చేసుకుంటుంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో గర్భిణిలతో పాటు మహిళలకు తలలు పగిలి తీవ్రగాయాలయ్యాయని, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారన్నారు.

సన్నాహాక సమావేశం

రామాంతాపూర్ లింగారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహాక సమావేశం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కర్ణాటక మాజీ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సుధాకర్ గారు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యాక్షులు శ్రీ NVSS ప్రభాకర్ గారు.స్థానిక బిజెపి కార్పొరేటర్లు, వివిధ మోర్చా నాయకులు, బిజెపి సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

ధర్నా

ఉప్పల్లో బస్ టెర్మినల్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ర్యాలీ నిర్వహించి టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది.

రథోత్సవం ఊరేగింపు

మహా శివరాత్రి పర్వదిన పురస్కరించుకుని చిలుకానగర్ శివాలయం ఆలయంలో శ్రీ శివప్రార్వతిల రథోత్సవం ఊరేగింపులో పాల్గొన్నాడం జరిగింది.

వినతిపత్రం అందజేత

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిజామాబాద్ MP ధర్మపురి అరవింద్ గారిపై మరియు బిజెపి నాయకులపై కార్యకర్తలపై ఆర్ముర్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకుల దాడిని ఖండిస్తూ బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో చిలుకానగర్ చౌరస్తా స్వామి వివేకానంద విగ్రహం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల మాస్క్ లు ధరించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని టిఆర్ఎస్ గుండాలు బిజెపి కార్యకర్తలపై చేసిన దాడిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రజాప్రతినిధులకు, అధికారులకు తగిన మంచిబుద్ధి ప్రసాదించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

సంబరాలు

భారతీయ జనతా పార్టీ దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన శుభసందర్భంగా బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో చిలుకానగర్ డివిజన్ పరిధిలో బైక్ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచుకోని టపాకాయలు కాల్చి గెలుపు సంబరాలు జరుపుకోవడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్రదారి ఉద్యమ నేత ఆత్మగౌరవానికి నిలువెత్తు కొండ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు మాజీ మంత్రి వర్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటెల రాజేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ధర్నా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బిజెపి ఉప్పల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎస్.ఈ ఇంజనీరు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ర్యాలీ

ప్రజల కోసం ప్రగతికోసం పేదప్రజల ఇండ్లు కోసం ప్రభాకర్ మార్చ్ అనే నినాదంతో పేద బడుగు బలహీన వర్గాల పేద స్థానికంగా నివాహిస్తున్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే కే టహించాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ గారి నాయకత్వంలో రాధిక చౌరస్తా నుండి కాప్రా మున్సిపల్ ఆఫీస్ వరకు వందలాదిమంది డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు దారులు మరియూ మహిళలు బీజేపీ రాష్ట్ర, జిల్లా ,డివిజన్ నాయకులు. నాయకురాలు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది.

పుట్టిన రోజు వేడుకలు

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారి జన్మదినం పురస్కరించుకుని చిలుకానగర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు కలసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ర్యాలీ

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ.. బిజెపి, బిజైవైయం చిలుకానగర్ డివిజన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

జయంతి

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి విద్యాభివృద్ధికి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త, బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు, మ‌హాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలను చిలుకానగర్ డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గొట్టిముక్కల ప్రదీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

శ్రీరామనవమి" సందర్భంగా

చిలుకానగర్ డివిజన్ లో ఆర్యసమాజం నిర్వహుకులు ఆచార్య వేద సింధు గారి ఆధ్వర్యంలో “శ్రీరామనవమి” సందర్భంగా స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు రామాయణం గురించి వ్యాసరచన, వ్యక్తిత్వ వికాస మరియు ప్రశ్నల పోటీలు (క్వీజ్) నిర్వహించారు.

జయంతి

చిలుకానగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో వాడ వాడలో భరత రాజ్యంగా నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి 131 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

పర్యవేక్షణ

చిల్కానగర్ డివిజన్ కుమ్మరికుంట లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా పనులు పూర్తి చేస్తున్నారని స్థానికులు బిజెపి చిలుకానగర్ డివిజన్ ప్రెసిడెంట్ గోనె శ్రీకాంత్ గారి దృష్టికి తీసుకొచ్చారు ఆయన వేంటనే వెళ్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పర్యవేక్షించడం జరిగింది.

విజయ యాత్ర

శ్రీ వీర హనమన్ జన్మదినోత్సవం సందర్భంగా హనమన్ విజయ యాత్ర శోభాయాత్ర ఉప్పల్ భజరంగ్ ధళ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

లుకానగర్ చౌరస్తాలో మంత్రి కేటిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి మంత్రి కేటిఆర్ వరంగల్ సభలో బిజెపి పై ప్రధాని నరేంద్ర మోడీ గారిపై మరియు బిజెపి నాయకులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన చేయడం జరిగింది.

పాదయాత్ర

బిజెపి రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు చిలుకానగర్ డివిజన్ మల్లిఖార్జునగర్, కుమ్మరికుంట, రాఘవేంద్రనగర్ గణేష్ టెంపుల్ తదితర కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో బిజెపి అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది.

డిమాండ్

అధికార TRS పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను జెండాలను, తోరణాలను తొలగించాలని బిజైవైయం మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జీ రేవల్లి రాజు ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో బిజైవైయం నాయకులు చేస్తున్న నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులకు సంఘీభావం తెలియజేసిన బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారు మాట్లాడడం జరిగింది.

ప్రజా సంగ్రామ యాత్ర

రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర లో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారితో కలిసి చిలుకానగర్ డివిజన్ బిజెపి నాయకులు.

చలివేంద్రం

చిలుకానగర్ డివిజన్ కాళ్యాణ్ పురి, ప్రశాంత్ నగర్ లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బిజెపి చిలుకానగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు పాల్గొన్ని చలివేంద్రం ప్రారంభించడం జరిగింది.

ఆరాధన మహోత్సవం

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారియొక్క 329వ ఆరాధన మహోత్సవ సందర్బంగా, చిలుకానగర్ లోని శ్రీ వీరభద్రస్వామి గుట్టపైన ఆలయంలో శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో మహోత్సవ కార్యక్రమం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హోమం మరియు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నాడం జరిగింది.

పాలాభిషేకం

బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిలుకానగర్ చౌరస్తాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

స్వాగతం

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలకడానికి చిలుకానగర్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది.

జెండా ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలుకానగర్ డివిజన్ బ్యాంక్ కాలనీ చౌరస్తాలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్ని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.

ఆహ్వాన పత్రాలు అందజేత

పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే బిజెపి విజయ సంకల్ప సభ భారీ బహిరంగ సభకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి వస్తున్నా నేపథ్యంలో చిలుకానగర్ డివిజన్ లో 300 మందికి ఆహ్వాన పత్రాలు అందించి సమావేశానికి ఆహ్వానిచడం జరిగింది.

వైద్య శిబిరం

చిలుకానగర్ డివిజన్ కాళ్యాణ్ పురి కాలనీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మరియు బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారి జన్మదినం పురస్కరించుకుని చిలుకానగర్ బిజైవైయం అధ్యక్షులు డప్పు దత్తసాయి ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ వైద్య బృందంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు బిపి, షుగర్, ఇసిజి మరియు ఇతర పరీక్షలతో పాటు కామినేని డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య సమస్యలపై తగిన సూచనలు సలహాలు చేశారు.

శుభాకాంక్షలు

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరినగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కృతజ్ఞతలు

శ్రీకాంత్ గారి జన్మదినం పురస్కరించుకుని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అమూల్యమైన ఆశీస్సులు శుభాకాంక్షలు అందించి ఆశీర్వాదించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

పుట్టిన రోజు సందర్భంగా

బిజెపి జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ శ్రీ మురళీధర్ రావు గారి పుట్టిన రోజు సందర్భంగా వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ప్రారంభోత్సవం

చిలుకానగర్ డివిజన్ కాళ్యాణ్ పురి, ప్రశాంత్ నగర్ లో “చలివేంద్రం” ఏర్పాటు చేసిన బిజెపి చిలుకానగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు పాల్గొన్ని “చలివేంద్రం” ప్రారంభించారు.

హామీ

బిజెపి రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు సోమవారం చిలుకానగర్ డివిజన్ మల్లిఖార్జునగర్, కుమ్మరికుంట, రాఘవేంద్రనగర్ గణేష్ టెంపుల్ తదితర కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో బిజెపి అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ప్రజలు అనేక సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా వర్షాలు పడితే తమ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడం, రోడ్లు అన్ని జలమయం అవుతున్నాయని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీరు కలుషితం కావడం, సిసి రోడ్లు సరిగా లేకపోవడం, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన రావడం, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందిని డ్రైనేజీలు పోంగిపోరులుతున్నాయని తదితర సమస్యలను కాలనీవాసులు బిజెపి నేతల ముందు ఏకరువు పెట్టారు. బిజెపి నాయకులు వారు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారికి వినతిపత్రం అందజేత

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిజామాబాద్ MP ధర్మపురి అరవింద్ గారిపై మరియు బిజెపి నాయకులపై కార్యకర్తలపై ఆర్ముర్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకుల దాడిని ఖండిస్తూ బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిలుకానగర్ చౌరస్తా స్వామి వివేకానంద విగ్రహం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల మాస్క్ లు ధరించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని టిఆర్ఎస్ గుండాలు బిజెపి కార్యకర్తలపై చేసిన దాడిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రజాప్రతినిధులకు, అధికారులకు తగిన మంచిబుద్ధి ప్రసాదించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారికి వినతిపత్రం అందజేశారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి

భారతీయ జనతా పార్టీ చిలుకనగర్ డివిజన్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన భారతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి గారి వేడుకలు చిలుకానగర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది.

సన్మానం

చిలుకానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జోజప్ప గారు మరియు ముగ్గురు టీచర్లు మంజుల, భాగ్యలక్ష్మి, హామ్మద్ బి టీచర్లు ట్రాన్స్ఫర్ మీద వేరే జిల్లాకు వెళ్లుతున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జోజప్ప గారు స్కూల్ కు చేసిన సేవలను గుర్తు చేస్తూ బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు యువకులు ఘనంగా సన్మానించారు.

సంఘీభావం

ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయకుండా జాప్యం చేస్తూ నిరుద్యోగులకు వంచిస్తున్న తెరాస ప్రభుత్వ తీరుకు నిరసనగా, నిరుద్యోగులకు అండగా BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో తలపెట్టిన దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించడం జరిగింది.

శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమం

శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమం బిజెపి చిలుకానగర్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో చిలుకానగర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. 

కార్మిక భీమా పథకం

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కార్మికులకు, కూలీ పనులు చేసుకునే పేద ప్రజలకు ప్రధానమంత్రి కార్మిక భీమా పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం పేరు “ఈ – శ్రమ్ ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన” ఈ పథకాన్ని ప్రజలకు అందించేందుకు చిలుకానగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిలుకానగర్ చౌరస్తాలో ఈ – శ్రమ్ కార్డు నమోదు ప్రక్రియ కార్యక్రమం నిర్వహించి దాదాపు 200 మందికి భీమా కార్డులు అందజేశారు.

కుటుంబ సమ్మేళనం

‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సామాజిక సమరసత’ “కుటుంబ సమ్మేళనం” కార్యక్రమంలో సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ గారు చిలుకానగర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆదర్శ కుటుంబ విశిష్టతను భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సనాతన భారతీయ ధర్మం ప్రపంచానికి అందించిన గొప్ప విషయాలను గురించి తన అద్భుతమైన ఉపన్యాసంతో తన మంచి మాటలతో స్పూర్తి, ప్రేరణ కలిగించిన అప్పాల ప్రసాద్ గారు.

ప్రశిక్షణా శిబిర విభాగము

భారతీయ జనతా పార్టీ ప్రాంత ప్రశిక్షణా శిబిర విభాగము  మేడ్చల్ అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో 9,10,11 మూడురోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న శిబిరంలో రెండో రోజు ప్రముఖలు విచ్చేసి వివిధ అంశాలపై ఉపన్యాసం చేశారు. 

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్థంతి

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల అభ్యున్నతి కోసమై కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామ చేసిన మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మానవతావాది మనుధర్మ శాస్త్రాన్ని మంటలో కాల్చి భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్థంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

నిరసన కార్యక్రమం

పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (పన్ను) తగ్గించి ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఉప్పల్ నియోజకవర్గం బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో చిలుకానగర్ డివిజన్ లో HP పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడం జరిగింది.

అక్రమ అరెస్టు

సూర్యపేట జిల్లాలో వడ్ల కోనుగోలు కేంద్రాలకు మరియు రైతుల సమస్యలను తెలుసుకున్నేందుకు బయలుదేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి మద్దతుగా ఉప్పల్ నియోజకవర్గం నుంచి బయలుదేరిన బిజెపి నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన ఉప్పల్ పోలీసులు. ఈ అక్రమ అరెస్టులతో మా పోరాటాన్ని రైతు ఉద్యమాన్ని ఆపలేరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేంటనే వడ్ల కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి వేడుక

స్వాతంత్ర సమరయోధులు స్వరాజ్య ఏకీకరణ చేసిన భారత దేశపు ఉక్కు మనిషి మాజీ ఉపప్రధాని మరియు మాజీ కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని చిలుకానగర్ చౌరస్తాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన చిలుకానగర్ బిజెపి డివిజన్ నాయకులు.

Party Activities 

దిష్టిబొమ్మ దహనం

చిలుకానగర్ చౌరస్తాలో సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంస్థల మరియు ఉదయ నిధి దిష్టిబొమ్మ దహనం.ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉప్పల్ అసెంబ్లీ బిజెపి శాఖ ఆధ్వర్యంలో నిరసనను తెలియచేస్తూ, డీఎంకే నేత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మను చిలకనగర్ చౌరస్తా లో దహనం చేశారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమం

మన భారత ఆర్మీ జవాన్లు చిల్కానగర్ డివిజన్లలోని పలు చోట్ల స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు దేవాలయాలు, పాఠశాలలు, పార్కులు, మైదానలలో ఉన్న పరిసరాలను శుభ్రం చేశారు. వారితో పాటు చిల్కానగర్ శివాలయంలో గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు.

ఉప ఎన్నికల ప్రచారం

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారి గెలుపు కోసం గతవారం రోజులుగా హుజురాబాద్ టౌన్ లో ఇంటి ఇంటికి వెళ్లుతూ ఓటర్లును కలిసి బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈటెల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.

రోడ్ షో

హుజురాబాద్ లో ఉప ఎన్నికల్లో భాగంగా బిజెపి అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గారి రోడ్ షో లో పాల్గొన్నడం జరిగింది

ఎన్నికల ప్రచారంలో భాగంగా

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ టౌన్ లో బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ అన్నగారికి మద్దతుగా వారి గెలుపు కోసం ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఇంటింటి ప్రచారం

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్న గెలుపు కొరకై ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బూత్ నెంబర్ 47,45, 43,39 లలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

మనోధైర్యం

చిలుకానగర్ శివాజీ సర్కిల్ వద్ద ఉన్న మెడికల్ షాపు షాట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధం అయ్యింది. తెల్లవారుజామున 3.00 గంటల సమయంలో జరిగింది. విషయం తెలుసుకున్న బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ నాయకులు సంఘన స్థలాన్నికి వెళ్లి అధికారులతో మాట్లాడారు అక్కడికి వచ్చిన రెవెన్యూ మరియు పోలీసు అధికారులతో మాట్లాడి భాధితులకు నష్టపరిహారం అందించి అందుకోవాలని అన్నారు. మెడికల్ షాపు యజమాని కైలాష్ ఓదార్చారు వారి కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు.

సమీక్షా సమావేశం

మేడ్చల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ విభాగాలు మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమీక్షా సమావేశం జరిగింది.

ప్రజా సంగ్రామ యాత్ర

ప్రజా సంగ్రామ యాత్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర కు చిలుకానగర్ 7వ డివిజన్ బిజెపి అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తరలిన బిజెపి చిలుకానగర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజా సంగ్రామ యాత్ర లో పది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన బిజెపి నాయకులు. 

జన ఆశీర్వాద యాత్ర

తెలంగాణ ముద్దుబిడ్డ కేంద్ర సంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు జి.కిషన్ రెడ్డి గారి జన ఆశీర్వాద యాత్ర లో భాగంగా చిలుకనగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జన ఆశీర్వాద యాత్రకు భారీర్యాలీతో బయలుదేరడం జరిగింది. 

అక్రమ అరెస్టు

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ని అరెస్టు చేయాలని వరసగా రెండోరోజు నిరసన వ్యక్తం చేస్తున్న మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ గారిని మరియు మల్కాజిగిరి బిజెపి నాయకులను అరెస్టు చేసి ఉప్పల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వారిని పోలీసు స్టేషన్ వెళ్లి కలసిన చిలుకానగర్ 7వ డివిజన్ బిజెపి అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ బిజెపి నాయకులు. 

దిష్టిబొమ్మ దగ్ధం

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మల్కాజిగిరిలో బిజెపి కార్పొరేటర్ శ్రవణ్ పై బిజెపి కార్యకర్తలపై దాడి చేసిన ఎమ్మెల్యే మైనపల్లి అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనపల్లి హనుమంతరావు వేంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చిలుకానగర్ బిజెపి నాయకులు.

ఈటెల రాజేందర్ గారి పాదయాత్ర

మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారి ప్రజా దీవెన యాత్రలో బిజెపి జిల్లా పార్టీ పిలుపు మేరకు చిలుకానగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిలుకానగర్ నుండి హుజురాబాద్ నియోజకవర్గం వెళ్లి ఈటెల రాజేందర్ గారి పాదయాత్ర జమ్మికుంట మండలం గ్రామాల్లో పాదయాత్ర చేశారు. 

దిష్టిబొమ్మ దహనం

భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారి పిలుపు మేరకు చిలుకానగర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు డప్పు దత్త సాయి ఆధ్వర్యంలో నిరుద్యోగ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది

సమస్య పరిష్కారానికి కృషి

పడిన వర్షంకు చిలుకానగర్ లో పోంగిపోరులుతున్న డ్రైనేజీలు ముఖ్యంగా మల్లీఖర్జునగర్ కాలనీలో వర్షంతో డ్రైనేజీ పోంగి కోన్ని ఇళ్లలోకి మురికి నీరు చేరింది. డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పైకి లేచి పడ్డాయి. రోడ్డుపై బురద రెండు మూడు ఇచులు పేరుకుపోయి నడవడానికి ఇబ్బందిగా మారింది. దుర్వాసన వస్తోందని స్థానికులు అవేదనతో బిజెపి నాయకులు దృష్టికి తీసుకొచ్చారు. బిజెపి చిలుకానగర్ డివిజన్ నాయకులు జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులకు తెలుపడం జరిగింది. 

Social Activities

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి భారతీయ జనతా పార్టీ చిలుకనగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ విచ్చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

కొవ్వొత్తుల ర్యాలీ

చిన్నారి చైత్రను హత్య చేసిన నిందితుడిని ఉరి తియ్యలిని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ అభం శుభం తెలియని చిన్నారి చైత్రను హత్య చేసిన నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిన్నారి చైత్రకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

పరిశీలన

రాబోయే వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గౌరీపుత్ర సాగర్ (కాప్రా చెరువు) వినాయక నిమజ్జనం ఏర్పాట్లను చెరువు సందర్శించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షులు జి.రాఘవరెడ్డి గారు, VHP రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారు, కార్యదర్శి రావినూతల శశిధర్ గారు, సహా కార్యదర్శి నాయిని బుచ్చిరెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ రెవెళ్లి రాజు, అసెంబ్లీ కో కన్వీనర్ గోనె శ్రీకాంత్ ముదిరాజ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్ని గణేష్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

శ్రీ కృష్ణ జన్మష్టామి

శ్రీ కృష్ణ జన్మష్టామి సందర్భంగా నిన్న చిలుకానగర్ బొడ్రాయి వద్ద నవీన్ ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మష్టామి వేడుకలకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, చిలుకానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గోనె శైలజ గారు, డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 

ధన్యవాదాలు

దేశ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ఫ్లెక్సీని చిలుకానగర్ వ్యాక్సిన్ సెంటర్ ల వద్ద ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ప్రకియ ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న 371 జయంతి

సర్దార్ సర్వాయి పాపన్న 371 జయంతి సందర్భంగా చిలుకానగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారు పాల్గొన్ని పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పరామర్శ

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నను మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు, మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, జిల్లా అధ్యక్షులు పనాల హరీష్ రెడ్డి గారితో కలసి అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అతని అనుచరులు దాడిలో గాయపడిన శ్రవణ్ గారిని పరామర్శించిన గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారు. 

అటల్ బిహారీ వాజ్ పేయ్ గారి వర్థంతి

భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకలు, కోట్లాది కార్యకర్తలకు మార్గదర్శి, మాకు స్పూర్తి, ప్రేరణ, మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుటూ చిలుకానగర్ బిజెపి డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిలుకానగర్ చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.

75వ స్వాతంత్ర దినోత్సవం

75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ డివిజన్ పరిధిలో పలు చోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్ని జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది.

మహంకాళి అమ్మవారి బోనాల జాతర

ఉప్పల్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్లో పలు ఫలహారం బండ్ల ఊరేగింపులో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారితో మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారితో కలసి పాల్గొన్నాడం జరిగింది.

అబ్దుల్ కలాం గారి వర్థంతి

ఆఖండ భారత రక్షణ రంగంలో అద్భుత విజయాలు సాధించిన శాస్త్రవేత్త మహోన్నత వ్యక్తి జీవితాంతం దేశం కోసం తపించిన దేశభక్తుడు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ విద్యార్థులలో స్పూర్తిని రగిలించి, భావి భారత నిర్మాతలు విద్యార్థులే అని పిలుపు ఇచ్చిన స్వప్నికుడు భరత రత్న మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం గారి వర్థంతి పురస్కరించుకుని చిలుకానగర్ లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారు.

జన్మదినం సందర్భంగా పిల్లలకు భోజనం ఏర్పాటు

బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారి జన్మదినం సందర్భంగా ఆనాధ ఆశ్రమంలోని పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. పిల్లలకు భోజనం ఏర్పాటు చేప్పించి వారికి వడ్డించి వారితోపాటు నేను భోజనం చేయడం జరిగింది. 

మొక్కలు నాటే కార్యక్రమం

జాలై 6 భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా బిజెపి పిలుపు మేరకు జరిగే సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా చిలుకనగర్ డివిజన్ పరిధిలో కాళ్యాణ్ పురి , రాఘవేంద్ర నగర్, బ్యాంక్ కాలనీల్లో ఓబిసి మోర్చా అధ్యక్షులు గొట్టిముక్కల ప్రదీప్ కుమార్ , యువ మోర్చా స్వచ్ఛభారత్ జిల్లా కన్వీనర్ అరగంటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది.

నిత్యావసర సరుకుల పంపిణీ

బీరప్పగడ్డలో ప్రవీణ్ – షారోణ్ ఫాండేషన్ సౌజన్యంతో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. బిజెపి నాయకులు జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారితో కలిసి 100 కుంటుబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు 50kg రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. 

Mr. Gone Srikanth Mudiraj with Eminent Politicians

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

దుబ్బాక శాసనసభ్యులు “రఘునందన్ రావు” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బీజేపీ మేడ్చల్ అధ్యక్షులు “పన్నాల హరీష్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలసిన శ్రీకాంత్ ముదిరాజ్ గారు

మాజీ ఉప్పల్ నియోజికవర్గ సభ్యులు “ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

బిజెపి రాష్ట్ర బిసి మోర్చా అధ్యక్షులు “ఆలే భాస్కర్” గారిని మర్యాదపూర్వకముగా కలసి సన్మానించిన శ్రీకాంత్ ముదిరాజ్ గారు.

Party & Social Activities

Pamphlets

News Paper Clippings

Video Clippings

}
12-07-1986

Born in Nalgonda Village

of Telangana

}
2000

Studied SSC Standard

from Zilla Parishad High School, Uppal

}
2002

Completed Intermediate

from NICT ITI college, Mettuguda

}
2012

Attained Graduation

from Dr. Ambedhkar Degree College, Nampally

}
2016

Completed MP Political Science

from Dr. Ambedhkar Degree College, Nampally

}

Joined in the RSS

}
2012

Joined in the BJP

}
2012-2013

Active Leader

of BJP

}
2013

BJYM Uppal President

}

7th Division General Secretary

of Chilkanagar, BJP

}
Till Now

7th Division President

of Chilkanagar, BJP