Dandaboina Anil Yadav | Councilor | Yadagirigutta | CPI | Telangana | the Leaders Page

Dandaboina Anil Yadav

09th Ward Councillor, CPI, Yadagirigutta, Yadadri-Bhuvanagiri, Telangana

My Journey in Service and Community Leadership

“Since beginning my journey in community service, my goal has always been to improve the lives of the people in Yadagirigutta. As a Councilor, I have worked on basic infrastructure projects like installing street lights, cleaning drainage systems, and repairing water sources to create a safer, healthier environment. My role with the CPI Party has allowed me to take action on critical social issues, from fighting corruption to supporting land rights for SC and ST communities. I am especially dedicated to empowering backward communities and raising awareness about their growth and recognition in society through awareness camps and public support programs.

In challenging times, like the COVID-19 crisis, I believe it’s crucial to act with compassion. I provided food, financial aid, and health resources, such as masks and sanitisers, to the underprivileged while organizing a COVID vaccination drive to encourage safety in our community. Environmental efforts are also close to my heart, and through programs like Palle Pragathi and Swachh Bharat, I have promoted cleanliness and tree planting to protect our village. My mission is to serve Yadagirigutta with integrity and dedication, ensuring everyone has the dignity, support, and opportunities they deserve.”

Dandaboina Anil Yadav

09th Ward Councillor, CPI, Yadagirigutta, Yadadri-Bhuvanagiri, Telangana

Early Life and Education

Mr. Dandaboina Anil Yadav, a visionary leader with roots in Yadagirigutta, Telangana, was born on 20th September 1991 to his parents, Veeraswamy and Sathemma. Growing up in a family deeply connected to their community, Mr. Yadav was instilled with values of dedication and service from an early age. His upbringing in the culturally rich town of Yadagirigutta laid the foundation for his future aspirations and his unwavering commitment to his people.

Schooling and Foundational Education

Mr. Anil Yadav began his formal education in 2007 by completing his SSC at the Zilla Parishad High School (ZPHS) in Yadagirigutta. This foundational period helped shape his early academic abilities and gave him insight into the challenges faced by students in rural communities, something he would carry with him throughout his career.

Pursuit of Technical Skills

After completing his schooling, Mr. Anil Yadav showed a keen interest in acquiring technical skills. From 2011 to 2012, he pursued a Diploma at the renowned Jawaharlal Nehru Government Polytechnic (JNGP) in Ramanthapur. His education in technical subjects gave him hands-on experience and knowledge, preparing him for the next step in his journey.

Higher Education in Engineering

In 2015, Mr Anil Yadav successfully completed his Bachelor of Technology (B.Tech) degree from Samskruthi College in Ghatkesar. His specialization in engineering provided him with a strong academic foundation and equipped him with the analytical skills and problem-solving abilities essential for a career dedicated to innovation and societal improvement.

Career in Community Leadership and Public Service

Career in Community Leadership and Public Service

Mr. Dandaboina Anil Yadav’s career is marked by a deep commitment to community welfare and public service, exemplifying his dedication to the people of Yadagirigutta. His work in various social initiatives and active participation in political service reflect his passion for addressing the pressing needs of his community.

Transformative Community Initiatives

As a proactive leader, Mr. Yadav has championed essential community development projects within the 9th Ward of Yadagirigutta. He has played a crucial role in the installation of street lights to enhance safety, the regular cleaning and maintenance of drainage systems to improve sanitation, and the repair of water boreholes to ensure consistent access to clean water. These initiatives not only address the immediate needs of the people but also reflect his commitment to building sustainable infrastructure for the long term.

Political Journey and Dedication to Social Causes

Mr. Yadav officially entered the political arena in 2020, joining the Communist Party of India (CPI) and embarking on a journey to amplify his impact on society. His dedication and community involvement earned him the trust of his constituents, leading to his election as Councilor of the 9th Ward in Yadagirigutta. In this role, he actively works to improve the lives of his community members, tackling local issues and advocating for the welfare of the people he represents.

Personal Commitment to Health and Social Welfare

Beyond his formal responsibilities, Mr. Yadav demonstrates an unwavering commitment to social welfare by regularly donating blood every nine months—a testament to his personal dedication to helping those in need. His commitment to health and social causes underscores the compassionate spirit that drives his approach to leadership.

Mr. Anil Yadav’s journey from a community activist to a Councilor exemplifies his vision for a better future and his dedication to public service, earning him respect and admiration from his community. His leadership, rooted in empathy and action, continues to make a significant impact in Yadagirigutta. 

Championing Social Justice and Empowerment for the Backward Communities

  • Anil Yadav has been serving the Backward Community People for their growth and recognition in society.
  • To spread awareness about the mission and vision of the LHPS, Many awareness camps have been conducted in the locality striving hard to preserve or restore dignity.
  • He is a staunch opponent of anti-corruption efforts. He said that gaining money via corruption is a disgrace to our nation and that such money is similar to scrap paper. He also stated that individuals who make money through corruption do not deserve to be respected by their peers in society.
  • He protested that skyrocketing petrol, diesel, and gas prices would become another problem for ordinary people in the community.
  • In case of any issues with the land of the SC and ST people, he remained and argued the issues and handed over the lands to them.

Dedication to Community Health and Environmental Sustainability

  • Dirty drains were covered in the expectation that by closing the drains and the Dumping Yards, the odour and sickness that emanated from them would be stopped.
  • Anil Yadav built a cemetery for the landless and homeless people on the land and Much effort has been made into the construction.
  • As a part of environmental protection, Anil Yadav has taken an active role by participating in the Palle Pragathi and Clean and Green by casting the plants in the village.
  • On focusing ng the improvement in cleanliness and hygiene in urban and rural areas, workplaces, and homes, Anil Yadav Conducted the Swachh Bharat Program on the saying of One step towards cleanliness by sanctioning loans for constructing restrooms in every house of the village.

Humanitarian Leadership During the Covid-19 Crisis

 

  • Anil Yadav acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Anil Yadav responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitisers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the coronavirus outbreak.
  • In response to Prime Minister Modi’s call, he organized a COVID Vaccination Drive to raise awareness among the general public about the need to receive a free coronavirus vaccination.
H.No: 4-251/E, Landmark: Yadagirigutta Old Temple, Village&Mandal: Yadagirigutta, District: Yadadri-Bhuvanagiri, State: Telangana, Zipcode: 508,115

E-mail:[email protected]

Contact:+91-9293940878

You are a leader if your actions encourage others to dream bigger, perform better, and improve the Best.

-Dandaboina Anil Yadav

Party Activities

వినతి పత్రం అందజేత

తేది 10-05-2020 యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుండి రావలసిన 30% గ్రాండ్ ని యాదగిరిగుట్ట మున్సిపల్ కి ఇవ్వాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ కౌన్సిలర్ అనిల్ కుమార్, ముక్కర్ల మల్లేష్, వాణి భరత్, సీసా విజయ గార్లు పాల్గొన్నారు .

నూతన 135 Mts సీసీ రోడ్డు పనులు

తేదీ : 20/10/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని ఇందిరా కాలనీలో ప్రైమరీ స్కూల్ నుండి పాత గుట్ట ప్రధానమైన రహదారి వరకు నూతన 135 Mts సీసీ రోడ్డు పనులు కౌన్సిలర్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పూర్తిచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎర్ర శంకర్, బైరాగాని ప్రకాష్ గారు బొడ్డు కృష్ణ, బొజ్జ శివ ప్రసాద్,కారింగుల వేణు పాల్గొన్నారు.

నూతన 135 Mts సీసీ రోడ్డు పనులు

తేదీ : 20/10/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని ఇందిరా కాలనీలో ప్రైమరీ స్కూల్ నుండి పాత గుట్ట ప్రధానమైన రహదారి వరకు నూతన 135 Mts సీసీ రోడ్డు పనులు కౌన్సిలర్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పూర్తిచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎర్ర శంకర్, బైరాగాని ప్రకాష్ గారు బొడ్డు కృష్ణ, బొజ్జ శివ ప్రసాద్,కారింగుల వేణు పాల్గొన్నారు.

నూతన 135 Mts సీసీ రోడ్డుకి పూజా కార్యక్రమం

తేదీ : 16/10/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని ఇందిరా కాలనీలో ప్రైమరీ స్కూల్ నుండి పాత గుట్ట ప్రధానమైన రహదారి వరకు నూతన 135 Mts సీసీ రోడ్డుకి పూజా కార్యక్రమం వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుధా హేమెంధర్ , మరియు వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

పాతగుట్ట ఆలయ అభివృద్ధి పట్ల స్థానికుల వినతి

తేదీ: 29/09/2024 న పాతగుట్టకు చెందిన స్థానికులు, వ్యాపారస్తులు, ఆటో కార్మికులు కలిసి, యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి గారికి వినతి పత్రం అందజేశారు. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం మీదుగా ప్రకటనలు నిలిపివేయబడినప్పటి నుంచి భక్తుల రద్దీ తగ్గడంతో, ఆలయ పూర్వ వైభవం కోసం మునుపటి ప్రకటనలు, కార్యక్రమాలు పునరుద్ధరించాలని కోరారు.

పరిసర ప్రాంతాలను శుభ్రం చేపించడం

తేదీ : 29/08/2024 రోజున యాదగిరిగుట్ట టౌన్ పరిధిలోని పాతగుట్ట, పెద్దిరెడ్డిగూడెం గ్రామాల్లో పోచమ్మ, బోనాల పండగకి వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు లైటింగ్, క్లీనింగ్, మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేపించడం జరిగింది. రోడ్డు పైన ఉన్న గుంతలను కూడా మొరం పోసి మరమ్మత్తులు దగ్గర ఉండి చేపించిన వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు.

లైటింగ్, క్లీనింగ్, మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేపించడం

తేదీ : 29/08/2024 రోజున యాదగిరిగుట్ట టౌన్ పరిధిలోని పాతగుట్ట, పెద్దిరెడ్డిగూడెం గ్రామాల్లో పోచమ్మ, బోనాల పండగకి వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు లైటింగ్, క్లీనింగ్, మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేపించడం జరిగింది. రోడ్డు పైన ఉన్న గుంతలను కూడా మొరం పోసి మరమ్మత్తులు దగ్గర ఉండి చేపించిన వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు.

పరిష్కరించడం

తేదీ : 12/07/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని పాత గుట్ట వెళ్ళు ప్రధానమైన రహదారి గుంతల మయంగా ఉండడం వల్ల ఇట్టి గుంతలను సీసీ ప్యాచ్ వర్క్లు మున్సిపల్ నిధులతోని వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు 2లక్షల రూపాయలతో పరిష్కరించడం జరిగింది. ఆటో కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

యూనిఫామ్ మరియు పుస్తకాలు పంపిణి

తేదీ : 26/06/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని ఇందిరా కాలనీలోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్కూలు యూనిఫామ్ మరియు పుస్తకాలు, మున్సిపల్ 9వ వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పంపిణి చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు గారు, స్కూల్ చైర్మన్ గారు విద్యార్థులు పాల్గొన్నారు.

క్లీనింగ్ చేయించడం

తేదీ :09/05/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని పెద్దిరెడ్డిగూడెం స్మశాన వాటిక స్థలాన్ని డోజర్ తో క్లీనింగ్ చేయించడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు పాల్గొన్నారు.

స్కూల్ విద్యార్థులకు అందజేయడం

తేదీ :16/04/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని ఇందిరా కాలనీలో ప్రైమరీ స్కూల్లో Divi’s laboratories Ltd వారి సహాయంతో వాటర్ బాటిల్స్ ని వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు అందజేయడం జరిగింది.

నిర్మాణం

తేదీ : 28/03/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని సాయిబాబా గుడి పక్కన ఉన్నటువంటి రోడ్డును 3 లక్షల రూపాయలతో వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరణ

తేదీ : 26/01/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులోని ఇందిరా కాలనీలో అంగన్వాడి దగ్గర జెండా ఆవిష్కరణ లో పాల్గొన్న కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు, కౌన్సిలర్ మామత, అంగన్వాడీ టీచర్ ఉమా, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

గుంతలు పూడ్చడం

తేదీ:04/03/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని పాత గుట్టలో కొత్త కళ్యాణ మండపం దగ్గర గేటు ముందు రోడ్డు గుంతలుగా ఉండడం వలన అట్టి గుంతలలో మురంపొపించి డోజర్ తో గుంతలు పూడ్చడం జరిగింది.

ఓపెన్ డ్రైనేజీ

తేదీ: 06/02/2024 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డ్ లోని ప్రశాంత్ నగర్ లో కొబ్బరికాయ కోట వెనుక భాగంలో ఓపెన్ డ్రైనేజీ 3 లక్షల రూపాయలతో ప్రారంభించిన, పూర్తిచేసిన వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు

అంత్యక్రియలు

తేదీ 18/01/2024 రోజున ఇందిరా కాలనీకి చెందిన బండారి కనకరాజు అనే యువకుడు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. మరణించినటువంటి కనకరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం చేపించి మరియు అంత్యక్రియలు దగ్గరుండి నిర్వహించినటువంటి వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు

తేదీ : 24/12/2023 రోజున యాదగిరి గుట్ట మునిసిపల్ పరిధిలో ని ఇందిరా కాలనీ లో సుంచు స్వామి ఇంటి దగ్గర నుండి బైరగాని అంజయ్య గారి హోటల్ వెనుక వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు, ఇట్టి కార్యక్రమం లో పాల్గొన్న కాలనీ పెద్దలు

రోడ్డు నిర్మాణ పనులు

తేదీ : 26/11/2023 రోజున యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులోని ప్రశాంత్ నగర్ లో సీసీ రోడ్డు పనులు 19 లక్షల రూపాయలతో ప్రారంభించిన వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు. ఈ రోడ్డు గతంలో గుంతలుగా ఉండడం వాళ్ళ స్థానికులకి చాలా ఇబందికరంగా ఎర్పడిందని, ఇట్టి సమస్య ని చుక్కల ఐలయ్య గారి ఇంటి నుండి యాదగిరిగుట్ట ప్రధానమైన రోడ్డు( మెయిన్ రోడ్డు ) వరకు రోడ్డు నిర్మాణ పనులు కౌన్సిలర్ అనిల్ గారు పూర్తిచేయడం జరిగింది.

Recent Activities

గణతంత్ర దినోత్సవం వేడుక

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి వికలాంగుల కాలనీలో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసిన దండబోయిన అనిల్ కుమార్ గారు.

సహాయం

యాదగిరి గుట్ట లో తప్పి పోయిన బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ కి ఫోన్ చేసి వారికి దగ్గరుండి అప్పచెప్పిన కౌన్సిలర్ దండ బోయిన అనిల్ కుమార్ గారు

స్మశాన వాటిక శుబ్రం

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి పెద్దిరెడ్డి గూడెం స్మశాన వాటిక లో జెసిబి సహాయంతో శుబ్రం చేయించిన 9th వార్డు కౌన్సిలర్ దండబోయిన అనిల్ కుమార్ గారు.

శంకుస్థాపన

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9 వార్డులోని పాత గుట్టలో కొత్త కళ్యాణమండపం నుండి సాదునేని మహేందర్ రావు బావి దగ్గరి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను దాదాపు 12 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది

వార్షిక క్యాలెండర్ ను డోర్ టు డోర్ అందజేత

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తొమ్మిదో వార్డులో ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త డబ్బాలను మరియు వార్షిక క్యాలెండర్ ను డోర్ టు డోర్ తన వార్డు మొత్తం పంచిన వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు. 

పింఛన్ అందజేత

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి దివ్యాంగుల కాలనీలో పింఛన్ వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వాలని వినితి పత్రం అందజేసిన తర్వాత దండబోయిన అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో దివ్యంగుల కాలనీలోనే సెంటర్ ఓపెన్ చేసి వారికి పింఛన్ అందచేశారు.

వినతి పత్రం

యాదగిరిగుట్ట పట్టణంలోనీ దివ్యాంగుల కాలనీలోని ప్రతి నెల పింఛనివ్వాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ జంపాల రజితకు వార్డు కౌన్సిలర్ దండ బోయిన అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి దివ్యాంగులు వినతి పత్రం అందజేశారు.

సమస్యను పరిష్కరించిన సందర్భంలో

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి 9వ వార్డు లో ఉన్న ప్రశాంత్ నగర్ లో శాగంటి శ్రీరాములు ఇంటి ముందు ఉన్నటువంటి మోరీ రోడ్డు ప్రమాదకరంగా ఉన్నందున అట్టి సమస్యను పరిష్కరించిన 9th వార్డ్ కౌన్సిలర్ దండ బోయిన అనిల్ కుమార్ గారు.

సమస్యను పరిష్కరించిన సందర్భంలో

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి వికలాంగుల కాలనీలో ప్రధానంగా నడిచేదారి గుంతలు పడి ప్రమాదంగా మారినటువంటి దారిని సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన 15 రోజులలో 60000 రూపాయలు తన స్వంత నిధులతో రోడ్డు వేసి సమస్యను పరిష్కరించిన 9th వార్డు కౌన్సిలర్ దండ బోయిన అనిల్ కుమార్ గారు మరియు గడ్డమీది సత్తయ్య నెమిలె బిక్షపతి కాల్వ బాలరాజ్ మరియు హరీష్ బాలస్వామి పాల్గొన్నారు.

మరమ్మత్తులను చేపడతానని హామీ ఇచ్చిన సందర్భంలో

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి వికలాంగుల కాలనీలో ప్రధానంగా నడిచేదారి గుంతలు పడి ప్రమాదంగా మారినటువంటి దారిని గుర్తించి వాటి మరమ్మత్తులను చేపడతానని హామీ ఇచ్చిన 9th వార్డు కౌన్సిలర్ దండ బోయిన అనిల్ కుమార్ గారు.

కుక్కలను పందులను పట్టేవారు వచ్చి వాటిని తరలించేంతవరకు దగ్గరుండి చూసుకున్నసందర్భంలో

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి ప్రశాంత్ నగర్ తొమ్మిదవ వార్డు లో పందులు మరియు కుక్కల సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం అందచేయగా వారు కుక్కలను పందులను పట్టేవారు వచ్చి వాటిని తరలించేంతవరకు దగ్గరుండి చూసుకున్న 9 th వార్డు కౌన్సిలర్ దండ బోయిన అనిల్ కుమార్ గారు.

వినతి పత్రం

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి తొమ్మిదవ వార్డులో కుక్కలు మరియు పందుల సమస్యను పరిష్కరించాలని యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేసిన 9 th వార్డు కౌన్సిలర్ దండ బోయిన అనిల్ కుమార్ గారు మరియు పాండురాజు ప్రసాద్ గారు, గడ్డమీది వేణు గారు, భాను ప్రసాద్ గారు పాల్గొన్నారు.

చెట్లు నాటిన సందర్భంలో

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో 9వ వార్డుకు సంబంధించిన స్మశాన వాటికలో చెట్లు నాటిన 9ధ్ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దండబోయిన అనిల్ కుమార్ గారు. 

రొట్టెలు అరటి పండ్లు అందజేసిన సందర్భంలో

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన కరోనా మహమ్మారితో భక్తులు లేకపోవడంతో కొండ మీద ఉన్నటువంటి కోతులకు ఆహారం కరువు ఏర్పడటంతో 9 థ్ వార్డ్ కౌన్సిలర్ దండబోయిన అనిల్ కుమార్ గారు వాటికి రొట్టెలు అరటి పండ్లు అందించారు. 

హైపోక్లోరైడ్ సొల్యూషన్ తో స్ప్రే చేసిన సందర్భంలో

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి తొమ్మిదవ వార్డు ప్రశాంత్ నగర్ లో కరోనా మహమ్మారితో చనిపోయిన రాజు గారి ఇంటి పరిధిలో తానే స్వయంగా దండబోయిన అనిల్ కుమార్ గారు హైపోక్లోరైడ్ సొల్యూషన్ తో స్ప్రే చేయడం జరిగింది

రక్తదాన శిబిరం

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో కరోనా మహమ్మరి తో బాధపడుతున్న వారికి ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి తొమ్మిదవ వార్డు నుండి తనతోపాటు 70 మంది యువకులు రక్తదాన శిబిరంలో రక్తం ఇవ్వడం జరిగింది.

100 కిలోల బియ్యం ఆర్థిక సహాయంగా అందజేసిన సందర్భంలో

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9 వ వార్డులోనీ పాతగుట్ట లోని చాగంటి గంగాధర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. అట్టి కుటుంబానికి అండగా ఉంటారని వార్డ్ కౌన్సిలర్ అనిల్ గారు మాట ఇచ్చి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం గా 100 కిలోల బియ్యం చేయడం జరిగింది

వినతి పత్రం

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుండి రావలసిన 30% గ్రాండ్ ని యాదగిరిగుట్ట మున్సిపల్ కి ఇవ్వాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ గారు, కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు, ముక్కర్ల మల్లేష్ గారు, వాణి భరత్ గారు, సీసా విజయ గార్లు పాల్గొన్నారు.

నిరసన

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తొమ్మిదో వార్డు పాత గుట్టలో ఉన్న ఫంక్షన్ హల్ లలోపెళ్ళిళ్ళు మరియు ఎలాంటి కార్యక్రమాలు జరుపుటకు అనుమతి లేదు మరియు భక్తులకు నిద్ర చేయడానికి దర్శనాలకు కూడా అధికారికంగా కూడా అనుమతి లేదు అని కాపలాగా యువకులను కాపలాగా పెట్టిన దండబోయినా అనిల్ కుమార్ గారు.

వినతిపత్రం అందజేత

కరోనా లాక్ డౌన్ సందర్భంలో యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధి ప్రజలకు కరోనా పట్ల జాగ్రత్తలు అవగాహన కల్పించాలని యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్ అందరూ యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

పిచ్చి మొక్కలు తొలిగించిన సందర్భంలో

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తొమ్మిదో వార్డులోని ఇందిరా కాలనీలో పందుల సమస్యని గుర్తించి సమస్య పరిష్కరిస్తామని వార్డు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.

సమస్య పరిష్కరణ

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తొమ్మిదో వార్డులోని ఇందిరా కాలనీలో పందుల సమస్యని గుర్తించి సమస్య పరిష్కరిస్తామని వార్డు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. 

సాయం

9వ వార్డ్ కి చెందిన నమిల బిక్షపతి గారి అమ్మగారు అనారోగ్యంతో మరణించిన కారణంగా వారి కుటుంబానికి వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు 100 KG ల బియ్యం ని సాయం చేయడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో BRS నాయకులు భరత్, నర్సింహా, CPI నాయకులు మల్లయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రం

యాదగిరిగుట్ట మున్సిపల్ 9వ వార్డ్ పాతగుట్ట లోని పెద్దిరెడ్డిగూడెం లోని స్మశాన వాటికని పరిశుభ్రం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

బియ్యం అందజేత

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఇటీవల 7వ వార్డ్ కి చెందిన మున్సిపల్ సిబ్బంది అయినటువంటి సురుపంగ కిష్టయ్య గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి 9వ వార్డ్ కౌన్సిలర్ దండబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి 100 కిలోల బియ్యం ను డొనేట్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్యాధపాక వెంకటేష్, సురుపంగ శ్రీను, బండి ఆనంద్, మధు, బాలస్వామి, హరిబాబు, బాలరాజు గారు పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్న 9వ వార్డ్ లోని పెద్దిరెడ్డిగూడెం లో స్మశాన వాటిక పనులు 90% పూర్తి చేయడం జరిగింది… ఇట్టి స్మశాన వాటిక స్థలం కొరకు కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు దాతలను వెతికి వారితో దాదాపుగా 22 గుంటల భూమిని మున్సిపల్ ఆఫీసు కి రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా ఒక సంవత్సర కాలంలోనే 90% పనులను అభివృద్ధి చేయడం జరిగింది ..

చర్యలు

గౌరవ మున్సిపల్ శాఖామంత్రి కేటర్ గారు మరియు ఎం ఎల్ ఏ గొంగిడి సునీత మేడమ్ గారి ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట పురపాలక పరిధిలోని 12 వార్డులలో సీసీ రోడ్స్ డ్రైనేజీ సమస్యలు మరియు మౌలిక సదుపాయాల గురించి ఎవరికీ యే సమస్యలు ఉన్నాయో పుర వాసులతో చర్చించి మున్సిపల్ ఛైర్మెన్ గారికి వార్డ్ సమస్యల గురించి వివరాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ సుధా హేమేందర్ గౌడ్ గారు, వైస్-చైర్మన్ కాటంరాజు గారికి 9 వ వార్డులో ఉన్న సమస్యల వివరాలు ఇవ్వడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో 9వ వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు కో_ఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబా గారు, TRS నాయకులు పాండవుల భాస్కర్ గారు,పాపట్ల నరహరి గారు, మాటురీ వెంకటయ్య గారు, శాగంటి రాజమల్లు గారు,  శాగంటి సత్తయ్య గారు, గడ్డమీది సాయిలు గారు పాల్గొన్నారు.

బియ్యం అందజేత

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఇటీవల 7వ వార్డ్ కి చెందిన మున్సిపల్ సిబ్బంది అయినటువంటి సురుపంగ కిష్టయ్య గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి 9వ వార్డ్ కౌన్సిలర్ దండబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి 100 కిలోల బియ్యం ను డొనేట్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్యాధపాక వెంకటేష్, సురుపంగ శ్రీను, బండి ఆనంద్, మధు, బాలస్వామి, హరిబాబు, బాలరాజు గారు పాల్గొన్నారు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

దుప్పట్లు పంపిణీ

వికలాంగుల దినోత్సవ సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో 9వ వార్డ్ లో వికలాంగుల కాలనీ లో స్థానిక కౌన్సిలర్ దండ బోయిన అనిల్ కుమార్ యాదవ్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అనిల్ మాట్లాడుతూ వికలాంగుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ వికలాంగులకు ఏ ఆపద వచ్చినా ముందుండి వారిని ఆదుకుంటానని అన్నారు. వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మరియు వికలాంగులు హాజరయ్యారు

డ్రైనేజీ పనులు ప్రారంభోత్సవం

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో 9వ వార్డ్ లోని ఇందిరా కాలనీ లో 3 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు వార్డ్ సభ్యులు శంకర్ గారు, ప్రకాష్, రామచందర్ గారు,రాములు గారు, గంగారాం గారు, పొన్నాల రాములు గారు, సమ్మయ్య గారు, సాయి గారు తదితరులు పాల్గొన్నారు.

సభ కార్యక్రమం

వికలాంగుల హెల్పింగ్ సొసైటీ. మొదటి వార్షికోత్సవ సభలో వికలాంగుల హక్కులు మరియు స్థానిక సంస్థలలో వారికి రావాల్సిన రిజర్వేషన్ 5% , రావడం లేదు అని కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు సభ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బీర్ల ఐలయ్య, మరియు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు, మరియు వికలాంగులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

యాదగిరిగుట్ట 09వ వార్డ్ లో నూతన సంవత్సర 2023 క్యాలెండర్ను ప్రశాంత్ నగర్ లో కొబ్బరికాయ కోట దగ్గర వార్డ్ ప్రజలతో ఆవిష్కరించిన వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు.ఇట్టి కార్యక్రమంలో వార్డ్ ప్రజలు పాల్గొన్నారు..

ప్రారంభోత్సవం

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్న 9వ వార్డ్ లోని ఇందిరా కాలనీలోని ప్రాధమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలలో వాటర్ ప్యూరీఫైర్ ని ప్రారంభించడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు, పాఠశాల హెడ్మాస్టర్ , మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బట్టలు, సబ్బులు పంపిణీ

గణతంత్ర దినోత్సవ సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి బట్టలు, సబ్బులు, మున్సిపాలిటీ తరపున పంచడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్, కమిషనర్,కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, కౌన్సిలర్,లు కో-ఆప్షన్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్న 9వ వార్డ్ లోని ఇందిరా కాలనీలోని అంగన్వాడీ కేంద్రం దగ్గర గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్, అంగన్వాడీ టీచర్, సిబ్బంది,యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం నాయకులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు

లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట అనుసంధానం అయిన 09వ వార్డులోని పాత గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు 31/1/2023 నుండి ప్రారంభం కావడంతో యాదగిరిగుట్ట మున్సిపల్ 9వ వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.

గణతంత్ర దినోత్సవ వేడుకలు

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్న 09వ వార్డ్ లోని ఇందిరా కాలనీలోని ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ అనిల్ కుమార్ గారు, పాఠశాల హెడ్మాస్టర్ , మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ఆహ్వానం

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డు లోని పెద్ద రెడ్డిగూడెంలో పోచమ్మ తల్లి 1/3/2023 బుధవారం విగ్రహ ప్రతిష్ట, 2/3/2023 గురువారం అమ్మవారి కళ్యాణం, భోనాల పండుగ కి , ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బీర్ల ఐలయ్య గారిని పెద్దిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు ఆహ్వానించడం జరిగింది.

అవగాహన కార్యక్రమం

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో 09వ వార్డ్ లోని ఇందిరాకాలనీలో తడి చెత్త పొడి చెత్త పైన వార్డ్ ప్రజలకు అవగాహన కల్పించడం , మరియు ఇందిరాకాలనీ లోని ప్రాధమిక పాఠశాలలో కూడా పిల్లలకు అవగాహన చెపుతూ వారి ఇంట్లో కూడా ఎలా తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి అని అవగాహన చెపుతున్న వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్. గరు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు, RP లు, వార్డ్ ప్రజలకు పాల్గొన్నారు.

ఆహ్వానం

గుట్ట పట్టణ పరిధిలోని పెద్దిరెడ్డిగూడెంలో మార్చి 1వ తేదీన నిర్వహించనున్న శ్రీపోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరు కావాలని కోరుతూ హైదరాబాద్లో ప్ర భుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గారిని, యాదగిరిగుట్టలో టెస్కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి గారిని వేర్వేరుగా కలిసి ఆ ప్రాంత పెద్దలు ఆహ్వానం పలికారు. కౌన్సిలర్ దండెబోయిన అనిల్కుమార్, నాయకులు గంగసాని రామారావు, గంగసాని నవీన్ కుమార్, మల్లయ్య, సత్తయ్య, మాటూరి సురేష్, సుధాకర్, సతీష్ తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.

కంటి వెలుగు కార్యక్రమం

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డ్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమం నూతనంగా 9వ వార్డ్ లో నిర్వహించడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ ఎరుకల సుధ హేమందర్ గారు, వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు..

స్ప్రెట్స్ పంపిణీ

కంటి పరీక్ష అనంతరం స్ప్రెట్స్ పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు..

పరిశుభ్రత

యాదగిరిగుట్ట మున్సిపల్ 9వ వార్డ్ పాతగుట్టలోని పెద్దిరెడ్డిగూడెంలోని స్మశాన వాటిక శుభ్రం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

స్మశాన వాటిక పరిశుభ్రత

యాదగిరిగుట్ట మున్సిపల్ 9వ వార్డ్ పాతగుట్టలోని పెద్దిరెడ్డిగూడెంలోని స్మశాన వాటిక శుభ్రం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

స్మశానవాటిక భూమి పూజ

20/7/2022 న స్మశానవాటిక భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

వాటర్ బాటిల్లు పంపిణీ

దివిస్ లాబొరేటరీస్ వారి సహకారంతో యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 09వ వార్డ్ లోని ఇందిరాకాలనీ లోని ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి వాటర్ బాటిల్లు మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధ హేమందర్ గారు, వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్, కౌన్సిలర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సభ కార్యక్రమం

వికలాంగుల హెల్పింగ్ సొసైటీ. మొదటి వార్షికోత్సవ సభలో వికలాంగుల హక్కులు మరియు స్థానిక సంస్థలలో వారికి రావాల్సిన reservation 5% , రావడం లేదు అని కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు సభ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బీర్ల ఐలయ్య, మరియు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు, మరియు వికలాంగులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్న 9వ వార్డ్ లోని పెద్దిరెడ్డిగూడెం లో స్మశాన వాటిక పనులు 90% పూర్తి చేయడం జరిగింది.

యాదగిరిగుట్ట మున్సిపల్ 9వ వార్డ్ పాతగుట్ట లోని పెద్దిరెడ్డిగూడెం లోని స్మశాన వాటిక లో ఈరోజు క్లీనింగ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు

సమస్యల వివరాలు

గౌరవ మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ గారు మరియు ఎం ఎల్ ఏ గొంగిడి సునీత గారి ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట పురపాలక పరిధిలోని 12 వార్డులలో సీసీ రోడ్స్ డ్రైనేజీ సమస్యలు మరియు మౌలిక సదుపాయాల గురించి ఎవరికీ యే సమస్యలు ఉన్నాయో పుర వాసులతో చర్చించి మున్సిపల్ ఛైర్మెన్ గారికి వార్డ్ సమస్యల గురించి వివరాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ సుధా హేమేందర్ గౌడ్ గారు, వైస్-చైర్మన్ కాటంరాజు గారికి 9 వ వార్డులో ఉన్న సమస్యల వివరాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో 9వ వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు కో_ఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబా గారు, టీఆర్ఎస్ నాయకులు పాండవుల భాస్కర్ గారు,పాపట్ల నరహరి గారు, మాటురీ వెంకటయ్య గారు,శాగంటి రాజమల్లు గారు, శాగంటి సత్తయ్య గారు, గడ్డమీది సాయిలు గారు పాల్గొన్నారు.

దుప్పట్లు పంపిణీ

వికలాంగుల దినోత్సవ సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో 9వ వార్డ్ లో వికలాంగుల కాలనీ లో స్థానిక కౌన్సిలర్ దండ బోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అనిల్ గారు మాట్లాడుతూ వికలాంగుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ వికలాంగులకు ఏ ఆపద వచ్చినా ముందుండి వారిని ఆదుకుంటానని అన్నారు.వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మరియు వికలాంగులు హాజరయ్యారు.

తడి చెత్త పొడి చెత్త డబ్బాలు పంపిణి

తడి చెత్త పొడి చెత్త డబ్బాలు మరియు క్యాలెండర్లు ఇంటింటికీ పంచడం జరిగింది

పెన్షన్

వికలాంగుల కాలనీ లో పెన్షన్ దగ్గర ఉండి ఇప్పించడం జరుగుతుంది

డ్రైనేజీ పనులు

వార్డ్ లో డ్రైనేజ్ మోరీ ని దగ్గనుండి నిర్మింపచేస్తున్న యాదగిరిగుట్ట 9వ వార్డ్ కౌన్సిలర్ అనిల్ యాదవ్ గారు.

హరితహార కార్యక్రమం

హరితహార కార్యక్రమం లో భాగంగా దాదాపుగా కౌన్సిలర్ అనిల్ గారు ఒక్కరే 80 మొక్కలను నాటకం జరిగింది

బియ్యం పంపిణీ

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి 100 కిలోల బియ్యం ని సహాయం చేయడం జరిగింది.. అంతేకాకుండా దాదాపుగా ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల మరణించిన కుటుంబాలకు 90% వరకు 100 KGs బియ్యం ఇవ్వడం జరిగింది.

నిర్బంధం

వార్డ్ లోని యువకులు మరియు కౌన్సిలర్ తమ వార్డ్ లోకి మరియు బయట వ్యక్తులను రానివ్వకుండా నిర్బంధం చేసి తన వార్డ్ సభ్యులను కాపాడుకోవడం జరుగుతుంది..

బ్రహ్మోత్సవం సందర్బంగా..

యాదగిరిగుట్ట 9th Ward నుండి మొదటిసారిగా అనిల్ యాదవ్ గారు శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

బ్రహ్మోత్సవంలో ...

శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి వారిని ఉరేగిస్తున్నా కార్యక్రమంలో పాల్గొన్నా అనిల్ యాదవ్ గారు.

హరితహర కార్యక్రమంలో

హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

విజయోత్సవ ర్యాలీ....

 యాదగిరిగుట్ట 9th Ward నుండి మొదటిసారిగా కౌన్సిలర్ గా ఎన్నికైన సందర్భంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాను నివాళులర్పిస్తున్నా అనిల్ యాదవ్ గారు మరియు పార్టీ కార్యకర్తలు .

మహాసభలో సన్మానం

సిపిఐ భువనగిరిలో జరిగినటువంటి మహాసభలకు విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు చాడ వెంకటరావు గారు ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్ లో సిపిఐ సింబల్ మీద గెలిచిన అటువంటి దండ బోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి మహాసభలో సన్మానం చేయడం జరిగింది

యాదగిరిగుట్టలో కాంగ్రెస్ , సిపిఐ కూటమి కౌన్సిలర్లను సన్మానిస్తున్న నాయకులు మరియు కార్యకర్తలు

పారిశ్యుద్ద పనులను పరిశీలిస్తున్నా దండబోయిన అనిల్ యాదవ్ గారు

యూత్ అసోసియేషన్ సభ్యులతో

బ్లడ్ డొనేట్ చేసిన దండబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు ,తన తోటి స్నేహితులను కూడా బ్లడ్ డొనేట్ చేయించాడు.

Social Activities

News Paper Clippings

Video Clippings

Video Clippings

}
20-09-1991

Born in Yadagirigutta

}
2007

Completed SSC Standard

from ZPHS School in Yadagirigutta

}
2012

Diploma

from JNGP, Ramanthapur

}
2015

Graduation

from Samskruthi College, Ghatkesar.

}
2020

Joined in the CPI Party

}
2020-Till Now

Councillor

of 9th Ward, Yadagirigutta