Bodhigeli Srinivas | the Leaders Page | Narayanpet Constituency Incharge | the Leaders Page

Bodhigeli Srinivas

Narayanpet Constituency Incharge, Narayanpet, Telangana, BSP

Bodhigeli Srinivas is an Indian Politician and currently Narayanpet Constituency Incharge from the BSP Party of Telangana State.

CHILDHOOD AND EDUCATION:

On the 04th of June, 1991, Srinivas was born to the couple Mr Bodhigeli Chinna Venkataiah & Mrs Bodhigeli Ashamma and raised in Gotur in Belagavi District in the state of Telangana.

In 2007-08, Srinivas obtained his Secondary Board of Education from Zilla Parishad High School, placed at Gotur in Belagavi and in 2012; he completed his Intermediate course from Government Junior College, Dhanwada in Narayanpet District, Telangana.

Srinivas obtained graduation with a degree from Saraswathi Degree College from Marikal in Dhanwada, Telangana State.

EARLY YEARS:

In 2017, Srinivas made his debut in the Bahujan Samaj Party (BSP), a national-level political party in India aimed at representing Bahujans, which includes Scheduled Castes, Scheduled Tribes, other Backward Classes, and religious minorities.

Through the skillful utilisation of the responsibilities, duties, and powers vested in him, he earned the admiration of the people. This recognition led to his appointment as the Narayanpet Constituency Incharge of BSP in the Indian State of Telangana in 2017, where he wholeheartedly served the people, never wavering from the trust they had placed in him.

With his ascension to power, Srinivas took every task as a solemn obligation, striving for the betterment of the people and ensuring their welfare remained a top priority. Moreover, he consistently sought ways to enhance society’s progress, dedicating himself to serve with unwavering dedication and genuine concern for the well-being of the community.

BSP Party Activities:

  • Many party development programs were carried out in the village for the party’s growth, and he respectably accepted the work assigned by the higher authorities. He is wholly involved in sorting out the issues raised on any topic.
  • Srinivas is actively involved in the programs organised by the BSP. He conveyed to the people the greatness of the Party all over the constituency.
  • Srinivas also carries forward organising BSP Cader camps and holding meetings to discuss the functions and Performance of the BSP. If anyone in the village encounters any problem, Srinivas will be at the forefront of the problem.
  • He is not limited to his services to the village but also extends to the people of the entire district; he favours those who work in line with the ideals of Ambedkar and Phule.
  • Srinivas collaborated for the welfare of the farmers throughout his reign, despite the high price of the farmer’s crops.

Social Activities:

  • Every Year On the occasion of Dr B.R. Ambedkar Birth and Death Anniversary, Srinivas Celebrates the event by recalling the services he provided to the nation.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage and every minute problem to the individual.
  • Srinivas has participated in various community activities in the village, especially on his Birthday. He supplies meals to the elderly and orphan children and delivers mineral water to the villagers.
  • He provided financial and humanitarian assistance to the victims of fires in the villages who the fires themselves had assaulted.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success due to his efforts.

Services Rendered During The Pandemic Covid:

  • He distributed masks, sanitisers, food to the impoverished, and financial assistance. An awareness demonstration was held to raise awareness about social distance and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.
  • In response to Prime Minister Modi’s call, Srinivas organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need for a free corona vaccination.
  • He has been distributing vital supplies to aid water-scarce places due to the social distance created by the Covid-19 restrictions.
  • Srinivas snuck out to help those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • A protest was held to raise awareness about social distance and the need to adopt preventative measures adapting preventative measures in order to prevent the Corona Epidemic from developing.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not exposed to any negative consequences.

      H.No: 6-80, Landmark: Near Pochamma Temple, Village: Gotur, Mandal: Dhanwada, District: Narayanpet, Constituency: Narayanpet, State: Telangana, Pincode: 509204.

      Email: [email protected]

      Mobile No: 9908612681.

      Biodata of Mr. Bodhigeli Srinivas

      Bodhigeli Srinivas | the Leaders Page | Narayanpet Constituency Incharge | the Leaders Page

      Name: Bodhigeli Srinivas

      DOB: 04-06-1991

      Father: Mr. Bodhigeli Chinna Venkataiah

      Mother: Mrs. Bodhigeli Ashamma

      Education Qualification: Graduation

      Political Party: BSP

      Present Designation: Narayanpet Constituency Incharge

      Permanent Address: Gotur, Dhanwada, Narayanpet, Narayanpet, Telangana.

      Contact No: 9908612681

       

      Active Participation in Various Party Activities

      విలేఖరుల సమావేశం

      హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ పేదల పొట్ట కొడుతుందని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైడ్రా పేరుతో సొంత సోదరుడికి నోటీసులిచ్చి,పేదలకు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు.సొంత సోదరుడికి ఒక న్యాయం,పేదోడికి మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు.రేవంత్ రెడ్డికి దమ్ముంటే రెండు వేళ ఎకరాల్లో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీలోనీ అక్రమ కట్టడాలను కూల్చాలన్నారు.పేదల ఉసురులో రేవంత్ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయమని,తక్షణమే పేదల ఇండ్ల అక్రమ కూల్చివేతలు ఆపాలన్నారు.

      నియామక పత్రం

      బహుజన్ సమాజ్ “పార్టీ (బీఎస్పీ) నారాయణ పేట | నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ గా ‘మరికల్ మండలం, ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన దాసరి అశోక్ గారిని నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ సోమవారం నాడు నియామక పత్రం అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని ఆదేశించారు.

      తెలంగాణలో గ్యారంటీ లేని కాంగ్రెస్ పాలన

      తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ లేని పాలన కొనసాగిస్తుందని బీఎస్పీ నారాయణ పేట జిల్లా బొదిగెలి శ్రీనివాస్ విమర్శించారు.మక్తల్ పట్టణ కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులతో పార్టీ బలోపేతం,ప్రజా ప్రభుత్వ వ్యతిరేక,ప్రజా సమస్యలపై పోరాటం గురించి పార్టీ నాయకులకు దిశా నిదేశం చేశారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ,జీరో కరెంటు బిల్లులు, గృహలక్ష్మి పథకం కింద పేదలకు పక్కా ఇండ్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజా పోరాటం తప్పదన్నారు. తక్షణమే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండారి చంద్ర శేఖర్,జిల్లా ప్రధాన కార్యదర్శి జుట్ల నరేందర్,మక్తల్ అసెంబ్లీ ఇంచార్జ్ పాలెం వెంకటయ్యBSP నాయకులు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

      కోయిల్ కొండ మండలం,పారుపల్లి గ్రామంలో బీఎస్పీ ప్రభంజనం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలి మా గ్రామానికి వస్తే తరిమికొడతామని హెచ్చరించిన మహిళలు
      9ఏండ్లు ఎమ్మేల్యేగా ఉండి కనీసం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదంటూ మహిళల ఆగ్రహం ఈ సారి ఏనుగుకు ఓటేసి దొరల పాలనకు చమరగీతం పాడాలని ప్రతిజ్ఞ చేసిన మహిళలు,యువకులు

      అక్రమ అరెస్ట్

      సూర్యాపేట బీసీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయించిన మంత్రి జగదీశ్ రెడ్డి అరాచకాలకు నిరసనగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పిలుపు మేరకు ఛలో “సూర్యాపేట” నిరసన కార్యక్రమానికి వెళ్తున్న నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెల శ్రీనివాస్ గారితో పాటు బీఎస్పీ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు మరికల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ బీసీ లను రాజకీయంగా అనగదొక్కడానికి కేసిఆర్ డైరెక్షన్లో మంత్రి జగదీష్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. బీసీలు ఎమ్మెల్యే గా పోటీ చేస్తే మంత్రి జగదీష్ రెడ్డి గారు ఓర్చుకోలేక జానయ్య యాదవ్ గారిపై తప్పుడు కేసులు బనాయించి వేదింపులకు గురి చేస్తున్నాడని, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న మంత్రి జగదీష్ రెడ్డి గారిని రాజకీయ సమాధి చేయాలన్నారు. బీసీ అణచివేతకు పాల్పడుతున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి దోపిడి దొంగల పాలన నుండి తెలంగాణ ప్రజలని విముక్తి చేయాలన్నారు. అరెస్టు అయిన వారిలో బీఎస్పీ నాయకులు శ్రీకాంత్ ముదిరాజ్ గారు, రమేష్ గారు, వెంకట్ రాములు గారు, వెంకటయ్య యాదవ్ గారు, ప్రవీణ్ కుమార్ గారు మరియు తదితరులు ఉన్నారు

      విలేకరుల సమావేశం

      బంగారు తెలంగాణలో కేసిఆర్ గారి మోసాలకు మరో హోం గార్డు రవీందర్ బలయ్యారని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. దన్వాడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా కేసిఆర్ గారు హోం గార్డులకు ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కెసిఆర్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. ఒక పక్క నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన ప్రభుత్వం మరో పక్క జీతాలు ఇవ్వక ఉద్యోగులను సైతం బలిచెయ్యడం దారుణమన్నారు. కనీస ఉద్యోగ భద్రత లేకుండా హోంగార్డులను వెట్టి చాకిరి చేయిస్తున్న ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికీ ఉద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా రాష్ట్రంలో ఉన్న హోంగార్డులను రెగ్యులర్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. హైదరాబాద్ లో జీతం అందక, పోలీసు అధికారుల వేదింపులకు ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని ఆదుకొని అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

      విలేకరుల సమావేశం

      నారాయణ పేట నియోజకవర్గ వ్యాప్తంగా నిరుపేదలకు ఇవ్వాల్సిన దళిత బంధు పతకాన్ని బీఆర్ఎస్ నాయకులు కమీషన్ల బందుగా మార్చారని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు విమర్శించారు. నారాయణ పేట జిల్లా కేంద్రంలో మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బందు పథకంలో ఎమ్మెల్యే అనుచరులే 2లక్షల నుండి 3లక్షల కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన పేదలకు ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే కుట్ర పూరితంగా పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి అసలైన పేదలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలు కమీషన్ల దందాలు చేస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పేదలకు చెందాల్సిన డబ్బులను ఎమ్మెల్యే సొంత అనుచరులకు పార్టీ కార్యకర్తలకు సిఫారసు చేస్తూ అసలైన పేదల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ నేతల కమీషన్ల దందాలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం జరిగింది.

      విజ్ఞప్తి

      కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలను నమ్మి బహుజన వర్గాల ప్రజలు మోసపోవద్దని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని నలబై యేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. ఆధిపత్య వర్గాలకు అధికారం ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలను పథకాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని రోజులు పథకాల పేరుతో మోసం చేస్తారని ప్రశ్నించారు. బహుజన వర్గాల ప్రజలు పథకాలకు లబ్దిదారులుగా కాకుండా అధికారంలో, సంపదలో హక్కుదారులుగా ఉండాలన్నారు. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేయగలరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బహుజనుల బ్రతుకులు మారాలంటే రాజ్యాధికారం రావాలని అది బీఎస్పీ తోనే సాధ్యమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూల్చి బహుజన రాజ్య స్థాపన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

      దళిత బంధు పథకం

      నారాయణ పేట నియోజకవర్గ వ్యాప్తంగా నిరుపేదల నోట్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మట్టి కొడుతున్నారని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ గారు ఆరోపించారు. జిల్లా కలెక్టరు కార్యాలయం దగ్గర ధామరగిద్ద మండలం, వత్తుగుండ్ల గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సీ కుటుంబాలతో కలిసి ఆయన మాట్లాడుతూ, పేదలకు ఇవ్వాల్సిన దళిత బంధు పతకాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చిన వత్తు గ్రామానికి చెందిన పేదలను, దుర్బాషలాడుతూ, క్యాంపు కార్యాలయం నుండి బయటకు గెంటివేయడం దారుణమన్నారు. అధికార మదంతో విర్రవీగితే తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలకు ఇవ్వడమెంటని ప్రశ్నించారు. దళిత బంధు పథకం కమీషన్ల వెనుక ఎమ్మెల్యే అండ ఉందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించాలని పిలుపునివ్వడం జరిగింది.

      పిర్యాదు

      రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ పేట ఆర్డీఓ కార్యాయంలో పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎలక్షన్ కమీషన్ బీఆర్ఎస్ కోసమే పని చేస్తున్నట్లు ఉన్నదని ఆరోపించారు. గత రెండు రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కార్యక్రమాలు చేస్తుంటే అధికారుల మౌనం వెనక ఆంతర్యమేమిటనీ ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై చర్యలు తీసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది.

      పిర్యాదు

      ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జెండా ఆవిష్కరణలు చేసిన నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారి మరికల్ తహశీల్దార్ కార్యాలయంలో పిర్యాదు చేయడం జరిగింది.

      ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జెండావిష్కరణలు చేసిన నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ మరికల్ తహశీల్దార్ కార్యాలయంలో పిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాలు అధికార పార్టీ ఎమ్మెల్యేకు వర్తించవా? అని ప్రశ్నించారు.మరికల్, ధన్వాడ మండలాల వ్యాప్తంగా పది గ్రామాలలో పార్టీ పథకాల పేరుతో నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడి జెండా కార్యక్రమాలు చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.తక్షణమే ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోకుంటే ఎన్నికల కమీషన్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఉంటదన్నారు.

      మాన్యవర్ కాన్షిరామ్ గారి 17వ వర్ధంతి

      తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపన చేసి బహుజన రాజకీయ యోధుడు మాన్యవర్ కాన్షిరామ్ గారి ఆశయాలు నెరవేరుస్తామని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు తెలిపారు.మరికల్ మండల కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం దగ్గర బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరామ్ గారి 17వ వర్ధంతి సందర్భంగా పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వేల ఏండ్లుగా బహుజన ప్రజలను రాజకీయ,ఆర్థిక బానిసలుగా మార్చిన ఆధిపత్య వర్గాల పార్టీలను మట్టి కరిపించి బహుజనుల అధికారం రుచి చూపించిన గొప్ప రాజకీయ చాణక్యుడు కాన్షిరామ్ గారు అని కొనియాడారు.బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ ప్రజల బ్రతుకులు మారాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు.దోపిడీ దొరల పార్టీల మాటలు నమ్మి మరో సారి మోసపోకుండా బీఎస్పీ పార్టీ కి ఓటు వేసి బహుజన రాజ్య స్థాపన ఏర్పాటుకు బహుజన ప్రజలు సహకరించాలని కోరారు.

      ఆశా వర్కర్లను శ్రమ దోపిడి చేస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొధిగెలి శ్రీనివాస్ గారు విమర్శించారు.మరికల్ మండల కేంద్రంలో చేపట్టిన ఆశా వర్కర్ల నిరవదిక సమ్మెకు మద్దతు ప్రకటించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లను కనీస ఉద్యోగ భద్రత కల్పించి,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఒక ప్రభుత్వ వైద్యుడు చేయలేని సేవలు గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు చేస్తున్నారని,కనీస వేతనం ఇవ్వని ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆశా వర్కర్లు చేసే పని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఒక్క రోజైనా చేయగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవులు ఇవ్వకుండా ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందనీ మండిపడ్డారు.ఆశా వర్కర్లకు 32 రకాల రిజిస్టర్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో కేసిఆర్ ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ.18,000/- వేతనం చెల్లించాలనీ లేని యెడల బీఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నారాయణ పేట జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య గారు, బీఎస్పీ నాయకులు శ్రీకాంత్ ముదిరాజ్ గారు, అంజి ముదిరాజ్ గారు,అశోక్ గారు, తదితరులు పాల్గొన్నారు.

      నారాయణ పేట నియోజకవర్గ వ్యాప్తంగా నిరుపేదల నోట్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మట్టి కొడుతున్నారని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ ఆరోపించారు.శుక్రవారం పేట జిల్లా కలెక్టరు కార్యాలయం దగ్గర ధామరగిద్ద మండలం, వత్తుగుండ్ల గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సీ కుటుంబాలతో కలిసి ఆయన మాట్లాడుతూ,పేదలకు ఇవ్వాల్సిన దళిత బంధు పతకాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చిన వత్తు గ్రామానికి చెందిన పేదలను, దుర్బాషలాడుతూ, క్యాంపు కార్యాలయం నుండి బయటకు గెంటివేయడం దారుణమన్నారు. అధికార మదంతో విర్రవీగితే తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలకు ఇవ్వడమెంటని ప్రశ్నించారు.దళిత బంధు పథకం కమీషన్ల వెనుక ఎమ్మెల్యే అండ ఉందని ఆరోపించారు.రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
      ఈ కార్యక్రమంలో,బీఎస్పీ నాయకులు శ్రీకాంత్ ముదిరాజ్,రవి యాదవ్, నిరుపేద ఎస్సీ మహిళలు మంగమ్మ, అనంతమ్మ, నర్సింగమ్మ,లాలమ్మ,శ్రీనివాసులు,హన్మంతు, బాలప్ప,మానిక్యప్ప,కన్ కప్ప,శంకర్, భువన్ తదితరులు పాల్గొన్నారు

      కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలను నమ్మి బహుజన వర్గాల ప్రజలు మోసపోవద్దని బీఎస్పీ నారాయణ పేట నియో జకవర్గ ఇంచార్జ్ శ్రీనివాస్ ప్రజలను కోరారు బుధవారం మాట్లాడుతున్న బొదిగెలి శ్రీనివాస్ దన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని నలబై యేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థిని ఎందుక ముఖ్యమంత్రిని చేయలేదో సమాధానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధిపత్య వర్గాలకు అధికారం ఇచ్చి బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలను పథకాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని రోజులు పథకాల పేరుతో మోసం చేస్తారని ప్రశ్నించారు. బహుజన వర్గాల ప్రజలు పథకాలకు లబ్దిదారులుగా కాకుండా అధికారంలో, సంపదలో హక్కుదారులుగా ఉండాలన్నారు.ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేయగలవా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బహుజనుల బ్రతుకులు మారాలంటే రాజ్యాధికారం రావాలని అది బీఎస్పీ తోనే సాధ్యమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూల్చి బహుజన రాజ్య స్థాపన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, మండల అధ్యక్షుడు రవి యాదవ్, మైనారిటీ కన్వీనర్ సయ్యద్ మహమూద్,బీఎస్పీ నాయకులు శ్రీకాంత్ ముదిరాజ్, బాల్పప్ప తదితరులు పాల్గొన్నారు

      అంగన్ వాడి టీచర్లు, హెల్పర్లను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.శుక్రవారం నారాయణ పేట జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరవదిక సమ్మె చేస్తున్న అంగన్ వాడి టీచర్లకు మద్దతు ప్రకటించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అబద్దాల హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినప్పుడు అంగన్వాడీ టీచర్లను ఎందుకు రెగ్యులరైజ్ చేయరని ప్రశ్నించారు.సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం కనీసం వేతనం ఎందుకు అమలు చేయడంలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.తక్షణమే అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య,బీఎస్పీ నాయకులు రవి యాదవ్,వీరన్న,హరీష్, అశోక్,రమేష్,తదితరులు పాల్గొన్నారు.

      బంగారు తెలంగాణలో కేసిఆర్ మోసాలకు మరో హోం గార్డు రవీందర్ బలయ్యారని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం దన్వాడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా కేసిఆర్ హోం గార్డులకు ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని మండిపడ్డారు.బంగారు తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కెసిఆర్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు.ఒక పక్క నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన ప్రభుత్వం మరో పక్క జీతాలు ఇవ్వక ఉద్యోగులను సైతం బలిచెయ్యడం దారుణమన్నారు.కనీస ఉద్యోగ భద్రత లేకుండా హోంగార్డులను వెట్టి చాకిరి చేయిస్తున్న ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికీ ఉద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా రాష్ట్రంలో ఉన్న హోంగార్డులను రెగ్యులర్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.హైదరాబాద్ లో జీతం అందక,పోలీసు అధికారుల వేదింపులకు ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని ఆదుకొని అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

      రాస్తా రోకో

      నారాయణపేట నియోజక వర్గ ఇంచార్జి బొదిగేళి శ్రీనివాస్ గారు పార్టీ నాయకులతో కలిసి రాస్తా రోకోలో పాల్గొనడం జరిగింది.

      నియమిక పత్రం

      బహుజన సమాజ్ పార్టీ (BSP) నారాయణ పేట నియోజకవర్గం, ధన్వాడ మండల మైనారిటీ కన్వీనర్ గా సయ్యద్ మహమూద్ గారిని నియమించడం జరిగింది. 

      చేరిక

      నారాయణ పేట నియోజకవర్గం మరికల్ మండలం, వెంకటాపూర్ గ్రామంలో 20మంది యువకులు బహుజన సమాజ్ పార్టీ (BSP) లో చేరడం జరిగింది

      సమావేశం

      నారాయణ పేట అసెంబ్లీ కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా భూత్ కమిటీలు సెక్టార్ కమిటీలు అత్యవసరంగా పూర్తి చేయాలని కమిటీ తీర్మానించడం జరిగింది.

      విడత యాత్రలో

      మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ గారు చేపట్టిన బహుజన రాజ్యాధికార రెండవ విడత యాత్రలో పాల్గొన్న బహుజన సమాజ్ పార్టీ (BSP) నారాయణ పేట నియోజకవర్గం నాయకులు

      రాజ్యాధికార యాత్ర

      మునుగోడు రాజ్యాధికార యాత్రలో రాష్ట్ర అద్యక్షులు RSP గారితో నారాయణ పేట నియోజకవర్గం నాయకుడు బొదిగెళి శ్రీనివాస్ గారు

      అధిక ఫీజుల గురించి మాట్లాడిన సందర్భంలో

      విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ, సర్టిఫికెట్లు కోసం వెళ్ళిన బీఈడి విద్యార్థినిల పట్ల, అదనపు ఫీజుల పేరుతో, అసభ్యపదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న నారాయణ పేట జిల్లా కేంద్రంలోని ఆదర్శ బీఈడి కళాశాల యాజమాన్యం పై అర్జెంటుగా విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి,కళాశాల గుర్తింపుని రద్దు చేయాలని BSP డిమాండ్

      నిరాహార దీక్ష

      నారాయణ పేట జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్కు దగ్గర వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని 9వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీకి BSP సంఘీభావం.

      బహిరంగ సభ గోడ పత్రికను విడుదల సందర్భంలో

      హైదరాబాద్, సరూర్ నగర్ మైదానంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే “తెలంగాణ బరోసా సభను” విజయవంతం చేయాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు కోరడం జరిగింది. నారాయణ పేట జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్ లో బహిరంగ సభ గోడ పత్రికను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దొరల చేతుల్లో బందీ అయిన తెలంగాణ ను, విముక్తి చేయడానికి బీఎస్పీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు బరోసా ఇవ్వబోతున్నట్లు ఆయన తెలపడం జరిగింది.

      సమావేశం

      ధన్వాడ మండల అభివృద్ధిలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు విమర్శించడం జరిగింది. గున్ముక్ల గ్రామంలో జరిగిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

      సమావేశం

      మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు.

      రిలే దీక్ష

      నారాయణ పేట నియోజక వర్గంలోని, కోటకొండ గ్రామాన్ని మండలం ఏర్పాటు చేయాలని 50 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న కోటకొండ మండల సాధన JAC కి BSP సంపూర్ణ మద్దతు చేయడం జరిగింది.

      వినతిపత్రం

      పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బీఎస్పీ ఆధ్వర్యంలో మరికల్ తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించిన నియోజకర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు.

      వినతిపత్రం

      గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులతో కలిసి దన్వాడ మండల తహసిల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

      విలేకరుల సమావేశం

      ఎమ్మెల్యే అండ లేకుంటే క్రీడా మైదానం కబ్జాకు గురైతదా? అని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు ప్రశ్నించడం జరిగింది. దన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధన్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సర్వే రిపోర్టును బయట పెట్టకుండా అధికార పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడటం జరిగింది. ప్రభుత్వ క్రీడా మైదానాన్ని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారారని ఆరోపించడం జరిగింది. మండల తహశీల్దార్ గారికి పిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా కనీస స్పందన లేదని మరి తహశీల్దార్ & రెవెన్యూ అధికారులు ఎవరి కోసం పని చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది.

      రిలే దీక్ష

      నారాయణ పేట నియోజకవర్గం లోని కోటకొండ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని 62రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న కోటకొండ మండల సాధన JAC కి BSP సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మండల సాధన కోసం బీఎస్పీ రాష్ట్ర అద్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ గారు JAC నాయకులతో ఫోన్లో మాట్లాడి మద్దతు ప్రకటించడం జరిగింది.

      నిరాహార దీక్ష

      ధన్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సర్వే రిపోర్టును బయట పెట్టీ ఖాళీ స్థలంలో డిగ్రీ కళాశాల లేదా పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు డిమాండ్ చేయడం జరిగింది. తహాశిల్దార్ గారికి పిర్యాదు చేయడం జరిగింది. అధికార పార్టీకి చెందిన నాయకుల అండతో సర్వే రిపోర్టును దాచి పెడుతున్నారని ఆరోపించడం జరిగింది. తక్షణమే క్రీడా మైదానం సర్వే హద్దులను నిర్ధారించి అక్రమ నిర్మాణాలకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. త్వరలో “సేవ్ ధన్వాడ క్రీడా మైదానం” పేరుతో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నామని అందుకు ధన్వాడ యువత సహకరించాలని కోరడం జరిగింది.

      నిరసన

      నారాయణ పేట జిల్లా,మరికల్ గ్రామం&మండల కేంద్రంలోని ధర్మన్న కుంట చెరువును కబ్జా చేసి రియల్ వెంచర్లు వేసిన BRS నాయకులపై చర్యలు తీసుకొని చెరువును రక్షించాలని BSP ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది.

      సమావేశం

      నారాయణ పేట నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ది పేరుతో హంగామా చేస్తున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎంత మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారో సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించడం జరిగింది.

      అధికార పార్టీ అండతో పోలీసులు,రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాను ప్రోత్సహించడం పలితంగా ముగ్గురు నిరుపేద బిడ్డలు బలయ్యారని తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బీఎస్పీ నారయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు డిమాండ్ చేయడం జరిగింది. .

      ధర్నా

      నారాయణ పేట జిల్లా,మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన ముగ్గురు నిరుపేద బిడ్డల మరణానికి కారణమైన BRS నాయకుల ఇసుక అక్రమ తవ్వకాల గుంతలు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ,రోడ్డుపై బైటాయించడం జరిగింది.

      బరోసా సభ

      ఛలో హైదరాబాద్ తెలంగాణ “బరోసా సభ” కు బయలుదేరిన నారాయణ పేట నియోజకవర్గ BSP నాయకులు పాల్గొనడం జరిగింది.

      బహిరంగ సభ గోడ పత్రికను విడుదల సందర్భంలో

      హైదరాబాద్, సరూర్ నగర్ మైదానంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే “తెలంగాణ బరోసా సభను” విజయవంతం చేయాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు కోరడం జరిగింది. నారాయణ పేట జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్ లో బహిరంగ సభ గోడ పత్రికను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దొరల చేతుల్లో బందీ అయిన తెలంగాణ ను, విముక్తి చేయడానికి బీఎస్పీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు బరోసా ఇవ్వబోతున్నట్లు ఆయన తెలపడం జరిగింది.

      సమావేశం

      ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మభ్యపెడుతున్నారని బీఎస్పీ నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు విమర్శించడం జరిగింది. దన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

      ధర్నా

      నారాయణ పేట జిల్లా,మరికల్ మండలం,చిత్తనూరు శివారులో ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తూ, చట్ట వ్యతిరేకంగా, అక్రమంగా నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేసి కంపెనీని ఎత్తి వేయాలని గత సంవత్సరం నుండి పోరాటం చేస్తున్న “చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటి”కి(ధన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి) BSP సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది.

      ధర్నా

      నారాయణ పేట మండలం తిర్మలాపూర్ గ్రామంలో BSP లోకి భారీగా చేరిన యువకులు, మహిళలతో ధర్నా చేయడం జరిగింది.

      సమావేశం

      కుల అహంకారంతో ఎస్సీ, ఎస్టీ కులాలను అవమాన పరిచిన నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు ఘాటుగా హెచ్చరించడం జరిగింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది.

      నిరసన కార్యక్రమం

      భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు, చేయడమే గాక, కొత్త రాజ్యాంగం తయారు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి కేటీఆర్ గారు, పలువురు ఎమ్మెల్యేల శవయాత్ర నిర్వహించడం జరిగింది.

      అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోని ప్రభుత్వ సంపదను లూటీ చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు ఆరోపించడం జరిగింది.

      పరామర్శ

      ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని మోసం చేసి బాలిక ఆత్మహత్యకు కారకుడైన నిందితునికి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు ఆరోపించడం జరిగింది. దామరగిద్ద మండలం,గత్ప గ్రామానికి చెందిన యశోద కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ యశోద మృతికి కారణమైన నిందితుడు సుదర్శన్ రెడ్డినీ తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

      రిలే నిరాహార దీక్ష

      మహబూబ్ నగర్ జిల్లా, కోయిల్ కొండ మండలంలోని గార్లపహడ్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని రిలే నిరాహార దీక్ష చేస్తున్న గార్లపహాడ్ మండల సాధన JAC కమిటీకి మద్దతు ప్రకటించిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ).

      బీఆర్ఎస్,బీజేపీ ప్రభుత్వాల రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై,అవినీతి,భూ కుంభకోణాలు,బీసీ రిజర్వేషన్లు పెంచాలని పోరాటం చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అద్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ గారి సెల్ ఫోన్ హ్యాకింగ్ చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న బీఅర్ఎస్ బిజేపీ ప్రభుత్వాల పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు డిమాండ్ చేయడం జరిగింది.

      సేకరణ కార్యక్రమం

      జనాభా నిష్పత్తి ప్రకారం బీసీల రిజర్వేషన్లు 50శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ ధన్వాడలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించిన bsp నాయకులు.

      నారాయణ పేట నియోజకవర్గo, మరికల్ గ్రామ శివారు సర్వే నంబర్ 449 భూ బాధిత రైతులకు బీఎస్పీ అండగా ఉంటుందని ప్రకటించిన BSP చీఫ్ RS ప్రవీణ్ కుమార్ గారు, బొడిగెలి శ్రీనివాస్ గారు మరియు ఇతర నాయకులు.

      ఎన్నికలో సందర్బంగా

      నారాయణ పేట నియోజకవర్గo,ధన్వాడ మండల నూతన కమిటీ ఎన్నికలో పాల్గొన నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ గారు.

      బీసీ రిజర్వేషన్లు పెంపు

      జనాభా దామాషా ప్రకారం 27%ఉన్న బీసీ రిజర్వేషన్లను 50%శాతానికి పెంచాలని BSP నాయకులు డిమాండ్ చేయడం జరిగింది.

      జయంతి

      బహుజన సమాజ్ పార్టీ (BSP)ఆద్వర్యంలో మరికల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ గారి 143వ జయంతి వేడుకలు ఘనంగా జరుపడం జరిగింది.

      చేర్చ

      నారాయణ పేట మండలం, బండగొండ గ్రామంలో బీసీ,ఎస్సీ యువకులతో బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం గురించి చర్చించి, తెలంగాణలో బహుజన రాజ్యం ఆవశ్యకత ను వివరించి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

      చేరిక

      నారాయణ పేట నియోజకవర్గం, దామరగిద్ద మండలం, కానుకుర్తి గ్రామానికి చెందిన 20మంది యువకుల TRS పార్టీ నుండి బహుజన సమాజ్ పార్టీ (BSP) లో చేరడం జరిగింది.

      ఆహ్వానం

      మరికల్ మండలం రాకొండ గ్రామంలో పార్టీ నిర్మాణంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నాయకులను కలిసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

      విద్యార్థి ఆత్మహత్య

      బాసర ట్రపుల్ ఐటీ విద్యార్థి సురేశ్ రాథోడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అలాగే విద్యార్థి ఆత్మహత్యకు నైతిక బాధ్యత వహించి తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారు పదవికి రాజీనామా చేయాలని BSP డిమాండ్ చేయడం జరిగింది.

      ప్రజా సమస్య లు

      ధన్వాడ మండలం & గ్రామపంచాయతి పరిధిలో 3,4వ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక పంచాయతి అధికారులకు, మండల పంచాయతి అధికారులకు (MPDO) గారికి విన్నవించినా సమస్యల ను ఏమాత్రం పట్టించుకోలేదాని ప్రజా సమస్య లు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ప్రజా వాణిలో పిర్యాదు చేసిన నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ గారు.

      నియమిక పత్రం అందజేత

      బహుజన సమాజ్ పార్టీ (BSP) పెద్ద చింతకుంట గ్రామ కన్వీనర్లు గా మల్లెల వెంకటయ్య యాదవ్ గారిని మరియు దేవదాసు గారిని నియామకం చేయడం జరిగింది. 

      మీటింగ్

      మక్తల్ పట్టణకేంద్రంలో BSP నారాయణపేట జిల్లా కమిటీ EC మీటింగ్ నిర్వహించడం జరిగింది.

      ఆవిష్కరణ కార్యక్రమం

      నారాయణ పేట జిల్లా, మక్తల్ నియోజకవర్గంలో ని మక్తల్ పట్టణ కేంద్రంలో BSP జిల్లా,అసెంబ్లీ కమిటీల ఆధ్వర్యంలో అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

      నారాయణపేట నియోజకవర్గం,కొయిల్ కొండ మండలంలో ఉన్న 61 పోలింగ్ భూత్ లకు సంభందించి ఓటర్ లిస్టును మండల కన్వీనర్, కో-కన్వీనర్లకు అందించడం జరిగింది.

      బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల అస్వస్థతకు విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యమే కారణమని, విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేయడం జరిగింది.

      బహిరంగ సభ

      బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా, ఛత్రపతి సాహు మహరాజ్ గారి జయంతి రోజున చలో వరంగల్ బహిరంగ సభకు తరలివెళ్తున్న బీఎస్పీ నాయకులు.

      గోడపత్రిక విడుదల

      రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 70 ఎమ్మెల్యే సీట్లు మక్తల్ లో జరిగే బీసీల రాజకీయ చైతన్య సదస్సు గోడపత్రిక విడుదల చేయడం జరిగింది.

      అక్రమ అరెస్ట్

      నారాయణ పేట నియోజక వర్గం,మరికల్ మండలం,పస్పుల గ్రామ 137 సర్వే నెంబర్ భూ బాధితులకు అండగా నిలిచి గత ఐదు రోజుల నుండి బాధితుల పక్షాన పోరాడుతున్న బహుజన సమాజ్ పార్టీ నాయకులను నారాయణ పేట ఎమ్మెల్యే గారు అక్రమ అరెస్ట్ చేయించడం జరిగింది.

      భూముల గురించి

      నారాయణపేట ఎమ్మెల్యేకు అభివృద్దిపై చిత్తశుద్ది ఉంటే తన భూములను, పార్టీలో ఉన్న నాయకుల భూములు ఇవ్వాలి అన్ని కోరుతున్న నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ గారు.

      ప్రజల సమస్యలు

      నారాయణ పేట మండలం కొల్లంపల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై BSP స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్న నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ గారు.

      “Bodhigeli Srinivas took part in an indefinite strike.”

      భారత్ బంద్

      ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర పన్నుతోందని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ గారు ఆరోపించారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి ఆదేశాల మేరకు సుప్రీం కోర్టు తీర్పును నిరసిస్తూ పలు సంఘాలు నారాయణ పేట జిల్లా కేంద్రంలో “భారత్ బంద్”కు ఇచ్చిన పిలుుమేరకు ఆయన పాల్గొని మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, పార్లమెంటులో చట్టం చేయకుండా కోర్టు ఏకపక్షంగా వర్గీకరణ తీర్పుతో పాటు క్రిమిలేయర్ విదానానికి ఆమోదం తెలపడం బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆధిపత్య వర్గాల రాజకీయాల్లో క్రిమిలేయర్ పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు తన తీరును మార్చుకోవాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు.

      కోయిల్ కొండ మండలంలో దూసుకుపోతున్న బీఎస్పీ ఏనుగు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాయమాటలు నమ్మొద్దు అహంకారానికి ఆత్మ గౌరవానికి జరుగుతున్న పోరాటంలో బహుజనులే గెలవాలి పథకాల మాయలో పడి మోసపోతే బహుజనుల జీవితాలు మారవు దోపిడి దారుల నుండి నారాయణ పేట నియోజకవర్గాన్ని విముక్తి చేస్తాం నూటికి 99శాతం ఉన్న ప్రజలను మోసం చేస్తున్న దొరల పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చిన బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు

      దోపిడి పార్టీలైన BRS, కాంగ్రెస్ పార్టీల మాయమాటలు నమ్మి మోసపోకుండా ఈ సారి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొధిగెలి శ్రీనివాస్ గారు.

      అంగన్ వాడి టీచర్లు, హెల్పర్లను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు డిమాండ్ చేయడం జరిగింది. నారాయణ పేట జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరవదిక సమ్మె చేస్తున్న అంగన్ వాడి టీచర్లకు మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అబద్దాల హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినప్పుడు అంగన్వాడీ టీచర్లను ఎందుకు రెగ్యులరైజ్ చేయరని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం కనీసం వేతనం ఎందుకు అమలు చేయడంలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

      ఆశా వర్కర్లను శ్రమ దోపిడి చేస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొధిగెలి శ్రీనివాస్ గారు విమర్శించారు. మరికల్ మండల కేంద్రంలో చేపట్టిన ఆశా వర్కర్ల నిరవదిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లను కనీస ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేయడం జరిగింది.

      గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు పేర్కొనడం జరిగింది. కోయిల్ కొండ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ముందు 12వ రోజు గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరవదిక సమ్మెకు మద్దతు ప్రకటించడం జరిగింది.

      గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు పేర్కొనడం జరిగింది. మరికల్ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ముందు 5వ రోజు గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరవదిక సమ్మెకు మద్దతు ప్రకటించడం జరిగింది.

      గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు పేర్కొనడం జరిగింది . దన్వాడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరవదిక సమ్మెకు మద్దతు ప్రకటించడం జరిగింది.

      అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు.

      గత 39రోజులుగా VRA లు సమ్మె చేస్తుంటే వారి డిమాండ్లపై కేసీఆర్ ప్రభుత్వం కనీసం స్పందించలేదని, ఇలాంటి దోపిడీ, దొంగల ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలని బహుజన సమాజ్ పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేయడం జరిగింది. దామరగిద్ద మండల కేంద్రంలో నిరవదిక సమ్మె చేస్తున్న VRA JAC ని ఉద్యేసించి ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టి, బహుజన రాజ్యం స్థాపనకు అందరూ కృషి చేయాలని కోరడం జరిగింది.

      మరికల్ మండల కేంద్రంలో VRA JAC నిర్వహిస్తున్న 25వ రోజు నిరవధిక సమ్మెకు మద్దతునిచ్చాము. అసెంబ్లీ సాక్షిగా VRAలకు ఇచ్చిన మాటను అబద్దాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబెట్టుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని BSP తరపున డిమాండ్ చేయడం జరిగింది.

      కోయిల్ కొండ మండల కేంద్రంలో VRA JAC నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతునివ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా VRAలకు ఇచ్చిన మాటను అబద్దాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబెట్టుకోవాలని BSP తరపున డిమాండ్ చేయడం జరిగింది.

      రాజ్యాధికార సభ

      వనపర్తి జిల్లా అధ్యక్షుడు చెన్న రాములు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు 7న వనపర్తి లోజరిగే బహుజన రాజ్యాధికార సభకు ముఖ్య అతిథిగా వస్తున్న BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ గారి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటింటికి పార్టీని పరిచయం చేసి అందరిని సభకు ఆహ్వానించడం జరిగింది.

      నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారి సమక్షంలో కోయిల్ కొండ మండలం, ఖాజీ పూర్ గ్రామంలో బీఎస్పీ లో చేరిన యువకులు ఈ సారి నారాయణా పేట లో  ఏనుగును గెలిపించాలని ప్రతిజ్ఞ చేసిన యువకులు

      “Events Featuring Bodigeli Srinivas as the Distinguished Chief Guest”

      వివాహ కార్యక్రమం

      కోయిల్ కొండ మండలం, జమాల్ పూర్ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ నాయకుడు ఆశన్న కుమార్తె వివాహానికి హాజరు కావడం జరిగింది.

      వివాహ రిసెప్షన్ కార్యక్రమం

      బీఎస్పీ నారాయణ పేట జిల్లా మహిళా కన్వీనర్ శేశాది బేగం గారి కూతురు వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

      వివాహ వేడుక కార్యక్రమం

      ధన్వాడ,చర్లపల్లి గ్రామంలోని వివిధ వివాహ వేడుకలకు హాజరైన నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ గారు.

      రంజాన్ పండుగ సందర్భంగా

      ముస్లిం సోదరుల పవిత్రం మాసం రంజాన్ ను పురస్కరించుకొని నేడు నారాయణ పేట మండలం, కొల్లం పల్లి గ్రామంలోని మసీద్ దగ్గర BSP ఆద్వర్యంలో ధావత్ -ఏ -ఇఫ్తార్ విందులో పాల్గొన నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ గారు.

       Bodhigeli Srinivas Played a Key role in Welfare and Development Activities

      గణేష్ చరితుర్థి సంధర్బంగా

      ధన్వాడ మండల కేంద్రంలో “రామ్ రహీం ఫ్రెండ్స్” ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 

      జన్మదిన వేడుకలు

      బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారి 67వ జన్మదిన వేడుకలు (జన కళ్యాణ్ దివస్) బీఎస్పీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది.

      మంచి నీటి వసతి

      తెలంగాణ లో విద్యా వ్యవస్థను కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా బ్రష్టు పట్టించిందని బహుజన సమాజ్ పార్టీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ గారు విమర్శించడం జరిగింది. మరికల్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కొరకు పరీక్షకు హాజరైన విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు బీఎస్పీ ఆధ్వర్యంలో మంచి నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది.

      జయంతి

      మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బహుజన సమాజ్ పార్టీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మరికల్ మండల కేంద్రంలో సామాజిక విప్లవకారుడు, బహుజనుల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

      జయంతి

      మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బహుజన సమాజ్ పార్టీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జ్ బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మరికల్ మండల కేంద్రంలో సామాజిక విప్లవకారుడు, బహుజనుల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

      వర్థంతి

      మరికల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ 59వ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి బొడిగెలి శ్రీనివాస్ గారు.

      నారాయణ పేట నియోజకవర్గం, మరికల్ మండలం, ఇబ్రహీంపట్నం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బొడిగెలి శ్రీనివాస్ గారు సందర్శించడం జరిగింది. ఆ పాఠశాలలో ఒక్క గది మాత్రమే ఉందని ఆ గదిలో 5తరగతులు ఉన్నాయని విద్యార్థులకు గత కొన్ని నెలలుగా కనీసం మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం లేదని తెలపడం జరిగింది.

      వర్థంతి

      బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్థంతి సందర్భంగా మరికల్ మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.

      వర్థంతి

      మహాత్మా జ్యోతి రావు పూలే గారి 132వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మానవతా మూర్తికి ఘన నివాళి అర్పించిన బీఎస్పీ నాయకులు.

      జన్మదిన వేడుకలు

      నారాయణ పేట జిల్లా కేంద్రంలో, తెలంగాణ BSP రథసారథి, బహుజన సమాజం జీవితాలను మార్చడానికి IPS ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన RS ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపడం జరిగింది.

      విద్యార్థుల సమస్యలు

      విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజాం కాలేజీకి చేరుకొని విద్యార్థులకు మద్దతుగా నిలిచడం జరిగింది. నిత్యం విద్యార్థుల సమస్యలకై పోరాడే వామపక్ష విద్యార్థి సంఘాలు దొరల గడీలలో బంధీలైనవి.బిఎస్పి అధికారంలోకి వస్తే తప్పా ఈ సమస్యలకు పరిష్కారం లేదు అన్ని తెలపడం జరిగింది.

      జయంతి

      నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి బొదిగేళి శ్రీనివాస్ గారు పార్టీ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో అంబెడ్కర్ జయంతి సందర్భంగా అయినా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

      Bodhigeli Srinivas with various party Leaders

      BSP చీఫ్, తెలంగాణ రథ సారథి “RS ప్రవీణ్ కుమార్” గారిని IPS ADDL DGP (VRS) గారితో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పుష్పగుచ్ఛము అందజేయడం జరిగింది.

      Party Events

      దిష్టి బొమ్మ దహనం

      ప్రారంభోత్సవ కార్యక్రమం

      సన్మానం

      బహిరంగ సభ ప్రసంగం

      అక్రమ అరెస్ట్

      ధర్నా

      దిష్టి బొమ్మ దహనం

      ర్యాలీ

      పార్టీ చేరిక

      ప్రెస్ మీట్

      అంబెడ్కర్ జయంతి

      Bodhigeli Srinivas with Different Leaders

      Party Activities

      News Paper Clippings

      Pamphlets

      Videos

      }
      04-06-1991

      Born in Gotur

      Dhanwada, Narayanpet, Telangana 

      }
      2007-08

      Studied SSC Standard

      from Zilla Parishad High School at Gotur 

      }
      2012

      Completed Intermediate

       from Government junior College, Dhanwada

      }

      Obtained Graduation

       from Saraswathi Degree College, Marikal

      }
      2017

      Joined in BSP

      }
      2017

      Party Activist

      of BSP

      }
      2017-Till Now

      Narayanpet Constituency Incharge

       of Narayanpet, BSP