Aruva Hemanth Reddy | MPTC | Founder and Chairman of AHR Sena | the Leaders Page

Aruva Hemanth Reddy

ఎంపీటీసీ, AHR సేన వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (INC), రామలింగంపల్లి, బొమ్మలరామారం, ఆలేరు, యాదాద్రి-భువనగిరి, తెలంగాణ.

ఎర్వ హేమంత్ రెడ్డి గారు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి యాదాద్రి-భువనగిరి జిల్లా రామలింగంపల్లి గ్రామ ఎంపీటీసీ గా పనిచేస్తున్నారు. మరియు AHR సేన అనే వ్యవస్థను స్థాపించి దాని ద్వారా ప్రజలకు తగిన సహాయాన్ని అందిస్తున్నారు. 

ప్రారంభ జీవితం, విద్య:-

ఎర్వ హేమంత్ రెడ్డి గారు ఈయన యాదాద్రి-భువనగిరి జిల్లాలో రామలింగంపల్లి అనే చిన్న గ్రామంలో 1987, ఆగష్టు 05 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి ఎర్వ. రంగారెడ్డి వ్యవసాయదారుడు, తల్లి గృహిణి.

అతను 2002లో బొమ్మలరామారం మండలంలోని శ్రీ సాయి విద్యాధామమ్ హైస్కూల్‌లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (SSC) పూర్తీ చేశారు. 

తదుపరి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి అచట 2004లో హబ్సిగూడలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (బైపీసీ) పూర్తి చేశారు.  ఆ తర్వాత 2007లో హైదరాబాద్ పద్మావతి కళాశాలలో DMLT కోర్స్ పూర్తీ చేసారు. 

రాజకీయ జీవితం:-

SFI సభ్యునిగా జీవితం:-

ఎర్వ హేమంత్ రెడ్డి గారు విద్యార్థిగా ఉన్నప్పుడే 2004లో SFI (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) లో చేరారు. అప్పటినుండి 2006వ సంవత్సరం వరకు పార్టీ సభ్యునిగా తన విధులను కొనసాగించారు. 

రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అతను తన పార్టీ సభ్యులతో కలిసి పోరాటాలలో పాల్గొనేవారు. పార్టీ తరుపున జరిగే ప్రతి ర్యాలీలలో, దీక్షలలో, నిరసనలలో హేమంత్ రెడ్డి గారు చురుకుగా పాల్గొనేవారు. 

SFI సభ్యుడిగా హేమంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు:-

  • స్కాలర్‌షిప్‌లు అందక ఇబ్బందులను ఎదురుకుంటున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారికీ స్కాలర్‌షిప్‌లు అందచేయాలని నిరసన వ్యక్తం చేశారు. 
  • కళాశాలలలో, మరియు పాఠశాలలలో విద్యార్థుల మరణాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. 
  • ప్రభుత్వ హాస్టళ్లలో చర్మవ్యాధులతో బాధపడుతున్న విద్యార్థిని, విద్యార్థులకు వైద్యం అందించాలని వారికీ మంచి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. 
  • విద్యార్థులపై అధిక ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.
  • వివిధ రాష్ట్రాల SFI పార్టీ నాయకులూ, సభ్యులు మరియు విద్యార్థి నాయకులు కలిసి నిరుద్యోగుల సమస్యల గురించి నిర్వహించిన పోరాటాలు, ధర్నాలు వంటి కార్యక్రమాలలో హేమంత్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు.
  • పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న గతేడాది ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు.

ప్రారంభ రాజకీయ జీవితం:-

సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిసారి ఒక కొత్త నాయకుడు ఉద్భవిస్తాడు. రాజకీయ నాయకులు పార్లమెంట్‌లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడమే కాదు, సమాజంలో అందరికంటే బలంగా మాట్లాడే వ్యక్తులు. ప్రతి శరీరం ఒక మంచి నాయకుడి గురించి కలలు కంటుంది అని బలంగా నమ్మి రాజకీయాలలోకి ప్రవేశించాలి అనుకున్నారు హేమంత్ రెడ్డి గారు. 

హేమంత్ రెడ్డి గారు 2005లో టీడీపీ (తెలుగు దేశం పార్టీ) ద్వారా తన తోలి రాజకీయ జీవితాన్ని పార్టీ కార్యకర్తగా ప్రారంభించారు. పార్టీ నాయకులతో కలిసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పలువురి ప్రశంసలందుకున్నారు.

2005 నుండి 2012 వరకు పార్టీ కార్యకర్తగా హేమంత్ రెడ్డి గారు పార్టీ కి మరియు ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తూ తన విధులను నిర్వహించారు. 

ఆ తరువాత హేమంత్ రెడ్డి గారు 2013లో INC (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ) లో చేరారు.

హేమంత్ రెడ్డి గారు 2013లో బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉపసర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందాడు.

గ్రామా ఉపసర్పంచ్ గా ఎన్నికైన తరువాత హేమంత్ రెడ్డి గారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ సమర్థవంతంగా తన విధులు నిర్వహిస్తూ అటు కుటుంబ బాధ్యతలు, మరియు ఇటు తన వృత్తి నిర్వహణ ఇలా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. 

అయన ప్రతి పనిలో ముందుంటు ప్రజా క్షేమమే అయన క్షేమం అనుకుంటూ నిరంతరం కృషి చేసారు. 

ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికలలో మరల ఉపసర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారు. అయన చేస్తున్న సేవనే ఆయనని ముందుకు నడిపిస్తూ అయన ఎదుగుదలకు మరింత కృషి చేస్తుంది. 

మహిళలు కూడా అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణించాలి అని వారికీ ఉన్నతమైన విద్య, ఉద్యోగంతో పాటుగా ఇంటి వద్ద ఉండే మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా వారిని ముందుండి నడిపించారు హేమంత్ రెడ్డి గారు. 

తదుపరి అయన గ్రామానికి మరియు పార్టీ కి చేస్తున్న సేవ చాలదని ఇంకా ఉన్నతంగా అతను ఎదుగుతూ ప్రజలకు మరింత సేవ చేస్తూ చేయాలనీ వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలని అయన 2019లో తన ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేసారు. 

పార్టీలో ఎదుగుదల:-

2019లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ విజయం సాధించి హేమంత్ రెడ్డి గారు రామలింగంపల్లి గ్రామా ఎంపీటీసీ గా ఎన్నికయ్యారు.

అతను గ్రామీణ వెనుకబడినతనం, మరియు పేదరికం ఉన్న తన చుట్టుపక్కన ప్రాంతాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి వారికీ తగిన సహాయాన్ని అందించారు.

దేశ అభివృద్ధిలో యువత ముందుండాలి అని కేవలం వారిని ఆర్థిక లేదా ఉత్పత్తి రంగాలలోనే కాకుండా ఎంతో ప్రాముఖ్యం ఉన్న రాజకీయాలలో వారికీ స్తానం కలిపించి వారి ద్వారా నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలనీ భావించి హేమంత్ రెడ్డి గారు యువతకు తగిన ప్రోత్సహాన్ని అందిస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నారు. 

అయన పార్టీ లో ఎక్కువ మంది యువతను చేరుస్తు వారికీ తగిన ప్రోత్సహాన్ని అందిస్తున్నారు. అలాగే అతను పార్టీ ఎదుగుదలకు మరియు ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. 

అతను గ్రామంలో అట్టడుగు స్థాయిలో ప్రజలు ఎదురుకొంటున్న ఇబ్బందులను తెలుసుకొని వెంటనే స్పందించి వారికీ తోడుగా నిలుస్తారు. 

హేమంత్ రెడ్డి గారు చేసిన పార్టీ మరియు సంక్షేమ కార్యక్రమాలు:-

  • ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పూర్తి బాధ్యత ఓటర్లకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని వారికీ అవగాహనా కల్పించారు. 
  • నిరంతరం పార్టీ కోసం పాటు పడే వ్యక్తిగా పార్టీ గురించి అవగాహనా కల్పిస్తూ ఎక్కువ మంది యువతను పార్టీ చేర్చి ముందుకు నడిపించారు. 
  • పార్టీ మరింత బలపరచడానికి పార్టీ గుర్తు ను చూపిస్తూ మరియు కడపత్రాలను కూడా ఇంటింటికి అందచేశారు. 
  • పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా వేడుకలు నిర్వహించి పేద ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందచేస్తారు. 
  • పార్టీ తరుపున పార్టీ సీనియర్ నాయకులతో కలిసి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. 
  • రాజకీయ నేతల పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, శిబిరాలు నిర్వహిస్తారు.
  • తన నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
  • సార్వత్రిక ఎన్నికల సీజన్‌లో, అతను పార్టీ పూర్తికాల నాయకుడిగా ప్రచారం చేస్తూ పార్టీ ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
  • హేమంత్ రెడ్డి గారు స్వచ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలను అందచేయడంతో పాటుగా గ్రామంలో ప్రతి చోట మొక్కలను నాటారు.
  • గడ్డి, గరిక, చెత్త, చెదారం ఉన్న ప్రదేశాలను శుభ్రపరిచి ప్రజలు దోమల బారిన పడకుండా జాగ్రత పడుతున్నారు. 
  • వర్షాల వలన మురుగు నీరు రోడ్ పైకి చేరకుండా ఎప్పటికి అప్పుడు వాటిని శుభ్రం చేపిస్తారు. 
  • గుంతల రహదారి వలన ప్రజలు ఇబ్బంది పడకుండా వాటిని మరమత్తులు చేపిస్తారు. 

ధర్నాలు, నిరసనలు:-

  • తెలంగాణ ఉద్యమ సాధనలో భాగంగా ధర్నాలు, రాష్ట్ర రోకోలు, వంటావార్పు ఉద్యమాలు చేశారు.
  • పంట కొనుగోలు తీరు పై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వలన ఇబ్బందులు ఎదురుకుంటున్న రైతుల కష్టాలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని నిరసన వ్యక్తం చేసారు. 
  • రైతుల రుణాలను మాఫీ చేయాలనీ మరియు వారికీ పంట నష్టం సమకూర్చాలని ధర్నాలు చేసారు. 
  • ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని మరియు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు బర్తీ చేయాలనీ ధర్నా చేసారు. 
  • హేమంత్ రెడ్డి గారు అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ గారు ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో చురుకుగా పాల్గొన్నారు. 
  • నిరుద్యోగ సమస్యపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేసారు. 
  • పార్టీ తరుపున జరిగే ప్రతి ర్యాలీ, దీక్షలు, నిరసనలలో చురుకుగా పాల్గొంటారు.

AHR (ఎర్వ హేమంత్ రెడ్డి) సేన:-

హేమంత్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుగుతూ ప్రజల కోసం మరియు పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఇంకా వారికీ తగిన సహాయాన్ని అందించి ప్రోత్సహాన్ని ఇచ్చి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలని మరియు సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో AHR సేన అనే ఒక సంస్ ని స్థాపించారు. 

ఈ సంస్థ ద్వారా “మానవ సేవే మాధవ సేవ…! గ్రామ సేవే దేశ సేవ….!” అని మనం మనకోసం మాత్రమే కాకుండా మన తోటి వారి కోసం అలాగే మన గ్రామం మరియు చుట్టూ ఉన్న ప్రదేశాలు బాగుంటేనే మన దేశం బాగుంటుంది అని గట్టి విశ్వసిస్తారు హేమంత్ రెడ్డి గారు. అయన నమ్మే ఈ సిద్ధాంతమే అతనిని మరింత ముందుకు నడిపిస్తూ వారి ఎదుగుదలకు సహాయ పడుతుంది. 

అతను ఈ సంస్థ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారి గ్రామానికి మరియు చుట్టూ పక్కన ఉన్న గ్రామాలకు కూడా సహాయపడుతున్నారు. 

సేవ కార్యక్రమాలు నిర్వహించి వికలాంగులకు మూడు చక్రాల బండి, పేద మహిళలకు కుట్టు మిషన్‌లు, ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు, నిత్యావసర సరుకులు ఇలా ఎన్నో అందచేస్తూ వారికీ తోడుగా నిలుస్తున్నారు హేమంత్ రెడ్డి గారు. 

ఈ సంస్థ ద్వారా హేమంత్ రెడ్డి గారు సమాజంలో విభిన్న అవసరాలున్న ప్రజలను గుర్తించి వారికి స్వచ్చందంగా అండగా నిలుస్తుండటం చాల గొప్ప విషయం. ఈ తరహా సేవలను పేద ప్రజలకు అందిస్తూ విజయవంతంగా ముందడుగు వేస్తుండటం చాల సంతోషకరం. 

హేమంత్ రెడ్డి గారు చేసిన సామాజిక మరియు అభివృద్ధి కార్యకలాపాలు:-

  • రామలింగంపల్లి గ్రామంలో నీటి కొరత ఏర్పడడంతో ప్రజలు పడుతున్న ఇబ్బంది గ్రహించి హేమంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం కాలం పాటు 4,00,000 రూపాయలు స్వంతంగా ఖర్చు పెట్టి ఇంటింటికి వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని అందించారు.
  • పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు 5000 రూపాయలు మరియు పాలు, పెరుగు, చల్లటి త్రాగు నీరు సహాయంగా అందచేశారు హేమంత్ రెడ్డి గారు. అలా ఇప్పటి వరకు ఒక 60-70 కుటుంబాలకు తన వంతు సహాయాన్ని అందచేశారు.
  • గ్రామంలో పేద కుటుంబాలలో ఎవరైనా చనిపోతే తన వంతు సహాయంగా వారికీ 100 కిలోల బియ్యం ఉచితంగా అందచేస్తారు. ఆలా ఇప్పటి వరకు ఒక 50 కుటుంబాలకు అందచేశారు.
  • రామలింగంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్, జామెట్రీ బాక్స్, స్టడీ మెటీరియల్, మరియు స్నాక్స్ వంటివి అందచేశారు. 
  • హేమంత్ రెడ్డి గారు రామలింగంపల్లి గ్రామం నుండి ప్రతి సంవత్సరం SSC బోర్డ్ ఎక్సమ్ కి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదురుకోకుండా వారికీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. 
  • రామలింగంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో 10,000 రూపాయలు ఖర్చుపెట్టి మధ్యాహ్నం భోజనంకి వండే సామాన్లు, పాత్రలు ఇవ్వడం జరిగింది. 
  • పర్వతపురం పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా షూస్ ఇవ్వడం జరిగింది. 
  • రామలింగంపల్లి లోని ప్రైమరీ పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో 50,000 రూపాయలు ఖర్చుపెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 
  • ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే సందర్బంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి 5,000 ఖర్చుపెట్టి బహుమతులు తెచ్చి వారికీ అందచేయడం జరిగింది. 
  • 2016లో రామలింగంపల్లి గ్రామంలో జరిగిన బోనాల పండుగ సందర్బంగా యాదవ సోదరులకు పలారం బండి ఇప్పించడం జరిగింది. దాని కోసం హేమంత్ రెడ్డి గారు సుమారు 1,50,000 వరకు ఖర్చు చేశారు. 
  • గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఎల్లపుడు నీటి సదుపాయం అందుబాటులో ఉండేలాగా 50,000 ఖర్చు పెట్టి వాటర్ పైప్ లైన్స్ వేయించారు. అలాగే ఆలయం చుట్టూ పరిసరాలు ఎల్లప్పుడూ వెలుతురులో ఉండాలని 70,000 ఖర్చు పెట్టి హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేసారు. 
  • అలాగే బతుకమ్మ పండుగ సందర్బంగా రామలింగంపల్లి గ్రామంలోని ఐదు వార్డులో 1,50,000 పెట్టి మ్యూజిక్ సిస్టం సౌండ్ బాక్స్ లు అందచేయడం జరిగింది. 
  • ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగ వేడుకలలో అందంగా పెద్దగా బతుకమ్మ పేర్చిన వారికీ 20,000 ఖర్చు పెట్టి బహుమతులు అందచేయడం జరుగుతుంది. 
  • రామలింగంపల్లి గ్రామంలో 2,00,000 ఖర్చు పెట్టి బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 
  • గ్రామంలో 2,80,000 పెట్టి నాలుగు హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 
  • గ్రామంలోని యువతకు అన్ని విధాలుగా ఎల్లపుడు తన వంతు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారు. 
  • పర్వతపురం మైసమ్మ గుడి నుండి పర్వతపురం గ్రామం వరకు 3km ల దూరం వరకు 6,00,000 రూపాయల ఖర్చుతో స్ట్రీట్ లైట్స్, కరెంటు పోల్స్ వేయించడం జరిగింది. 
  • రామలింగంపల్లి ఎంపీటీసీ పరిధిలోని (రంగాపురం, పర్వతపురం) గ్రామాలలో వినాయక చవితి సందర్బంగా చందాలు ఇవ్వడం మరియు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చేస్తారు. దాదాపు ప్రతి సంవత్సరం 2,00,000 వరకు ఖర్చు చేస్తారు. 
  • 10,000 పెట్టో గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో ఫ్యాన్ లు ఇప్పించడం జరిగింది. 
  • మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని అనుసరించి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 10,000 ఖర్చు పెట్టి 4 నెలల పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • పర్వతపురం గ్రామంలో 2,10,000 పెట్టి 3 హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 
  • తెలంగాణాలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పర్వతపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్బంగా 40,000 పెట్టి జెర్సీ కబడ్డీ కిట్లు అందచేయడం జరిగింది. అలాగే మొదటి బహుమతి గా 40,000 అందచేశారు. 
  • పర్వతపురం గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద 1,10,000 పెట్టి వజ్ర స్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. 
  • పర్వతపురం గ్రామం లో 1,50,000 పెట్టి డా|| బి. ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 
  • రంగాపురం గ్రామంలో 2,10,000 పెట్టి 3 హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 
  • కొత్త రంగాపురం నుండి పాత రంగాపురం వరకు దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు 3,00,000లతో విధి దీపాలు, స్తంబాలు, కరెంటు వైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 
  • బొమ్మలరామారం మండలంలోని కస్తూరిబా పాఠశాల మరియు కళాశాలలో 70,000 హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 
  • రామలింగంపల్లి గ్రామంలో పశువుల నీటి కొరత తీర్చేందుకు నీటి తొట్లను నిర్మించడం జరిగింది.  

కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు హేమంత్ రెడ్డి అందించబడిన సేవలు:-

  • కరోనా కష్ట సమయాల్లో కష్టాల్లో ఉన్న చాలా మందికి హేమంత్ రెడ్డి సహాయం చేశారు.
  • కరోనా కష్ట కాలంలో 60,000 ఖర్చు చేసి మెడిసిన్స్, మాస్క్స్, శానిటైజర్స్, ppe కిట్స్ బొమ్మలరామారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి ఇవ్వడం జరిగింది. 
  • హేమంత్ రెడ్డి గారు తన ఎంపీటీసీ పరిధిలోని రామలింగంపల్లి, రంగాపురం, మరియు పర్వతపురం మూడు గ్రామాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్స్, కూరగాయలు అందచేశారు. 
  • ఫ్రంట్ వారియర్స్ కి ppe కిట్స్, మాస్క్లు, శానిటైజర్స్, అక్టోమీటర్స్, డిజిటల్ థెర్మో మీటర్స్, బీపీ చెకప్ మెషీన్స్ అందచేయడం జరిగింది. 
  • కరోనా యొక్క మొదటి మరియు రెండవ తరంగాల సమయంలో లాక్డౌన్ ద్వారా ప్రభావితమైన వారికి అతను ఆర్థిక మరియు మానవతా సహాయం అందించాడు. సంక్షోభ సమయాల్లో, మరియు కరుణతో ప్రతిస్పందించడం, ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం చేయడం మరియు లాక్‌డౌన్ ద్వారా ప్రభావితమైన వారికి మరింత సహాయం అందించడం చేసారు. 
  • కరోనా సోకినా రోగులకు నిత్యావసర సరుకులు, పౌష్ఠిక ఆహారం, అందచేస్తూ వారు కోలుకునే వరకు వారికీ సహాయం అందచేదం జరిగింది. ఇలా దాదాపు 100 మందికి పైగా అందచేశారు. 
  • కరోనా వారియర్స్ గా పనిచేస్తున్న వారికీ పోలీసులకు, నర్సులకు, డాక్టర్లకు,  మాస్కులు, మరియు శానిటైజర్స్ అందచేశారు. అలాగే వారికీ లొక్డౌన్ ప్రారంభం నుండి అయిపోయేంత వరకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. 
  • తన ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఐసొలేషన్ కిట్స్ అందచేయడం జరిగింది. 
  • వలస కూలీలకు నిత్యావసర సరుకులు ఒక 15 రోజులకు సరిపోయేలా ఇచ్చారు. ఆలా ఒక 50 మంది వరకు అందచేశారు. 
  • కరోనా కష్ట కాలంలో ప్రజల శ్రేయస్సు కొరకు తన మూడు గ్రామాలలో ఒక 5,00,000 రూపాయల వరకు ఖర్చు చేసారు హేమంత్ రెడ్డి గారు.

HNO: 2-17, Village: Ramalingampally, Mandal: Bommalaramaram, Constituency: Aleir, District: Yadadri-Bhuvanagiri, State: Telangana, Pincode: 508116.

Mobile: 9866554222

Biodata of Mr. Aruva Hemanth Reddy

Aruva Hemanth Reddy | MPTC | Founder and Chairman of AHR Sena | the Leaders Page

Name: Aruva Hemanth Reddy

DOB: 05th August 1987

Father: Mr. Arva Ranga Reddy

Education Qualification: DMLT (Diploma in Medical Laboratory Technology)

Profession: Full Time Leader

Political Party: INC

Present Designation: MPTC

Permanent Address: Ramalingampally, Bommalaramaram, Yadadri-Bhuvanagiri, Telangana.

Contact No: 9866554222

“ప్రపంచ భారమును మోయవలసిన బాధ్యత మనదేనని ప్రతి ఒక్కరు భావించి పని చేయగలిగినప్పుడే జీవితం మరింత ముందుకు సాగిపోతుంది…..”

ఎర్వ హేమంత్ రెడ్డి గారు ఒక సామాన్యమైన వ్యక్తి. వారి కృషి మరియు అంకితభావం చెప్పుకోదగినవి. అతను చాల మంది జీవితాలలో వెలుగు

నింపుతున్న ఒక మహనీయుడు. అతను అత్యంత ప్రభావవంతమైన మరియు ప్రత్యేకమైన వ్యక్తి, వారి సహజ లక్షణాలు, ఉన్నతమైన

తెలివితేటలు, వీరోచిత ధైర్యం, అసాధారణ నాయకత్వ సామర్థ్యాలు మరియు దైవిక ప్రేరణ, నిర్ణయాత్మక చారిత్రక ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

ఎర్వ హేమంత్ రెడ్డి

Recent Activities

అంబులెన్స్ నిర్వహణ

మండల ప్రజల ఆరోగ్య సౌకర్యార్థమై  సమకూర్చిన అంబులెన్స్  నిర్వహణ ఖర్చులకు  రూ.10000 లు అందజేస్తున్న రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో శ్రీ చిమ్ముల సుధీర్ రెడ్డి అధ్యక్షులు, శ్రీమతి బి. సరిత ఎంపీడీవో, శ్రీ ధీరావత్  శ్రీహరి నాయక్, ఎంపీటీసీ  తిమ్మాపురం, శ్రీ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి  పర్యవేక్షకులు, శ్రీ గొడుగు చంద్రమౌళి, శ్రీ యంజాల సత్యనారాయణ తదితరులు గార్లు పాల్గొన్నారు.

AHR సేన

“మానవ సేవే మాధవ సేవ…! గ్రామ సేవే దేశ సేవ….!” అని విశ్వసిస్తూ వెనకబడిన పేద ప్రజలను మరియు యువతను ముందుకు నడిపించాలని భావించి రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు స్థాపించిన AHR సేన ప్రారంభమైన సందర్బంగా

గెలిచినా సందర్బంగా

ఉపసర్పంచ్ గా 2వ సారి గెలిచినా సందర్బంగా ఆనందంలో రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

వరలక్ష్మి వ్రతం

నియోజక వర్గంలోని ఆడపడచుల కొరకు పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేసిన రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

ఎంపీటీసీ గా ప్రమాణ స్వీకారం

ఎంపీటీసీ గా గెలిచినా సందర్బంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

ఫాన్స్ పంపిణి

ప్రభుత్వ పాఠశాలలో టీచర్లకు ఫ్యాన్లను అందచేస్తున్న రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

చలివేంద్రం

వేసవి కాలంలో రహదారి పైన వెళుతున్న ప్రజలు దాహంతో ఇబ్బందులు ఎదురుకోకుండా వారికీ త్రాగటానికి చల్లటి నీరు, మజ్జిగ తో చలివేంద్రాలను ఏర్పాటు చేసిన రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

చలివేంద్రం

కబడ్డీ పోటీలు

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో భాగంగా యువతను ప్రేరిపిస్తూ గెలిచినా వారికీ బహుమతిని అందచేస్తున్న రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు. 

సర్వ సభ్య సమావేశం

మండల ప్రజా పరిషత్తు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మండల సర్వ సభ్య సమావేశంలో భాగంగా చిమ్ముల సుధీర్ రెడ్డి గారితో పాటుగా రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

స్వతంత్ర దినోత్సవం

స్వతంత్ర దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

విగ్రహ ఆవిష్కరణ

దేశానికి ఎంతో సేవ చేసిన డా|| బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన సందర్బంగా రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

శుభాకాంక్షలు

రామలింగంపల్లి గ్రామా పాలకవర్గం బాధ్యతలు తీసుకోని 2 సంవత్సరాలు పూర్తీ చేసుకున్న సందర్బంగా సర్పంచ్ కళ గారికి మరియు ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి గారికి వార్డ్ సభ్యుల అందరికి శుభాకాంక్షలు తెలియచేస్తూ రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

ప్రమాణ స్వీకారం

ఎంపీటీసీ గా గెలిచినా తరువాత ప్రమాణ స్వీకారం చేస్తున్న రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

గెలిచినా సందర్బంగా

ఎన్నికలలో గెలిచినా సందర్బంగా గ్రామా ప్రజలతో పాటుగా ఆనందంలో రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

ప్రచారంలో భాగంగా

ఎన్నికల సందర్బంగా గ్రామంలో ప్రచారం చేస్తున్న రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

రవాణా సౌకర్యం

10 వ తరగతి పరీక్షల సందర్బంగా విద్యార్థులకు ఏ ఇబ్బందులు కలగకుండా వారి కోసం రవాణా సౌకర్యాన్ని ఏర్పరిచిన రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

మూగజీవుల కోసం సంపుల నిర్వహణ

వేసవి కాలంలో మూగజీవుల దాహం తీర్చడం కోసం సంపులు నిర్మించిన సందర్బంగా రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

సౌండ్ బాక్స్ ల పంపిణి

అరువు హేమంత రెడ్డి రామలింగంపల్లి  ఎంపీటీసీ గారు ఐదు వార్డులలో గ్రామ యూత్ సభ్యులకు మ్యూజిక్ సిస్టమ్  అందజేయడం జరిగింది.

సహాయనిధి

ప్రభుత్వ పాఠశాల లో ఉన్న ఇబ్బందులను తెలుసుకొని విద్యార్థులకు ఏ ఇబ్బందులు కలగకుండా వాటి బాగోగుల కోసం చెక్కును అందచేస్తున్న సందర్బంగా రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

AHR సేన

ఫుట్ బాల్ టౌర్నమెంట్స్

ఫుట్ బాల్ టౌర్నమెంట్స్ లో భాగంగా యువతను ప్రోత్సహిస్తూ రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

కోలాటాల పంపిణీ

బతుకమ్మ పండగ సందర్బంగా గ్రామంలోని ఆడపడుచులకు కోలాటాలు పంచిన సందర్బంగా రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

అన్నదాన కార్యక్రమం

గణేష్ చతుర్థి సందర్బంగా తన నియోజకవర్గంలోని గ్రామాలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్బంగా రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ

ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్స్ పంచుతున్న సందర్బంగా రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

Service in Pandemic COVID-19

కరోనా నియంత్రణకు మందు పిచికారీ

కరోనా సమయంలో గ్రామంలో కరోనా నియంత్రణకు మందు పిచికారీ చేపించిన రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

మందులు, శానిటైజర్స్ అందచేసిన సందర్బంగా

ప్రాధమిక వైద్య కేంద్రంకు మందులు, శానిటైజర్స్ అందచేసిన సందర్బంగా రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

సహాయనిధి

కరోనా భాదితుల కోసం మినీ ఐసొలేషన్ ఏర్పాటు చేసి వారికీ పండ్లు, గుడ్లు, కూరగాయలు అందచేస్తున్న రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

భద్రతా ఏర్పాట్లు

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భద్రతా గుర్తించి శానిటైజ్ చూపించిన రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

కరోనా వారియర్స్

కరోనా కష్ట కాలంలో ప్రజల భద్రతా గురించి ఎల్లవేళల కృషి చేస్తున్న కరోనా వారియర్స్ పోలీస్ ల కోసం మాస్కులు, శానిటైజర్స్ పంపిణి చేస్తున్న రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

ఆత్మీయ కలయిక

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని కలిసిన సందర్బంగా రామలింగంపల్లి ఎంపీటీసీ ఎర్వ హేమంత్ రెడ్డి గారు.

Videos

Party Activities

More Party Activities

Brochures

News Paper Clippings

}
05-08-1987

రామలింగంపల్లి గ్రామంలో జన్మించారు.

బొమ్మలరామారం , యాదాద్రి-భువనగిరి,  ఆలేరు ,తెలంగాణ.

}
2002

పాఠశాల విద్యను అభ్యసించారు

శ్రీ సాయి విద్యాధామమ్ హైస్కూల్‌

}
2004

ఇంటర్మీడియట్ పూర్తి చేశారు

బైపీసీ కోర్స్ 

విజ్ఞాన్ జూనియర్ కళాశాల, హైదరాబాద్

}
2007

DMLT (Diploma in Medical Laboratory Technology) పూర్తి చేశారు

పద్మావతి కళాశాల, హైదరాబాద్ 

}
2004-2006

SFI లో చేరారు

స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, పార్టీ కార్యకర్త

}
2005-2012

టీడీపీ పార్టీలో చేరారు

తెలుగు దేశం పార్టీ , పార్టీ కార్యకర్త 

}
2013

INC పార్టీలో చేరారు

 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ

}
2013

ఉపసర్పంచ్

రామలింగంపల్లి, బొమ్మలరామారం , యాదాద్రి-భువనగిరి, తెలంగాణ.

}
2018

ఉపసర్పంచ్

రామలింగంపల్లి, బొమ్మలరామారం , యాదాద్రి-భువనగిరి, తెలంగాణ.

}
2019

ఎంపీటీసీ

రామలింగంపల్లి, బొమ్మలరామారం , యాదాద్రి-భువనగిరి, తెలంగాణ.

}

AHR (ఎర్వ హేమంత్ రెడ్డి) సేన

రామలింగంపల్లి, బొమ్మలరామారం , యాదాద్రి-భువనగిరి, తెలంగాణ.