Aithagoni Janardhan | President of BC Student Organization | Thallabavigudem | Nalgonda | the Leaders Page

Aithagoni Janardhan

President of the BC Student Organization, Thallabavigudem, Nalgonda, Telangana

Aithagoni Janardhan is the President of the BC Student Organization. He was born on 18-02-1989 to Yellaiah in Thallabavigudem, Nalgonda dist. He completed SSC in 2005 and Intermediate in 2008. He graduated with a degree in 2012 and completed a B.P.Ed(Bachelor of Physical Education) in 2014.

In 2009, He started to participate in BC Association. From 2009-2020, he conducted Awareness Programs about Society, Student Awareness programs about Education, gave financial assistance to poor students.

He always fought for Weaker Sections, Student’s problems, Problems of welfare homes. Fought on Government regarding Student’s Scholarships, Feereimbursements also fought for BC Reservation. Janardhan is serving as President of the BC Student Organization.

He erected an idol in the temple at Thallabavigudem also established Ambedkar, Pule idol in the village.

 Recent Activities:

  • Janardhan distributed Rice, Vegetables,  Masks, Sanitizers to the 12th ward people in the time of Pandemic COVID-19 lockdown. Provided Free Food Service.
  • BC Student Union district president Janardhan Gowda demanded on the birth anniversary of Dharmabhiksham that the name of Telangana armed peasant fighter Bommagani Dharmabhiksham should be given to the newly formed Suryapeta district. He participated in Election Campaigns.
  • Nalgonda district president Janardhan Gowda took part in a dharna under the auspices of the BC student body to build its own buildings for BC welfare hostels.

Thallabavigudem, Nalgonda,Telangana

Mobile: 9642222294,9642222295
Email[email protected]

Recent Activities

కళాశాలల విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలు తక్షణమే తెరవలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుండి డిగ్రీ మొదటి, ద్వితీయ సంవత్సరల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగా వారు హాజరు కావాల్సిన అవసరం ఉంటుందని ప్రభుత్వ కళాశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు పరీక్ష కేంద్రనికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు కరోన ప్రభావంతో మూసివేసిన వసతి గృహాలు తెరవాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ వసతి గృహాలు మూసివేత కారణంగా అదునుగా భావించిన ప్రవేటు వసతి గృహాల యాజమాన్యాలు వాటిని తెరిచి అధిక ఫిజులు వసూళ్లు చేస్తున్నారని, దీనితో డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధులు ఫిజులు చెల్లించ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అందుకు విద్యార్థుల యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రభుత్వ వసతి గృహాలు తెరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వాడపల్లి సత్యనారాయణ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు దుడ్డు కృష్ణ మూర్తి, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్ లు పాల్గొన్నారు.

పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

రాస్తారోకో

వినతి పత్రం అందజేత

భవిష్యత్ తరాల దృష్ట్యా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి అని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అయితగోని జనార్ధన్ గౌడ్ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ గారు దానిమీద జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాలలో ప్రభుత్వం తరఫున చైతన్య కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులు చైతన్యం చేసే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ వారిని పనులకు వెళ్లకుండా చదువు మానేయకుండా చర్యలు చేపట్టాలి అని అన్నారు. అదేవిధంగా విద్యార్థులను దుకాణాలలో, కూరగాయల మార్కెట్ లలో ,షాపింగ్ మాల్ లో పనికి పెట్టుకున్నట్లైతే వాటి యజమానుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని . నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉన్నందున చిన్నారులు, విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మున్నాసు ప్రసన్నకుమార్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు దుడ్డు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

మీటింగ్ లో

మీటింగ్ లో మాట్లాడుతున్న బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు అయితగొని జనార్దన్ గౌడ్ గారు

పుట్టినరోజు వేడుకలలో

మీడియా తో

మీడియా తో మాట్లాడుతున్న బీసీ విద్యార్థి సంఘం  అధ్యక్షులు జనార్దన్ గౌడ్ గారు

ధర్నా

బీసీ సంక్షేమ హాస్టల్లకు స్వంత భవనాలు నిర్మించాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్న నల్గొండ జిల్లా అధ్యక్షులు అయితగొని జనార్దన్ గౌడ్ గారు మరియు పార్టీ కార్యకర్తలు

అక్రమ అరెస్ట్ ను ఖండిద్దాం అంటూ నిరసన

ధర్నాలో భాగంగా

విద్యార్థుల పోరు గర్జన

బీసీ విద్యార్థుల సమస్యల సాధనకై చట్ట సభల్లో బీసీ లకు 52% రిజర్వేషన్ సాధనకై సామజిక న్యాయం, సమానవాటా కోసం విద్యార్థుల పోరు గర్జన సభలో పాల్గొని మాట్లాడుతున్న మన జనార్దన్ గౌడ్ గారు మరియు తదితరులు

జయంతి సందర్భంగా

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం పేరుని కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాకు పెట్టాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగొని జనార్దన్ గౌడ్ గారు ధర్మభిక్షం గారి జయంతి రోజున డిమాండ్ చేసారు.

హక్కులకై పోరాటం

పూజ సమయంలో

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో

ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు కల్పించాలి…… బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు యూనివర్సిటీల లో రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా పాఠ్యపుస్తకాలలో మహనీయులైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే నారాయణ గురు పెరియర్ రామస్వామి లాంటి మహనీయులు చరిత్ర తొలగించ కూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రైవేటు యూనివర్సిటీలలో లక్షలాది డొనేషన్లు లక్షలాది ఫీజులు కట్టలేక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రిజర్వేషన్ల అన్ని యూనివర్సిటీలలో యధావిధిగా కొనసాగించాలి లేనియెడల ప్రైవేటు యూనివర్సిటీల ని రద్దు చేయాలి లేనియెడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు దుడ్డు కృష్ణమూర్తి ,రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి వాడపల్లి సత్యనారాయణ ,గంగపుత్ర యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అంబటి ప్రణీత్ కుమార్, గౌడ్ యువజన సంఘం జిల్లా నాయకులు ఎరుకల లక్ష్మణ్ గౌడ్ ,టౌన్ ప్రెసిడెంట్ కారింగు నరేష్ గౌడ్ ,వీరేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు ..

Social Services

తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మృత్య కారుల సమితి సంఘ రాష్ట్ర కమిటీ కార్యక్రమంలో పాల్గొన్నా నాయకులు.

నివాళులర్పిస్తున్నా తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మృత్య కారుల సమితి సంఘ రాష్ట్ర కమిటీ నాయకులు

మట్టివిగ్రహాలను పూజించాలి

పార్లమెంట్ లో బి సి బిల్లులు నమోదు చేయాలి అని ధర్నా చేస్తున్నాసంఘ నాయకులు

జాతీయ చేనేత దినోత్సవం వేడుకలలో పాల్గొన్నా నాయకులు

Press Meet

రాస్తా రాకో

సన్మాన కార్యక్రమంలో

News Paper Clippings

Party Activities

బి.సి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విప్లవ పోరాట యోధుడు తెలంగాణ ఉద్యమకారుడు కామ్రేడ్ కోనాపూర్ సాంబశివుడు గారి 11వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ 16 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపి గిరిజన ఆదివాసీల ప్రజల కోసం విప్లవ పోరాటం చేసి ఆంధ్ర పెత్తందార్ల అరాచకాలను అరికట్టాలని తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూసి జన జీవన స్రవంతిలో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందర్నీ ఉద్యమంలో పాల్గొన్న విధంగా చైతన్యం చేసి ప్రతి ఒక్కరు ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బహుజనులకు రాజ్యాధికారం అందుతుంది అని చెప్పి అందరూ ఆకర్షితులిని చేశాడు. సాంబశివుడు అన్న భౌతికంగా లేకున్నా ఆయన అన్నారు ప్రతి ఒక్కరు ఆయన స్ఫూర్తి బతికే ఉంది ప్రతి ఒక్కరు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉండి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నల్గొండ జనరల్ సెక్రెటరీ కర్నాటి యాదగిరి జిల్లా ఉపాధ్యక్షుడు మునగాల సైదులు జిల్లా కోశాధికారి కల్లూరి సత్యం గౌడ్ జిల్లా విద్యార్థి యువజన సంఘం ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్ విద్యార్థి సంఘం నాయకుడు మండల యాదగిరి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మనగోని శివ కప్పల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

బి.సి విద్యార్థి సంఘం ఒక్క రోజు నిరాహార దీక్ష

బి.సి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ గారు మాట్లాడుతూ
1)పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.
2)కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు 1500/- నుండి 3000/- పెంచాలని, పాఠశాల హాస్టల్ మరియు రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు 3 నుండి 7వ తరగతి వరకు వారికి నెలకు 950/- నుండి 2000/- వరకు,8 నుండి 10 వ తరగతి వారికి 1100/- నుండి 3000/- లకు పెంచాలి.
3)కాస్మోటిక్ ఛార్జీలు బాలురకు 500/-, బాలికలకు 600/- పెంచాలి.
4)హాస్టల్ విద్యార్థులకు ప్రతి ఆదివారం,బుధవారం అలాగే- పండుగలకు స్పెషల్ భోజనం పెట్టాలి.
5)సంక్షేమ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలకు సొంత భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించాలి. ప్రధానంగా పెద్ద రూములు కట్టి ప్రతి రూములో నలుగురికి నాలుగు మంచాలు ఉండాలి. అలాగే హాస్టల్ కు డైనింగ్ హాల్, లైబ్రరీ హాల్, టీవీ హాస్టల్లో నిర్మించాలి.
6)ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఫార్మసీ, పీజీ, డిగ్రీ, ఇంటర్ కోర్సులు చదివే బి.సి విద్యార్థుల మొత్తం ఫీజు లను ప్రభుత్వం భరించాలి. ఈ కోర్సుల ఫీజుల గరిష్ట పరిమితి ఎత్తివేసి, గతంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇవ్వాలి.
7)అదనంగా ఇంకా 150 బి.సి కాలేజ్ హాస్టల్ లు మంజూరు చేయాలి. బి.సి లకు 240 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలి.
8)ప్రతి హాస్టల్ లో ఇంజనీరింగ్, ఎం.బి.ఎ, ఎం.సి.ఎ, విద్యార్థులు ఉన్నచోట సంఖ్యను బట్టి నాలుగు నుంచి పది కంప్యూటర్లు మంజూరు చేయాలి.
9)కోర్సు పూర్తి అయిన వారికి రెండు సంవత్సరాలు హాస్టల్ వసతి కల్పించి ఉద్యోగ పోటీపరీక్షలకు కోసం అని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
దీక్షను ప్రారంభించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి L.V యాదవ్, ఎమ్మార్పీఎస్ నల్గొండ జిల్లా ఇన్చార్జి Bakaram శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన TSU జిల్లా అధ్యక్షుడు కొండేటిమురళి కొండేటి ,ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి బిక్షం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి కర్నాటి ఉపాధ్యక్షుడు సైదులు ప్రచార కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ యువజన సంఘం అధ్యక్షుడు నరేష్ గౌడ్ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు మండల యాదగిరి యాదవ్, పండ్ల హరికృష్ణ, సుమన్, హేమంత్, పవన్ ,మహేష్, ప్రశాంత్, రజిని, కుమార్ కోటేష్, అమర్, మహిళా సంక్షేమ సంఘం మండల అధ్యక్షురాలు ఖమ్మంపార్టీ శంకర్ దుర్గ .తదితరులు పాల్గొన్నారు

రాస్తారోకో కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే వార్షిక బడ్జెట్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 10 వేల కోట్లకు బడ్జెట్ని పెంచాలని, బీసీలకు కూడా బిసి బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా బడ్జెట్లో కేటాయించాలని, బీసీ యువతకు మరియు కుల వృత్తి దారులకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని, గురుకుల పాఠశాలలకు సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించేందుకు అదే విధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్చార్జీల కూడా బడ్జెట్లో పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మున్నాసు ప్రసన్నకుమార్, కర్నాటి యాదగిరి, కారింగ్ నరేష్ గౌడ్, పండ్ల హరికృష్ణ గౌడ్, చెరుపల్లి సదాశివ,కంభంపాటి శంకర దుర్గ,కన్నెబోయిన రమేష్ యాదవ్, కె.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

మహిళా దినోత్సవం సందర్భంగా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళ సంక్షేమ సంఘం, యువజన సంఘం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నల్లగొండ మండల మహిళా సంఘం అధ్యక్షురాలు గా ఖమ్మం పార్టీ శంకర్ Durga ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయంగా అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో ముందుండాలని, సావిత్రిబాయి లాంటి గొప్ప ఉద్యమకారులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి, ప్రచార కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కాలింగ్ నరేష్ గౌడ్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మునగాల సైదులు ,కె రమేష్ ,సంధ్య ,ఎం నవనీత ,మహేశ్వరి ,జ్యోతి ,విజయ్ అశోక్, తదితరులు పాల్గొన్నారు

రాస్తారోకో

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ పట్టణం లోని క్లాక్ టవర్ సెంటర్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ గారు మాట్లాడుతూ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ తొలగించాలని, ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీ యాక్ట్ తేవాలని కోరారు.

జయంతి సందర్బంగా

జ్యోతిరావు ఫులే జయంతి సందర్బంగా విగ్రహానికి పూలమాల వేసి నివలర్పిస్తున్నా జనార్దన్ గారు మరియు పార్టీ సభ్యులు

బీసీలకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలి

బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ రుణాల తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా బీసీలకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీలకు దరఖాస్తు చేసుకున్నటువంటి 7 లక్షలు పైగా కుటుంబాలని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనులు కుల వృత్తి దారులు అనేక రకాలుగా తెలంగాణ కోసం ఉద్యమించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు బీసీలకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం ఆలోచన చేయాలని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల 50 కోట్ల అప్పు చేయడం జరిగింది దాంట్లో 50% జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు నయాపైసా కూడా కేటాయించక పోవడం చాలా శోచనీయం కరోనా కారణంగా కులవృత్తులు దారులకు ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారు జనాభాలో 56 శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు బడ్జెట్లో జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించక పోవడం చాలా శోచనీయం , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓట్లు వేసే బిచ్చగాళ్ళ లాగా నే చూస్తున్నాయి తప్పా బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాల గురించి ఏ ప్రభుత్వం కూడా మాట్లాడడం లేదు. తక్షణమే బీసీలకు కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం .ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వాడపల్లి సత్యనారాయణ ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు దుడ్డు కృష్ణమూర్తి రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు
చిలకరాజు సతీష్ కుమార్ గౌడ్ యువజన సంఘం నాయకులు ఎరుకల లక్ష్మణ్ గౌడ్ . శ్రీకాంత్ ,విక్రమ్ ,జానకి రామ్ తదితరులు పాల్గొన్నారు

}
18-02-1989

Born in Thallabavigudem

}
2009

Joined in BC Association

}
2012

Completed Degree

}
2014

Completed B.P.Ed

Bachelor of Physical Education

}

Conducted Awareness Programs

about Society, Education

}

President

of BC Student Organization

}

Social Activist