Boya Girijamma

Boya Girijamma

Chairperson Zilla Praja Parishad, Anantapur, Andhra Pradesh, YSRCP.

 

Boya Girijamma is an Indian Politician of the YSR Congress Party and Chairperson Zilla Praja Parishad of Anantapur District, Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 14th of June 1992,  Boya Girijamma was born to the couple of Mr Sake Rama Subbanna and Mrs Sake Naga Lakshmamma resided in the village of B. Krishnapuram in Garladinne Mandal at Anantapur District in the Indian State of Andhra Pradesh.

In 2007, Girijamma acquired her Secondary Board of Education from Zilla Parishad High School at B. Krishnapuram in Garladinne Mandal and completed her Intermediate course from Vivekananda Junior College at Anantapur in the year 2009.

She attained her Graduation from S K University at Anantapur in 2012.

CAREER IN POLITICS:

Girijamma had a sense of service since childhood and intended to be able to do all services to the people politically. She was enchanted by the services rendered to the people by Y.S Jagan Mohan Reddy, the founder of the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) and the Present Chief Minister of Andhra Pradesh, and joined the YSRCP party in 2011 and served as a Leader of the Party.

Since joining, She has been working incredibly as a YSRCP Party Activist, working hard for the welfare of the people, constantly striving for the development of the society, and has rendered desperate services to the community.

Upon Joining, She was designated as the District Floor Leader of Anantapur from YSRCP in 2014 to serve the people and tackle the issues raised by executing her tasks effectively and adhering to the party’s policies and guidelines.

Girijamma was credited for having successfully carried out the responsibility of being YSRCP District Women Union President of Anantapur in 2014. She has been unceasingly representing the people, considering their welfare, and receiving widespread public appreciation.

Girijamma’s constant attention and sheer diligence to service in 2019 led to her appointment as the 3rd Ward Corporator of Anantapur Municipal Corporation to faithfully represent and advocate for the organization’s positions and has served prudently for the benefit of the people from the community’s inception, consistently desiring for the party’s and society’s advancement, and performing desperate service to humanity and for the rightness of the people.

Her unwavering commitment and actual effort gained her the position of Chairperson Zilla Praja Parishad of Anantapur in 2021. She has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

Ever since she started rendering services to the people as well as the Employees of ZPP with the assigned authority, She has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People and ZPP employees as well.

Zpp Chairperson Camp Office, Landmark: Opposite Geetha Mandir, Sapthagiri Circle, Anantapur, State: Andhra Pradesh, Pincode: 515001

Email: antpczpp@gmail.com

Mobile No: 97369 98999, 97002 25500.

H.No: 18-1-591, Tarakapuram Colony, Venugopal Nagar Extension, 80 Feet Road, District: Anantapur, State: Andhra Pradesh, Pincode: 515001.

 Bio-Data of Mrs. Boya Girijamma

Name: Boya Girijamma

DOB: 14th of June 1992

Father: Mr. Sake Rama Subbanna

Mother: Mrs. Sake Naga Lakshmamma

Present Designation: Chairperson, Zilla Praja Parishad, Anantapur

Education Qualification: Graduation

Profession: Politician

Permanent Address: H.No: 18-1-591, Tarakapuram Colony, Venugopal Nagar Extension, 80 Feet Road, Anantapur, Andhra Pradesh.

Contact No: 97369 98999, 97002 25500.

“The quality of a leader is reflected in the standards they set for themselves.”

News Paper Clippings

Recent Activities

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

స్థానిక జిల్లా పరిషత్ క్యాంపు ఆఫీస్ లో సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని మనం ఫౌండేషన్ వారు జాతీయ స్థాయి లో 100 మంది వివిధ రంగాలలో విశేష ప్రతిభను కనపరచిన మహిళలకు ప్రశంస పత్రాలను అందించారు. అందులో భాగంగా అనంతపురం సాయి ట్రస్ట్ కు చెందిన ముగ్గురు మహిళలు శ్రీమతి ఆశ్వత్వం పద్మలత గారు, శ్రీమతి శంకర సుధామణి గారు, శ్రీమతి నిచ్చెనమెట్ల శ్వేతా రాఘవేంద్ర గారు ఎంపిక కాగా, వారిని ప్రశంస పత్రం తో పాటు, శాలువాలతో ఉమ్మడి అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు సత్కరించారు. అనంతరం వృత్తి శిక్షణ కార్యక్రమంలో విశేష ప్రతిభను ప్రదర్శించిన అర్చన, జయశ్రీ, హర్షిత ను కూడా వారిని ఉమ్మడి అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమం లో సాయి ట్రస్టు అద్యక్షుడు శ్రీ విజయసాయి కుమార్ గారు, ట్రస్టు సభ్యులు శ్రీ రాఘవేంద్ర గారు, శ్రీ నారాయణ గారు, తదితరులు పాల్గొన్నారు.

సహకార సంఘం భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం

06.08.2022:- శింగనమల మండలంలోని ఈస్ట్ నరసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయము మరియు జగనన్న పాల వెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గౌరవ శింగనమల శాసనసభ సభ్యులు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారితో పాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

వర్చువల్ కార్యక్రమం

03-08-2022:- నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి లేకుండా వారి పరిస్థితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఏటా 10 వేల రూపాయల చొప్పున వడ్డీ లేని ఋణం అందించే జగనన్న తోడు పథకo ద్వారా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.395 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, రూ.15.96 కోట్ల రూపాయల వడ్డీ రీయింబర్స్ మెంట్ కలిపి మొత్తం రూ.410.96 కోట్ల రూపాయలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమం నందు గౌరవ అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

స్థాయి సంఘాల సమావేశము

03-08-2022:- స్థానిక అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని ప్రధాన సమావేశ మందిరం నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారి అధ్యక్షతన 3వ (గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘం) మరియు 4వ (విద్యా – వైద్య సంఘం) స్థాయి సంఘాల సమావేశము నిర్వహించడం జరిగినది. స్థాయీ సంఘ సభ్యులు వారి సంబంధిత ప్రాదేశిక నియోజక వర్గం నందు గల సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా వెంటనే వాటిని పరిష్కరించవలసినదిగా గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు సంబంధిత అధికారులను అదేశించడం జరిగినది.

హర్ ఘర్ తిరంగా ర్యాలీ

02.08.2022:- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్థానిక కె.యస్.ఆర్.బాలికల జూనియర్ కళాశాల నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ ర్యాలీ నందు గౌరవ అనంతపురము శాసనసభ సభ్యులు శ్రీ అనంత వెంకట్రామి రెడ్డి గారు, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ & జాయింట్ కలెక్టర్ శ్రీ కేతన్ గార్గ్ గారు, అనంత నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్లు, పలువురు కార్పోరేషన్ల డైరెక్టర్లు/చైర్ పర్సన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు & ఉద్యోగులు పాల్గొన్నారు.

రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం

31.07.2022 :- స్థానిక పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నందు గౌరవ రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత గారి చేతులమీదుగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ వారి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, స్థానిక రుద్రంపేట బైపాస్ సమీపంలోని వాల్మీకి భవనం నందు 2021-22 విద్యా సంవత్సరమునకు సంభందించి ఉమ్మడి జిల్లాలలోని 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యలో ఉత్తమ ప్రతిభ చూపిన వాల్మీకి విద్యార్థులకు వాల్మీకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవo కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బ్యాగులు, మెమెంటోలు మరియు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగినది.

వినతి పత్రం అందజేత

01-08-2022:- రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా అనంతపురము నగరానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డి.జి.పి.) శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్ నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. అలాగే APSP బెటాలియన్ ఉద్యోగుల సమస్యలపైన గౌరవ రాష్ట్ర డి.జి.పి. గారితో చర్చించి, వారి సమస్యలపైన వినతి పత్రం అందజేశారు.

వినతి పత్రం అందజేత

30.07.2022:- రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ వారి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా అనంతపురము నగరానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత గారిని స్థానిక ఆర్.&బి. గెస్ట్ హౌస్ నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. అలాగే APSP బెటాలియన్ ఉద్యోగుల సమస్యలపైన గౌరవ మంత్రి గారితో చర్చించి, వారి సమస్యలపైన వినతి పత్రం సమర్పించారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమం

29.07.2022:- స్థానిక పాతవూరు చెన్నకేశవస్వామి గుడి సమీపంలోని పాత DM&HO కార్యాలయ ఆవరణలో M/s.REC Ltd వారి ఆర్ధిక సహాయంతో నూతనంగా నిర్మించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా ప్రభుత్వ విప్ & గౌరవ రాయదుర్గం శాసనసభ సభ్యులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు & ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి కాపు భారతి గారితో పాటు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

వర్చువల్ కార్యక్రమం

29.07.2022:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వైయస్ఆర్ కాపు నేస్తం క్రింద నేడు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయు కార్యక్రమంను, అనంతపురము నగరంలోని క్రిష్ణ కళామందిర్ నందు ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

వాల్మీకి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం

28.07.2022:- స్థానిక రుద్రంపేట బైపాస్ సమీపంలోని వాల్మీకి భవనం నందు 2021-22 విద్యా సంవత్సరమునకు సంభందించి ఉమ్మడి జిల్లాలలోని 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యలో ఉత్తమ ప్రతిభ చూపిన వాల్మీకి విద్యార్థులకు వాల్మీకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవo-2022 కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, బ్యాగులు, మెమెంటో లు మరియు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగినది.

“ఉజ్వల్ భారత్- ఉజ్వల్ భవిష్య” కార్యక్రమం

26.07.2022:- “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా అనంతపురము నగరంలోని రజాక్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన “ఉజ్వల్ భారత్- ఉజ్వల్ భవిష్య” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ రాప్తాడు శాసనసభ సభ్యులు శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

దుస్తుల అందజేత &“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమం

25.07.2022:- అనంతపురము సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో హిందూపురానికి చెందిన నిరుపేద మహిళకు ఆర్ధిక సహాయం మరియు దుస్తులను అందచేయడం జరిగినది. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా పుట్టపర్తి సాయి ఆరామం హాల్ నందు పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉజ్వల్ భారత్- ఉజ్వల్ భవిష్య” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

“స్వాతంత్ర్య సంగ్రామo” నాటక ప్రదర్శన

25.07.2022:-  “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా స్థానిక లలిత కళా పరిషత్ నందు సంస్కార భారతి సంస్థ ఆధ్వర్యంలో డా.రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి, విజయవాడ వారిచే ప్రదర్శించిన “స్వాతంత్ర్య సంగ్రామo” నాటక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు హాజరయ్యారు.

రైతు భరోసా కేంద్రం భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం

23.07.2022:-  శింగనమల మండలంలోని వెస్ట్ నరసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయము, వై.యస్.ఆర్.హెల్త్ క్లినిక్ మరియు రైతు భరోసా కేంద్రం భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శింగనమల శాసన సభ సభ్యులు శ్రీమతి జొన్నల గడ్డ పద్మావతి గారు మరియు రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ సి.ఇ.ఓ. శ్రీ ఆలూరు సాంబశివా రెడ్డి గారితో పాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ZPTC గారు, MPP గారు, సర్పంచ్ గారు, YSRCP నాయకులు & శ్రేణులు, మండల స్థాయి అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది సమావేశము

22.07.2022:- స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయపు సమావేశ మందిరం నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బందితో సమావేశము నిర్వహించడం జరిగినది. ఈ సమావేశములో మొదటగా మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ శ్రీ KC నారాయణ గారి మృతికి మౌనం పాటిస్తూ సంతాపం తెలిపారు. అనంతరం నూతనంగా బదిలీపై వచ్చిన సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించారు, తదనంతరం గౌరవ అధ్యక్షుల వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వారి ఉద్యోగాన్ని అలసత్వం వహించకుండా పూర్తి బాధ్యతతో నిర్వర్తించాలని, సమయపాలన పాటించాలని తెలుపుతూ, సంస్థ గౌరవాన్ని నిలపాలని మార్గ నిర్దేశం చేసారు.

ఆకస్మిక తనిఖీ

21-07-2022:- కూడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ఆకస్మికంగా పర్యటించి, మధ్యాహ్న భోజనంను పరిశీలించి, పాఠశాల యందలి పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగినది. ఈ ఆకస్మిక పర్యటనలో కూడేరు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ యం.నారాయణ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ గారు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, యం.పి.డి.ఓ గారు మరియు మండల విద్యాధికారి గారు పాల్గొన్నారు.

ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమం

19.07.2022:- అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారులు కంగారు పడాల్సిన అవసరం లేకుండా, వారికి మరో అవకాశం కూడా కల్పిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 3,39,096 మంది లబ్ధిదారులకు రూ.137 కోట్లను ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో భాగంగా నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయు సందర్భంగా, స్థానిక కలెక్టర్ గారి కార్యాలయములోని VC హాల్ నందు ఏర్పాటు చేసిన వర్చ్యువల్ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం

18.07.2022:- దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా,  అనంతపురము జిల్లా శింగనమల మండలం లోలూరు గ్రామంలో హైదరాబాద్-బెంగలూరు జాతీయ రహదారిలో 8KM ల పొడవున, NHAI శాఖ వారి ఆద్వర్యంలో నిర్వహించిన ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని మొక్కలు నాటి ప్లాంటేషన్ డ్రైవ్ ని ప్రారంభించారు.

ప్రపంచ జనాభా దినోత్సవ అవగాహన ర్యాలీ

11.07.2022:- ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయం నుండి సప్తగిరి సర్కిల్ వరకు నిర్వహించిన కుటుంబ నియంత్రణ పద్దతులపై అవగాహనా ర్యాలీని అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీ నందు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా కుటుంబ నియంత్రణ పద్దతుల పోస్టర్ ను విడుదల చేశారు.

జాతీయ విద్యా సదస్సు

03.07.2022:- అఖిల భారత విద్యాసంస్థల సమాఖ్య (A.I.F.E.A) ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయపు సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన జాతీయ విద్యా సదస్సు లో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో చేసిన మార్పులు ఒక సంచలనం అని, పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని తెలియజేసారు. అదే విధంగా ఏ విపత్కర సమయంలో, ఏ కారణం వలన పిల్లలు విద్యకు దూరం కాకూడదని అందుకు అందరం భాద్యతగా ఉండాలని తెలియజేసారు.

భూమి పూజ కార్యక్రమం

23.06.2022:- కీ.శే శ్రీమతి గౌరమ్మ & కీ.శే శ్రీ జి హనుమంతరావు గారి జ్ఞాపకార్థం వారి కోడలు శ్రీమతి జి.లక్ష్మీ రావు గారు గార్లదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు భోజనశాల నిర్మాణానికి చేపట్టిన భూమి పూజ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొనారు.

సాధారణ సర్వ సభ్య సమావేశం

23.06.2022:- స్థానిక జిల్లా పరిషత్ ప్రధాన సమావేశ మందిరం నందు నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంనకు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు అధ్యక్షత వహించి అజెండా మేరకు వివిధ శాఖల సమీక్షను నిర్వహించారు.

సంధ్యారవళి జాతీయ స్థాయి నృత్య మహోత్సవం

22.06.2022:- అనంతపురంలోని కృష్ణకళామందిర్ నందు “సంధ్యారవళి” జాతీయ స్థాయి నృత్య మహోత్సవ కార్యక్రమాన్ని అనంతపురము శాసన సభ్యులు శ్రీ అనంత వెంకట రామిరెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

21.06.2022:- 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక SSBN కాళాశాల ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

వివాహ మహోత్సవమునకు స్వాగతం

18 .06.2022:- YSRCP సీనియర్ నేత, అనంత నగర పాలక సంస్థ కార్పొరేటర్ శ్రీ చవ్వా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుని వివాహ మహోత్సవ సందర్బంగా అనంతపురము నగరానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని స్థానిక R & B విశ్రాంతి గృహం నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మార్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జిల్లాకు స్వాగతం పలికారు.

వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం

రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన వై.యస్.ఆర్.యంత్ర సేవా పథకం ద్వారా అనంతపురం ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న మహిళా క్రీడా మైదానం (ఎగ్జిబిషన్ గ్రౌండ్) నందు ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

3వ మరియు 4వ స్థాయి సంఘాల సమావేశము

04.06.2022:- స్థానిక అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని ప్రధాన సమావేశ మందిరం నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారి అధ్యక్షతన 3వ (గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘం) మరియు 4వ (విద్యా – వైద్య సంఘం) స్థాయి సంఘాల సమావేశము నిర్వహించడం జరిగినది. ఈ సమావేశాలలో సంబంధిత శాఖ అధికారులు ప్రగతి నివేదికలు మరియు వారి శాఖ ద్వారా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను స్థాయీ సంఘ సభ్యులకు వివరించారు,

వేరుసెనగ విత్తన పంపిణీ కార్యక్రమం

02.06.2022:- రాప్తాడు మండలం పాలచర్ల గ్రామంలో రాబోవు ఖరీఫ్ సీజన్ దృష్ట్యా నిర్వహించిన వేరుసెనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొనారు.

ప్రత్యేక పూజా కార్యక్రమం

31.05.2022:- రామగిరి మండలం పేరూరు గ్రామంలోని కొల్లాపురం దేవస్థానం నందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో గౌరవ రాప్తాడు శాసన సభ సభ్యులు శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొనారు. తదనంతరం YSRCP శ్రేణులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. 

సామాజిక న్యాయ భేరి

28.05.2022:- అనంతపురము నగరం నందు జరగబోవు “సామాజిక న్యాయ భేరి” బహిరంగ సభ సందర్బంగా గౌరవ రాష్ట్ర విద్యుత్, సైన్స్ & టెక్నాలజీ, అటవీ, పర్యావరణ & భూగర్భ గనుల శాఖా మంత్రివర్యులు మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించబడిన సమీక్ష సమావేశం నందు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

ప్రెస్ మీట్

28.05.2022:-  అనంతపురము నగరం నందు జరగబోవు సామాజిక న్యాయభేరి మహా సభను విజయవంతం చేయుటకు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గారి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ అనంతపురము ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిర్వహించనున్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయభేరి మహా సభ నందు పాల్గొని విజయవంతం చేయవలసినదిగా పిలుపునిచ్చారు

బహిరంగ సమావేశం

24.05.2022:- అనంతపురము జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సామాజిక న్యాయభేరి యాత్ర విజయవంతం చేయడానికి స్థానిక రెండవ రోడ్డు లోని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గౌరవ వై.యస్.ఆర్.సి.పి. అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ మేరుగు నాగార్జున గారి అధ్యక్షతన పార్టీ శ్రేణులతో నిర్వహించిన బహిరంగ సమావేశంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

సామాజిక న్యాయభేరి యాత్ర

24.05.2022:- అనంతపురము జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సామాజిక న్యాయభేరి యాత్ర విజయవంతం చేయడానికి జిల్లాకు విచ్చేసిన గౌరవ వై.యస్.ఆర్.సి.పి. అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ మేరుగు నాగార్జున గారికి, MLC శ్రీ జంగా కృష్ణమూర్తి గారికి, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ శ్రీ ఖాదర్ భాష గారికి స్థానిక రెండవ రోడ్డు లోని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు.

సాగు నీటి సలహా మండలి సమావేశం

19.05.2022:- స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు రెవెన్యు భవనంలో నిర్వహించిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ సమావేశం నందు గౌరవ రాష్ట్ర విద్యుత్, సైన్స్ & టెక్నాలజీ, అటవీ, పర్యావరణ & భూగర్భ గనుల శాఖా మంత్రివర్యులు మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గౌరవ రాష్ట్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ ఉషాశ్రీ చరణ్ గారు, గౌరవ ప్రభుత్వ విప్ మరియు MLC లు, గౌరవ శాసన సభ్యులు, జిల్లా కలెక్టరు గారు, సంయుక్త కలెక్టరు గారు, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు.

దిశా ఆప్ మెగా డ్రైవ్

19.05.2022:- స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయపు సమావేశ మందిరం నందు 2 టౌన్పొలీసు అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన దిశా ఆప్ మెగా డ్రైవ్ లో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొనారు. . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయపు సిబ్బంది అందరికి దిశా ఆప్ డౌన్లోడ్ చేసే విధానం, అందులో ఉన్న సదుపాయాలు, వాటి వలన ఉపయోగాలను క్షుణ్ణంగా వివరించి. సిబ్బంది ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ నందు దిశా SOS ఆప్ ఇన్స్టాల్ చేయించారు.

జగనన్న విద్యాదీవెన పథకం పై అవగాహన సదస్సు

19 .05.2022:- రాప్తాడు మండలం, హంపాపురం గ్రామంలోని SVIT కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్) పథకం పై అవగాహన సదస్సు లో రాప్తాడు శాసన సభ్యులు శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం, అమలు పరుస్తున్న పథకాలను ప్రతి విద్యార్థి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకుని, విద్య పరంగా ఉన్నత స్థానాలకు ఎదిగాలని తెలియజేసారు.

శ్రీ సత్యసాయి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం

18.05.2022:- శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయంలోని స్పందన సమావేశ మందిరము నందు గౌరవ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మరియు ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధి శిక్షణ & ఫ్యాక్టరీస్ శాఖా మాత్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారి అధ్యక్షతన నిర్వహించిన శ్రీ సత్యసాయి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నందు శ్రీ సత్యసాయి జిల్లా & అనంతపురము జిల్లాల ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

వేసవి విజ్ఞాన శిబిరము ప్రారంభోత్సవ కార్యక్రమం

17.05.2022:- స్థానిక సప్తగిరి సర్కిల్ నందు గల అనంతపురము జిల్లా గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిబిరము ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ తల్లితండ్రులు తమ పిల్లలను ఈ వేసవి విజ్ఞాన శిబిరములో పాల్గొనేటట్లు ప్రోత్సహించి, వారిలో ఉన్న నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేయవలసినదిగా పిలుపునిచ్చారు.

శ్రీ పాలవేరు వీర నాగమ్మవారి మహోత్సవం& వైయస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్

16.05.2022:- అనంతపురము రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ పాలవేరు వీర నాగమ్మవారి మహోత్సవాలలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘వైయస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్’ లో భాగంగా నాలుగో ఏడాది మొదటి విడత మొత్తాన్నినేడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం మరియు గ్రామంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలో జమ చేయు కార్యక్రమాన్ని, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డు నందు ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

శ్రీమద్ వాసవీ జయంతి ఉత్సవం

శ్రీమద్ వాసవీ జయంతి ఉత్సవాలలో భాగంగా స్థానిక వైశ్యా హాస్టల్ నుండి గుల్జార్ పేట నందు గల అమ్మవారిశాల వరకు నిర్వహించిన ఊరేగింపులో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. తదనంతరం ఆర్య వైశ్య మహిళా సంఘం వారు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారిని సన్మానిoచి, జ్ఞాపికను అందజేశారు.

జయంతి వేడుక

08.05.2022:- శ్రీ భగీరథ మహర్షి గారి జయంతిని పురస్కరించుకుని స్థానిక RTC బస్టాండ్ సమీపంలోని భగీరథ సర్కిల్ నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి అధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో అనంతపురము శాసన సభ సభ్యులు శ్రీ అనంత వెంకట రామి రెడ్డి గారు మరియు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

పరామర్శ

07.05.2022:- గోరంట్ల నందు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కుమారి తేజస్విని కుటుంబ సభ్యులను అనంతపురము & శ్రీ సత్యసాయి జిల్లాల ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పరామర్శించి, ఓదార్చారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, తాము అన్నివిధాలా వారి కుటుంబానికి అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు.

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయు కార్యక్రమం

05.05.2022:- జగన్న విద్యా దీవెన పథకంలో భాగంగా జనవరి-మార్చి, 2022 త్రైమాసికానికి దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయు కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

‘సున్నా’ వడ్డీ పథకం మెగా చెక్ పంపిణీ కార్యక్రమం

02.05.2022:- ఆత్మకూరు గ్రామంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ‘సున్నా’ వడ్డీ పథకం మెగా చెక్ పంపిణీ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాప్తాడు శాసన సభ సభ్యులు శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, స్థానిక MPP, వైస్ MPP, సర్పంచులు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు & శ్రేణులు మరియు మండల స్థాయి అధికారులు & సిబ్బంది మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Party Activities and Meetings

జిల్లా సమీక్షా కమిటీ సమావేశం

29.04.2022:- స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని రెవిన్యూ భవన్ నందు గౌరవ రాష్ట్ర విద్యుత్, సైన్స్ & టెక్నాలజీ, అటవీ, పర్యావరణ & భూగర్భ గనుల శాఖా మంత్రివర్యులు మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించబడిన అనంతపురము జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నందు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

ఆకస్మిక పర్యటన

28.04.2022:- బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయoను అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ఆకస్మికంగా పర్యటించి సిబ్బంది హాజరు మరియు వారి పనితీరుపై ఆరా తీశారు. కార్యాలయ రికార్డులు పరిశీలించి, అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో విధినిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని మరియు గ్రామాలలో ప్రభుత్వ పథకాల అనర్హుల జాబితా లో ఉన్న నిజమైన అర్హులను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేయుటకు తగు చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించారు.

మెగా చెక్ పంపిణీ కార్యక్రమం

26.04.2022:- కూడేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న & సేవా మిత్ర అవార్డుల ప్రధానోత్సవ & సన్మాన కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. అనంతరం స్వయం సహాయక మహిళలకు ‘o’ వడ్డీ కి సంభందించిన మెగా చెక్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఆకస్మిక పర్యటన

23.04.2022:- పెనుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయoను అనంతపురము, శ్రీ సత్య సాయి ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ఆకస్మికంగా పర్యటించి సిబ్బంది హాజరు మరియు వారి పనితీరుపై ఆరా తీశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి, విధినిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

YSR సున్నా వడ్డీ పథకం

23.04.2022:– స్థానిక పెనుకొండ నందు IKP కార్యాలయంలో ఏర్పాటు చేసిన YSR సున్నా వడ్డీ పథకం క్రింద మహిళలకు మెగా చెక్ పంపిణీ కార్యక్రమంలో అనంతపురము, శ్రీ సత్య సాయి ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెనుకొండ శాసన సభ సభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర్ నారాయణ గారు, స్థానిక MPP , MPTC లు, మండల అధికారులు, YSRCP శ్రేణులు పాల్గొన్నారు

ఆకస్మిక పర్యటన

22.04.2022:- అనంతపురము రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయoను అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ఆకస్మికంగా పర్యటించి సిబ్బంది హాజరు మరియు వారి పనితీరుపై ఆరా తీశారు. కార్యాలయ రిలార్డులు పరిశీలించి, కార్యాలయ సమయ వేళలు సక్రమంగా పాటించి, విధినిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు

వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం

22.04.2022:- వర్చువల్ విధానం ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు వరుసగా 3వ ఏడాది వై.యస్.ఆర్.సున్నావడ్డీ పథకం క్రింద స్వయం సహాయక సంఘాలలోని మహిళలు బ్యాంకులకు కట్టవలసిన రూ.1.261 కోట్ల వడ్డీ ని వారి తరపున ప్రభుత్వమే వారి బ్యాంకు ఖాతాలలో బటన్ నొక్కి జమ చేయు కార్యక్రమంను అనంతపురము జిల్లా కలెక్టరేట్ కార్యాయలపు VC హాల్ నందు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

సన్మాన కార్యక్రమం

21.04.2022:- బుక్కరాయసముద్రం మండలంలోని సిద్దరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గ్రామ వాలంటీర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ సి.ఇ.ఓ. శ్రీ ఆలూరు సాంబశివా రెడ్డి గారు, స్థానిక జెడ్.పి.టి.సి. గారు, యం.పి.పి.గారు, సర్పంచ్ గారు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు మండల స్థాయి అధికారులు & సిబ్బంది పాల్గొన్నారు.

పర్యవేక్షణ

21.04.2022:-  అనంతపురము రురల్ మండలం రైతులతో మరియు వ్యవసాయ కూలీలతో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు కలిసి ప్రభుత్వ పథకాలు అమ్మ ఒడి, పెన్షనులు, YSR ఆసరా, చేయుత మరియు ఇతర పథకాలు వారికి అందుతున్నాయా లేదా, గ్రామ వాలంటీర్ల పనితీరు, RBK ల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు, ప్రజలందరూ జగనన్న ప్రభుత్వము పై సంతృప్తిగా ఉన్నారని, ప్రభుత్వ పథకాలన్నీ వారికి సమయానికి అందుతున్నాయని తెలియజేస్తూ, రాబోవు కాలంలో కూడా శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని రైతులు అభిలాష వ్యక్తం చేశారు.

శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి 102వ జయంతి

21.04.2022:-  1. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్.డి.టి.) పాఠశాలల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని ప్రధాన సమావేశ మందిరం నందు అనంతపురము జిల్లలో నిరుపేదలకు తన జీవితాన్ని అంకితం చేసి, అండగా నిలిచిన మహనీయుడు శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి 102వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

2. స్థానిక ఆర్ట్స్ కాలేజీలోని డ్రామా హాల్ నందు శ్రీ సత్యసాయి ధ్యానమండలి, అనంతపురము జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మికత-సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం-ఆదర్శ దాంపత్య జీవితంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 60వ వార్షికోత్సవ మహోత్సవం

21.04.2022:-  అనంతపురము రూరల్ మండలం చియ్యేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 60వ వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిధిగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ పాఠశాలను చూస్తా ఉంటే తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇది ప్రభుత్వ పాఠశాలనా? లేక కార్పోరేట్ స్కూలా? అనే సందేహం ఎవ్వరికైనా కలుగుతుందని, మన జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అమలు చేసున్న మన బడి నాడు-నేడు పథకంతో ఇలాంటి ఎన్నో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు సమూలంగా మారిపోయాయని, అలాగే ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన సిబ్బంది, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, దాతలకు  అభినందనలు తెలిపారు.

సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రధాన మహోత్సవం

07.04.2022:-  స్థానిక క్రిష్ణకళామందిర్ నందు గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురము శాసన సభ్యులు శ్రీ అనంత వెంకట రామి రెడ్డి గారు, MLC శ్రీ శివ రామి రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా ప్రజా పరిషద్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొనారు.

1వ మరియు 7వ స్థాయి సంఘ సమావేశము

05.04.2022:- స్థానిక అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని ప్రధాన సమావేశ మందిరం నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారి అధ్యక్షతన 1వ (ఆర్ధిక మరియు ప్రణాళిక స్థాయి సంఘం) మరియు 7వ (పనుల స్థాయి సంఘం) స్థాయి సంఘ సమావేశము నిర్వహించడం జరిగినది.

వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం

04.04.2022:- అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదు.. పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలి.. అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా, ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, శాస్త్రీయ అధ్యయనంతో, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా… గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ.. 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిపాలన ప్రారంభించు కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

పదోన్నతుల ఉతర్వులు జారీ

31.03.2022:- స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ చాంబర్ నందు జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం క్రింద పనిచేస్తున్న సీనియర్ సహాయకులు శ్రీ నంద కిషోర్ గారు, శ్రీ నాగేశ్వర రెడ్డి గారు, శ్రీ వెంకట నారాయణ, శ్రీ హరినాథ్ గారు, శ్రీమతి ఉమా ప్రసన్న గార్లకు పరిపాలనాధీకారులుగా పదోన్నతుల ఉతర్వులను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు అందజేశారు.

వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం

04.04.2022:- అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదు.. పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలి.. అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా, ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, శాస్త్రీయ అధ్యయనంతో, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా… గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ.. 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిపాలన ప్రారంభించు కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశం

26.03.2022:- స్థానిక జిల్లా పరిషత్ లోని సమావేశ భవనం యందు నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంనకు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు అధ్యక్షత వహించి అజెండా మేరకు వివిధ శాఖల సమీక్షను నిర్వహించారు.

జగనన్న విద్యా దీవెన పథకం

16.03.2022:-  జగన్న విద్యా దీవెన పథకంలో భాగంగా అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయు కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు హాజరయ్యారు.

వైఎస్సార్‌సీపీ పార్టీ ఆవిర్భావోత్సవ వేడుకలు

12.03.2022:-  వైఎస్సార్‌సీపీ 11 వసంతాలు పూర్తిచేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్బంలో స్థానిక 2వ రోడ్డులోని YSRCP పార్టీ కార్యాలయం లో వైఎస్సార్‌సీపీ పార్టీ ఆవిర్భావోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో మొదటగా దివంగత నేత YS రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి, అనంతరం YSRCP జండా ఎగురవేసి కేక్ కట్ చేసారు.

జగనన్న విద్యా దీవెన పథకం

16.03.2022:-  జగన్న విద్యా దీవెన పథకంలో భాగంగా అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయు కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు హాజరయ్యారు.

భూమి పూజ కార్యక్రమం

05.03.2022:-  గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు మాదకద్రవ్యాల అకాడమీ (NACIN) శిక్షణా కేంద్రం నందు గౌరవ కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చేసిన భూమి పూజ కార్యక్రమానికి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు హాజరయ్యారు. దేశంలోనే కరువు జిల్లా అయినటువంటి అనంతపురము జిల్లా యొక్క ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన వెనుకబడిన జిల్లాలకు కేటాయించినటువంటి ఆర్థిక సంవత్సరాలకు గాను 100 కోట్ల రూపాయల నిధులను జిల్లాకు విడుదల చేయాలని గౌరవ కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి వినతి పత్రం అందజేశారు.

రోడ్డు నిర్మాణ భూమి పూజా కార్యక్రమం

03.03.2022:-  డి.హీరేహాళ్ మండలం మడేనహళ్లి గ్రామంలో రూ.3.5 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ భూమి పూజా కార్యక్రమం, గ్రామ సచివాలయo, వెల్ నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరియు రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలోని మధ్యాహ్నేశ్వర స్వామి ఆలయం నందు జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసన సభ సభ్యులు శ్రీ కాపు రామచంద్రా రెడ్డి గారు, ఆనంతపురము పార్లమెంటు సభ్యులు శ్రీ తలారి రంగయ్య గారితో పాటు అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

పర్యవేక్షణ

02.03.2022:-  బెంగళూరు హైదరాబాద్ హైవే మార్గంలో వ్యవసాయ కూలీలతో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు కలిసి ప్రభుత్వ పథకాలు అమ్మ ఒడి, పెన్షనులు, YSR ఆసరా, చేయుత మరియు ఇతర పథకాలు వారికి అందుతున్నాయా లేదా, గ్రామ వాలంటీర్ల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు, ప్రజలందరూ జగనన్న ప్రభుత్వము పై సంతృప్తిగా ఉన్నారని, ప్రభుత్వ పథకాలన్నీ వారికి సమయానికి అందుతున్నాయని తెలియజేస్తూ, రాబోవు కాలంలో శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని అభిలాష వ్యక్తం చేశారు.

రోడ్డు నిర్మాణ భూమి పూజా కార్యక్రమం

27.02.2022:- ఆహుడా పరిధిలో రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన రోడ్డు నిర్మాణ భూమి పూజా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాప్తాడు శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణ భూమి పూజా కార్యక్రమం

27.02.2022:- అనంతపురము రూరల్ మండల పరిధిలోని రుద్రం పేట గ్రామ సచివాలయo -1 భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆనంతపురము పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ తలారి రంగయ్య గారు, ఆనంతపురము శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ అనంత వెంకటరామి రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

నీటి సరఫరా బోర్డు సమావేశం

27.02.2022:- స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి నీటి సరఫరా బోర్డు సమావేశంలో అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కల్యాణదుర్గం నియోజక వర్గం కుందుర్పి మండలంలోని కొన్ని గ్రామాలలో వాల్టా చట్టం అమలులో ఉన్నందున కొత్త బోర్లు వేయలేని పరిస్థితి, ఆ ప్రాంతాలలో ప్రస్తుతము నీటి సమస్య ఎక్కువగా ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఆకస్మిక పర్యటన

22.02.2022:- అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని వివిధ సెక్షన్ల యందు ఆకస్మికంగా పర్యటించి పలు రికార్డులను పరిశీలించి, కార్యాలయ సిబ్బంది అందరూ సమయపాలన పాటించి, తమ విధులను సమర్థవంతంగా నిర్వహించవలసినదిగా ఆదేశించారు. అలాగే అవసరమైన మేరకు మరమ్మత్తులు చేపట్టుటకు కార్యాలయ భవనాలను పరిశీలించారు.

Social Activities

వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిధి

22.04.2022:- అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గారు పర్యటనలో భాగంగా నిర్వహించిన పలు వివాహ కార్యక్రమాలలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

కేక్ కటింగ్ కార్యక్రమం

19.04.2022:- గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి శ్రీమతి వై.యస్.విజయమ్మ గారి జన్మదిన శుభ సందర్భంగా స్థానిక 2వరోడ్డులోని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి

11.04.2022:- జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి వేడుకలలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురము జిల్లా కలెక్టరు, అనంతపురము నగర పాలక సంస్థ మేయరు, డిప్యుటి మేయరు, వివిధ కార్పోరేషన్ డైరెక్టర్లు, చైర్ పర్సన్లు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

శ్రీ సుబ్రమణ్య స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమం

08.04.2022:- అనంతపురం రూరల్ మండలంలోని కాట్నేకాలువ గ్రామంలో నిర్వహించిన శ్రీ సుబ్రమణ్య స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు, యస్.వి.యూనివర్సిటీ వెటర్నరీ బోర్డు సభ్యులు శ్రీమతి తోపుదుర్తి నయనతా రెడ్డి గారు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

08.04.2022:- స్థానిక జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గారి క్యాంపు కార్యాలయం నందు ఇద్దరు (02) విభిన్న ప్రతిభావంతులకు బ్యాక్ లాగ్ క్రింద కుమారి మమతా బాయి గారిని యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనకు జూనియర్ అసిస్టెంట్ గా, శ్రీ బాల గంగాధర్ గారిని తాడిపత్రి పి.ఆర్.పి.ఐ.యు.సబ్ డివిజన్ కార్యాలయమునకు టైపిస్ట్ గా నియామక ఉత్తర్వులు అనంతపురము జిల్లా ప్రజా పరిషద్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు అందజేసి శుభాకాంక్షలు తెలుపుతూ భాద్యతగా విధినిర్వహణ చేయవలసినదిగా ఆదేశించారు.

శ్రీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి

05.04.2022:- స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త అయిన శ్రీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకుని స్థానిక 2వ రోడ్డులోని YSRCP పార్టీ కార్యాలయము నందు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో అనంతపురము శాసన సభ్యులు శ్రీ అనంత వెంకట రామి రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ నదీం గారు పాల్గొన్నారు. అనంతరం స్థానిక సప్తగిరి సర్కిల్ నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీ

30.03.2022:- అనంతపురము గ్రామీణ మండల పరిధిలోని కురుగుంట గురుకుల పాఠశాలను అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ఆకస్మిక తనిఖీ చేసారు. అక్కడ పాఠశాల పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేసి, భవిష్యత్తులో పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు.

 

శ్రద్ధాంజలి ఘటించిన బోయ గిరిజమ్మ

30.03.2022:- శ్రీ సత్యసాయి నీటి సరఫరా బోర్డు నందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేయుచున్న శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు గుండెపోటుకు గురై స్థానిక సవేరా హాస్పిటల్ నందు మరణించగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు హుటాహుటిన సవేరా హాస్పిటల్ నకు వెళ్ళి శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారి పార్థివ దేహానికి శ్రద్దాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవo

26.03.2022:- అంతర్జాతీయ మహిళా దినోత్సవoను పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్ లోని చైర్ పర్సన్ గారి ఛాంబర్ నందు మహిళా ZPTCలు మరియు జిల్లా ప్రజా పరిషత్ మహిళా సిబ్బందితో కలసి కేక్ కటింగ్ కార్యక్రమాన్నిఅనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు నిర్వహించారు.

ఆకస్మిక తనిఖీ

26.03.2022:- ఉరవకొండ మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ఆకస్మిక తనిఖీ చేసారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మాట్లాడి, అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలించారు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనమును మెనూ ప్రకారం పెట్టాలని, నాణ్యతలో రాజీ పడకూడదని, ఒకవేళ అలా ఏదైనా నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి

16.03.2022:- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ భవనం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి నివాళి అర్పించి, వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి, ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిపెట్టిన మహా పురుషుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారని, అంతటి త్యాగ శీలి జన్మదిన సందర్భంగా వారి పోరాట స్పూర్తిని నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని కోరారు.

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

12.03.2022:- జెండా పట్టిన ప్రతి కార్యకర్త కూడా గర్వంగా తలెత్తుకునేలా చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ ఆవరణలోని చైర్ పర్సన్ గారి క్యాంపు కార్యాలయంనందు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు.

పరామర్శ

11.03.2022:- అనంతపురము రూరల్ మండలం పిల్లిగుండ్ల కాలనీ లోని ప్రభుత్వ పాఠశాల నందు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురై అనంతపురము ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు చికిత్స పొందుతున్న 36 మంది విద్యార్థులను అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు అనంతపురము పార్లమెంటరీ సభ్యులు శ్రీ తలారి రంగయ్య గారు, యస్.వి.యూనివర్సిటీ వెటర్నరీ బోర్డు సభ్యులు శ్రీమతి తోపుదుర్తి నయనతా రెడ్డి గారితో పాటు హుటాహుటిన వెళ్ళి, పరామర్శించి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు.

శుభాకాంక్షలు

10.03.2022:- స్థానిక శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం 20వ స్నాతకోత్సవాలలో ముఖ్య అతిధిగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ది విభాగంలో గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న మన అనంతపురము గౌరవ పార్లమెంటరీసభ్యులు శ్రీ తలారి రంగయ్య గారికి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.

చేనేత ఉత్పత్తుల ప్రదర్శన

10.03.2022:- స్థానిక సాయి నగర్ లోని అంబేద్కర్ భవనం నందు, చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శన (Handlooms EXPO) కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన చేనేత కళాకారుల ద్వారా ఏర్పాటు చేయబడిన స్టాల్స్ ని అనంతపురము పార్లమెంటరీ సభ్యులు శ్రీ తలారి రంగయ్య గారు, అనంత నగర పాలక సంస్థ మేయరు శ్రీ వసీం సలీం గారు, జాయింట్ కలెక్టరు శ్రీ గంగాధర్ గౌడ్ గారితో కలిసి ప్రారంభించారు.

నేత్ర మరియు వైద్య శిబిరం కార్యక్రమం

27.02.2022:- రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సక్షమ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్ర మరియు వైద్య శిబిరం కార్యక్రమంలో విశిష్ట ఆహ్వానితులుగా రాప్తాడు శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ సక్షమ్ సేవా సంస్థ సేవలు హర్షణీయం అని, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత సేవ చేయాలని తెలిపారు.

పోలియో చుక్కలు వేయు కార్యక్రమం

27.02.2022:- రాప్తాడు మండల కేంద్రం లోని సచివాలయం-1 నందు ఏర్పాటు చేసిన పోలియో చుక్కలు వేయు కార్యక్రమం నందు రాప్తాడు శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ చిన్న పిల్లలు పోలియో బారిన పడకుండా తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.

క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్

పుట్టపర్తి శాసన సభ్యులు శ్రీ దుద్దేకుంటా శ్రీధర్ రెడ్డి గారి నేతృత్వంలో శ్రీ సత్య సాయి క్రికెట్ క్లబ్ మరియు దుద్దేకుంట ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నందు ముఖ్య అతిధిగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొనారు.కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీ మరియు నగదు అందజేశారు.

 

కిసాన్ మేళా

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలో ఉన్న ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ, వ్యవసాయ క్షేత్రంలో సింగనమల నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

వై.యస్.ఆర్. ఆసరా కార్యక్రమం

వై.యస్.ఆర్. ఆసరా ఉత్సవాల్లో భాగంగా కనగానపల్లి మండల కేంద్రంలోని యం.పి.డి.ఓ. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వై.యస్.ఆర్. ఆసరా కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతము YSR ఆసరా 2 వ విడతలో భాగముగా కనగానపల్లి మండలమునకు గాను 648 మహిళా సంఘాలకు అక్షరాల రూ. 5. 02 కోట్లు (ఐదు కోట్ల రెండు లక్షల రూపాయలు) లబ్ది చేకూరినట్టు పేర్కొన్నారు.

సన్మాన కార్యక్రమం

ఇటీవల అకాల వరదల కారణంగా చేన్నేకొత్త పల్లి మండలం వెల్దుర్తి గ్రామం వద్ద చిత్రావతి నదిలో ఇరుక్కుపోయిన 10మంది ప్రజల ప్రాణాలను కాపాడిన ఇండియన్ ఎయిర్ పోర్స్ రేస్క్యు టీం వారికి వెల్దుర్తి గ్రామం నందు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో భాగంగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మొదట చిత్రావతి నదికి గంగ పూజ నిర్వహించి తదనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొనారు.

ల్యాప్ ట్యాప్లు, మొబైల్ ఫోన్లు పంపిణీ

స్థానిక పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పి.టి.సి.) గ్రౌండ్ నందు “అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ” సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొనారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన ఆటలపోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు, అదే విధంగా అర్హులకు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన ల్యాప్ ట్యాప్లు, మొబైల్ ఫోన్లు పంపిణీ చేసారు.

3 వ విడత జగనన్న విద్యా దీవెన ప్రారంభ కార్యక్రమం

స్థానిక అనంతపురము కలెక్టరేట్ కార్యాయలపు VC హాల్ నందు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 3 వ విడత జగనన్న విద్యా దీవెన ప్రారంభ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థి చదువుకోవాలి, వారి చదువు తల్లి తండ్రులకు భారం కాకూడదు అని, చదువుకోవాలని అభిలాష ఉండి ఆర్ధిక స్థోమత లేనివారిని చదివించడమే ధెయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని పేర్కొన్నారు.

పాలాభిషేకం

రాష్ట్ర ప్రభుత్వం BC జనగణనకు కార్యరూపం చేపట్టిన తరుణంలో స్థానిక 2వ రోడ్డు నందు YSRCP పార్టీ కార్యాలయము నందు ఏర్పాటుచేసిన కార్యక్రమములో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమములో మొదట రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారి చిత్ర పటమునకు పాలాభిషేకం చేసి, అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు మాట్లాడుతూ ఇప్పటికి 1931 జనాభా లెక్కల ప్రకారమే BC జనాభా లెక్కిస్తున్నారని, గత ప్రభుత్వం BC లను కేవలం ఓటు బ్యాంకులా మాత్రమే చూసారు కానీ BC ల సాదికారకతను విస్మరించింది అని, ఈ నేపధ్యంలో BC జనగణన ఆవశ్యకత ఎంతైనా ఉందని దానికి గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంతో హర్షనీయమని, రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉంటూ పనిచేస్తుందని తెలియజేసారు.

శ్రీ కనకదాసు జయంతి

శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా స్థానిక పాత ఊరు నందు గుత్తి రోడ్డు సర్కిల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

పరామర్శ

రాప్తాడు నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సూచనల మేరకు,  పడిన భారీ వర్షాల కారణంగా ఆత్మకూరు మండలములోని పంపనూరు, తలుపూరు, తోపుదుర్తి గ్రామాలలో నివాస గృహములను కోల్పోయిన వారిని మరియు పంట నష్టం జరిగిన రైతులు అందరు ఈ విపత్కర పరిస్థుతుల నుండి త్వరగా బయట పడాలని పంపనూరు శ్రీ సుబ్రమణ్య స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వర్షం వలన నష్టపోయిన వారిని పరామర్శించి వారికి మేమున్నామంటూ భరోసా ఇస్తూ, నిత్యావసర వస్తువులను పంపిణి చేసిన అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు.

పరామర్శ

స్థానిక కేర్ అండ్ క్యూర్ ఆసుపత్రి ICU విభాగంలో చికిత్స పొందుతున్న ప్రజా ప్రతినిధి శ్రీ రేనాటి శ్రీనివాసులు గారిని పరామర్శించి, వైద్యులతో వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన చికిత్స ఇవ్వవలసినదిగా సూచించారు.

స్వాగతం

మాజీ కేంద్ర సహాయ మంత్రి మరియు శ్రీకాకుళం జిల్లా YSRCP పార్టీ అధ్యక్షుల వారి దంపతులు శ్రీమతి డా. కిల్లి కృపారాణి గారిని, డా.కిల్లి రామ్మోహరావు గారిని, శ్రీకాకుళం గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి విజయ సాయిరాజ్ గారు, కంచిలి MPP దేవదాస్ రెడ్డి గారు కార్యకర్తలు, అభిమానులు పాల్గొని చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారిని శాలువా మరియు పుష్ప గుచ్చములతో సత్కరించి జిల్లాకు సాదర స్వాగతం పలికారు.

పరామర్శ

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైనా 18 మంది విద్యార్థులను అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పరామర్శించి డ్యూటి డాక్టరు శ్రీ డా. శంకర్ నారాయణ గారితో పిల్లల ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకుని, వారికి తగిన చికిత్స అందించి జాగ్రతగా చుసుకోనవలసినదిగా సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుక

స్థానిక రెండవ రోడ్డు మరియు అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల కార్యక్రమానికి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, శ్రీమతి బోయ గిరిజమ్మ గారు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, అనంతపురము శాసన సభ్యులు శ్రీ అనంత వెంకట రామిరెడ్డి గారు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు,  జిల్లా స్థాయి అధికారులు పాల్గొనడం జరిగింది.

శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

రొద్దం మండలములోని కోగిర గ్రామములో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు, కార్యక్రమములో మొదటగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల ను వేశారు, శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మాట్లాడుతూ సమాజానికి ఆది కావ్యమైన రామాయణమును సమాజానికి కుటుంబ విలువలకు ఒక ఉదాహరణగా రచించారు.

క్రికెట్ టోర్నమెంట్ పోటీ

స్థానిక RDT స్టేడియం నందు జర్నలిస్టుల ఐఖ్యత కొరకు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు, ధర్మవరం శాసన సభ సభ్యులు శ్రీ కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి గారు మరియు AHUDA చైర్మన్ శ్రీ మహాలక్ష్మి శ్రీనివాస్ గారు ప్రారంభించారు, ఈ కార్యక్రములో మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ఉల్లాసం, ఆరోగ్యమే కాకుండా ఐకమత్యం చాటాలనే సత్సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమములో విలేకరులు అందరు కలసిమెలసి ఉండాలని, సమాజ శ్రేయస్సుకై తమవంతు సేవలు అందించాలని పేర్కొన్నారు.

నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం

బొమ్మనహల్ మండలములోని శ్రీదరగట్ట గ్రామములో నూతన గ్రామ సచివాలయము,రైతు భరోసా కేంద్రము, అంగన్వాడి 2-3, ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవనము నిర్మాణం , జిల్లా పరిషత్ పాఠశాల ప్రహారి గోడ నిర్మాణం మరియు వెల్నెస్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల నందు ఏర్పాటు చేసిన YSR ఆసరా రెండవ విడత కార్యక్రమములో పాల్గొనారు.

అమరవీరుల సంస్మరణ దినోత్సవం

స్థానిక పోలిస్ పెరేడ్ గ్రౌండ్ నందు 07.30 గంటలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమములో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్, చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమములో పోలీసు అమరవీరుల స్మారక స్థూపానికి పుష్ప గుచ్చముతో నివాళులు అర్పించారు. స్థానిక గుత్తి రోడ్ లోని శ్రీ 7 కన్వెన్షనల్ హాల్ నందు 10.30 గంటలకు వివాహ మహోత్సవానికి హాజరయ్యి నూతన దంపతులను ఆశీర్వదించారు.

కరపత్రములు మరియు వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (దూర విద్యా విధానం) ద్వారా 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్య కు సంభందించి 2021-22 వ విద్యా సంవత్సరమునకు గాను అడ్మిషన్లు ప్రారంభమైనందున, ప్రవేశ అర్హత వివరములు, ఫీజు వివరములు మరియు ప్రవేశం పొందు విధానమునకు సంభందినచిన పూర్తి వివరములతో కూడిన కరపత్రములు మరియు వాల్ పోస్టర్లను జిల్లా ప్రజా పరిషత్, అనంతపురము చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ఆవిష్కరించారు.

పరామర్శ

స్థానిక సూపర్ స్పెసాలిటీ ఆసుపత్రి నందు ఐ.సి.యు వార్డు నందు చికిత్స పొందుతున్న వేణుగోల్ నగర్ వాస్తవ్యులు అయిన శ్రీ యూ శ్రీనివాసులు గారిని అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, అధైర్య పడవద్దని తెలిపి, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆర్.యమ.ఓ డా. శ్రీ చైతన్య గారితో చర్చించి, మెరుగైన చికిత్స అందించమని తెలిపారు.

INAUGURATION PROGRAMS

అవార్డుల ప్రధానోత్సవ & సన్మాన కార్యక్రమం

26.04.2022:- అనంతపురము రూరల్ మండలంలోని ఆకుతోటపల్లి పంచాయితీ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న & సేవా మిత్ర అవార్డుల ప్రధానోత్సవ & సన్మాన కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. అనంతరం స్వయం సహాయక మహిళలకు ‘o’ వడ్డీ కి సంభందించిన మెగా చెక్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

త్రాగునీటి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం

22.04.2022:- స్థానిక జె.యన్.టి.యు.రోడ్ నందు YSRCP నాయకులు శ్రీ తలారి బయన్న గారు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సురక్షిత త్రాగునీటి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ సి.ఇ.ఓ. శ్రీ ఆలూరు సాంబశివా రెడ్డి గారు, బుక్కరాయసముద్రం ZPTC , సర్పంచ్ గారు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు శ్రేణులు పాల్గొన్నారు.

ఆయుష్మాన్ భారత్ – ఆరోగ్య మేళా ప్రారంభోత్సవ కార్యక్రమం

19.04.2022:- స్థానిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అనంతపురము శాసన సభ సభ్యులు శ్రీ అనంత వెంకట రామిరెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ – ఆరోగ్య మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ ఉషాశ్రీ చరణ్ గారు, హిందూపురం పార్లమెంటరీ సభ్యులు శ్రీ గోరంట్ల మాధవ్ గారు, రాప్తాడు శాసన సభ్యలు శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైద్య అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అనంతకోటి వృక్షమహోత్సవం కార్యక్రమం

05.04.2022:- స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనంతకోటి వృక్షమహోత్సవం కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్పు మన నుండే మొదలవ్వాలని ప్రకృతిని కాపాడడం మన చేతుల్లోనే ఉందని, అది మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు మొక్కలను నాటి సంరక్షించవలసినదిగా కోరారు.

చలివేంద్రము

31.03.2022:- వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున రాబోవు రోజులలో త్రాగునీటి సమస్య లేకుండా కార్యాలయమునకు వచ్చు ప్రజల కొరకు స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము నందు చలివేంద్రమును జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ప్రారంభించారు.

 

e-హాస్పిటల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం

30.03.2022:- స్థానిక సర్వజన ప్రభుత్వ వైద్యశాల నందు ఏర్పాటు చేసిన e-హాస్పిటల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్ గారు, జాయింట్ కలెక్టర్ డా.సిరి గారు, NIC అధికారులు, సర్వజన ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమం

24.03.2022:- స్వర్గీయ శ్రీ రాకెట్ల నారాయణరెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఆయన పేరుతో నిర్వహిస్తున్న రాకెట్ల నారాయణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ కప్ 2022 సంవత్సరమునకు గాను, ఉరవకొండ జూనియర్ కళాశాల మైదానం లో క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు మరియు ఉరవకొండ నియోజకవర్గ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి గారి తనయుడు ఉరవకొండ యువనాయకులు శ్రీ వై.ప్రణయ్ రెడ్డి గారు హాజరై ఘనంగా ప్రారంభించారు

నూతన గృహ ప్రారంభోత్సవ కార్యక్రమం

27.02.2022:- రాప్తాడులోని జగనన్న హౌసింగ్ కాలనీ లోని నూతన గృహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాప్తాడు శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాటు అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాప్తాడు జెడ్.పి.టి.సి. సభ్యులు, గౌరవ రాప్తాడు మండల యం.పి.పి. మరియు వైస్ యం.పి.పి., గౌరవ రాప్తాడు మండల మార్కట్ యార్డ్ చైర్మన్ గారు, గౌరవ రాప్తాడు వై.యస్.ఆర్.సి.పి. మండల కన్వీనర్ గారు, స్థానిక వై.యస్.ఆర్.సి.పి. నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

శంకుస్థాపన కార్యక్రమం

26.02.2022:- నార్పల మండల కేంద్రం నందు యం.పి. ల్యాడ్స్ నిధుల క్రింద రూ.20.00 లక్షల అంచనా వ్యయంతో నూతన గ్రంధాలయ నిర్మాణమునకు గాను ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమం నకు శంకుస్థాపకులు అయిన గౌరవ శ్రీ తలారి రంగయ్య గారు, పార్లమెంటు సభ్యులు, అనంతపురము, సభాధ్యక్షులు అయిన గౌరవ శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు, శాసన సభ్యులు, శింగనమల మరియు ప్రత్యేక ఆహ్వానితులైన గౌరవ శ్రీ ఆలూరు సాంబశివా రెడ్డి గారు, సి.ఇ.ఓ., రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ వారితో కలిసి ముఖ్య అతిధిగా అనంతపురము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.

 OFFICIAL MEETINGS

పదోన్నతుల ఉతర్వులు జారీ

స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయపు పరిధిలోని ఒక (01) ల్యాబ్ అసిస్టెంట్ నకు, ముగ్గురు(03) రికార్డ్ అసిస్టెంట్లకు, మొత్తం నలుగురు (04) ఉద్యోగులకు జూనియర్ సహాయకులుగా పదోన్నతుల ఉతర్వులను అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు అందజేశారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలుపుతూ, పదోన్నతి అంటే భాద్యత పెరిగినట్టు అని, దానికి తగినట్టు ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా విధులు సక్రమంగా నిజాయితీ, నిబద్దత, అంకిత భావముతో నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేసారు.

జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశము

స్థానిక అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయపు సమావేశ మందిరం నందు మొట్ట మొదటి జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశము జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారి అధ్యక్షతన జరిగినది. మొదటగా స్థాయి సంఘాల ఎన్నిక జరిగినది. తర్వాత జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సర్వ సభ్య సమావేశము

కనగానపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలమునందు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కె.భాగ్యమ్మ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశము నకు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య నిర్మాణానికి నెలకొల్పిన సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను సర్పంచులు, MPTC లు , MPP గారు, అధికారులు సమర్ధవంతంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మండల అభివృద్ధి కి పాటు పడాలని తెలియజేసారు.

వై.యస్.ఆర్. ఆసరా కార్యక్రమం

వై.యస్.ఆర్. ఆసరా ఉత్సవాల్లో భాగంగా కనగానపల్లి మండల కేంద్రంలోని యం.పి.డి.ఓ. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వై.యస్.ఆర్. ఆసరా కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతము YSR ఆసరా 2 వ విడతలో భాగముగా కనగానపల్లి మండలమునకు గాను 648 మహిళా సంఘాలకు అక్షరాల రూ. 5. 02 కోట్లు (ఐదు కోట్ల రెండు లక్షల రూపాయలు) లబ్ది చేకూరినట్టు పేర్కొన్నారు.

3 వ విడత జగనన్న విద్యా దీవెన ప్రారంభ కార్యక్రమం

స్థానిక అనంతపురము కలెక్టరేట్ కార్యాయలపు VC హాల్ నందు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 3 వ విడత జగనన్న విద్యా దీవెన ప్రారంభ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థి చదువుకోవాలి, వారి చదువు తల్లి తండ్రులకు భారం కాకూడదు అని, చదువుకోవాలని అభిలాష ఉండి ఆర్ధిక స్థోమత లేనివారిని చదివించడమే ధెయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని పేర్కొన్నారు.

ప్రమాణస్వీకార కార్యక్రమము

స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము, అనంతపురము నందు ఏర్పాటు చేసిన చిలమత్తూర్ జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ స్థానానికి సభ్యురాలిగా నూతంగా ఎంపిక అయిన శ్రీమతి గొల్ల అనుష గారి ప్రమాణస్వీకార కార్యక్రమమునకు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు హాజరయ్యారు.

సమీక్షా సమావేశం

స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని సామావేశ మందిరం నందు మధ్యాహ్నం 03.30 గంటలకు జిల్లా నందు పని చేయుచున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమీక్షాసమావేశాన్ని అనంతపురము జిల్లా ప్రజా పరిషత్, చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి గారి అధ్యక్షతన నిర్వహించారు.

అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశము

అనంతపురము జిల్లా కలెక్టరు వారి కార్యాలయములో చేసిన అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశమునకు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు, సమావేశము లో మాట్లాడుతూ రైతే రాజు అన్న మాటను నిజం చేసే దిశగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అధికారులు అందరు రైతులకు సమయానుకూలంగా సూచనలు సలహాలు ఇవ్వవలసినదిగా సూచించారు.

సిబ్బంది సమావేశం

స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు, సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పరిచయ కార్యక్రమం మరియు వారు చేస్తున్న పని వివరములు తెలుసుకున్నారు, గౌరవ ముఖ్య మంత్రిగారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి శక్తీ వంచన లేకుండా కృషి చేస్తానని ఇందుకు అధికారులు మరియు సిబ్బంది అందరూ సహకరించి పనిచేయాలని కోరారు.

2 వ విడత YSR ఆసరా చెక్కుల పంపిణీ

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం నందు మొదటగా ప్రియతమనేత డా|| వై యస్ రాజ శేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 2 వ విడత YSR ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రములో పాల్గొన్నారు. కార్యక్రమములో గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ తండ్రి ఒక్క అడుగు వేస్తే కొడుకు 10 అడుగులు వేసి మహిళలను తన అక్కా చెల్లెమ్మ లుగా భావించి, YSR ఆసరా 2 వ విడతలో భాగముగా శెట్టూరు మండలమునకు గాను 764 మహిళా సంఘాలకు అక్షరాల రూ. 9 కోట్లు ( తొమ్మిది కోట్ల రూపాయలు ) లబ్ది చేకూరినట్టు పేర్కొన్నారు.

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గా శ్రీమతి బోయ గిరిజమ్మ గారు

అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గా శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పూర్తి అధికారిక పదవీ భాద్యతలు స్వీకరించారు. మొదటగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గా శ్రీమతి బోయ గిరిజమ్మ గారు, చైర్ పర్సన్ గారి క్యాంప్ కార్యాలయము నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత జాతీయ నాయకుల విగ్రహాలకు పూల మాలలతో నివాళులు అర్పించి, స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము నందు ఉదయం 09.20 గంటలకు అధికారికంగా పూర్తి పదవీ భాద్యతలు స్వీకరించారు.

ELECTION CAMPAIGN

పెనుకొండ నగర పంచాయితీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పెనుకొండ 10 వ వార్డు YSRCP తరపున పోటీ చేస్తున్న శ్రీమతి బి.హారతి గారి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించమని కోరుతూ కోట వీధి, శ్రీరాములయ్య కాలనీ, మెయిన్ రోడ్డు, పరమేశ్వర పురం & వెంకటాపురం తాండా నందు గడప గడపకి విస్తృత ప్రచారం చేసారు.

కడప జిల్లా కలసపాడు మండలం పరిధిలోని పెండ్లిమర్రి పంచాయితీ నందు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న, అనంతపురం జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు.

నగర పంచాయితీ ఎన్నికలో భాగంగా రాష్ట్ర రోడ్డు మరియు భావన నిర్మాణ శాఖ మంత్రి వర్యులు శ్రీ మాలగుండ్ల శంకర్ నారాయణ గారు, అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పెనుకొండ 10 వ వార్డు YSRCP తరపున పోటీ చేస్తున్న శ్రీమతి బి.హారతి గారిని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించమని కోరుతూ రోడ్ షో గా పరమేశ్వర కాలనీ, పరమేశ్వర కాలనీ తాండాలో గడప గడప ప్రచారం సాగించారు.

నగర పంచాయితీ ఎన్నికలో భాగంగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పెనుకొండ 10 వ వార్డు YSRCP తరపున పోటీ చేస్తున్న శ్రీమతి బి.హారతి గారిని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించమని కోరుతూ ప్రచారం లో పాల్గొన్నారు.

నగర పంచాయితీ ఎన్నికలో భాగంగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పెనుకొండ 10 వ వార్డు YSRCP తరపున పోటీ చేస్తున్న శ్రీమతి బి.హారతి గారిని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించమని కోరుతూ కోట వీధి, వెంకటాపురం తండా నందు గడప గడప ప్రచారం లో పాల్గొన్నారు

నగర పంచాయితీ ఎన్నికలో భాగంగా అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పెనుకొండ 10 వ వార్డు YSRCP తరపున పోటీ చేస్తున్న శ్రీమతి బి.హారతి గారిని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించమని కోరుతూ ప్రచారం లో పాల్గొన్నారు, ప్రచారానికి మద్దతుగా శాసన మండలి సభ్యులు శ్రీ మొహమ్మద్ ఇక్బాల్ గారు ప్రచారం లో పాల్గొన్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

01.08.2022:- గుమ్మగట్ట మండలం భూపసముద్రం గ్రామంలో గౌరవ ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసన సభ సభ్యులు శ్రీ కాపు రామచంద్రా రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని, గ్రామంలోని ప్రతి గడప గడపకూ వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు ఏమేరకు అందుతున్నాయి? వారు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.

24.05.2022:- శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం సి.బడవాండ్లపల్లి గ్రామం మరియు శ్రీరాం నగర్ కాలనీలలో గౌరవ పుట్టపర్తి శాసనసభ సభ్యులు శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లాల ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని, గ్రామంలోని ప్రతి గడప గడపకూ వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు ఏమేరకు అందుతున్నాయి? వారు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.

16.07.2022:- అనంతపురము రూరల్ మండలం రాజీవ్ కాలనీ నందు గౌరవ అనంతపురము శాసన సభ సభ్యులు శ్రీ అనంత వెంకట రామి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని, గ్రామంలోని ప్రతి గడప గడపకూ వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు ఏమేరకు అందుతున్నాయి? వారు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఇలాగే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని వారి అభిలాషను వ్యక్తం చేశారు.

13.05.2022:- అనంతపురము రూరల్ మండలం పామురాయి మరియు సోములదొడ్డి గ్రామాలలో గౌరవ రాప్తాడు శాసనసభ సభ్యులు శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొని, గ్రామంలోని ప్రతి గడప గడపకూ వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు ఏమేరకు అందుతున్నాయి? వారు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.

11.05.2022:- బొమ్మనహళ్ మండలం బొల్లనగుడ్డం గ్రామంలో రాయదుర్గం శాసనసభ సభ్యులు, YSRCP అనంతపురం జిల్లా అధ్యక్షులు & ప్రభుత్వ విప్ శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన “గడప గడపకు మన ప్రభుత్వం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు గౌరవ అనంతపురం పార్లమెంటు సభ్యులు శ్రీ తలారి రంగయ్య గారితో పాటు పాల్గొని, గ్రామంలోని ప్రతి గడప గడపకూ వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ఏమేరకు అందుతున్నాయి అని ఆరా తీసి, వారి యొక్క సంతృప్తతా స్థాయిని తెలుసుకున్నారు.

District Level Plenary Meeting

28.06.2022:- అనంతపురము జిల్లా కేంద్రంలో గౌరవ రాయదుర్గం శాసన సభ సభ్యులు, ప్రభుత్వ విప్ మరియు అనంతపురము జిల్లా YSRCP పార్టీ అధ్యక్షులు శ్రీ కాపు రామచంద్రా రెడ్డి గారి అధ్యక్షతన, అనంతపురము జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు ముఖ్య అతిధిగా నిర్వహించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు.
27.06.2022:- మడకశిర నియోజకవర్గం నందు గౌరవ శాసన సభ సభ్యులు శ్రీ యం. తిప్పేస్వామి గారి అధ్యక్షతన నిర్వహించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మరియు మడకశిర నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుల కార్యక్రమంలో మడకశిర వాల్మీకి సర్కిల్ నందలి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి తదనంతరం ర్యాలీగా ప్లీనరీ సభాస్థలికి చేరుకుని వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలతో నివాళి అర్పించారు.

 Mrs. Boya Girijamma with Eminent People

అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మెన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి “శ్రీ వై. జగన్ మోహన్ రెడ్డి” గారిని తాడేపల్లి లో మర్యాద పూర్వకముగా కలసి తనను జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా ఎన్నక చేసినందులకు కృతజ్ఞతలు తెలియజేసినారు.

అనంతపురము నగరానికి విచ్చేసిన  “శ్రీమతి వై ఎస్ విజయమ్మ” గారిని అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మార్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు

స్థానిక R&B అతిధి గృహం నందు అనంతపురము శాసన మండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన “శ్రీ శివ రామి రెడ్డి” గారికి శాలువా, పుష్ప గుచ్చం తో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

గౌరవ రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి “తానేటి వనిత” గారిని  అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు.

గౌరవ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డి.జి.పి.) “శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకముగా కలిసి పూలగుచ్ఛమును అందజేసిన అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు.

పెనుకొండ శాసన సభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు “శంకర నారాయణ గారు” శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్బంగా అనంతపురము, శ్రీ సత్య సాయి ఉమ్మడి జిల్లా ప్రజా పరిషద్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన “శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్” గారిని అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జిల్లాకు స్వాగతం పలికారు.

 శ్రీ సత్య సాయి జిల్లాకు నూతన కలెక్టరు గా భాద్యతలు స్వీకరించిన “శ్రీ బసంత్ కుమార్, IAS” గారిని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్, పుట్టపర్తి నందు మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురము జిల్లా ప్రజా పరిషద్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు.

స్థానిక R&B అతిధి గృహం నందు అనంతపురము జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు “శ్రీ బొత్స సత్యనారాయణ” గారిని అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందచేశారు

Party Activities

Party Pamphlets

}
14-06-1992

Born in Krishnapuram

Garladinne Mandal, Anantapur District, AP

}
2007

Studied SSC Standard

from Zilla Parishad High School, B. Krishnapuram

}
2009

Completed Intermediate

from Vivekananda Junior College, Anantapur

}
2012

Attained Graduation

from S K University, Anantapur

}
2014

Joined in YSRCP

}
2014

District Floor Leader

of Anantapur, YSRCP

}
2014

YSRCP District Women Union President

of Anantapur

}
2019

3rd Ward Corporator

of Anantapur Muncipality, YSRCP

}
2021-Till Now

Chairperson Zilla Praja Parishad

of Anantapur, YSRCP